హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. టెన్త్ క్లాస్ 75.16 శాతం, ఇంటర్లో 65.39 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జూన్ 15వ తేదీన డీఎస్సీకి ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తామన్నారు. అలాగే డిఎస్సీ ఫలితాలపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సంగతి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశంపై ఈ నెల 10వ తేదీన విచారణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని గంటా స్పష్టం చేశారు.