Titan Watch Company
-
టైటన్ హీలియోస్‌కు కొత్త బ్రాండ్స్
న్యూఢిల్లీ: లగ్జరీ వాచ్‌ల విక్రయంలో ఉన్న టైటన్ హీలియోస్ మరిన్ని విదేశీ బ్రాండ్స్‌ను జోడిస్తోంది. 12–18 నెలల్లో కొత్తగా 10 బ్రాండ్స్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం హీలియోస్ స్టోర్లలో టామీ హిల్ఫిగర్, టిస్సో, స్వరోస్కీ, ఫాజిల్ వంటి 45 బ్రాండ్ల వాచ్‌లు కొలువుదీరాయి. వీటి ధరలు రూ.5,000 మొదలుకుని రూ.1,00,000 వరకు ఉన్నాయి. మరోవైపు హీలియోస్ స్టోర్ల సంఖ్యను కంపెనీ గణనీయంగా పెంచుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 ఔట్లెట్లు రానున్నాయని టైటన్ వాచెస్, వేరబుల్స్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ శుక్లా వెల్లడించారు. ‘మొత్తం వ్యాపారంలో హీలియోస్ నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. ఈ విభాగం ఆదాయం 45 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. హీలియోస్ టర్నోవర్‌లో 20 శాతం కొత్త కలెక్షన్, లిమిటెడ్ ఎడిషన్స్ నుంచి అందుకోవాలని దృష్టిపెట్టాం. పండుగల సీజన్ ప్రమోషన్స్ కారణంగా కస్టమర్ల రాక, ఆన్లైన్ సేల్స్ 20–25 శాతం అధికం అవుతాయని భావిస్తున్నాం. అన్ని బ్రాండ్స్‌లో కలిపి ఏటా 150 దాకా కేంద్రాలను జోడిస్తున్నాం’ అని వివరించారు. టైటన్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు, పట్టణాల్లో 240 హీలియోస్ స్టోర్లు ఉన్నాయి. హీలియోస్తోపాటు టైటన్ వరల్డ్, ఫాస్ట్‌ట్రాక్, రాగా, జూప్, ఎస్ఎఫ్ బ్రాండ్లలో 1,110కిపైగా కేంద్రాలు ఉన్నాయి. -
టైటన్ లాభం అప్..
-
టైటన్ లాభం అప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 916 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 835 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 10,708 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 8,567 కోట్ల అమ్మకాలు సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 11,402 కోట్లకు చేరాయి. ఇక మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 12,653 కోట్లయ్యింది. దీనిలో జ్యువెలరీ విభాగం ఆదాయం 39 శాతం జంప్‌చేసి రూ. 11,081 కోట్లను తాకగా.. వాచీలు తదితర బిజినెస్ 32 శాతం వృద్ధితో రూ. 1,092 కోట్లకు చేరింది. వెరసి వాచీలు, వేరబుల్స్ విభాగం తొలిసారి రూ. 1,000 కోట్ల టర్నోవర్‌ను అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకేర్ ఆదాయం 13 శాతం బలపడి రూ. 189 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 10 టైటన్ వరల్డ్ స్టోర్లతోపాటు, హీలియోస్ 5, ఫాస్ట్‌ట్రాక్ 5 చొప్పున స్టోర్లను ఏర్పాటు చేసింది. ఫలితాల నేపథ్యంలో టైటన్ షేరు బీఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 3,273 వద్ద ముగిసింది. -
15 నిమిషాల్లో రూ. 400 కోట్లు సంపాదించిన రేఖా ఝున్‌ఝున్‌వాలా
సాక్షి, ముంబై: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్‌ఝున్‌వాలా మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలంలో 15 నిమిషాల్లో కోట్లాది రూపాయలను ఆర్జించారు. తన పోర్ట్‌ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్ల లాభాలతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. ఏకంగా 400కోట్ల రూపాయలను తన నెట్‌వర్త్‌కు జోడించుకున్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో వ్యాపార వృద్ది, ఇతర వ్యాపార అప్డేట్స్తో సోమవారంనాటి మార్కెట్లో టైటన్, టాటా మోటార్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. రేఖా పోర్ట్ ఫోలియోలోని షేర్ల మార్నింగ్ డీల్స్‌తో ఆమె నికర విలువ ఆకాశానికి ఎగిసింది. ట్రేడింగ్ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ షేరు ధర రూ. 2,598.70 గరిష్టాన్ని తాకింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది. రేఖా ఝున్‌ఝున్‌వాలా నెట్‌వర్త్ జూమ్ 2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970) పెరిగింది. అలాగే టాటా మోటార్స్ షేర్లు 5,22,56,000 షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000). కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా. -
