ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదు: గంటా | not suspend any professor says ganta srinivasarao | Sakshi
Sakshi News home page

ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదు: గంటా

Published Fri, Sep 25 2015 7:43 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదు: గంటా - Sakshi

ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదు: గంటా

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఏ ప్రొఫెసర్నూ సస్పెండ్ చేయలేదని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రోజున ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఆయన వచ్చారు. అనంతరం యువభేరీ సదస్సులో ఏయూ ప్రాఫెసర్లు, సిబ్బంది హాజరైన అంశంపై వీసీ జీఎస్‌ఎన్ రాజుతో మట్లాడారు. ఇప్పటివరకు ఏ ఆచార్యుడినీ సస్పెండ్‌ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. దీనిపై వర్సిటీ అధికారులు పరిశీలించాక చర్యలు తీసుకుంటారన్నారు.

విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని.. ఇటీవల జరిగిన సంఘటనలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వర్సిటీలో బయటి వ్యక్తుల ప్రవేశాలు పూర్తిగా నియంత్రించే దిశగా పనిచేస్తామన్నారు. పరిశోధకులు సైతం నిర్ణీత కాలంలో తమ పరిశోధనలు పూర్తిచేసి, వర్సిటీని వదిలి వెళ్లాలన్నారు. వీసీ జి.ఎస్.ఎన్‌రాజు మాట్లాడుతూ.. వర్సిటీకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందని, ఆచార్యుల ప్రసంగాలను పరిశీలించిన తర్వాత ఏదైనా చెబుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement