
లోకేష్ టూర్ కోసం టెన్త్ ఫలితాల విడుదల వాయిదా
విజయవాడ: మంత్రి లోకేష్ విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సమయాన్ని మార్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని తొలుత నిర్ణయించగా, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సివుండగా, లోకేష్ టూర్‌లో పాల్గొనేందుకోసం మంత్రి గంటా వేదికను విశాఖకు మార్చారు.
విశాఖలో లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మంత్రి గంటా తీరుపై విద్యాశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రి లోకేష్ పర్యటన కోసం టెన్త్ ఫలితాల విడుదల సమయాన్ని మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.