vizag tour
-
మోదీ వైజాగ్ టూర్ పై.. సిహెచ్ నరసింగరావు కీలక కామెంట్స్
-
రోల్‌మోడల్ స్టేట్‌గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్‌లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్‌గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్‌మోడల్ స్టేట్‌గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
‘సేనా’పతి రాయబారం!
భారత ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఇది ఈ వారపు ప్రధాన కథా స్రవంతి. ఈ స్రవంతిలోకి కొన్ని ఉపకథల్లాంటి పిల్ల కాలువలూ వచ్చి చేరాయి. తెలంగాణకు సంబంధించినంతవరకు ఉత్కంఠ గానీ, ఉపకథలు గానీ ఏమీ లేవు. ప్రధానమంత్రికి అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి స్వాగతం చెప్పలేదు. ఆయన సభలో పాల్గొనలేదు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనేనని షరా మామూలుగానే లోకల్ బీజేపీ విమర్శించింది. ఈ ఉల్లంఘన మొదటిసారి కాదు. ఇది నాల్గోసారి! కనుక ఎవరూ ఆశ్చర్యపడలేదు. తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ శత్రు శిబిరాలుగా చీలిపోయాయి. ఆ శత్రుత్వం శ్రుతి మించి సంప్రదాయాలను కూడా మింగేసింది. ప్రధాన మంత్రి కూడా తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇన్సైడ్ స్టోరీలంటూ ఏమీ ఉండవనేది అందరికీ తెలిసిన విషయం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తత్వానికి తగ్గట్టుగానే అంతా సాఫ్ సీదా. ఓపెన్ ససేమ్! బ్యాక్‌డోర్ డిప్లొమసీ అంటూ ఏమీ ఉండదు. సాక్షాత్తూ ప్రధాని సమక్షం లోనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టడమే ఇందుకు నిదర్శనం. ‘కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదని, ఉండబోద’ని జగన్ నిర్మొహమాటంగా ప్రకటించారు. అధికారిక కార్యక్రమమైనప్పటికీ వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. తమకు గుర్తున్నంతవరకూ విశాఖ నగరంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభ ఇదేనని వయోధిక రాజకీయ పరిశీలకులు చెప్పారు. సభాస్థలి కిక్కిరిసిపోగా రోడ్లపై కూడా జనం పెద్దసంఖ్యలో నిలిచిపోయారు. కనీసం మూడు నుంచి మూడున్నర లక్షల మంది ఈ సభకు వచ్చి ఉండొచ్చనే అంచనా వెలువడింది. ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టుకు ఈ సభ అద్దంపట్టింది. ప్రజా వెల్లువను చూసి ప్రధాని సంతోషపడినట్లు వేదిక మీదున్నప్పుడు ఆయన ముఖ కవళికలే చాటి చెప్పాయి. పార్టీలు వేరైనప్పటికీ ఈ దేశ ప్రధానమంత్రిని అపూర్వంగా ఆదరించి, జయజయధ్వానాలతో కూడిన తమ ఆతిథ్య విశిష్టతను ఉత్తరాంధ్ర గడ్డ చాటిచెప్పింది. వారి ఆతిథ్యానికి తగ్గట్టుగా మోదీ కూడా విశాఖపట్టణం ఔన్నత్యాన్ని కొనియాడారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పిల్లకాలువలూ, పిట్టకథల వంటి కొన్ని చిన్నచిన్న కదలికలు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శిబిరంలో కనిపించాయి. ప్రధానమంత్రి విశాఖపట్నం చేరుకొని తన బసకు చేరుకున్న వెంటనే అక్కడ వేచివున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలుసుకున్నారు. జనసేన పార్టీ గత మూడేళ్ల నుంచి బీజేపీతో డేటింగ్ చేస్తున్నది. అటువంటప్పుడు రెండు పార్టీల నాయకులు కలిస్తే వింతేమున్నది? ఏ వింతా ఉండకూడదు. కానీ, ఒకపక్క బీజేపీతో పొత్తులో ఉంటూనే తెలుగుదేశం పార్టీని కూడా ఆయన ప్రేమిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన కార్య క్రమాలు కూడా ఉంటున్నాయి. బీజేపీతో కంటే తెలుగు దేశంతోనే ఆయన ఎక్కువ సమన్వయంతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని గతంలో పవన్ చేసిన ప్రకటనను ఒకసారి గుర్తుచేసుకోవాలి. బీజేపీ – టీడీపీ – జనసేన ఒక కూటమిగా ఏర్పడితే తప్ప వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని దీని సారాంశం. వాస్తవా నికి ఈ ప్రతిపాదన చంద్రబాబుది. తాను నేరుగా బీజేపీ పెద్దల ముందు ఉంచడానికి మొహం చెల్లదు కనుక ఈ కార్యాన్ని పవన్‌కు అప్పగించారు. మోదీతో భేటీలో ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ వినిపించడమే పవన్ కల్యాణ్‌కు నిన్నటి టాస్క్. బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ ఏజెంట్ల ద్వారా ఇప్పటికే ఈ విషయంలో కొంత లాబీయింగ్ జరిగింది. కానీ బీజేపీ అధిష్ఠానం బాబును నమ్మేందుకు సుముఖంగా లేదన్న సమాచారంతో పవన్ కల్యాణ్ మీద వారిని ఒప్పించే బాధ్యతను పెట్టినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కూడా ఒక వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా మాట్లాడేందుకు దువ్విపెట్టారు. సమయం రానే వచ్చింది. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంపై విశాఖకు రావడాన్ని వారు ఉపయోగించుకున్నారు. ముందుగా అడిగిన మేరకు పవన్ కల్యాణ్‌కు, రాష్ట్ర బీజేపీ నాయకులకు విడివిడిగా ప్రధాని అపాయింట్మెంట్లు లభించాయి. ఈ రాయబారంలో పట్టువిడుపు లేకుండా వ్యవహరించడం కోసం పవన్ కల్యాణ్ మీద టీడీపీ ఒకరకమైన ఒత్తిడిని కూడా ప్రయోగించింది. ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరడానికి ముందే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఎల్లో ఛానళ్లకు ఒక లీక్ అందింది. లోకేశంబాబు జనవరి 27 నుంచి ఏపీలో పాదయాత్ర చేస్తారనేది ఆ లీకు. ఈ వార్తను హఠాత్తుగా ఈ సందర్భంలో ‘లీకు’గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అధికారికంగానే ప్రకటించవచ్చు. ఒక పార్టీ తరఫున ఎన్నికలకు ముందు ఒక నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే అతనే ఆ పార్టీకి సర్వసైన్యాధ్యక్షుడి కింద లెక్క. కూటమిలో చేరేందుకు పవన్ బీజేపీని ఒప్పిస్తే వ్యూహం మారవచ్చు. ఈ లీకు వార్తతో తమకు సంబంధం లేదని చెప్పవచ్చు. బీజేపీ లేకుండా వస్తే పవన్ కల్యాణ్‌కు ఉప సేనాపతి పదవే దక్కుతుందని అన్యాపదేశంగా చెప్పడం కావచ్చు. పవన్ కల్యాణ్ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. సరిగ్గా అదే సమయానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రామోజీ ఫిలింసిటీలోకి ప్రవేశించారు. పవన్ వైజాగ్ చేరుకుని తన హోటల్ విడిది నుంచి ప్రధాని బసచేసిన ఐఎన్ఎస్ చోళకు సుమారు 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. దాదాపు అంతసేపూ బాబు – రామోజీల సమావేశం కొనసాగింది. ఈమధ్యకాలంలో రాష్ట్ర బీజేపీ నేతల తోనూ, కేంద్ర స్థాయిలో ఉన్న కొందరు శ్రేయోభిలాషులతోనూ తీవ్రస్థాయిలో లాబీయింగ్ జరిగినట్టు సమాచారం. అనుకున్న ప్రకారం ముందుగా పవన్ కల్యాణ్‌తోనూ, తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతోనూ ప్రధాని సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో ఏం జరిగిందనే దానిపై ఎల్లో మీడియా విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉన్నదనీ, ప్రభుత్వమే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదనీ, ఆర్థిక క్రమశిక్షణ లోపించిందనీ, ఇంకా ఇలాంటి అనేక ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రికి పవన్ కల్యాణ్ నివేదించినట్టు ఎల్లో మీడియా రిపోర్ట్ చేసింది. అన్ని ఆరోపణలకూ ‘ఐ నో, ఐ నో’ (నాకు తెలుసు) అంటూ ప్రధాని తలూపారట! పవన్ కల్యాణ్ ఆరోపణల చిట్టా విప్పినంతసేపూ (సుమారు పది నిమిషాలు) నాదెండ్ల మనోహర్ కూడా సమావేశంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ను బయటికి పంపించారు. అటు పిమ్మట మరికొంతసేపు ప్రధానితో పవన్ సమావేశం కొనసాగింది. మనోహర్ ఉన్నంతసేపు ఏం జరిగిం దనే దానిపై చిలవలు పలవలు రాసిన ఎల్లోమీడియా ఆ తర్వాత భాగంపై మౌనం దాల్చింది. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో ప్రధాని మాట్లాడారు. వారి మాటలు విన్నారు. సమావేశంపై ఎల్లో మీడియా ఇచ్చిన వివరాలనే పరిశీలిద్దాము. వైసీపీ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ఎండగట్టాలని ప్రధాని సూచించారట. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రభుత్వంపై ఛార్జిషీట్లు వేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారట. ఇంకా ఏమన్నారంటే... ‘‘రాజకీయాల్లో నిదానం అస్సలు పనికిరాదు. మనం వేగంగా ఉండకపోతే ఆ స్థానాన్ని మరో పార్టీ భర్తీ చేస్తుంది. మనకు మన పార్టీ ముఖ్యం. మరో పార్టీ కాదు. సమస్య చిన్నదా పెద్దదా అని చూడకుండా నిత్యం పోరాటం చేయాలి’’. ఈ వార్తాంశాల అంతస్సారాన్ని (b్ఛ్టఠ్ఛీ్ఛn ్టజ్ఛి జీn్ఛట) చదివితే ఏమర్థమవు తుంది? ఇంకో పార్టీ కోసం ఆలోచించడం మానేసి మీరే ప్రతిపక్షంగా ఎదగడం మీద దృష్టి పెట్టండని స్పష్టంగా ప్రధానమంత్రి రాష్ట్ర బీజేపీ కోర్ టీమ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ అంతస్సారాన్ని గ్రహించగలిగితే మనోహర్ లేని సమయంలో పవన్‌తో మోదీ ఏం మాట్లాడి ఉంటారనేది అర్థమవుతుంది. మనోహర్ నిష్క్రమించిన అనంతరం ప్రధానమంత్రి తన మన్‌కీ బాత్‌ను పవన్ కల్యాణ్‌కు ఉపదేశించారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం, తెలుగుదేశం నమ్మదగిన పార్టీ కాదనీ, దాని స్థానంలో బీజేపీ – జనసేన కూటమి ప్రతిపక్షంగా ఎదగా లని చెప్పారట! పవన్ కల్యాణ్ ఇప్పటికే టీడీపీతో కమిట్ అయ్యారు కనుక ఈ మాటలు రుచించి ఉండకపోవచ్చు. అయినా గట్టిగా ఎదురుచెప్పలేని పరిస్థితి. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలో ఈ సంకటస్థితి ప్రతిఫలించింది. ఈ మూడు పార్టీలు కలిస్తేనే వైసీపీతో పోరాడగలమని గట్టిగా నమ్ముతున్న పవన్‌కు నిన్నటి సమావేశం చేదు అనుభవాన్నే ఇచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జతగూడి ఉపసేనాపతి పదవి తీసుకోవడమా? లేక బీజేపీ – జనసేన కూటమికి సర్వ సేనాధిపతిగా వ్యవహరించడమా? ఈ రెంటిలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి పవన్‌ది. ఆయన నిస్సంశయంగా ఉపసేనాపతి పదవినే తీసుకోవచ్చు. ఆయన ట్రాక్ రికార్డే ఈ నిర్ధారణకు కారణం. ఆయన విమర్శకులు ఆరోపిస్తున్నట్టుగానే ప్రతి రాజకీయ మలుపులోనూ పవన్ తెలుగుదేశం పార్టీకి ఉపకరించే విధంగానే వ్యవహరిస్తున్నారు. