
ఏపీ ఇంటర్‌లో తెలంగాణ అమ్మాయి టాప్
ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన వేములవాడ అమ్మాయి
వేములవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ జూనియర్ కళాశాలలో వేములవాడకు చెందిన నాగమల్ల యశశ్రీ ఫస్టియర్ ఫలితాల్లో 436 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంకును కైవసం చేసు కుంది. దీంతో ఆంధ్రలో తెలంగాణ అమ్మాయి తన హవా ప్రదర్శిం చిందని వేములవాడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్ గ్రామానికి చెందిన నాగమల్ల శ్రీనివాస్ విద్యాభ్యాసం వేములవాడలోనే కొనసాగింది. వైద్యపట్టా తీసుకున్న అనంతరం వైద్యురాలు నాగమల్ల పద్మలతను వివాహం చేసుకున్నాడు.
అనంతరం వేములవాడలోనే ఇరువురు పార్థసారథి నర్సింగ్‌హోం స్థాపించి ఇక్కడి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు తేజశ్రీ, యశశ్రీలు. పెద్ద కూతురు తేజశ్రీ సైతం విజయవాడలోనే విద్యాభ్యాసం చేసి బైపీసీ ఫస్టియర్ ఫలితాల్లో 433 మార్కులు సాధించుకుందనీ, మెడిసిన్‌లో 719వ ర్యాంకు సాధించుకుని ప్రస్తుతం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
చిన్న కూతురైన యశశ్రీ ఇంటర్ బైపీసీ చదువుకుంటూ గురువారం అక్కడి ప్రభు త్వం విడుదల చేసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంకు సాధించింది. వైద్య దంపతులైన డాక్టర్ శ్రీనివాస్–పద్మలతలను అభినందిస్తున్నారు.