ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో ఈ ఫలితాలను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.