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ స్వయంగా జనసేను స్థాపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇది జరిగింది. పార్టీ పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగలేదు. తెలుగుదేశం – బీజేపీ కూటమిలో భాగ స్వామిగా ఉండి ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అప్పుడు దేశవ్యాప్తంగా వీస్తున్న ‘మోదీ వేవ్’ తోడవడంతో ఒక్క శాతం ఓట్ల తేడాతో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నినాళ్లూ జనసేన ఒక ప్రతిపక్షంగా కాదు గదా ఒక రాజకీయ పక్షంలా కూడా వ్యవహరించలేదు. వేలకోట్ల రూపాయల కిమ్మత్తు చేసే అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వచ్చినా కిమ్మనలేదు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ అభాగినులను కాటేస్తున్నా నోరు విప్ప లేదు. తాసిల్దార్ల దగ్గర్నుంచీ ఐఏఎస్‌ల వరకు మాట వినని అధికారులపై ఎమ్మెల్యేలు బహిరంగంగా దాడులు చేస్తున్నా, దూషిస్తున్నా ఖండించలేదు. మళ్లీ 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అనుకూల వైఖరినే జనసేన తీసుకున్నది. తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్సీపీకి పడకుండా చీల్చడం కోసం కమ్యూనిస్టులనూ, బీఎస్పీని కలుపుకొని జనసేన కూటమి కట్టింది. ఈ కూటమికి చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. బాబు అప్పగించిన ఈ టాస్క్‌లో పవన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ వైఫల్యం పవన్ అహంపై బలమైన దెబ్బకొట్టింది. స్వయంగా తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తననూ, తన పార్టీనీ దారుణంగా ఓడించిన వైఎస్సార్సీపీపై పీకల్దాకా కోపాన్ని పెంచుకున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీతో ఇంతకుముందు నుంచే కొనసాగుతున్న బంధం మరింత బలపడింది. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చే అసైన్మెంట్ల ప్రకారమే ఆయన రాజకీయ కార్యక్రమాలు ఉంటున్నాయనే విమర్శలు వచ్చాయి. ఇటీవల జరిగిన జసేన పార్టీ సమావేశంలో రాష్ట్ర మంత్రులను ఆవేశంతో ఊగిపోతూ తిట్టడం, ఇప్పటం గ్రామానికి కారు బానెట్‌పై కూర్చుని పూనకంతో వెళ్లడం, వైజాగ్‌లో విపరీత ప్రవర్తన ఇలా చెప్పుకుంటూ పోతే ఓ కొండవీటి చేంతాడు! ఇవన్నీ తెలుగుదేశం – జనసేనల ఫెవికాల్ బంధాన్ని దృఢంగా నిర్ధారిస్తున్నాయి. తమతోపాటు బీజేపీని తీసుకురావడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడకపోతే ఈ మిత్రద్వయం కమ్యూనిస్టుల తోడ్పాటు కోసం ప్రయత్నించ వచ్చు. మునుగోడు తులాభారంలో ఎర్ర తులసిదళం పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ వాళ్ల కాళ్లావేళ్లా పడి, వాళ్లు ఛీపొమ్మని చీదరించుకున్న స్థానంలోకి చంకలు గుద్దుకుంటూ వెళ్లడానికి కమ్యూనిస్టులు ఆ మాత్రం నిబద్ధత లేనివాళ్లా ఏమి? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పేదల ఇళ్లపై కూడా రాజకీయం చేస్తున్నారు : మంత్రి బొత్స సత్యనారాయణ
-
ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతమైంది : బీజేపీ ఎంపీ జీవీఎల్
-
మోదీ పాలనలో ప్రతి రంగంలో దూసుకుపోతున్నాం: రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్
-
విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బహిరంగ సభ
-
ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్‌లో శనివారం జరిగే బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. ప్రాజెక్టుల వివరాలు.. ► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం ఇదీ చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
ప్రధాని విశాఖ సభ: కని విని ఎరుగని రీతిలో ప్రజానీకం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటనలో భాగంగా సభలో పాల్గొనేందుకు పోటెత్తారు జనాలు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఉద్దేశంతో.. ఏపీ ప్రభుత్వం జనసమీకరణ చేపట్టింది. ఈ సభకు కనివినీ ఎరుగని రీతిలో సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. బస్సులు, రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో జనాలను సభకు తరలించారు. సభకు వచ్చిన దగ్గర నుండి మళ్లీ తిరిగి వెళ్లే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే 1.10 లక్ష మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రధాని సభకు హాజరయ్యే వాహనదారులకు సూచనలు ► శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ప్రధాని సభకు వచ్చే వాహనాలు మారికవలస.. తిమ్మాపురం.. కురుపాం సర్కిల్ నుంచి చిన వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి ► భీమిలి నుంచి వచ్చే వాహనాలు మారి వలస తిమ్మాపురం జోడుగుల పాలెం చిన్న వాల్తేరు మీదుగా కృష్ణదేవరాయలు అతిథి గృహానికి చేరుకోవాలి ► మాడుగుల నుంచి వచ్చే రూట్ నెంబర్ 170 వాహనాలు పినగాడి వేపగుంట హనుమంతవాక కళాభారతి మీదుగా ఏయూ గ్రౌండ్స్ కు చేరుకోవాలి ► పెందుర్తి ఎస్ కోట చోడవరం నుంచి వచ్చే వాహనాలు అడవివరం శివాజీ పార్క్ మీదుగా రామలక్ష్మి అపార్ట్మెంట్ వద్ద ప్రజలను దించి నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి ► నర్సీపట్నం పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలు ఎన్ ఎ డి కొత్త రోడ్.. తాటి చెట్ల పాలెం గురుద్వారా మీదుగా మద్దిలపాలెం వద్ద ప్రజలను దించాలి ► విశాఖ సౌత్ నుంచి బయలుదేరే ప్రజలు జ్ఞానాపురం ...ఫిషింగ్ హార్బర్ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి చిన్న వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి ► విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ప్రజల వాహనాలు అప్పు ఘర్ మీదుగా ఆర్‌సిడి ఆసుపత్రి వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలి ► వీఐపీలు తమ వాహనాలను నోవాటెల్... సర్క్యూట్ హౌస్ ...సెవెన్ హిల్స్ జంక్షన్ ఆసిల్ మెట్ట.. స్వర్ణ భారతి స్టేడియం నుంచి మద్దిలపాలెం వద్ద ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి. ఇదీ చదవండి: ప్రధాని పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు ఇదిగో.. -
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
-
ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం విశాఖలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు, మరికొన్నింటిని జాతికి అంకితం చేసేందుకు విశాఖకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో రాత్రి 7.55కు ఐఎన్ఎస్ డేగా వద్దకు ప్రధాని చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, తదితరులు స్వాగతం పలికారు. సీఎం జగన్ పలువురు మంత్రులను ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం మారుతి కూడలి నుంచి ఐఎన్ఎస్ చోళా వరకు బీజేపీ చేపట్టిన శోభాయాత్ర రోడ్ షోలో అడుగడుగునా ప్రధానికి ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐఎన్ఎస్ చోళా సూటుకు చేరుకున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీకి చెందిన కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. మరోవైపు సీఎం జగన్మోహన్రెడ్డి పోర్టు గెస్ట్‌హౌస్‌కు రాత్రి 8.43కు చేరుకోగా, నోవాటెల్‌లో గవర్నర్ బస చేస్తున్నారు. అంతకు ముందు ప్రధానికి స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కలెక్టర్, కమిషనర్‌తో పాటు ఎంపీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. 40 నిమిషాల పాటు పీఎం ప్రసంగం! రాష్ట్రంలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్ ఇప్పటికే సిద్ధమైంది. శనివారం (12వ తేదీ) ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధానితో కలిసి గవర్నర్, ముఖ్యమంత్రిలు పాల్గొననున్నారు. ప్రధాని ఐఎన్ఎస్ చోళ నుంచి ఉదయం 10.10 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు ఏయూ గ్రౌండ్‌కు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ప్రధాని రూ.10,742 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన, రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ బహిరంగ సభలో ప్రధాని 40 నిమిషాల పాటు ప్రసంగించనున్నట్లు తెలిసింది. ఇదే సభలో సీఎం వైఎస్ జగన్ కూడా మాట్లాడనున్నారు. 11.45 గంటలకు సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12.05 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. బీజేపీ శోభాయమాన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. శోభాయాత్ర పేరిట నిర్వహించిన రోడ్డు షోలో దారి పొడవునా మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు వెనక ఉన్న రోడ్డు మార్గంలోని మారుతి జంక్షన్ నుంచి నేవల్ డాక్ యార్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ రోడ్డుషో సాగింది. రోడ్డు పక్కన బీజేపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా పెద్ద సంఖ్యలో మోదీ ముఖచిత్రం ఉన్న ప్ల కార్డులను చేతబట్టి నిలుచున్నారు. మోదీ వాహనంపై దారి వెంబడి బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. మోదీ.. మోదీ.. భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వాహనంలోపలి నుంచి వారికి అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు. తొలుత ఈ రోడ్డు షోలో ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో పయనిస్తారని భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రధాని రోడ్డు షో కాన్వాయ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఈ రోడ్డు షో వెనుక బీజేపీ నాయకులు సీఎం రమేష్, పురందేశ్వరి, సుజనా చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
ప్రధాని పర్యటనలో రాజకీయ అంశాలు లేవు : బీజేపీ ఎంపీ జీవీఎల్
-
ప్రధాని విశాఖ పర్యటన సందర్బంగా బీజేపీ రోడ్ షో..
