- నగదు నిల్వలను మాత్రం అలాగే ఉంచండి
- ఏపీ ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
- మధ్యంతర ఉత్తర్వులు జారీ
- సెప్టెంబర్ 10వ తేదీకి విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు సూచన మేరకు బ్యాంకులు స్తంభింపజేసిన ఖాతాలను నిర్వహించుకునేందుకు హైకోర్టు ఏపీ ఇంటర్ బోర్డుకు అనుమతినిచ్చింది. స్తంభింపజేసిన నాటికి బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలను అలానే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. తెలంగాణ ఇంటర్ బోర్డు రాసిన లేఖలకు స్పందించి, తమ బ్యాంకు ఖాతాలను ఎస్‌బీఐ స్తంభింపజేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ఇంటర్ బోర్డు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన ధర్మాసనం తన విచారణను గురువారం కూడా కొనసాగించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు తరఫున అడ్వొకేట్ జనరల్ కొండం రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.
ఖాతాలు నిర్వహించుకోండి
Published Fri, Aug 14 2015 1:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement