శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెంది.. పదో తరగతి ఫలితాల్లో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఘనంగా సత్కరించారు. ‘ఉత్తమ ప్రతిభకు అభినందనలు’ నామకరణంతో శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
10 పాయింట్లు సాధించిన 32 మందికి ప్రశంసాపత్రం, రూ.2,500 నగదు, టైటాన్ రిస్ట్ వాచ్‌లను బహూకరించారు. అలాగే శత శాతం ఫలితాలు సాధించిన 89 పాఠశాలలకు విజయం పాఠశాలల కింద విజయం పతాకం, షీల్డ్‌లను అందజేశారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను పర్యవేక్షిస్తున్న 13 మంది ఎంఈవోలకు ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను విజయపథంలో ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది జిల్లా 91.68 శాతం ఫలితాలు సాధించడానికి అందరి సమిష్టి కృషే కారణమన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించడానికి ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఎంతో శ్రమకు ఓర్చి ఉంటారన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, దేశానికి నిర్మాతలను తయారు చేసి అందిస్తున్నారన్నారు. రేపటి సమాజానికి పునాదులు వేస్తున్నారన్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ జిల్లాలో ఏర్పాటు చేశామని, తద్వారా పిల్లల పర్యవేక్షణ జరిగిందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో జిల్లా మంచి ఫలితాలు సాధించాలని ఆకాక్షించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో బాలికలదే పైచేయిగా ఉందన్నారు. సివిల్ సర్వీస్లు, బ్యాంకు పరీక్షలు వంటి వాటిలో బాలికలు కనీసం 40 శాతం మంది ఉంటున్నారన్నారు.
గత ఏడాది సంస్కారం కార్యక్రమం ద్వారా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. జేసీ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మంచి స్థానాలను అందుకొనడంలో తగిన తర్ఫీదును అందజేయాలన్నారు. డీఈవో ఎస్.అరుణకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది 91.68 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో 9వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు.
సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.అచ్యుతానంద గుప్తా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ ఏడాది 94.78 శాతం ఫలితాలు సాధించామన్నారు. సమావేశంలో ఏజేసీ ఎం.డి.హషీమ్‌షరీఫ్, జీడ్పీ సీఈవో వి.నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.లాలాలజపతిరాయ్, ఆర్వీం అధికారి ఆర్.గణపతిరావు, విజయం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రశంసలందుకున్న పాఠశాలలు...
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదమల్లి, అవలంగి, బులుమూరు, మాతల, పూసాం, కొమ్మువలస, రావిచంద్రి, ఎం.సింగుపురం, రొంపివలస, జి.సిగడాం, రాజాం, లింగాలవలస, కాగితాపల్లి, మండాకురిటి, వాల్తేరు, బొడ్డూరు, సిరిపురం, యు.కె.గుమ్మడ, కోణంగిపాడు, నీలానగరం, నర్సిపురం, వీరఘట్టం, కె.కవిటి, సతివాడ, కరవంజ, యలమంచిలి, లింగాలవలస, అచ్యుతాపురం, టి.లింగాలపాడు, బాదాం, వెదుళ్లవలస, అంపలాం, తోలాపి, తాడివలస, తెప్పలవలస, గొర్లెపేట, కిల్లిపాలెం, నవనంపాడు, కె.కొజ్జీరియా, తురగలకోట, పెదబాణాపురం, రౌతుపురం, మర్రిపాడు, కొల్లిపాడు, లింగావలస, తలగాం, మెట్టూరు, వజ్రపుకొత్తూరు, గరుడభద్ర
కేజీబీవీలు...
భామిని, బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్.పేట, రాజాం, సారవకోట, తురాయిపువలస, వంగర, ఆమదాలవలస, జలుమూరు, కోటబొమ్మాళి, మురపాక, లావేరు, పొందూరు, రణస్థలం, మెళియాపుట్టి, ఇచ్చాపురం, బోరువంక, నందిగాం, బోరుభద్ర, సోంపేట
గిరిజన ఆశ్రమ పాఠశాలలు...
లబ్బ, ఓండ్రుజోల, శంభాం, పూతికవలస, చినబగ్గ, మల్లి-2, హడ్డుబంగి, దోనుబాయి, గంగంపేట, పట్టులోగాం, బందపల్లి, పెద్దమడి, పెద్ద లక్ష్మీపురం, జయపురం, భీమ్‌పురం, సీతంపేట-2
అవార్డులు పొందిన విద్యార్థులు వీరే...
దారపు అప్పలరెడ్డి (జి.సిగడాం), కోన అసిరిరెడ్డి(జి.సిగడాం), తెప్పల ఉష(వజ్రపుకొత్తూరు), వెలుగు జోగమ్మ(టెక్కలి), జి.వి.వి.ఎస్.ఆర్.ఎల్.ప్రసాద్(రాగోలు), కలిశెట్టి వనిత(సారవకోట), పాగోటి రేణుక(సారవకోట), కరిమెల్లి సుకన్య(సారవకోట), చవికి సాయికృష్ణ(జి.సిగడాం), కోల దివ్య(హిరమండలం), వి.డింపుల్(ఇచ్చాపురం), పి.శంకర్(ఇచ్చాపురం), ప్రగడ ఉదయభాస్కర్(జలుమూరు), అంధవరపు శ్యామసుందర్(జలుమూరు), తొగరాపు నాగభూషణరావు(జలుమూరు), చల్లా సత్యనారాయణ(జలుమూరు), గార రామలక్ష్మి(సంతకవిటి), బలగ నరేంద్ర(పాతపట్నం), గొల్లపల్లి రేణుక(పలాస), మజ్జి సౌజన్య(పాలకొండ), గొట్టా చరణ్‌కుమార్(నరసన్నపేట), అన్నెపు కవిత(నందిగాం), ఎం.శేషగిరి(నందిగాం), ఆర్.కృష్ణవేణి (మెళియాపుట్టి), శిర్లా బేబీ ప్రసాద్(మందస), లోపింటి భీమశంకర్(మందస), శిల్పాపాండ్యన్(మందస), ఎస్.మహేష్(కొత్తూరు), బొండాడ ఊర్వశి(కంచిలి), కప్ప సంతోషి(కంచిలి), తుంగాన అశ్విని(కవిటి), సి.హెచ్.స్వాతి(కవిటి).
‘పది’ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
Published Sat, May 24 2014 2:38 AM | Last Updated on Mon, Jul 29 2019 7:32 PM
Advertisement
Advertisement