-
Visakha Tour: ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
Time: 08:57 PM ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌లో ప్రధాని బస విశాఖ మారుతి జంక్షన్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 1.5 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు. విశాఖ ఐఎన్ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. Time: 08:13 PM ప్రధానికి ఘన స్వాగతం ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజిని స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని.. చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు(శనివారం) ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోదీ సభావేదికపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. Time: 08:06 PM విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు. Time: 07:21 PM కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. Time: 06:55 PM విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధానికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. Time: 05:44 PM విశాఖ బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయల్దేరారు. ప్రధాని మోదీకి సీఎం స్వాగతం పలకనున్నారు. ఇవాళ, రేపు(శనివారం) పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా.. 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7.25 గంటలకు విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగకు చేరుకుంటారు. తర్వాత చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు. సీఎం జగన్ పర్యటన సాగేదిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రధాని మోడీ టూర్ తో ఉత్తరాంధ్రకు మేలు : ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
-
రాష్ట్రపతి కోవింద్ కు స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్రపతి కోవింద్ కు ఘన స్వాగతం పలకనున్న సీఎం జగన్
-
విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
-
విశాఖకు సీఎం జగన్
-
Famous Tourist Places Vizag: వహ్ వైజాగ్! ఒకటా రెండా.. ఎన్నెన్ని అందాలో
సాక్షి, విశాఖపట్నం : ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటకంగా కూడా గత రెండు దశాబ్ధాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. కొండ కోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాలు.. ఏ చోటకు వెళ్లినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది. 2004 తరువాత నుంచి పర్యాటకంగా విశాఖ రూపురేఖలు మారిపోయాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా నగరంలోనే కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా సరికొత్త పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓసారి చూసొద్దాం రండి... మదిదోచే కైలాసగిరి ఆర్కే బీచ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు. చదవండి: Lambasingi: లంబసింగికి చలో చలో భీమిలి.. అందాల లోగిలి.. ఆర్కే బీచ్ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్ పాలకుల సమాధులు, లైట్ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడం విశేషం. జలజల జలపాతాలు.. విశాఖ మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఆంధ్రా ఊటీ.. అరకు.. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్ క్లియర్ స్ట్రీమ్స్ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు. బుద్ధం.. శరణం.. గచ్ఛామి... ఆర్కే బీచ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ప్రాచీన బౌద్ధ క్షేత్రాలు తొట్లకొండ, బావికొండ ఉన్నాయి. తొట్లకొండ తదితర ప్రాంతాలు నిత్యం పర్యాటకులను అలరిస్తున్నాయి. జంతు ప్రపంచం పిలుస్తోంది... ఆర్కే బీచ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో జూపార్క్ ఉంది. ఎన్నో అరుదైన జంతువులు, వన్యప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జూ ఎదురుగా ఉండే కంబాలకొండలో వన్యప్రాణులతో పాటు సాహస క్రీడలు, బోటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భలే మంచు ఊరు డిసెంబర్..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వీఎంఆర్డీఏ పార్క్ ఆర్కే బీచ్ వ్యూను చూస్తూ పర్యాటకులు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిక్నిక్లు జరుపుకునేందుకు, ఆహ్లాదాన్ని పొందేందుకు అనువైన ప్రదేశం. ఇటీవలే రూ.35 కోట్లతో పార్క్‌ను అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. అటు కురుసుర.. ఇటు టీయూ 142 ఆర్కే బీచ్‌లో విహరించి కాస్తా ముందుకు వెళ్తే.. పర్యాటకులను ఆకట్టుకునే కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ఉంటుంది. దాని ఎదురుగానే టీయూ– 142 యుద్ధ విమాన మ్యూజియం. ఇప్పుడు వీటి సరసన... సీ హారియర్ మ్యూజియం సిద్ధమవుతోంది. ఇంకాస్త ముందకెళితే విక్టరీఎట్ సీ దర్శనమిస్తుంది. పురాతన బొర్రా గుహలు.. మీరు చరిత్ర ప్రేమికులైతే, బొర్రా గుహలు ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయి. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు. చరిత్ర చెప్పే మ్యూజియం వీటన్నింటినీ సందర్శించి.. ఇంకొంచెం ముందుకెళ్తే.. విశాఖ మ్యూజియం కనిపిస్తుంది. దాని ఎదురుగానే.. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి సబ్‌మెరైన్ కల్వరి çహాల్ కనిపిస్తుంది. విశాఖ మ్యూజియంలో భారత దేశ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ప్రదర్శిస్తుంటారు. అల ఆర్కే బీచ్‌లో.. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్ మొదలుకొని స్టే, డిన్నర్ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి. -
AP: అభివృద్ధి ఎక్స్‌ప్రెస్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా నూతన సొగసులు సంతరించుకుంటున్న విశాఖలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. నగర చరిత్రలో తొలిసారిగా రూ.247.32 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను శుక్రవారం తన పర్యటన సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరదించుతూ రూ.150 కోట్లతో తొలిసారి రోటరీ మోడల్లో అభివృద్ధి చేసిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు దేశంలోనే తొలి మెకనైజ్డ్ ఆటోమేటిక్ పార్కింగ్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సాగర నగరిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దిన వుడా పార్కు సీఎం చేతులమీదుగా ప్రారంభమైంది. మూడు జోన్లుగా దీన్ని సుందరీకరించారు. 12 కీలక ప్రాజెక్టులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఎన్ఏడీ కూడలి, వుడా పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో మొత్తం 12 కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరు అనంతరం ముఖ్యమంత్రి జగన్ పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్‌కు చేరుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు కూడా హాజరై వధూవరుల్ని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి గన్నవరం బయలుదేరారు. సీఎం జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవీ... వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, నేతలు, అధికారులు ఎన్ఏడీ ఫ్లైఓవర్ రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్ విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చనుంది. దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఫ్లైఓవర్‌ను అభివృద్ధి చేశారు. ఎటువంటి భూ సేకరణ లేకుండానే దీన్ని పూర్తి చేశారు. 2036 నాటికి గంటకు 23,500 వాహనాలు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయాణం చేస్తాయని అంచనా. సీఎం కప్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి మెకనైజ్డ్ పార్కింగ్ విశాఖ జగదాంబ జంక్షన్లో మల్టీ లెవల్ సెమీ–ఆటోమెటిక్ కార్ పార్కింగ్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. రూ.11.45 కోట్లతో దీన్ని తీర్చిదిద్దారు. 367.89 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 100 కార్లను పార్క్ చేసే అవకాశం ఉంది. పార్క్ చేసిన వాహనాన్ని గరిష్టంగా 90 సెకన్లలో తిరిగి తీసుకొచ్చే వీలుంది. ► పిఠాపురం కాలనీలో రూ.7.60 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయం. ► రూ.7.55 కోట్లతో ఆనందపురం జంక్షన్ నుంచి బొని గ్రామం వరకూ 9 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 2 వరసల రహదారి. ► మధురవాడ లా కాలేజీ నుంచి రుషికొండ బీచ్ వరకూ రూ.7.50 కోట్లతో నిర్మించిన రెండు వరుసల రహదారి. ► ఎన్‌హెచ్–16 నుంచి విశాఖ వ్యాలీ స్కూలు మీదుగా బీచ్ రోడ్ వరకూ రూ.6.97 కోట్లతో చేపట్టిన రహదారి. ► రూ. 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కళ్యాణ మండపం. ► తాటిచెట్లపాలెం ధర్మానగర్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్. ► దాదాపు 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా సుందరీకరించిన వుడా పార్కును సీఎం ప్రారంభించారు. పార్కును మూడు జోన్లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఏరియాను అభివృద్ధి చేశారు. బీఎంఎక్స్ సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. హెర్బల్ ప్లాంట్స్‌తో ల్యాండ్‌స్కేప్‌ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. ► రూ.4.65 కోట్లతో దండుబజారులో స్మార్ట్ స్కూల్‌గా అభివృద్ధి చేసిన మహారాణి విద్యాదేవి హైస్కూల్. ► శిథిలావస్థలో ఉన్న టౌన్ హాల్ రూ.4.24 కోట్లతో ఆధునీకరణ ప్రాజెక్టుతో పాటు రూ.7.16 కోట్లతో పాత మునిసిపల్ హాల్ ఆధునీకరణ ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభించారు. ► వుడా పార్కులో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 21న నిర్వహించనున్న సీఎం క్రికెట్ కప్‌ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. -
విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
విశాఖ: పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం జగన్
Live Updates ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు. రూ.248 కోట్లతో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు.. 150 కోట్లతో నిర్మించిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. బీచ్‌రోడ్డులో రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని సీఎం ప్రారంభించారు. ►వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరుల్ని సీఎం ఆశీర్వదించారు. ►డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వధూవరుల్ని సీఎం ఆశీర్వదించారు. ►విశాఖలో ఎన్ఏడీ ప్లైఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ►విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. రూ.248 కోట్లతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ చేరుకున్నారు. సీఎంకు మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి, కలెక్టర్ స్వాగతం పలికారు. కాసేపట్లో ఎన్ఏడీ జంక్షన్లో ప్లైఓవర్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ►విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. వివాహ రిసెప్షన్లకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, సీపీ పరిశీలించారు. సీఎం జగన్ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖకి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు గేట్–1లో అధికారులు, ప్రజాప్రతినిధుల్ని కలవనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ఎన్ఏడీ జంక్షన్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకోనున్నారు. అక్కడ రూ. 150 కోట్లతో నిర్మించిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 5.45 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్లో విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని సీఎం ఆశీర్వదించనున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులో ఉన్న వుడా పార్కుకి చేరుకొని రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదిస్తారు. రాత్రి 7.55 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం బయలుదేరనున్నారు. -
‘అప్పుడు కోడిగుడ్లు, టమోటాలు విసరలేదా బాబూ’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను తెలివి తక్కువ యాత్రలుగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా బాబును ప్రజలు ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి పట్ల విరక్తి చెందిన స్థానిక ప్రజలే ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘రెండేళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీకి వస్తే కనీసం ఎయిర్ పోర్టులోకి కూడా పోలీసులు అనుమతించలేదు. కానీ, నేడు పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టి చంద్రబాబుకు అనుమతులిచ్చారు. పోలీసులు అనుమతులిచ్చినా ప్రజలు అంగీకరించొద్దా? ఓ వ్యక్తి కోసం పోలీసులు లాఠీఛార్జీ చేశారు. చంద్రబాబు పర్యటన కోసం షూట్ ఎట్ సైట్ చేయాలా? ఓ వైపు ఢిల్లీ అగ్నిగుండం అవుతుంటే, జాతీయ నేతగా చెప్పుకునే చంద్రబాబు వైఖరి ఇదేనా? రాజకీయ బాధ్యత గల వ్యక్తి విశాఖలో అరాచకం సృష్టించడాన్ని ఖండిస్తున్నాం’అన్నారు. ఎన్టీఆర్‌కు అవమానం కళ్లారా చూశాను.. ఎక్కడేం జరిగినా కడప, పులివెందుల అని మాట్లాడ్డం చంద్రబాబుకు అలవాటు. కానీ, అక్కడి ప్రజలను రౌడీలుగా, గుండాలుగా పరిగణించి వారి మనోభావాలను కించపరుస్తున్నారు. 1994లో మీరు చేసిన పనేంటి? ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు వచ్చినప్పుడు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరలేదా చంద్రబాబు? ఎన్టీఆర్ చేతులు అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకోవడం ప్రత్యక్షంగా చూసాను. ఎన్టీఆర్ వెన్నుపోటుకు విశాఖ నుంచే ఎమ్మెల్యేలతో ఆయన పథక రచన చేశారు. రాజకీయాల కోసం ఎంతటి స్థాయికయినా బాబు దిగజారుతారు. చంద్రబాబు మాటలతో ఉత్తరాంధ్ర ప్రజలు బాధపడుతున్నారు. 1994 ఆగస్టు ఎపిసోడ్‌పై సీఎం వైఎస్ జగన్ జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ కోరుతున్నా’అని వీరభద్ర రావు పేర్కొన్నారు. -
చంద్రబాబు పర్యటనకు మత్స్యకారుల సెగ
-
లోకేష్ టూర్ కోసం టెన్త్ ఫలితాల విడుదల వాయిదా
విజయవాడ: మంత్రి లోకేష్ విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల సమయాన్ని మార్చారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని తొలుత నిర్ణయించగా, మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. విజయవాడలో ఫలితాలను విడుదల చేయాల్సివుండగా, లోకేష్ టూర్లో పాల్గొనేందుకోసం మంత్రి గంటా వేదికను విశాఖకు మార్చారు. విశాఖలో లోకేష్ పర్యటన ముగిసిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మంత్రి గంటా తీరుపై విద్యాశాఖ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రి లోకేష్ పర్యటన కోసం టెన్త్ ఫలితాల విడుదల సమయాన్ని మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. -
సాక్షిని చదువుతున్న చంద్రబాబు
చూడొద్దన్న సాక్షిని చంద్రబాబు చదివేస్తున్నారు ప్రభుత్వాలను సరైనమార్గంలో నడిపించడానికి పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటాయి. ప్రజా సమస్యలపై పత్రికలు రాసే వార్తలపై ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యతిరేకంగా వార్తలొస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమాత్రం సహించరు. నిత్యం తనకు అనుకూలంగా కథనాలు రావాలని అనుకుంటారు. "సాక్షి" చెప్పే అక్షరసత్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తన అక్కసును వెళ్లగక్కారు. సహనం కోల్పోయి పలు వేదికల్లో ఆయన "సాక్షి" దినపత్రికను చూడొద్దని, చదవొద్దని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సాక్షి అనగానే ఇంతెత్తు లేస్తారు. పార్టీ నాయకులెవరూ సాక్షి పత్రికను చదవొద్దని పిలుపునిచ్చారు కూడా. పైకి అలా చెబుతున్నప్పటికీ చంద్రబాబు తన ఫీడ్ బ్యాక్ కోసం సాక్షి పత్రికలో వచ్చే కథనాలపైనే ఆధారపడతారని అనేక మంది పార్టీ నేతలు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో పార్టీ నాయకులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన సందర్భంలోనూ ఒక్కో నాయకుడి పనితీరును బేరీజు వేయడానికి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ సైతం సాక్షి పత్రిక క్లిప్పింగ్స్ చూపించి నాయకులకు రేటింగ్ ఇచ్చారు. సాక్షిని చదవొద్దని పైకి చెప్పే చంద్రబాబు తీరిక దొరికినప్పుడల్లా ఆ పత్రికను తప్పనిసరిగా చదువుతారని టీడీపీ సీనియర్లు చెప్పే విషయం రూఢీ అయింది. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం ఉదయం విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్టు నుంచి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనడానికి కాన్వాయ్ లో వెళుతున్న సందర్భంలో సాక్షి పత్రికను తీసుకుని మొదటి పేజీ నుంచి చివరి వరకు ఆసాంతం చూస్తూ తనకు అవసరమైన కథనాలు చదివారు. దాంతో పాటు జిల్లా టాబ్లాయిడ్‌ను సైతం పూర్తిగా చదివారు. చంద్రబాబుతో పాటు ఆ వాహనంలో జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు వాహనంలో అధికారులు అన్ని పత్రికలను అందుబాటులో ఉంచుతారు. విశాఖ పర్యటన సందర్భంగా అన్ని పత్రికల్లోనూ ఒక్క సాక్షిని మాత్రమే తీసుకుని చదివారు. ఫొటోలు : పీఎల్ మోహనరావు, సాక్షి, విశాఖపట్నం -
