రైతు రుణమాఫీని సవాల్ చేస్తూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుణమాఫీని సవాల్..
హైదరాబాద్ : రైతు రుణమాఫీని సవాల్ చేస్తూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుణమాఫీని సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. రుణమాఫీని బ్యాంకులు అంగీకరిస్తే మీకెందుకు అభ్యంతరం అంటూ పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.