సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నిన్నే(మంగళవారం) ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్ ఫలితాలు రిలీజ్ కానుండడం విశేషం.
‘సాక్షి’లో ఫలితాలు..
టెన్త్ పరీక్ష ఫలితాలను త్వరితగతిన తెలుసుకునేందుకు సాక్షి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి, ఫలితాలు పొందవచ్చు.
►తెలంగాణ టెన్త్ ఫలితాల్లో 86 శాతం ఉత్తీర్ణ నమోదైంది.
►బాలుర ఉత్తీర్ణత 84.68 శాతం
►బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత
►2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత
►నిర్మల్ జిల్లా 99 శాతంతో మొదటి స్తానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో ఉంది.
►25 పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత
►ప్రభుత్వ పాఠశాలలో 72.39 శాతం ఉత్తీర్ణత
►తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.25 ఉత్తీర్ణత
Comments
Please login to add a commentAdd a comment