గుంటూరు: భగభగమండుతున్న ఎండల దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలల వేసవి సెలవులను మరో వారంపాటు పొడిగిస్తూ ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ కేలండర్ ప్రకారం జూన్ ఒకటో తేదీన కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వేసవి దృష్ట్యా జూన్ 8వ తేదీన ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉందన్న విషయాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు గమనించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది.