Live Updates
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు. రూ.248 కోట్లతో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు.. 150 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. బీచ్‌రోడ్డులో రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని సీఎం ప్రారంభించారు.
►వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరుల్ని సీఎం ఆశీర్వదించారు.
►డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరుల్ని సీఎం ఆశీర్వదించారు.
►విశాఖలో ఎన్‌ఏడీ ప్లైఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
►విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. రూ.248 కోట్లతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు.
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. సీఎంకు మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి, కలెక్టర్ స్వాగతం పలికారు. కాసేపట్లో ఎన్‌ఏడీ జంక్షన్‌లో ప్లైఓవర్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
►విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. వివాహ రిసెప్షన్లకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, సీపీ పరిశీలించారు. సీఎం జగన్ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖకి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు గేట్–1లో అధికారులు, ప్రజాప్రతినిధుల్ని కలవనున్నారు.
అనంతరం రోడ్డు మార్గంలో ఎన్‌ఏడీ జంక్షన్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకోనున్నారు. అక్కడ రూ. 150 కోట్లతో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 5.45 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్‌లో విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని సీఎం ఆశీర్వదించనున్నారు.
అక్కడి నుంచి బీచ్‌రోడ్డులో ఉన్న వుడా పార్కుకి చేరుకొని రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదిస్తారు. రాత్రి 7.55 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం బయలుదేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment