
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వచ్చే భక్తులు తాము ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులపై ఫిర్యాదు చేయడానికి వీలుగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం హైకోర్టుకు నివేదిం చారు. ఈ యాప్ రూపకల్పన బాధ్యతలను టీసీ ఎస్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఈ యాప్ భక్తు లకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని వివ రించారు. భక్తులు ఫిర్యాదులు చేయడానికి ఇప్పటికే ఓ టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు వాట్సాప్ నంబర్ కూడా కేటాయించామని తెలిపారు.
అధిక ధరలు మొదలు ఏ అంశానికి సంబంధించైనా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసి, ఆ ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఏం చర్యలు తీసుకున్నారు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఉందని వివరించారు. ఈ నంబర్లపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నామని టీటీడీ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ తెలియజేశారు. తిరుమలలో వ్యాపారులు తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ చిత్తూరుకు చెందిన పరిహార సేవా సమితి గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment