
రేపు విశాఖకు ప్రధాని మోదీ
హుదూద్ తుఫానుతో అల్లకల్లోలలంగా మారిన విశాఖపట్నం నగరానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రానున్నారు. ఇక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి.. బాధితులను పరామర్శించేందుకు ఆయన వస్తున్నారు. హుదూద్ తుఫానుపై తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడానని, ఇప్పటికే తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నానని ఆయన తెలిపారు.
కనీవినీ ఎరుగని రీతిలో నష్టాన్ని మిగిల్చిన హుదూద్ తుఫాను అనంతరం సహాయక చర్యలకు 2వేల కోట్ల రూపాయల సాయం చేయాలని కేంద్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. తుఫాను కారణంగా తన వారణాసి పర్యటనను కూడా రద్దు చేసుకున్న ప్రధాని.. నేరుగా ఢిల్లీ నుంచి విశాఖకు వెళ్తారు.