ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని
కర్నూలు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలులో ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో 61.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయితే, ఏపీలో 72.07 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. గత ఏడాదిలో పోలిస్తే 1.19 శాతం ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక ఇంటర్ ఫలితాల్లో 83%తో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా నిలవగా కడప జిల్లా 60%శాతంతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.