Tenth class results
-
TS SSC Result 2023: టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నిన్నే(మంగళవారం) ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్ ఫలితాలు రిలీజ్ కానుండడం విశేషం. ‘సాక్షి’లో ఫలితాలు.. టెన్త్ పరీక్ష ఫలితాలను త్వరితగతిన తెలుసుకునేందుకు సాక్షి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, ఫలితాలు పొందవచ్చు. ►తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణ నమోదైంది. ►బాలుర ఉత్తీర్ణత 84.68 శాతం ►బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత ►2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత ►నిర్మల్ జిల్లా 99 శాతంతో మొదటి స్తానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది. ►25 పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత ►ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత ►తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.25 ఉత్తీర్ణత -
ఆ ఆరుగురూ ఎంతో ప్రత్యేకం.. డిజిటల్ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించారు
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో సహాయకులు (స్క్రైబ్) లేకుండా పదో తరగతి పరీక్షలు రాసిన దృష్టిలోపం ఉన్న విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడంపై విద్యాశాఖ అధికారులు వారికి అభినందనలు తెలిపారు. వీరందరూ ఎంతో ప్రత్యేకమని వారు అభివర్ణించారు. అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్టీడీ) ఇన్‌క్లూజివ్ హైస్కూల్లో టెన్త్ చదివిన దృష్టిలోపం గల విద్యార్థినులు డిజిటల్ విధానంలో 2022–23 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాశారు. వీరిలో పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, ఎక్కలూరు దివ్యశ్రీ, మేఖ శ్రీధాత్రి, ఏకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మ ఉత్తీర్ణత సాధించారు. వారికి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తొలి ప్రయోగంతోనే చక్కటి విజయం ఏపీ విద్యాశాఖ తొలిసారిగా పదో తరగతి దివ్యాంగ (దృష్టి లోపం) విద్యార్థులను డిజిటల్ విధానంలో పరీక్షలు రాయించేందుకు సిద్ధంచేసింది. వారు ల్యాప్‌టాప్‌లో హిందీ మినహా మిగతా సబ్జెక్టులన్నీ స్వయంగా డిజిటల్ విధానంలో రాయడానికి కేవలం 45 రోజుల్లో సిద్ధమయ్యారు. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా డిజిటల్‌గా ప్రశ్నపత్రాలను రూపొందించారు. దేశంలో ఇలాంటి విద్యార్థులకు డిజిటల్ విధానంలో పరీక్షలు రాసే సౌలభ్యం ఎక్కడా కల్పించలేదు. తొలిసారిగా ఏపీలో ఈ తరహా పరీక్షలు విజయవంతంగా నిర్వహించి, ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విద్యార్థుల కోసం ‘నాన్ విజిబుల్ డెస్క్‌టాప్ యాక్సెస్’ (ఎన్‌వీడీఏ) సాఫ్ట్‌వేర్‌తో ప్రశ్నలను విని సమాధానాలు టైప్ చేశారు. డిజిటల్ పరీక్షల్లో విజయం సాధించడంతో భవిష్యత్‌లోను వారు పోటీ పరీక్షలు స్వయంగా రాయడానికి నాంది పలికారు. అందరికీ ఆదర్శనీయం ప్రయత్నమే విజయానికి దారి చూపుతుంది. దివ్యాంగ విద్యార్థులైనా కంప్యూటర్ ద్వారా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం ఆదర్శనీయం. మన రాష్ట్రంలో పాఠశాలలను డిజిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు అంకితభావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి -
విద్యాశాఖ కార్యాచరణ.. మే మొదటి వారంలో పది ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు పై తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. గతంలో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయంలో వీటిని ఏడింటికి తగ్గించారు. 2021–22లో సైన్స్ సబ్జెక్టులోని భౌతిక, రసాయన శాస్త్రాలు (పీఎస్), జీవశాస్త్రం (ఎన్ఎస్)లకు వేర్వేరుగా కాకుండా ఒకే పేపర్, ఒకే పరీక్షగా మార్పు చేశారు. దీంతో పదో తరగతిలో పబ్లిక్ పరీక్షల పేపర్ల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఏడాది (2022–23) కూడా ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపర్‌ను రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్లెట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముందుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొత్తం 6.6 లక్షల మంది విద్యార్థులు కాగా పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే 6.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరు రాసే సమాధానాల పత్రాలు 50 లక్షల వరకు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాలను మినహాయించి తక్కిన 23 జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కేంద్రానికి కేటాయించే పరీక్షల సమాధాన పత్రాల సంఖ్య 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో 13 జిల్లాల్లో మాత్రమే మూల్యాంకన కేంద్రాలు ఉండేవి. దీనివల్ల ఒక్కో జిల్లా కేంద్రంలో 4.5 లక్షల సమాధానాల పత్రాలను మూల్యాంకనం చేయాల్సి వచ్చేది. దీంతో భారీ ఎత్తున టీచర్లు అవసరమయ్యేవారు. అలాగే ఫలితాల వెల్లడిలోనూ ఆలస్యమయ్యేది. కేంద్రాల పెంపు వల్ల మూల్యాంకనాన్ని త్వరగా ముగించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 18న పదో తరగతి పరీక్షలు ముగియగానే అదే నెల 19 నుంచి 26 వరకు ఈ మూల్యాంకనాన్ని నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 22న రంజాన్ ఉండటంతో ఆ రోజు మూల్యాంకనం నుంచి ముస్లిం సిబ్బందికి మినహాయింపు ఇవ్వనున్నారు. మూల్యాంకనాన్ని 26న ముగించాక రెండు వారాల్లో వాటిని కంప్యూటరీకరించి ఫలితాల విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. తత్కాల్ ఫీజుతో పరీక్ష దరఖాస్తుకు అవకాశం.. కాగా పదో తరగతి పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి 31 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇదే చివరి అవకాశమని మరోసారి పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే వారికి మాత్రమే ఆ తర్వాత నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఉంటుందని వివరించారు. -
టార్గెట్ రిజల్ట్స్.. 100 శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది. నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే బడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. ఫలితాల సాధన దిశగా జిల్లా అధికారులకు టార్గెట్లు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ.. ఫలితాలు తక్కువగా ఉండే బడుల వివరాలను సేకరిస్తోంది. ఆయా స్కూళ్లలో ఫలితాలు తక్కువగా ఉండటానికి కారణాలను విశ్లేషిస్తూ నివేదికలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు సరిగా జరగలేదు. 2021లో పరీక్షలు లేకుండానే అందరినీ పాస్ చేశారు. 2020లోనూ పరీక్షలు రాసినవారి వరకు ఉత్తీర్ణులుగా ప్రకటించారు. కరోనా కాలంలో బోధన జరిగా జరగకపోవడమే దీనికి కారణం. అయితే ఈ ఏడాది సకాలంలో బడులు తెరిచారు. సిలబస్ కూడా సకాలంలో పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతర్గత పరీక్షలన్నీ నిర్వహించడం వల్ల వార్షిక ఫలితాలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారనే అభిప్రాయంతో విద్యాశాఖ ఉంది. సన్నద్ధతకు ప్రత్యేక చర్యలు ఈసారి పదో తరగతిలో ఉన్న విద్యార్థులంతా కరోనా కాలంలో 8, 9 తరగతులు చదివినవారే. ఆ రెండేళ్లు విద్యా సంస్థలు సరిగా తెరవక, బోధన జరగక అభ్యసన నష్టాలు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. దానిని సరిచేయడానికే బ్రిడ్జి కోర్సులు నిర్వహించింది. అంతకు ముందు విద్యార్థులు చదివిన తరగతుల్లో వెనుకబడిన పాఠాలను మళ్లీ బోధించారు. కానీ దీని నుంచి ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. విద్యాశాఖ అంతర్గత సర్వేలోనూ ఇది వెల్లడైంది. ఈ క్రమంలోనే క్లాసులో కనీసం 80 శాతం విద్యార్థులకు పాఠం అర్థమైతేనే సిలబస్‌లో ముందుకెళ్లాలని విద్యాశాఖ ఆదేశించింది. సరిగా అర్థంకాని విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ఒక గంట ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు పుస్తకాలు సరిగా అందకపోవడం, ఇతర కారణాలతో బోధన సరిగా సాగలేదని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే ఐదు నెలల పాటు ప్రత్యేక బోధనపై దృష్టి పెట్టాలని విద్యాశాఖ పేర్కొంది. అంతర్గత పరిశీలనలో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక బోధన చేపట్టాలని.. ప్రతి వారం వారి పురోగతి అంచనా వేయాలని సూచించింది. నెల రోజుల్లో వారి సామ ర్థ్యాన్ని గుర్తించి, అప్పటికీ పురోగతి లేకపోతే మరో సారి ప్రత్యేక బోధన చేపట్టాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకుపైగా బడుల్లో టెన్త్ ఫలితాలు గతం కన్నా తగ్గే అవకాశం ఉందని.. జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించింది. సబ్జెక్టు టీచర్లు లేకుండా ఎలా? టెన్త్ ఫలితాల సాధనకు టార్గెట్లు పెడుతున్న అధికారులు.. క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికీ 10వేల బడుల్లో ఏదో ఒక సబ్జెక్టు టీచర్ కొరత ఉందని, హైస్కూల్ టీచర్లను ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. అభ్యసన నష్టాలను ఈ ఐదు నెలల్లో ఎలా భర్తీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖలో దాదాపు 18 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని.. ఈ ఏడాది విద్యా వలంటీర్లను కూడా నియమించలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఎంఈవోలు, డీఈవోల పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి పరిశీలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. హైస్కూల్ హెచ్ఎంలకు ఎంఈవోగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, బోధనపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా చేస్తున్నారని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయి టీచర్ల కొరత పరిష్కరించకుండా, ఫలితాల కోసం టార్గెట్లు పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. -
SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here) టెన్త్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 78.3 శాతంలో ప్రకాశం జిల్లా మొదటిస్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ పదో తరగతి ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో చూడొచ్చు. ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here) -
AP 10th Result 2022: పదో తరగతి ఫలితాలు విడుదల
AP SSC 10th Result 2022: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్ 6వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. టెన్త్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వెల్లడించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం మంది పాస్ అయ్యారని పేర్కొన్నారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని మంత్రి బొత్స తెలిపారు. ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here) వాస్తవానికి టెన్త్ ఫలితాలు జూన్ 4వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేకపోయినట్లు విద్యాశాఖ డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ పదో తరగతి ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్‌లో కూడా చూడొచ్చు. -
10న పదో తరగతి పరీక్షల ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 10న వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్టు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం 6,22,537 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ జరుగుతోందని, ఇప్పటికే దాదాపు 25 శాతం పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిందన్నారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10న ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని దేవానందరెడ్డి వివరించారు. -
టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020 – 21 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని, ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్ లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ కలర్ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు. ఈ అవకాశం సెప్టెంబర్ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత విద్యార్ధులు మరోసారి రూ.80 రుసుము చెల్లించి, ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. 2021 ఏడాది మాత్రమే కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షలు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు తేదీ నుంచి 30 రోజుల వరకు మాత్రమే వెబ్సైట్లో సర్టిఫికెట్ ఉంటుందన్నారు. దరఖాస్తుకు విధివిధానాలు త్వరలో తెలియచేస్తామని చెప్పారు. -
టెన్త్ క్లాస్ ‘ఆల్ పాస్’ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్ పాస్’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019–20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్ పాస్’గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. గతేడాది కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక రాష్ట్ర విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. వారి ధ్రువపత్రాల్లో సబ్జెక్టులకు గ్రేడ్లు బదులు.. పాస్ అని మాత్రమే ఇచ్చారు. దీంతో వారి ఉన్నత చదువులకు ఇబ్బందులేర్పడ్డాయి. చదువులకే కాకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా వచ్చే ఉద్యోగాలను పొందే విషయంలోనూ గ్రేడ్లు, మార్కులు లేకపోవడం వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీనిపై ఛాయారతన్(రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి) నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ చర్చించింది. 2019–20 విద్యార్థులకు ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2, ఫార్మేటివ్–3, సమ్మేటివ్–1 పరీక్షలు జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో ఫార్మేటివ్ పరీక్షకు 20 మార్కులు చొప్పున 60 మార్కులుగా, సమ్మేటివ్ పరీక్షకు 40 మార్కులుగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇందులో వీరికి కూడా ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల సగటును తీసుకొని పబ్లిక్ పరీక్షల గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. హైపవర్ కమిటీ తుది నివేదిక తర్వాత విద్యా శాఖ ఫలితాలు ప్రకటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అత్యున్నత స్థాయి కమిటీ త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దాని ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటిస్తారు. ఈ ఏడాది ఫార్మేటివ్‌ల ఆధారంగా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల తదుపరి ఉన్నత చదువులకు గ్రేడ్లు అవసరమని, వారికి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా గ్రేడింగ్‌తో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరముందన్న సూచనలతో విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా గ్రేడ్లతో ఫలితాలు ప్రకటించనుంది. 2020–21 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు కేవలం 2 ఫార్మేటివ్ పరీక్షలు మాత్రమే జరిగాయి. వీటిలో ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని పదో తరగతి ఫలితాలు ప్రకటించాలన్న అంశంపై కమిటీ దృష్టి సారించింది. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2 పరీక్షలు జరిగాయి. ఈ ఫార్మేటివ్ పరీక్షలు ఒక్కో దానికి 50 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులను గ్రేడ్ల కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల మార్కులను సగటుగా తీసుకొని గ్రేడింగ్ ఇస్తారు. -
టెన్త్, ఇంటర్ ఫలితాలకు హైపవర్ కమిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు. ఈ మేరకు విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. కాగా.. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్ నేతృత్వంలోనే మరో హైపవర్ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. -
టెన్త్ కోసం టైం టేబుల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలుకు గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సమయపాలనకు అదనంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లనున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 94.5 శాతం సగటు ఉత్తీర్ణతను సాధించాయి. ఈసారి నూరు శాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించేలా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నాలుగు గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే నెల రెండో వారం నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాయి. 4 గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణ సైతం రోజువారీగా నిర్వహించనున్నాయి. గురుకుల సొసైటీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను గురుకుల ప్రిన్సిపాళ్లు సంబంధిత సొసైటీ కార్యాలయాలకు పంపించాలి. అలా వచ్చిన వివరాలను సొసైటీలు అంచనా వేస్తాయి. దీంతో సొసైటీ పరిధిలోని పాఠశాలల పనితీరుపై స్పష్టత వస్తుంది. ప్రతిరోజు రెండు స్పెషల్ క్లాసులు గురుకుల సొసైటీలు రూపొందించిన ఉమ్మడి ప్రణాళికను ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న వారికే అమలు చేయనున్నారు. ఈ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో వారంలో ప్రతి సబ్జెక్టును రెండు సార్లు ప్రత్యేక తరగతుల్లో బోధిస్తారు. ఇందులో ఒక తరగతిలో రివిజన్, మరో తరగతిలో అభ్యాసన కార్యక్రమాలు ఉంటాయి. వారాంతంలో శని లేదా ఆదివారాల్లో స్లిప్‌టెస్టులు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. సబ్జెక్టులో వెనుకబడినట్లు గుర్తిస్తే వారికి మరింత సాధన చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతాయి. -
పదిమంది మెచ్చేలా!
ఈ విద్యార్థులు నిజంగా మట్టిలో మాణిక్యాలే. వ్యక్తిగత సమస్యలను అధిగమించి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభను కనబరిచారు. పట్టుదలతో చదివి ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు నిలుస్తాయని నిరూపించారు. అలాంటి విద్యార్థుల్లో అంగ వైకల్యాన్ని అధిగమించి ఫలితాలను సాధించినవారు ఒకరైతే.. తల్లిదండ్రులు లేకపోయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన వారు మరొకరు. తండ్రి లేకపోయినా ఎంతో కష్టపడి తల్లి చదివించిన చదువులో ఉత్తీర్ణులైన వారు మరొకరు. ఇలా ప్రభుత్వ మోడల్ స్కూళ్లు, విద్యా శాఖ గురుకులాల్లో నిరుపేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభ చాటారని మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి ప్రశంసించారు. – సాక్షి, హైదరాబాద్ వైకల్యాన్ని జయించిన విజయలక్ష్మి పుట్టుకతోనే మూగ, చెవిటితనం ఉన్నా విద్యలో మాత్రం రాణిస్తూ ముం దుకెళ్తోంది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సైగలను గమనిస్తూ సబ్జెక్టులను అర్థం చేసుకుని పదో తరగతిలో 8.5జీపీఏ సాధించింది. ఆరో తరగతి నుం చి జిన్నారం మోడల్ స్కూల్లో చదువుకుంది. పుట్టుక నుంచే సెరబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వర్ష ముందు వైకల్యమే తలవం చింది. జక్రాన్పల్లిలోని మోడల్ స్కూల్ లో చదువుకున్న వర్ష.. టెన్త్ ఫలితాల్లో 9.3 జీపీఏ సాధించింది. తండ్రి గీత కార్మికుడు. వైకల్యం, పేదరికాన్ని అధిగమించి పట్టుదలతో లక్ష్యం వైపు అడుగులేసింది. తల్లిదండ్రుల్లేకపోయినా.. జక్రాన్‌పల్లి మోడల్ స్కూల్లో చదువుతున్న బి.మయూరికి తల్లిదండ్రులు లేరు. అయినా లక్ష్య సాధనలో ముందుకు సాగింది. పట్టుదలతో చదువుకుని 9.7 జీపీఏ సాధించింది. అమ్మమ్మ, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తన లక్ష్యాన్ని సాధించానంటోంది మయూరి. తల్లి కష్టానికి ప్రతిఫలం.. శాలిగౌరారం మోడల్ స్కూల్లో చదువుకున్న గీతాంజలి 10 జీపీఏ సాధించింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి వెంకటమ్మ కాయకష్టం చేసి కూతురిని చదివించింది. తల్లి ప్రోత్సాహంతో కటిక పేదరికంలోనూ లక్ష్య సాధనలో వెనుకంజ వేయకుండా తన ప్రతిభను నిరూపించుకుంది. ఆటోవాలా కూతురు.. శంకరపల్లి మోడల్ స్కూల్లో చదువుకున్న షేక్ నాజియా తండ్రి అఫ్జల్ పాషా ఆటో డ్రైవర్. ఆరుగురు ఆడపిల్లల్లో మూడో అమ్మాయి. పేదరికంలోనూ షేక్ నాజియా శ్రమించి 10 జీపీఏ సాధించి అందరి మన్ననలు పొందుతోంది. ఇబ్బందులను అధిగమించి.. భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కుమారుడు ఎ.శివకుమార్ పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించాడు. రోడ్డు ప్రమాదంలో తన తండ్రి వెన్నెముక దెబ్బతినడంతో తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో చదివి 10 జీపీఏ సాధించాడు. తల్లిదండ్రులు కూలీలైనా.. ఇటిక్యాల మోడల్ స్కూల్లో చదువుకున్న గడ్డం కృతిక 10 జీపీఏ సాధించింది. ఆమె తండ్రి నారాయణరెడ్డి వ్యవసాయ కూలి. తల్లి బీడీ కార్మికురాలు. బంధువుల ఇంట్లో ఉండి రోజూ 7 కిలోమీటర్ల దూరం వెళ్లి ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో పదో తరగతిలో తన ప్రతిభను నిరూపించుకుంది. కాగా, నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్.దీప పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 10 జీపీఏ సాధించింది. తాండూరు గురుకుల పాఠశాలలో దీప చదువుకుంది. దీప ఇంట్లో 7వ సంతానం. -
చిత్తూరు ఫస్ట్..మదనపల్లె లాస్ట్
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని చిత్తూరు డివిజన్ మొదటి స్థానంలో, మదనపల్లె డివిజన్ చివరి స్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 97.41 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం విదితమే. జిల్లాలోని నాలుగు విద్యాశాఖ డివిజన్లలో ఫలితాలు ఏవిధంగా వచ్చాయని సమీక్షించగా చిత్తూరు డివిజన్లో 98.86 శాతం, తిరుపతి డివిజన్ 97.11 శాతం, పుత్తూరు డివిజన్లో 96.15 శాతం, మదనపల్లె డివిజన్లో 95.32 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది కన్నా అభివృద్ధి పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కన్నా అభివృద్ధి కనిపించింది. విద్యాశాఖ అధికారులు అమలు చేసిన సాధన, మహాసంకల్పం, నైట్ విజన్ తరగతులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. జిల్లాలోని 66 మండలాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. చిత్తూరు డివిజన్లో 15,787 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 55 మంది పరీక్షలకు గైర్హాజరు కాగా, 125 మంది ఫెయిల్ అయ్యారు. 15,607 మంది ఉత్తీర్ణత చెందారు. ఆ డివిజన్లో నూరు శాతం ఫలితాలను ఆరు మండలాలు సాధించాయి. ఐరాల, పెనుమూరు, పూతలపట్టు, రామకుప్పం, ఎస్ఆర్పురం, గుడిపాల మండలాల్లో వందశాతం ఫలితాలు నమోదయ్యాయి. ఎప్పుడూ చివరనే జిల్లాలోని మదనపల్లె డివిజన్ పదో తరగతి ఫలితాల్లో ఏటా చివరి స్థానంలో నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఆ డివిజన్‌కు రెగ్యులర్ డీవైఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ లోపం తలెత్తింది. ప్రస్తుతం డీవైఈఓగా ఉన్న ముస్తాక్ అహ్మద్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. ఒక వైపు డీఈఓ కార్యాలయంలోని ఏడీ1గా, మరోవైపు మదనపల్లె డీవైఈఓగా రెండు పడవలపై విధులను నిర్వహించాల్సి ఉండడంతో పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల మానిటరింగ్, పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది పది ఫలితాల్లో మదనపల్లె డివిజన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ డివిజన్లో 12,275 మంది విద్యార్థులకు గాను 11,700 మంది ఉత్తీర్ణత చెందారు. 508 మంది ఫెయిల్ కాగా, 67 మంది గైర్హాజరయ్యారు. ఆ డివిజన్ ఉత్తీర్ణత 95.32 శాతం నమోదు కావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్లలో చివరి స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఆ డివిజన్లో 18 మండలాలుండగా అందులో పీటీఎం మండలం మాత్రమే 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. మిగిలిన మండలాలు 99, 98, 97, 96 ఉత్తీర్ణత సాధించాయి. మదనపల్లె డివిజన్‌లోనే ఫెయిల్యూర్స్ అధికం జిల్లావ్యాప్తంగా పది పరీక్షల్లో 1,364 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లాలో నాలుగు డివిజన్లలో ఫెయిల్యూర్స్ సంఖ్య మదనపల్లె డివిజన్‌లోనే అధికంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. మదనపల్లె డివిజన్లో 508 మంది, తిరుపతి డివిజన్లో 383 మంది, పుత్తూరు డివిజన్లో 348 మంది, చిత్తూరు డివిజన్లో 125 మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు. జిల్లాలోని విజయపురం, పెద్దతిప్పసముద్రం, యాదమరి, తవణంపల్లె, శాంతిపురం, ఎస్ఆర్పురం, రామకుప్పం, పూతలపట్టు, పెనుమూరు, ఐరాల, గుడిపాల మండలాల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఖాళీగా ఉన్న డీవైఈఓ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏళ్ల తరబడి రెగ్యులర్ డీవైఈఓలు లేకపోవడంతో విద్యాపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. సీనియర్లుగా ఉన్న ఎంఈఓలకు పదోన్నతులు కల్పించి రెగ్యులర్ డీవైఈఓలుగా నియమించాలని ఎంఈఓలు డిమాండ్ చేస్తున్నారు. పర్యవేక్షణ ముఖ్యం ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించాల్సిన రెగ్యులర్ డీవైఈఓ లేకపోవడం సరికాదు. ఆ పోస్టులను సంవత్సరాల కొద్దీ ఎందుకు భర్తీ చేయడం లేదు? ఆ పోస్టుల్లో రెగ్యులర్ అధికారులుంటే పర్యవేక్షణ చేసి, పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉండేది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అతి తక్కువగా ఉత్తీర్ణత సాధించిన మండలాల వారీగా రివ్యూ చేసి నూతన ప్రణాళికలు అమలు చేయాలి. – సద్దామ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
పదిలో మూడో స్థానం
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం రెండు స్థానాలు ముందుకు వెళ్లింది. ఫలితంగా ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా 3 వ స్థానంలో నిలిచింది. 10 జీపీఏల సాధనలో జిల్లా విద్యార్థులు 3,283 మంది సాధించారు. సర్కారు బడుల ఉత్తీర్ణత శాతం, 10 జీపీఏల్లో మెరుగైన ఫలితాలు లభించాయి. మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 97.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పబ్లిక్ పరీక్షల సమయంలో ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు, పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాలు లభించాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 1.05 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గత ఏడాది జిల్లాలో 96.36 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 97.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన డీఈఓ పాండురంగస్వామిని కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా అభినందించారు. బాల, బాలికల పోటీ.... కొన్నేళ్లుగా పది ఫలితాల్లో బాలికల హావా కొనసాగుతూనే వస్తోంది. ఈ సారి విడుదలైన ఫలితాల్లోనూ జిల్లాలో బాలికలే ముందంజలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 51,205 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో బాలురు 27,217 మంది, బాలికలు 25,352 మంది ఉన్నారు. వారిలో బాలురు 26,442 మంది, బాలికలు 24,763 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 97.15 శాతం, బాలికలు 97.68 శాతం ఉత్తీర్ణతను సాధించి బాలుర కంటే బాలికలు ముందజలో నిలిచారు. ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఈసారి పరీక్షల్లో 10 జీపీఏ సాధనలో సత్తా చాటారు. గత ఏడాది జిల్లాలో 2,452 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఆ సంఖ్య ఈ ఏడాది 3,283 కు చేరింది. గత ఏడాది కంటే ఈ సారి పది జీపీఏ సాధించిన విద్యార్థులు 831 మంది పెరిగారు. కేజీబీవీలో 97 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు గతేడాది కంటే ఈసారి 12 కేజీవీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో ఉన్న 20 కేజీబీవీ పాఠశాలల నుంచి 719 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 693 మంది ఉత్తీర్ణత చెందగా, 27మంది ఫెయిల్ అయ్యారు. అలాగే జిల్లాలోని 19 మోడల్ స్కూళ్లల్లో 1,269 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 11 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఒక విద్యార్థి పరీక్షకు హాజరు కాలేదు. ప్రభుత్వ బడుల్లో పెరిగిన ఉత్తీర్ణత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతానికి భిన్నంగా ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ ఏడాది 34,711 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 33,292 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి 18,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 17,913 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని 8 మండలాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మార్చిలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు 52,569 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 51,205 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన 1,364 మంది ఫెయిల్ అయ్యారు. పది’లో సత్తాచాటిన ఉర్దూ పాఠశాలలు మదనపల్లె సిటీ: జిల్లాలో 30 ఉర్దూ ఉన్నత పాఠశాలలుండగా అందులో 20 పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన వి.కోట ఉర్దూ ఉన్నత పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినులు ఏకంగా పదికి పది పాయింట్లు సాధించి తమ సత్తాను చాటారు. జిల్లాలోని పెనుమూరు మండలంలోని పూనేపల్లె, కుప్పంలోని కుప్పం మెయిన్, వి.కోట మండలంలోని నాలుగు ఉర్దూ ఉన్నత పాఠశాలలు, వి.కోట మెయిన్, నడిపేపల్లె, కొంగాటం, ఖాజీపేట, బైరెడ్డిపల్లె, యాదమరి మండలంలోని 14 కండ్రిగ, కలికిరి మండలంలోని గడి, మహల్, మదనపల్లె రూరల్ మండలం బాలాజీనగర్, అర్బన్‌లోని మున్సిపల్ ఉన్నత పాఠశాల, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల, నిమ్మనపల్లె, చౌడేపల్లె మండలంలోని దాదేపల్లె, గంగవరం మండలంలోని పెద్ద ఉగిలి, తిరుపతి కార్పొరేషన్ ఉర్దూ ఉన్నత పాఠశాల, వాల్మీకిపురం మైనార్టీ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. మిగిలిన 10 పాఠశాలలు సరాసరి 95 శాతం ఫలితాలను సాధించి తమ ఆ«ధిక్యతను చాటుకున్నాయి. -
టాపర్ @ ఆటో డ్రైవర్ డాటర్
సాక్షి, సిటీబ్యూరో/మేడ్చల్: పదో తరగతి ఫలితాల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాలు మరింత వెనుకబడిపోయాయి. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ...రాష్ట్ర స్థాయిలో జిల్లాల ర్యాంకింగ్ మరింత దిగజారింది. గత ఏడాది మేడ్చల్ జిల్లా 13వ స్థానంలో నిలవగా, ఈ సారి 21వ స్థానానికి...రంగారెడ్డి జిల్లా 16వ స్థానం నుంచి 22వ స్థానానికి దిగజారింది. అక్షరాస్యతలో అందరికంటే ముందున్న హైదరాబాద్ జిల్లా గత ఏడాది 25వ స్థానంలో ఉండగా, ఈసారి ఆఖరి(31వ) స్థానానికి పడిపోయింది. ఇక హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది పరీక్షకు మొత్తం 70,173 మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో 58,306 మంది విద్యార్థులు (83.09శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 45,747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, వీరిలో 42,467 మంది (92.83 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 42,753 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 39,753 మంది విద్యార్థులు(92.98 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మూడు జిల్లాల్లోనూ బాలికలదే హవా.. గ్రేటర్ పరిధిలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలురతో పోలిస్తే బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 34,517 మంది బాలురు పరీక్ష రాయగా, వీరిలో 27,237 మంది (78.91శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక 35,656 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా, వీరిలో 31,069 మంది (87.14 శాతం)ఉత్తీర్ణత సాధించారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో 23,651 మంది బాలురు పరీక్ష రాయగా, వీరిలో 21,656 మంది (91.56శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలికలు 22,096 మంది బాలికలు పరీక్ష రాయగా, వీరిలో 20,811 మంది (94.18శాతం)ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 22,340 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా, 20,511 మంది (91.81శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా 20,413 మంది బాలికలకు, 19,242 మంది(94.26శాతం)ఉత్తీర్ణత సాధించి తమ ఆధిక్యతను చాటుకున్నారు. 25 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో 25 ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాల–తాడ్‌బండ్, ప్రభుత్వ బాలికల పాఠశాల– షాలిబండ, ప్రభుత్వ సిటీ బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల–మెఘల్‌పుర, ప్రభుత్వ బాలుర అంధ పాఠశాల–దారుషిఫా, ప్రభుత్వ పాఠశాల–మొఘల్ పురా–1, ప్రభుత్వ పాఠశాల–ఖాజిపురా, ప్రభుత్వ పాఠశాల–అఫ్జల్‌గంజ్, ప్రభుత్వ బాలుర పాఠశాల–దారుషిఫా, ప్రభుత్వబాలికల పాఠశాల–ఫలక్‌నుమా, ప్రభుత్వ బాలుర పాఠశాల–చాంద్రాయణగుట్ట, ప్రభుత్వ బాలుర పాఠశాల–మైసారం, ప్రభుత్వ బాలికల పాఠశాల–డబీర్‌పురా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాల–టీఈజీఏ, ప్రభుత్వ బాలికల పాఠశాల–ముస్తైద్పుర, ప్రభుత్వ బాలుర పాఠశాల–అంబర్పేట్, ప్రభుత్వ డెఫ్ పాఠశాల–మలక్‌పేట్, ప్రభుత్వ హెచ్ఎస్ అజంపుర– గోల్నాక, జీజీహెచ్ఎస్–ఎన్బీటీ నగర్, ప్రభుత్వ పాఠశాల–జమిస్తాన్పూర్, ప్రభుత్వ పాఠశాల –బాగ్ముసారంబాగ్, ప్రభుత్వ బాలికల పాఠశాల– న్యూ ముసారంబాగ్, ప్రభుత్వ బాలికల అంధ పాఠశాల–మలక్‌పేట్, న్యూ ప్రభుత్వ హైస్కూల్–వైఎంసీఏ సికింద్రాబాద్, ప్రభుత్వ పాఠశాల –సికింద్రాబాద్ మార్కెట్ పాఠశాలల్లో కూడా వంద శాతం ఫలితాలు సాధించారు. మరో 24 పాఠశాలలు 40 శాతం లోపు ఫలితాలతో వెనుకబడిపోయాయి. వీటిలో రెండు పాఠశాలల్లో జీరో శాతం ఫలితాలు నమోదు కావడం గమనార్హం. టాపర్ @ ఆటో డ్రైవర్ బొల్లారం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఎం.శ్రావ్య టెన్త్ ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధించి మారేడుపల్లి మండలంలోనే టాపర్‌గా నిలిచింది. తండ్రి భిక్షపతి ఆటో డ్రైవర్ కాగా..తల్లి బాలలక్ష్మి దూలపల్లి గ్రామపంచాయతీలో బిల్ కలెక్టర్. మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో నివాసం. శ్రావ్య టాపర్‌గా నిలవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీరలక్ష్మి, టీచర్లు అభినందించారు. తమ కూతుర్ని బాగా చదివిస్తామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంజినీర్‌నవుతా... నేను మల్కాజిగిరి ఆర్.కె నగర్‌లోని నేషనల్ హైస్కూల్లో ఒకటి నుంచి టెన్త్ వరకు చదివాను. టెన్త్‌లో పదికి పది జీపీఏ సాధించాను. ఈ స్కూల్లో అందరూ నిరుపేద విద్యార్థులే ఉన్నారు. నాన్న సురేందర్ జీహెచ్ఎంసీలో అటెండర్. అమ్మ సత్యలక్ష్మి. మాది పేద కుటుంబం. కష్టపడి చదివి ఉత్తమ మార్కులు సాధించాను. అమ్మా నాన్నల ఆశలకనుగుణంగా భవిష్యత్‌లోనూ బాగా చదువుకుని ఇంజినీర్ అవుతాను. నా విజయానికి సహకరించిన పాఠశాల యాజమాన్యానికి, టీచర్లకు కృతజ్ఞతలు. – రిషిక,(10/10 జీపీఏ ) -
మార్కుల మాయ
ఒకప్పుడు పదో తరగతి పాస్ అయితేనే గొప్ప.. కానీ ఇప్పుడు పదో తరగతి చదివే ప్రతి విద్యార్ధి లక్ష్యం 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడమే..నిజం చెప్పాలంటే విద్యార్థి కంటే అతను చదివే కార్పొరేటు స్కూళ్లది ఇదే తాపత్రయం.. ఆ లక్ష్యంతోనే ఓ మాదిరి స్టూడెంట్ను కూడా రుద్ది రుద్ది 10బై10 తెప్పించేస్తుంటారు.అలాంటిది ఓ స్టూడెంట్ బాగా చదివి కూడా పబ్లిక్ పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకోలేకపోయాడు..! ఎందుకో అనుమానమొచ్చి రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేస్తే జవాబుపత్రం ఇచ్చారు.దాన్ని పరిశీలిస్తే సదరు విద్యార్థి అన్ని ప్రశ్నలకూ సరిగ్గానే సమాధానాలు రాసినట్లు స్పష్టమైంది. కానీ దిద్దిన మాస్టారే తప్పులో కాలేశారు. తక్కువ మార్కులతో మాయ చేశారు. ఫలితంగా విద్యార్థికి గ్రేడ్ పాయింట్లు తగ్గిపోయాయి.పోనీ ఏదో తప్పు జరిగిపోయింది.. సరిదిద్దండి.. అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు.చివరికి విద్యార్థి తల్లిదండ్రులు హైకోర్టుకు వెళ్తేగానీ దిగిరాలేదు.. ‘వామ్మో.. మా పరువుపోద్ది.. అయిందేదో అయ్యింది వదిలేయండి’.. అంటూ వెంటపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని సీతమ్మధారకు చెందిన పుట్టి గౌతమ్‌సాయి 2017 మార్చిలో కొటక్ సెలేషియన్ స్కూలులో పదోతరగతి పరీక్షలు రాశాడు. ఫలితాల్లో ఒక్క తెలుగులో మినహా అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించాడు. తెలుగులో మాత్రం 9 గ్రేడ్ పాయింట్లు రావడంతో మొత్తంగా 9.8 గ్రేడ్ పాయింట్లు మాత్రమే లభించాయి. 10కి 10 రావాల్సిన తనకు.. పైగా తెలుగు పరీక్ష బాగా రాసినా ఎందుకిలా జరిగిందని అనుమానమొచ్చి వెంటనే రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేశాడు. అప్పట్లో హైదరాబాద్‌లోని చాపల్‌రోడ్‌లో ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు దరఖాస్తు చేశాడు. రెండు నెలల తర్వాత ఎట్టకేలకు స్పందించిన పరీక్షల విభాగం ‘నో చేంజ్’ అంటూ లిఖితపూర్వక సమాచారం పంపించి.. గౌతమ్ సాయి రాసిన జవాబుపత్రాల జెరాక్స్ కాపీలను పంపించింది. జవాబుపత్రాలతోబయటపడిన పొరపాట్లు సరిగ్గా అక్కడే దిద్దిన మాస్టారు తప్పు.. రీవాల్యుయేషన్‌లోనూ సరిదిద్దని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం నిర్వాకం బయటపడ్డాయి. తెలుగు పేపర్లో మొదటి 9 ప్రశ్నల వరకు సరైన సమాధానాలకు రెండు మార్కులు ఇవ్వాల్సి ఉండగా, 10, 11, 12 ప్రశ్నలకు సరైన సమాధానాలకు ఐదు మార్కులు ఇవ్వాల్సి ఉంది. గౌతమ్‌సాయి 10, 11, 12 ప్రశ్నలకు సరైన సమాధానం రాసినప్పటికీ... మొదటి తొమ్మిది ప్రశ్నలకు రెండేసి మార్కులు వేసుకుంటూ వచ్చిన ఎగ్జామినర్ ఆ ఐదు మార్కుల ప్రశ్నలకు కూడా పొరపాటుగా రెండు మార్కులు చొప్పునే వేసేశారు. దీంతో మొత్తానికి అతని మార్కుల శాతం తగ్గి గ్రేడ్ పడిపోయింది. ఇదంతా జవాబుపత్రాలను చూస్తే అర్ధమైంది. ఏడాదిన్నర తిరిగినాపట్టించుకోని పరీక్షల విభాగం వెంటనే విద్యార్ధి తనకు జరిగిన అన్యాయాన్ని పరీక్షల విభాగం దృష్టికి తీసుకువెళ్లి గ్రేడ్ సరిచేయాల్సిందిగా దరఖాస్తు చేశాడు. అయితే తామేమీ చేయలేమని అధికారులు తేల్చిచెప్పేశారు. పొరపాటు స్పష్టంగా తెలుస్తోంది కదా.. కాస్త సరిచేయమని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో సదరు విద్యార్ధి తండ్రి, ఏయూలో ప్రొఫెసర్‌గా చేస్తున్న పుట్టి శ్రీనివాసరావు పక్కా ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటివరకు ఎన్నిసార్లు కలిసినా స్పందించని పరీక్షల విభాగం అధికారులు హైకోర్టులో రిట్ ఫైల్ చేయగానే దిగొచ్చారు. ఈసారికి వదిలేయండి.. ఎక్కడో పొరపాటు జరిగింది.. అని విన్నవించుకున్నారు. అయితే విషయం కోర్టులో ఉంది కాబట్టి దానిపై ఏమీ మాట్లాడలేనని విద్యార్ధి తండ్రి పరీక్షల విభాగం అధికారులకు స్పష్టం చేసేశారు. ఇక్కడ విషయమేమిటంటే.. సదరు విద్యార్ధి తండ్రి, ఏయూలో సీనియర్ ప్రాఫెసర్ కావడం, ఎంత ఖర్చయినా హైదరాబాద్, అమరావతిలకు తిరగడం. హైకోర్టు న్యాయవాది తన బంధువు కావడంతో రిట్ పిటిషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుని విషయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వరకూ తీసుకువెళ్లగలిగారు. కానీ ఇదే అన్యాయం సామాన్యుడికి జరిగితే ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క మార్కు తగ్గిందని రివాల్యుయేషన్‌కి వెళితే..
బెళగావి: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 625 మార్కులకు గాను 624 మార్కులు సాధించి మిగిలిన ఒక్క మార్కు కోసం రివాల్యుయేషన్‌కు వెళ్లి 100 శాతం మార్కులు సాధించాడు ఓ కర్ణాటక విద్యార్థి. బెళగావికి చెందిన మహ్మద్ కైఫ్ ముల్లా నగరంలోని ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఇటీవల ఆ రాష్ట్ర పదో తరగతి బోర్డు ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో కైఫ్‌కు 625 మార్కులకు గాను 624 మార్కులు వచ్చాయి. సైన్స్ సబ్జెక్టులో ఒక్క మార్కు తక్కువగా వచ్చింది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలే రాసినా ఒక్క మార్క్ ఎలా పోయిందా? అని కైఫ్ అసంతృప్తి చెందాడు. 100 శాతం మార్కులు వస్తాయన్న ఆత్మవిశ్వాసంతో అతను రివాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశాడు. అతను అనుకున్నదే నిజమైంది. రివాల్యుయేషన్లో కైఫ్‌కు ఆ ఒక్క మార్కు కూడా కలిసి వచ్చింది. దీంతో అతను 100 శాతం మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా కైఫ్ మాట్లాడుతూ.. టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం ఆర్ఎల్ఎస్ అనే కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతున్న కైఫ్ ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
నేడే పదో తరగతి ఫలితాలు
-
నేడే పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదలవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తా రని ప్రకటించారు. కాగా, ఈ ఫలితాలను www. sakshieducation. com వెబ్సైట్లో కూడా పొందవచ్చు. -
పదిలో 93.6%
సాక్షి, చెన్నై: పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 93.6 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్లస్‌టూ తరహాలో ఈ ఏడాది కూడా బాలికల హవా సాగింది. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను ఇద్దరు, రెండో ర్యాంక్‌ను 50 మంది, మూడో ర్యాంక్‌ను 224 మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారు. పలు పాఠ్యాంశాలలో వందకు వంద మార్కులతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు హోరెత్తించారు. ఇక, నిర్బంధం తమిళ విద్యా విధానం చుట్టుముట్టినా, కోర్టు ఆదేశాలతో పరీక్షల్ని మాతృభాషలో రాసిన తెలుగు విద్యార్థులు తమ సత్తాను చాటుకున్నారు. రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదమూడు వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మూల్యాంకణ ప్రక్రియ ముగిసినా, ఎన్నికలు అడ్డురావడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు సర్వం సిద్ధం చేసిన అధికార వర్గాలు బుధవారం ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు ఫలితాలను ప్రకటించారు. డీపీఐ ఆవరణలో పరీక్షల విభాగం డెరైక్టర్ వసుంధరాదేవి ఫలితాలను విడుదల చేయడంతో పాటు, ర్యాంకుల జాబితాల్ని, పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల మార్కులు, తదితర అంశాల్ని వివరించారు. ఆ మేరకు పది లక్షల 72 వేల 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, తొమ్మిది లక్షల 47 వేల 335 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో నాలుగు లక్షల 83 వేల 717 మంది బాలికలు, నాలుగు లక్షల 63 వేల 618 మంది బాలురు ఉన్నారు. ఈ ఏడాది కూడి బాలికల హవా సాగింది. మొత్తంగా 93.6 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. గత ఏడాది కంటే, ఈ సారి ఒక్కశాతం ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్రంలోనే ఉత్తీర్ణతలో ఈరోడ్ జిల్లా 98.48 శాతంతో తొలి స్థానాన్ని, 98.7 శాతంతో కన్యాకుమారి రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక, 86.49 శాతంతో వేలూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ర్యాంకర్లు : ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు, ర్యాంకుల్లోనూ అదే పయనం సాగించారు. తమిళ మాద్యమంలో పరీక్షలు రాసిన వారిలో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్‌ను ఐదు వందలకు గాను 499 మార్కులతో ఇద్దరు కైవసం చేసుకున్నారు. వారిలో విరుదునగర్ జిల్లా పెరియపళ్లికులంలోని నోబల్ స్కూల్ విద్యార్థిఆర్ శివకుమార్, నామక్కల్ జిల్లా రాశిపురం ఎస్ఆర్వీ -ఎక్స్ఎల్ విద్యార్థిని ప్రేమసుధా ఉన్నారు. సీఏ చదువుతానని శివకుమార్ పేర్కొనగా, డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యం అని ప్రేమసుధా వ్యాఖ్యానించారు. ఇక, రెండో స్థానాన్ని 498 మార్కులతో యాభై మంది, 497 మార్కులతో మూడో స్థానాన్ని 224 మంది విద్యార్థులు దక్కించుకున్నారు. ఇక, తమిళ పాఠ్యాంశంలో 73 మంది, ఆంగ్లంలో 51 మంది, సైన్స్‌లో 18 వేల 642, గణితంలో 18 వేల 754 మంది, సోషియల్ సైన్స్‌లో 39 వేల 398 మంది వందకు వంద మార్కులతో హోరెత్తించారు. ఇక, అంధ విద్యార్థుల విభాగంలో ముగ్గురు రాష్ట్రంలో మొదటి రెండు ర్యాంకుల్ని దక్కించుకున్నారు. తిరునల్వేలి జిలా పాళయం కోట్టైలోని అంధుల పాఠశాలకు చెందిన కృష్ణకుమార్ ఐదు వందలకు 489, ఎం రాణి 470 మార్కులు సాధించారు. రాష్ట్రంలో కేంద్ర కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సైతం సత్తా చాటుకున్నారు. చెన్నై పుళల్ జైలులో 28 మంది ఖైదీలు ఉత్తీర్ణులయ్యారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 70 కార్పొరేషన్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. 6,608 మంది పరీక్ష రాయగా, ఆరు వేల 273 మంది ఉత్తీర్ణులయ్యారు. 99 శాతం మేరకు కార్పొరేషన్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డీఎంకే అధినేత కరుణానిధి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు విద్యార్థుల ప్రతిభ : నిర్బంధ తమిళం అమల్లో ఉన్న ఈ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు తెలుగు విద్యార్థులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చివరకు కోర్టు కరుణించి ఇచ్చిన ఆదేశాల్ని అధికార వర్గాలు అమలు చేయడంతో మాతృభాషలో పరీక్షలు రాసి తమ ప్రతిభ చాటుకున్నారు. తెలుగులో పాఠ్యాంశంలో వందకు 90కు పైగా మార్కుల్ని అత్యధిక శాతం మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం విశేషం. ఇక, హోసూరు సమీపంలోని డెంకణీకోట తాలూక కుందుకోట ప్రభుత్వ తెలుగు ఉన్నత పాఠశాలలో చదువుతున్న శాలివారానికి చెందిన ఎం.మధుశ్రీ తెలుగు పాఠ్యాంశంలో 98 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. -
గురుకులాలు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లో సంక్షేమ గురుకులాలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. మహాత్మా జ్యోతిబా ఫూలే (బీసీ) గురుకులాలు 96 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు నెలకొల్పాయి. ఇది రాష్ట్ర ఉత్తీర్ణత శాతం (86%) కంటె పది శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 90 శాతం, ఎస్టీ గురుకుల పాఠశాలలు 84 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బీసీ గురుకులాల్లో మొత్తం 1307 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1248 మంది ఉత్తీర్ణులయ్యారు. 708 మంది ఏ గ్రేడ్, 530 మంది బీ గ్రేడ్ సాధించారు. నాగార్జునసాగర్, నాగర్‌కర్నూలు, చిట్యాల, ధర్మారం, మహేశ్వరం, కౌడిపల్లి, శాయంపేట స్కూళ్లు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్సీ గురుకులాల నుంచి 8,914 మంది విద్యార్థులు హాజరు కాగా 8,022 మంది పాసయ్యారు. ఈ గురుకులాల్లో 29 స్కూళ్లు వంద శాతం, 14 స్కూళ్లు 98 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎస్టీ గురుకుల స్కూళ్ల నుంచి 2,377 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,988 మంది పాసయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఆయా గురుకులాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులను మంత్రులు జోగురామన్న, జి.జగదీశ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్ అభినందించారు. -
దివ్యశ్రీ, కీర్తన..శభాష్
తల్లి, తండ్రి మృతి చెందిన దుఃఖంలో పరీక్ష రాసి మంచి మార్కులు సాధించిన విద్యార్థినులు కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి మంచి మార్కులతో పాసయ్యామని చెప్పుకోడానికి ఒకరికేమో తల్లిలేదు.. మరొకరికేమో తండ్రి లేడు. పరీక్షల సమయంలో ఈ ఇద్దరు విద్యార్థినిలు ఒకరు త ండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయారు. పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసి నేడు మంచి ఫలితాలు సాధించారు. దివ్యశ్రీ జిపిఎ 10కి 10, కీర్తన 8.2 జీపీఏ సాధించి శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరం పోలీస్లైన్లోని పద్మావతి, సుబ్బనరసింహల పెద్ద కుమార్తె దివ్యశ్రీ. నగరంలోని సాయి క్రిష ్ణహైస్కూల్లో పదవ తరగతి చదివింది. ఈమె తల్లి పద్మావతి మార్చి 25న తమ బందువుల ఆమ్మాయికి ఆరోగ్యం బాగా లేకుంటే చెన్నైలోని అపోలో అసుపత్రిలో చూపించుకుని 26వ తేదీ రాత్రి చెన్నై నుంచి వస్తుండగా రాజంపేట సమీపంలో లారీని కారు ఢీకున్న సంఘనటలో మృతి చెందింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలిసిన దివ్యశ్రీ పుట్టెడు దుఖాన్ని దిగమింగుకుని 27న నాగార్జున మోడల్ స్కూల్లోని పరీక్షా కేంద్రానికి హాజరై తెలుగు పరీక్ష రాసింది. అన్ని సబ్జెక్టులలో పదికి పది (జీపీఏ)మార్కులను సాధించి సత్తా చాటుకుంది. తండ్రి ఇకరారని తెలిసి.. కడపలోని నెహ్రునగర్‌కు చెందిన వెంకటరమణ, లక్ష్మీదేవి పెద్ద కుమార్తె కీర్తన. జయనగర్‌కాలనీకి చెందిన జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివింది. వెంకట రమణ అనారోగ్యంతో భాదపడుతూ మార్చి 27 తెల్లవారుజామున మృతి చెందాడు. బాగా చదువుకోవాలమ్మా అని తండ్రి తరచూ చెప్పే మాటలను గుర్తు తెచ్చుకుని గుండె నిబ్బరం చేసుకుని నాగార్జున మోడల్ స్కూల్లో పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్ష రాసింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 8.2 జీపీఏ సాధించింది. అప్పట్లో పరీక్ష రాస్తున్న కీర్తనను డీఈఓ ప్రతాపరెడ్డి ఓదార్చారు. పై చదువుకు తన వంతు సాయం చేస్తానని కూడా చెప్పారు. అదే సెంటర్లో దివ్యశ్రీ అనే విద్యార్థిని తల్లి కూడా వృుతి చెందిందని తెలియక పోవటంతో అప్పట్లో డీఈఓ పరామర్శించలేకపోయారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థినులిద్దరూ మంచి మార్కులు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
ఇంగ్లిష్ మీడియం విద్యార్థులదే హవా
హైదరాబాద్ సిటీ: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లీష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 77.56 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం 82.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక తెలుగు మీడియంలో 73.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతేడాదితో పోల్చితే తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. గత ఏడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరు కాగా అందులో 2,08,023 మంది (83.18 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అదే ఇంగ్లీష్ మీడియంలో 2,36,998 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,11,723 మంది (89.34 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి రెండు మాధ్యమాలలో ఉత్తీర్ణత శాతం తగ్గినా ఇంగ్లిషు మీడియంలో చేరి పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య పెరిగింది. మీడియం వారీగా పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలు.. మీడియం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులు ఉత్తీర్ణతశాతం తెలుగు 2,44,448 1,79,221 73.32 ఇంగ్లిషు 2,56,363 2,11,281 82.41 ఉర్దూ 11,713 7034 60.05 ఇతర 949 731 77.03 మొత్తం 5,13,473 3,98,267 77.56 -
మొదటి స్థానం నిలబెడతా..
బాలాజీచెరువు (కాకినాడ) :నవ్యాంధ్రప్రదేశ్లోనూ పదవ తరగతి ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లాను మొదటిస్థానంలో నిలబెడతానని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు అన్నారు. గత సంవత్సరం పదవ తర గతి ఫలితాల్లో జిల్లా ఉమ్మడిరాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నరసింహారావు డీఈఓగా బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలైన సందర్భంగా ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ప్రశ్న : జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు ఎంతమంది హాజరౌతున్నారు? జవాబు : జిల్లావ్యాప్తంగా మార్చి 26న జరిగే పరీక్షలకు 69,510 మంది విద్యార్థులు హాజరౌతున్నారు. రెగ్యులర్‌గా 65,648 మంది, ప్రైవేట్‌గా 3,858 మంది హాజరౌతున్నారు. బాలురు 34,908 మంది, బాలికలు 34,592 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రశ్న : పరీక్షలకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? జవాబు : కొత్తగా కలిసిన మండలాలతో కలిపి జిల్లాలో 317 సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రశ్న : గతంలో ప్రతి పాఠశాలనూ ఒక అధికారికి దత్తతనిచ్చారు. ఈ సంవత్సరం? జవాబు : క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరమూ కలెక్టర్ ఆదేశాల మేరకు అలాగే ప్రతి పాఠశాలకూ ఓ దత్తత అధికారిని నియమించాం. ప్రశ్న : ఈ సంవత్సరం ఫలితాలకు మీ యాక్షన్ ప్లాన్? జవాబు : ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు ప్రథమ స్ధానంలో నిలపడమే నా లక్ష్యం. ఇప్పటికే మండలస్థాయిలో కమిటీలు నియమించాం. ప్రీ పబ్లిక్ 1, 2 పరీక్ష ఫలితాల ఆధారంగా ఉత్తీర్ణత శాతం గుర్తించి, ఉత్తీర్ణతలో బాగా వెనుకబడిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. ప్రశ్న : పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యూయా? జవాబు : ఇప్పటికే ప్రశ్నాపత్రాలు వచ్చారుు. అన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలతో పాటు తాగునీటి సదుపాయం కల్పించడంతో వెలుతురు బాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మాస్ కాపీయింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. 15 ఫ్లైయింగ్ స్వ్కాడ్లు నియమిస్తున్నాం. గత సంవత్సరం మాస్ కాపీయింగ జరిగిన కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం. ప్రశ్న : పదవ తరగతి విద్యార్థులకు మీరిచ్చే సందేశం? జవాబు : పదవ తరగతి విద్యాభ్యాసంలో ఎంతో కీలకమైనది. ఈ తరగతిలో వచ్చిన ఫలితాల్ని బట్టే విద్యార్థి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఒత్తిడికి గురవకుండా మెదడును ప్రశాంతంగా ఉంచుకొని పరీక్షలు రాయాలి. కాపీయింగ్‌కు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకోరాదు. పదవ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించాలన్నదే నా ఆకాంక్ష. -
ఫలితాలు అదుర్స్
సాక్షి, ముంబై: రాష్ట్ర విద్యార్థులు పదోతరగతిలో రికార్డుస్థాయి ఫలితాలను సాధించారు. మంగళవారం ప్రకటించిన ఎస్సెస్సీ ఫలితాల్లో గతసంవత్సరం కంటే 5.36% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 15,49,834 మంది విద్యార్థులు పరీక్షలు అందులో 88.32% మంది.. అంటే 13,68,796 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికల్లో 90.55% మంది ఉత్తీర్థులుకాగా బాలురు 86.47% ఉత్తీర్ణత సాధించారు. ఇక విభాగాలవారీగా పరిశీలిస్తే మొత్తం తొమ్మిదింటిలో మరోసారి కొంకణ్ విభాగం తన పట్టును నిలుపుకుంది. కొంకణ్ విభాగంలో గతంలోకంటే 2% మంది విద్యార్థులు అధికంగా పాసయ్యారు. దీంతో ఈసారి 95.57 శాతంతో కొంకణ్ విభాగం ప్రథమ స్థానంలో నిలిచింది. రెండోస్థాన్నాన్ని కోల్హాపూర్ విభాగం దక్కించుకుంది. ఇక్కడ 93.83అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది నాలుగోస్థానంలో నిలిచిన పుణే ఈసారి 92.35 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానంలో నిలువగా, గతంలో మూడవ స్థానంలో ఉన్న ముంైబె 88.84 శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక చివరి స్థానంలో లాతూర్ విభాగం నిలిచింది. అయితే గతంలోకంటే ఇక్కడ ఈసారి మెరుగైన ఫలితాలే నమోదయ్యాయి. గత సంవత్సరం 73.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈసారి మాత్రం 81.68 శాతం విద్యార్థులు ఈ విభాగం నుంచి ఉత్తీర్ణత సాధించారు. మునుపెన్నడులేని విధంగా రికార్డుస్థాయిలో ఫలితాలు సాధించడం సంతోషకరమైన విషయమని శిక్షణ మండలి అధ్యక్షులు గంగాధర్ మీడియాకు తెలిపారు. 21.32 శాతం ఉత్తీర్ణత సాధించిన రిపీట్ విద్యార్థులు... రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,68,508 మంది విద్యార్థులు రిపీటర్లుగా పరీక్షలు రాశారు. వీరిలో 21.323 శాతం(35,926) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. బాలికల ఉత్తీర్ణత శాతం 24.34 కాగా బాలురు 19.86 శాతం మంది పాసయ్యారు. అత్యధికంగా గ్రేడ్లు దక్కించుకున్న బాలురు.. ఎస్సెస్సీ ఫలాతాలను గ్రేడ్ల వారీగా పరిశీలిస్తే బాలురే పైచేయిగా నిలిచారు. 7,32,218 మంది బాలురు గ్రేడ్లు సాధించగా బాలిక వరకు వచ్చేసరికి ఈ సంఖ్య 6,36,578కు పరిమితమైంది. ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్‌లలో పాసైన వారిలో కూడా బాలురే అధికంగా ఉన్నారు. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నగరంలోని తెలుగు పాఠశాలలు సత్తాచాటాయి. వడాలాలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ(ఏఈఎస్) హైస్కూల్ ఈసారి కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించింది. 2013-14కుగాను ఏఈఎస్ నుంచి మొత్తం 353 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 97.73 శాతం(345) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాల నుంచి 91.8 శాతం మార్కులతో వి. ఓంకార్ ప్రథమ స్థానంలో, పి.సాగర్ 91.6 శాతం మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరిలో 79 మంది డిస్టింక్షన్, 114 మంది ఫస్ట్ క్లాస్, 119 మంది సెకండ్ క్లాస్ సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మార్క్షీట్లు, ప్రమాణపత్రాలు ఇచ్చేరోజు మంచిమార్కులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నట్టు ఎఈఎస్ అధ్యక్షులు స్వరూపరావ్, కార్యదర్శి పి.ఎం. రావ్, ప్రిన్సిపాల్ కె. లక్ష్మీలలిత తెలిపారు. 100 శాతం ఫలితాలతో మోడ్రన్ హ్యాట్రిక్.. ఘాట్కోపర్లో తెలుగువారి ఆధ్వర్యంలో నడిచే మోడ్రన్ ఇంగ్లిష్ హైస్కూల్ వరుసగా మూడోసారి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. దీనిపై పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఘాట్కోపర్ కామ్రాజ్నగర్లో ఉన్న ఈ స్కూల్లో తెలుగు విద్యార్థులతోపాటు ఇతర విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈసారి పరీక్షలు రాసిన 25 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో 87 శాతంతో అంకుష్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. వరుసగా మూడోసారి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి హ్యాట్రిక్ సాధించిందని గాలి మురళి, జక్కుల తిరుపతి, బండారు శేశాద్రి, మంజ్రేకర్ తెలిపారు. గీతా విద్యాలయం 98శాతం గోవండీలోని తెలుగువారికి చెందిన శ్రీ గీతా వికాస మండలి ఆధ్వర్యంలో నడిచే గీతా విద్యాలయం ఈ సారి కూడా మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 55 మంది పరీక్షలు రాయగా 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారు. 1979లో సాపించిన ఈ స్కూల్లో తెలుగు మీడియం లేకపోయినప్పటికీ అనేక మంది తెలుగు విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మొత్తం 1,800 మంది విద్యార్థులున్నారని చెర్మైన్ వాసాల కిషన్ తెలిపారు.