గూడెం నుంచి ఆగిరిపల్లికి తరలిపోయిన నిట్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్టాలనుకున్న 'నిట్'ను కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి మార్చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 11వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలుకావట్లేదని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెలలో రెండు రోజులు 'బడిలో బస' కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో వీడియో పాఠాలు చెప్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు.