
పేదింట విద్యా కిరణం
సంతకవిటి (శ్రీకాకుళం): ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి సత్తా చాటాడు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం అక్కరాపల్లి గ్రామానికి చెందిన చీపురుపల్లి సంతోష్‌కుమార్ ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు 466 మార్కులు సాధించి ఎంపీసీలో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. తల్లిదండ్రులు లక్ష్మీ, పుట్టయ్యలు ధోబీ వృత్తి చేస్తారు.
సివిల్స్ సాధించడమే లక్ష్యం: సత్యవాణి
పార్వతీపురం రూరల్: సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని ఫస్ట్ ఇంటర్ స్టేట్‌ఫస్ట్ ర్యాంకర్ సత్యవాణి పేర్కొంది. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురానికి చెందిన సత్యవాణి ఇంటర్ ఫస్టియర్‌లో 466 మార్కులు సాధించింది. ఈమె తండ్రి ఆంజనేయులు(అవధాని) గ్రామంలో పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.