కర్నూలు: పరీక్షల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పది గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అబ్బాయిల ఉత్తీర్ణత 69.43శాతం నమోదవ్వగా అమ్మాయిలు వారికంటే 5.37శాతం ఎక్కువగా 74.80శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు.
కాగా, ఈ ఫలితాల్లో మొత్తం పాసయినవారి శాతం 72.07 నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల్లో టాప్ ప్లేస్లో కృష్ణా జిల్లా (83శాతం) రాగా, ఆఖరి స్థానంలో కడప (60శాతం) వచ్చినట్లు చెప్పారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కూడా అమ్మాయిలే పైచేయి సాధించిన విషయం తెలిసిందే.