16న విశాఖకు ప్రధాని మోదీ
స్టీల్ ప్లాంట్‌లో బహిరంగ సభకు హాజరు సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నం రానున్నారు. హెచ్‌పీసీఎల్ నిర్మించిన భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల భూగర్భ ప్రాజెక్టు (ఐఎస్పీఆర్ఎల్)తో పాటు స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ యువరాజ్ విడుదల చేశారు. దాని ప్రకారం.. ప్రధాని 16వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి వైమానిక దళ విమానంలో బయల్దేరి 9.20కి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి 9.25కి హెలికాప్టర్లో బయల్దేరి ఐఎన్ఎస్ శాతవాహనకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్‌పీసీఎల్ నిర్మించిన ఐఎస్పీఆర్ఎల్ ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. భూగర్భంలో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఉదయం 10 గంటలకు జాతికి అంకితం చేస్తారు. 10.40కి శాతవాహన హెలిపాడ్‌కు చేరుకుని హెలికాప్టర్లో స్టీల్‌ప్లాంట్‌కు వెళ్తారు. 12,500 కోట్లతో చేపట్టిన స్టీల్‌ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 12.40కి స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 1.20కి విశాఖ నుంచి వైమానిక దళ విమానంలో బయల్దేరి వారణాసి వెళ్తారు. -
విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
విశాఖలో కలియదిరుగుతున్న మోదీ
హుదూద్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో విశాఖపట్నం చేరుకున్న మోదీ.. అక్కడ దెబ్బతిన్న విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు ఆయన చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వెంట ఆ పర్యటనలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు. ముందుగా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత.. కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ప్రధాని సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత బయల్దేరి నేరుగా మళ్లీ ఢిల్లీ వెళ్తారు. -
విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ
విశాఖ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన మంగళవారం మధ్యాహ్నం సైనిక విమానం ఐఎన్ఎస్ డేగాలో నగరానికి వచ్చారు. తుఫానుకు దెబ్బతిన్న విమానాశ్రయాన్ని మోడీ పరిశీలించారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. కలెక్టరేట్లో మోడీ తుఫాను సహాయక కార్యక్రమాలు, నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నారు. రోడ్డు ప్రాంతంలో ఆయన తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. మోడీ సుమారు రెండు గంటల పాటు విశాఖలో ఉంటారు. మధ్యాహ్నం 3.20కి ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు. -
ప్రధాని విశాఖ పర్యటనలో మార్పులు
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇక్కడ ఏరియల్ సర్వే చేయబోవడంలేదని విశాఖ ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఢిల్లీలో బయల్దేరిన మోదీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ వస్తారన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన నేరుగా విశాఖ కలెక్టరేట్‌కు వస్తారని, కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం 3.25 గంటలకు మోదీ విశాఖ నుంచి బయల్దేరి నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు. వాస్తవానికి అంతకుముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం అయితే ఉత్తరాంధ్ర, ఒడిషా ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఇక్కడినుంచి కర్ణాటక వెళ్తారని కూడా చెప్పారు. అయితే, ఢిల్లీలో అత్యవసరపనులు ఉండటం, రేపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కూడా ఉండటంతో పర్యటనలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. -
రేపు విశాఖకు ప్రధాని మోదీ
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలలంగా మారిన విశాఖపట్నం నగరానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రానున్నారు. ఇక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి.. బాధితులను పరామర్శించేందుకు ఆయన వస్తున్నారు. హుదూద్ తుఫానుపై తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, ఇప్పటికే తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నానని ఆయన తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో నష్టాన్ని మిగిల్చిన హుదూద్ తుఫాను అనంతరం సహాయక చర్యలకు 2వేల కోట్ల రూపాయల సాయం చేయాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. తుఫాను కారణంగా తన వారణాసి పర్యటనను కూడా రద్దు చేసుకున్న ప్రధాని.. నేరుగా ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్తారు.