టెన్త్, ఇంటర్‌ ఫలితాలకు హైపవర్‌ కమిటీలు | High Power Committees for Tenth and Inter results | Sakshi
Sakshi News home page

టెన్త్, ఇంటర్‌ ఫలితాలకు హైపవర్‌ కమిటీలు

Published Fri, Jul 2 2021 5:19 AM | Last Updated on Fri, Jul 2 2021 5:19 AM

High Power Committees for Tenth and Inter results - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ఎం.ఛాయారతన్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు.

ఈ మేరకు విద్యా శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. కాగా.. ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్‌ నేతృత్వంలోనే మరో హైపవర్‌ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement