మార్చి1 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు
విజయవాడ: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. ఈ ఏడాది 10 లక్షల 30 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జంబ్లింగ్ పద్ధతిపై చిన్న చిన్న సమస్యలున్నాయని.. వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. 1445 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు దగ్గరలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామన్నారు. కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. అర్టీసీ అధికారులతో చర్చించి విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా మార్చి9 న జరగాల్సిన పరీక్షను 19న నిర్వహిస్తామన్నారు.