సాక్షి, అమరావతి: కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్‌షిప్’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మిడియెట్ విద్యామండలి కమిషనర్ సౌరభ్ గౌర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.
2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్ సెక్టార్ స్కీం స్కాలర్‌షిప్ కోసం డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్‌ఐవోలు అన్ని మేనేజ్‌మెంట్స్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు. విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా http://www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment