పాలిటెక్నిక్ కళాశాలల్లో కరికులమ్-16
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో కరికులమ్-16ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి గంటా తెలిపారు.
అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా, అంతర్జాతీయంగా విద్యార్థులు రాణించేలా కరికులమ్(పాఠ్యాంశం)ను అప్‌గ్రేడ్ చేస్తేనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ గేటేవే హోటల్‌లో సోమవారం సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ పాఠ్యాంశ నవీకరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా కరిక్యులమ్ ఉంటేనే ఉపాధి అవకాశాలు విద్యార్థులకు మెండుగా లభిస్తాయని, ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో కరికులమ్-16ను ప్రవేశపెడుతున్నామని అన్నారు.