సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రాజమహేంద్రవరం షల్టన్ హోటల్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సారనికి సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. మొత్తం 73.33 శాతం మంది ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి ప్రకటించారు. 84 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. నెల్లూరు 77 శాతంతో రెండో స్థానంలో ఉండగా, గుంటూరు జిల్లా 76 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి.
మొత్తం 4,84, 889 మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారు. ఇందులో రెగ్యులర్ 4,41,359 మంది రాయగా, ప్రవేట్‌గా 48,530 మంది రాశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
టాపర్స్ వీరే..
ఎంపీసీ
వర్ధన్ రెడ్డి ---- 992
షేక్ ఆఫ్రాన్---- 991
సుష్మా ------- 990
బైపీసీ:
దీక్షిత ------- 990
లక్ష్మీ కీర్తి: --- 990
ఎంఈసీ
నిశాంత్ కృష్ణ -- 992
మీనా --------- 991
అభిషేక్ ------- 981
Comments
Please login to add a commentAdd a comment