విశాఖలో కలియదిరుగుతున్న మోదీ
హుదూద్ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో విశాఖపట్నం చేరుకున్న మోదీ.. అక్కడ దెబ్బతిన్న విమానాశ్రయాన్ని పరిశీలించారు. అనంతరం తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు ఆయన చేరుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ వెంట ఆ పర్యటనలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు. ముందుగా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత.. కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ప్రధాని సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత బయల్దేరి నేరుగా మళ్లీ ఢిల్లీ వెళ్తారు.