Andhra Pradesh Board of Intermediate Education
-
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
సాక్షి, విశాఖ : ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్శిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జూనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 62శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, పశ్చిమ గోదావరి రెండో స్థానం, గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలవగా 48 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. మార్కులు ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అటువంటి ఆత్మహత్యలను నియంత్రించేందుకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.సుమారు నాలుగు లక్షల ఎనభైవేలమంది పరీక్షకు హాజరు కాగా వారిలో 2,95, 891 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం తగ్గింది. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలే పైచేయిగా నిలిచారు. పరీక్ష ఫలితాలను ప్రభుత్వం 44 వెబ్సైట్లలో అందుబాటులో ఉంచింది. వీటితో పాటు www.sakshieducation.com వెబ్సైట్లోను పరీక్షా ఫలితాలను చూడవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్) - ఇక్కడ చూడండి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (వొకేషనల్) - ఇక్కడ చూడండి -
ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
-
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రాజమహేంద్రవరం షల్టన్ హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సారనికి సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. మొత్తం 73.33 శాతం మంది ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి ప్రకటించారు. 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. నెల్లూరు 77 శాతంతో రెండో స్థానంలో ఉండగా, గుంటూరు జిల్లా 76 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తం 4,84, 889 మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారు. ఇందులో రెగ్యులర్ 4,41,359 మంది రాయగా, ప్రవేట్‌గా 48,530 మంది రాశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. టాపర్స్ వీరే.. ఎంపీసీ వర్ధన్ రెడ్డి ---- 992 షేక్ ఆఫ్రాన్---- 991 సుష్మా ------- 990 బైపీసీ: దీక్షిత ------- 990 లక్ష్మీ కీర్తి: --- 990 ఎంఈసీ నిశాంత్ కృష్ణ -- 992 మీనా --------- 991 అభిషేక్ ------- 981 -
ఎంసెట్‌లో మిగిలిన ర్యాంకులు విడుదల
కాకినాడ: ఎంసెట్‌లో అర్హత సాధించి ర్యాంకులు పొందని అభ్యర్థులకు శుక్రవారం ర్యాంకులు ప్రకటించనున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా కాకుండా ఇతర బోర్డులు ద్వారా ఎంసెట్ పరీక్ష రాసి డిక్లరేషన్ ఫారం ఎంసెట్ కార్యాలయానికి అందజేసిన వారి ర్యాంకులు ప్రకటిస్తామని, ఇంకా డిక్లరేషన్ ఫారం సమర్పించని అభ్యర్థులు ఫారం ఎంసెట్ వైబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అందజేస్తే ర్యాంకులు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష హాల్ టికెట్ నంబరు కాకుండా ప్రథమ సంవత్సరానిది ఎంటర్ చేయడంతో ఈ సమస్యలు వచ్చాయని తెలిపారు. ఏమైనా సందేహాలుంటే 0884–2340535 నంబరులో సంప్రదించవచ్చన్నారు. -
ఏపీ ఇంటర్లో తెలంగాణ అమ్మాయి టాప్
ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన వేములవాడ అమ్మాయి వేములవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ జూనియర్ కళాశాలలో వేములవాడకు చెందిన నాగమల్ల యశశ్రీ ఫస్టియర్ ఫలితాల్లో 436 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంకును కైవసం చేసు కుంది. దీంతో ఆంధ్రలో తెలంగాణ అమ్మాయి తన హవా ప్రదర్శిం చిందని వేములవాడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన నాగమల్ల శ్రీనివాస్ విద్యాభ్యాసం వేములవాడలోనే కొనసాగింది. వైద్యపట్టా తీసుకున్న అనంతరం వైద్యురాలు నాగమల్ల పద్మలతను వివాహం చేసుకున్నాడు. అనంతరం వేములవాడలోనే ఇరువురు పార్థసారథి నర్సింగ్‌హోం స్థాపించి ఇక్కడి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు తేజశ్రీ, యశశ్రీలు. పెద్ద కూతురు తేజశ్రీ సైతం విజయవాడలోనే విద్యాభ్యాసం చేసి బైపీసీ ఫస్టియర్ ఫలితాల్లో 433 మార్కులు సాధించుకుందనీ, మెడిసిన్‌లో 719వ ర్యాంకు సాధించుకుని ప్రస్తుతం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. చిన్న కూతురైన యశశ్రీ ఇంటర్ బైపీసీ చదువుకుంటూ గురువారం అక్కడి ప్రభు త్వం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంకు సాధించింది. వైద్య దంపతులైన డాక్టర్ శ్రీనివాస్–పద్మలతలను అభినందిస్తున్నారు. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్ విధానం అమలు చేశామని, రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫలితాల్లో కూడా గ్రేడింగ్ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. అలాగే 80 శాతం ఉత్తీర్ణతతో ఎప్పటిలాగే బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 77శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, నెల్లూరు జిల్లా (69 శాతం) ద్వితీయ, పశ్చిమ గోదావరి జిల్లా (67శాతం) తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో 86 శాతంతో కృష్ణాజిల్లా టాప్‌లో నిలవగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెకండ్ (80శాతం), గుంటూరు జిల్లా (79శాతం) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చివరస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ 20న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా, ఈసారి అంతకన్నా వారం రోజులు ముందుగా విడుదల చేశారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షి, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఇంటర్ ఫస్టియర్.... ఫలితాల్లో కృష్ణాజిల్లాకు (77శాతం) మొదటి స్థానం రెండోస్థానంలో నెల్లూరు జిల్లా (69) మూడో స్థానంలో పశ్చిమ గోదావరి (67 శాతం) ఫస్టియర్ లో 64 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత A-గ్రేడ్- 1,67,194 మంది విద్యార్థులు B-గ్రేడ్ .... 87,346 C-గ్రేడ్... 41,451 D-గ్రేడ్... 18,480 సెకండియర్... కృష్ణాజిల్లా 86 శాతంతో తొలి స్థానం రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు జిల్లా (80 శాతం) మూడో స్థానంలో గుంటూరు (79 శాతం) రెండో సంవత్సరంలో 77 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత A-గ్రేడ్- 2,09,248 మంది విద్యార్థులు B-గ్రేడ్ .... 82,530 C-గ్రేడ్... 30,400 D-గ్రేడ్... 8,810 ఎంపీసీలో ఫస్ట్ ర్యాంక్- షేక్ షర్మిల (992 మార్కులు) ఎంపీసీలో సెకండ్ ర్యాంక్- దోసపాటి సాయివంశీ (992) థర్డ్ ర్యాంక్- లోకేశ్ బాబు (991) బైపీసీలో ఫస్ట్ ర్యాంక్ - ఆలపాటి నైమిషా (991) సెకండ్ ర్యాంక్ - పసుపులేటి లీమ (990) థర్డ్ ర్యాంక్ - ఎస్. హారిక (990) సీఈసీలో ఫస్ట్ ర్యాంక్ - యుక్త (969) సెకండ్ ర్యాంక్ - డి పల్లవి (965) థర్డ్ ర్యాంక్ - మహేశ్వరి (965) -
రేపు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు
అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలోని గేట్‌వే హొటల్లో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 10,31,285 మంది రాశారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. 1,445 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాదికన్నా ఈసారి పరీక్ష ఫలితాలను వారం రోజులు ముందుగా విడుదల చేస్తుండడం విశేషం. పరీక్ష ఫలితాలను ‘సాక్షిఎడ్యుకేషన్.కామ్’లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్ జనరల్ ఫలితాలకు 54242కు ఐపీఈ1 స్పేస్ హాల్‌టిక్కెట్ నెంబర్ పంపాలి. సెకండియర్ జనరల్ ఫలితాలకు ఇదే నెంబర్‌కు ఐపీఈ2 స్పేస్ ఇచ్చి హాల్‌టిక్కెట్ నెంబర్ పంపించాలి. 5676750 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపి సమాచారం తెలుసుకోవచ్చని బోర్డు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 17న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. వాస్తవానికి ఈ నెల 27న విడుదల చేయాలని భావించినా జేఈఈ ఫలితాలను విడుదల చేస్తుండడంతో ఇంటర్ ఫలితాలను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. బుధవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తికానున్నది. 17న ఫలితాలను విడుదల చేస్తామని, సాంకేతిక సమస్యలు తలెత్తితే 18న ప్రకటిస్తామని బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
మార్చి1 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు
విజయవాడ: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఏడాది 10 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జంబ్లింగ్ పద్ధతిపై చిన్న చిన్న సమస్యలున్నాయని.. వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. 1445 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామన్నారు. కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. అర్టీసీ అధికారులతో చర్చించి విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా మార్చి9 న జరగాల్సిన పరీక్షను 19న నిర్వహిస్తామన్నారు. -
సచివాలయం నిర్మాణ పనుల్లో ప్రమాదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో మరోసారి ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం పిట్టగోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన కార్మికులు రాంగోపాల్, ధర్మేంద్ర, జయరామ్, కిషోర్ చౌదరిలను ఎన్నారై ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే సచివాలయం నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతిచెందారు. తాజా ప్రమాదంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సచివాలయ నిర్మాణంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సీపీఎం నాయకుడు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని...వారికి తక్షణమే నష్టపరిహారమివ్వాలన్నారు. కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని బాబురావు ప్రభుత్వాన్ని కోరారు. -
ఏపీ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు నేడే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో ఈ ఫలితాలను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ వెబ్సైట్లో చూసుకోవచ్చు. -
పేదింట విద్యా కిరణం
సంతకవిటి (శ్రీకాకుళం): ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి సత్తా చాటాడు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం అక్కరాపల్లి గ్రామానికి చెందిన చీపురుపల్లి సంతోష్‌కుమార్ ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 మార్కులు సాధించి ఎంపీసీలో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. తల్లిదండ్రులు లక్ష్మీ, పుట్టయ్యలు ధోబీ వృత్తి చేస్తారు. సివిల్స్ సాధించడమే లక్ష్యం: సత్యవాణి పార్వతీపురం రూరల్: సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని ఫస్ట్ ఇంటర్ స్టేట్‌ఫస్ట్ ర్యాంకర్ సత్యవాణి పేర్కొంది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురానికి చెందిన సత్యవాణి ఇంటర్ ఫస్టియర్‌లో 466 మార్కులు సాధించింది. ఈమె తండ్రి ఆంజనేయులు(అవధాని) గ్రామంలో పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
చనిపోయిన మా అక్కే నాకు స్ఫూర్తి
సెకండియర్ ఎంపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ రోష్ని ఫస్టియర్ ఎంపీసీలో స్టేట్ టాపర్‌గా నిరుపేద విద్యార్థి సంతోష్‌కుమార్ విజయనగరం అర్బన్: చనిపోయిన తన అక్కే తనకు స్ఫూర్తి అని ఇంటర్ సెకండియర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారణాసి రోష్ని తెలిపారు. తన కంటే రెండేళ్లు పెద్ద అయిన అక్క శ్రావణి చదువులో ప్రతిభ చూపేదని, ఆమె హైస్కూల్లో చదువుతూ అకాల మరణం చెందడంతో అప్పటి నుంచి అక్కకు చదువుపై ఉన్న మక్కువను తాను స్ఫూర్తిగా తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన అక్క బతికుంటే ఎలా ప్రతిభ చూపేదో అలా రాణించాలనుకున్నానని చెప్పారు. ఉన్నత స్థాయి ఐఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ చదవాలని ఉందనీ, ప్రజలకు అధికంగా ఉపయోగపడే, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల తయారీ, పరిశోధనలకు సంబంధం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులను ఎన్నుకుంటానని తెలిపారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విజయనగరం పట్టణానికి చెందిన వారణాసి రోష్ని సెకండియర్ ఎంపీసీలో అత్యధిక మార్కులు (992/1000) సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 466/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్‌ను తెచ్చుకుంది. తండ్రి వారణాసి శ్రీనివాసరావు పట్టణంలోని మధ్యతరగతి వ్యాపారవేత్త, తల్లి ఉషారాణి గృహిణి. పదో తరగతిలో 9.8 మాత్రమే తెచ్చుకున్న ఈమె ఇంటర్లో రాష్ట్రస్థాయిలోనే టాపర్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మక ఐఐటీలో చదవాలనేదే నా లక్ష్యం: ప్రగతి ఇంటర్మీడియెట్ ద్వితీయ ఎంపీసీ గ్రూప్‌లో సెకండ్ర్యాంకు సైతం విజయనగరం జిల్లాకే దక్కింది. పట్టణానికి చెందిన బలభద్రుని శివప్రగతి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించింది. ఈమెకు 990 మార్కులు లభించాయి. ఈమె తండ్రి వెంకటరావు డుమా కార్యాలయంలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. అత్యున్నత ప్రమాణాలున్న ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి దేశాభివృద్ధికి తన వంతు కృషిచేయాలన్నదే లక్ష్యమని చెప్పారు. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. తొలిసారిగా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను రికార్డు స్థాయిలో 28 రోజుల లోపే విడుదల చేసినట్లు మంత్రి గంటా తెలిపారు.ఒకేషనల్ కోర్సు ఫలితాలను కూడా తొలిసారిగా ఆన్ లైన్ ద్వార విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఫస్టియర్ 68.05, సెకండియర్ 73.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం ఫస్టియర్ 4,67,747 సెకండియర్ 4,11941 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ లో 3,18,120 సెకండియర్ 3,03,934 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఫస్టియర్ లో అనంతపురం, సెకండియర్ లో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను మే 24 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సప్లమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించేందుకు ఏప్రిల్ 26 చివర తేదీగా ప్రకటించారు. -
మార్చి 2 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి మొదలయ్యే తెలంగాణ పరీక్షలతోపాటే ప్రారంభించేలా షెడ్యూల్‌ను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు సంతకం చేశారు. ఇంటర్ బోర్డు దీనిపై అధికారికంగా ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రశ్నపత్రాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటున్నందున.. వేర్వేరు తేదీల్లో ఈ పరీక్షలు జరిగే సమయంలో ముందుగా పరీక్ష జరిగే రాష్ట్రం పేపర్లను ప్రైవేటు కళాశాలల వారు మరో రాష్ట్రానికి పంపి కాపీలు చేయిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తాను ముందుగా ప్రకటించిన(మార్చి 11 నుంచి 30వ తేదీవరకు) షెడ్యూల్‌కు బదులు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను అనుసరించాలని నిర్ణయించింది. మార్చి 2 నుంచి 21 వరకు నిర్వహించేలా తెలంగాణ షెడ్యూల్ వెలువడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు చేసిన ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఫైలును మంత్రి ఆమోదానికి పంపింది. -
అప్పటి నిధుల విభజన చెల్లదు...
* నిధులు వినియోగించకుండా ఏపీ ఇంటర్‌బోర్డును ఆదేశించండి * హైకోర్టులో తెలంగాణ ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ముందు ఇంటర్ బోర్డుకు వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.343 కోట్ల నిధులను ఇరు రాష్ట్రాల బోర్డులకు విభజన చేస్తూ అప్పటి బోర్డు కార్యదర్శి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ వ్యాజ్యం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ నగరంలో లేకపోవడంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల ఆస్తులను మిగిలిన సంస్థల అస్తి, అప్పులను విభజించినట్లు విభజించేందుకు సెక్షన్ 75 అనుమతించడం లేదు. అయితే అప్పటి ఇంటర్ బోర్డు కార్యదర్శి తనకు లేని అధికారాన్ని ఉపయోగిస్తూ వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.343.5 కోట్లను 31.5.2014న ఇరు బోర్డులకూ విభజన చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రూ.200 కోట్లను ఏపీ ఇంటర్ బోర్డు పేరు మీద వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉన్నత విద్యా మండలి విషయంలోనూ ఇలానే నిధుల విభజన చేశారు. ఈ నేపథ్యంలో ఖాతాల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డుకు అనుమతినివ్వొద్దని బ్యాంకులకు లేఖలు రాశాయి. విషయం తెలుసుకున్న ఏపీ బోర్డు రూ.105 కోట్లను విజయవాడ ఆంధ్రాబ్యాంకుకు మళ్లించింది. అయితే మిగిలిన బ్యాంకులు ఖాతాల నిర్వహణకు అనుమతినివ్వకపోవడంతో ఏపీ బోర్డు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు పొందింది. ఖాతాల స్తంభన నాటికి ఖాతాల్లో ఉన్న నిల్వలను అలా కొనసాగించాలని బ్యాం కులను హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఏపీ బోర్డు పేరు మీద విభజన చేసిన నిధులను విత్‌డ్రా చేయకుండా, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయండి. ఆ మొత్తాలను తమ కు వాపసు చేసేలా ఆదేశాలివ్వండి.’ అని తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఖాతాలు నిర్వహించుకోండి
- నగదు నిల్వలను మాత్రం అలాగే ఉంచండి - ఏపీ ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశం - మధ్యంతర ఉత్తర్వులు జారీ - సెప్టెంబర్ 10వ తేదీకి విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు సూచన మేరకు బ్యాంకులు స్తంభింపజేసిన ఖాతాలను నిర్వహించుకునేందుకు హైకోర్టు ఏపీ ఇంటర్ బోర్డుకు అనుమతినిచ్చింది. స్తంభింపజేసిన నాటికి బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలను అలానే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. తెలంగాణ ఇంటర్ బోర్డు రాసిన లేఖలకు స్పందించి, తమ బ్యాంకు ఖాతాలను ఎస్బీఐ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన ధర్మాసనం తన విచారణను గురువారం కూడా కొనసాగించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు తరఫున అడ్వొకేట్ జనరల్ కొండం రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. -
ఏపీ మెమోలు ఎలా ఇస్తారు?
ఇంటర్ బోర్డును వివరణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మార్కుల జాబితా జారీ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘టీ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు’ శీర్షికన ఈనెల 27న సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక కోరింది. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్ష రాసిన వారికి ఏపీ ఇంటర్మీడియెట్ పేరుతో మెమోలు ఇవ్వడమేంటని, ఇందుకు గల బాధ్యులు, కారణాలపై నివేదిక అందజేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కటే కంప్యూటర్ ల్యాబ్ ఉండటం, రెండు రాష్ట్రాల విద్యార్థుల మెమోల ముద్రణకు సంబంధించిన ముందస్తు పనులన్నీ ఒకే ల్యాబ్‌లో జరగడం వల్ల పొరపాటు జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. ఇదే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించేందుకు సిద్ధమైనట్లు తెలి సింది. ఏదేమైనా ఈ అంశం విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్నం దున ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. -
జూనియర్ కళాశాలలకు సెలవులు పొడిగింపు
గుంటూరు: భగభగమండుతున్న ఎండల దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలల వేసవి సెలవులను మరో వారంపాటు పొడిగిస్తూ ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ కేలండర్ ప్రకారం జూన్ ఒకటో తేదీన కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వేసవి దృష్ట్యా జూన్ 8వ తేదీన ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉందన్న విషయాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు గమనించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. -
తెలంగాణ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు
అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు హైదరాబాద్: అందరికీ తెలంగాణ వచ్చింది. కానీ ఇంటర్ బోర్డుకు రాలేదట! అదేంటి అనుకుంటున్నారా? అలాగే ఉంది టీ ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలోని కాలేజీల నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మార్కుల మెమోలు ఇచ్చేశారు. దీంతో విద్యార్థులు లబోదిబోమంటూ ఇంటర్ బోర్డు వద్దకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ‘ఏముందిలే.. తెలంగాణ ఇంటర్ బోర్డు పేరుతో మరో మెమో ముద్రించి ఇస్తాం.. అది ఇచ్చేయండి.. అంటూ వెనక్కి తీసుకుంటున్నారు. ఇంత జరిగినా బోర్డు అధికారులు అదేం లేదంటూ బుకాయిస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం: మొన్నటి ఇంటర్ పరీక్షకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సాధారణంగా ఒక విద్యార్థి మెమోను ముద్రించాక అధికారికంగానే మూడు దశల్లో పరిశీలిస్తారు. ముద్రణాలయం నుంచి వచ్చాక సంబంధిత సెక్షన్లో ఎల్డీసీ, సూపరింటెండెంట్, రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ స్థాయిల్లో పరిశీలిస్తారు. అవన్నీ దాటాకే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ పరిశీలించి విద్యార్థులకు అందజేస్తారు. అన్ని స్థాయిల్లోనూ ఈ తప్పిదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌ను వివరణ కోరగా, అలాంటిదేమీ లేదన్నారు. విద్యార్థులకేనా శిక్ష... బోర్డుకు లేదా? మొన్నటి వార్షిక పరీక్షల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమన్నారు. అలాగని కాలేజీ యాజమాన్యాలను శిక్షించలేదు. చివరకు ఒక్కో విద్యార్థి రూ. 10 వేల జరిమానా చెల్లించి హాల్‌టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లను నిరాకరించారు. తప్పు చేసిన కాలేజీలను మాత్రం శిక్షించలేదు. జరిమానా చెల్లిస్తామని విద్యార్థులు కోరినా ఇచ్చేది లేదని, ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ విద్యార్థులకు ఓ విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి కల్పించారు. కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థులను శిక్షిస్తారు.. మరి బోర్డు చేసిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తార ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం చేయకుండా ఇలా ఇబ్బందులు పెడుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. -
తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ...
