
సుపథం ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ..
సాక్షి, తిరుమల : సుపథం ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుర్తుతెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.