ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ : ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్శిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జూనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 62శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, పశ్చిమ గోదావరి రెండో స్థానం, గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలవగా 48 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి ఆత్మహత్యలను నియంత్రించేందుకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.సుమారు నాలుగు లక్షల ఎనభైవేలమంది పరీక్షకు హాజరు కాగా వారిలో 2,95, 891 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం తగ్గింది. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలే పైచేయిగా నిలిచారు. పరీక్ష ఫలితాలను ప్రభుత్వం 44 వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు www.sakshieducation.com వెబ్‌సైట్‌లోను పరీక్షా ఫలితాలను చూడవచ్చు.
- ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్) - ఇక్కడ చూడండి
- ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (వొకేషనల్) - ఇక్కడ చూడండి
Comments
Please login to add a commentAdd a comment