-
తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ...
కర్నూలు: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలులో ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణలో 61.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయితే, ఏపీలో 72.07 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. గత ఏడాదిలో పోలిస్తే 1.19 శాతం ఉత్తీర్ణత పెరిగిందని తెలిపారు. మే 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇక ఇంటర్ ఫలితాల్లో 83%తో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా నిలవగా కడప జిల్లా 60%శాతంతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
ఇక్కడ కూడా అమ్మాయిలదే హవా
కర్నూలు: పరీక్షల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పది గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అబ్బాయిల ఉత్తీర్ణత 69.43శాతం నమోదవ్వగా అమ్మాయిలు వారికంటే 5.37శాతం ఎక్కువగా 74.80శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. కాగా, ఈ ఫలితాల్లో మొత్తం పాసయినవారి శాతం 72.07 నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల్లో టాప్ ప్లేస్‌లో కృష్ణా జిల్లా (83శాతం) రాగా, ఆఖరి స్థానంలో కడప (60శాతం) వచ్చినట్లు చెప్పారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కూడా అమ్మాయిలే పైచేయి సాధించిన విషయం తెలిసిందే. -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 10 గంటలకు కర్నూలులో విడుదల చేశారు. మొత్తం 2,90,789 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి, కమిషనర్ ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఫలితాల కోసం www.sakshi.com, www.sakshieducation.com, http://examresults.ap.nic.in, http://results.cgg.gov.in చూడవచ్చు. -
ఎంసెట్ విడిగానా? ఉమ్మడిగానా?
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం ఏపీ ఇంటర్ బోర్డు సమావేశం జరిగింది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదని సమావేశంలో గంటా పేర్కొన్నారు. అందువల్ల తప్పని పరిస్థితుల్లో పరీక్షలు విడిగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులతో చర్చించామన్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చే ఏర్పాట్లపై ఆలోచిస్తున్నామన్నారు. ఇంటర్ పరీక్షల్లాగే ఎంసెట్ పరీక్షల్లోనూ తెలంగాణ ప్రభుత్వం బెట్టు చేస్తోందని దుయ్యబట్టారు. ఎంసెట్ ను విడిగా నిర్వహించాలా? లేక ఉమ్మడిగా నిర్వహించాలా? అనే దానిపై అధికారులతో సమాలోచనలు జరుపుతున్నామన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గంటా తెలిపారు. -
ఏపీలో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ జారీ
ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగుతాయి. రాత పరీక్షలు మార్చి 11వతేదీ నుంచి మార్చి 31 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీ క్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ప్రాక్టికల్స్‌కు 1,689 కేంద్రాలు, థియరీ పరీక్షలకు 1,413 కేంద్రాలను కేటాయించారు. ప్రాక్టికల్ పరీక్షలకు 2,90,466 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. మొదటి ఏడాదిలో ఒకేషనల్ విద్యార్ధులు 26,900 మంది, రెండో ఏడాదిలో 28,914 మంది ఉన్నారు. నీతి, మానవ విలువలకు సంబంధించి జనవరి 28వతేదీన, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 31న ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయి. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్షలకు 9,89,240 మంది హాజరు కానున్నారు.