
సీఎం రాజీనామా చేస్తే నేనూ చేస్తా
గుంటూరు : రాష్ట్ర విభజన అనివార్యమైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని త్యాగం చేస్తారని గతంలో ప్రకటించారనీ, ఒకవేళ అదే జరిగితే తానూ రాజీనామా చేసి ముఖ్యమంత్రిని అనుసరిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన విషయంలో శాస్త్రీయ పద్ధతులు పాటించలేదని చెప్పారు. ఇప్పటివరకు పార్లమెంట్ జరగకుండా ఎంపీలు చాలా చక్కగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని, ఇకమందు కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.