ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 11 నుంచి నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడిగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు చేసిన యత్నం ఫలించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌కు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకుంది. దీంతో తాము సొంతంగగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి గంటా శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.