10 నిమిషాల్లో రూ.186 కోట్లు సంపాదించిన బిగ్ బుల్
ముంబై: 10 నిమిషాల్లో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే వంద, వెయ్యి, పదివేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే పది లక్షలు. కానీ, ఇండియన్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మాత్రం ఏకంగా రూ.186 కోట్ల రూపాయలు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్‌కు చూపారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ నేటి(ఫిబ్రవరి 15) ట్రేడింగ్‌లో ధగధగా మెరిసాయి. దాదాపు టైటాన్ కంపెనీ 4 శాతం, టాటా మోటార్స్ 5 శాతం ర్యాలీ చేసింది. టైటాన్ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో ₹2398 వద్ద ముగిసింది. అయితే ఇది ఈ రోజు ఉదయం 9:25 గంటలకు ప్రతి షేరు ధర స్థాయిలకు ₹2435 వరకు పెరిగింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే 10 నిమిషాల్లో ప్రతి షేరు పెరుగుదలకు ₹37 పెరిగింది. అదేవిధంగా, మరో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హోల్డింగ్ కంపెనీ స్టాక్ టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు ప్రారంభ గంటలో తలక్రిందులుగా తెరుచుకున్నాయి. టాటా మోటార్స్ షేర్ ధర ఈ రోజు +27.55(5.84%) పెరిగి రూ.499.00కు చేరుకుంది. అక్టోబర్ - డిసెంబర్ 2021 త్రైమాసీకంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు కంపెనీలో వాటా ఉంది. రాకేష్ ఝుంఝున్ వాలా 3,57,10,395 షేర్లు లేదా 4.02 శాతం వాటా కలిగి ఉంటే, రేఖా ఝున్‌ఝున్‌వాలా సంస్థలో 95,40,575 షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే రాకేష్ ఝుంఝున్ వాలా, రేఖా ఝుంఝున్ వాలా కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. (చదవండి: ఇండియన్ ఇంజనీర్ల అద్భుతం! జేమ్స్‌బాండ్ ఇక్కడ ఫైట్ చేయాల్సిందే) -
వరల్డ్ టాప్–100 లగ్జరీ బ్రాండ్లు.. చోటు దక్కించుకున్న ఇండియన్ బ్రాండ్స్ ఇవే
న్యూఢిల్లీ: ప్రపంచంలో విలాసవంతమైన టాప్–100 బ్రాండ్లలో భారత్ నుంచి ఐదింటికి చోటు లభించింది. టైటాన్ మూడు స్థానాలు పైకి ఎగిసి 22వ ర్యాంకులోకి వచ్చింది. అంతేకాదు అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి 20 లగ్జరీ ఉత్పత్తుల కంపెనీల్లోనూ చోటు సంపాదించుకుంది. జెమ్స్ అండ్ జ్యుయల్లరీ టాప్–100 విలాసవంత ఉత్పత్తుల్లో భారత్ నుంచి కల్యాణ్ జ్యుయలర్స్, జోయలుక్కాస్, పీసీ జ్యుయలర్స్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ ఉన్నాయి. ఇవన్నీ జ్యుయలరీ కంపెనీలే కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి ధోరణి గతేడాది మాదిరే ఉందని, జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం తాజా ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించినట్టు.. ఈ నివేదికను రూపొందించిన డెలాయిట్ తెలిపింది. తొలిసారి త్రిభువన్దాస్.. టాప్ –100 లగ్జరీ ఉత్పత్తుల జాబితాలోకి త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి తొలిసారిగా చోటు సంపాదించుకుంది. టాప్–10 బ్రాండ్లు యూరోప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతం (ఈఎంఈఏ) నుంచే ఉన్నాయి. టాప్–100లో 80కు పైగా కంపెనీల విక్రయాలు 2019–20లో (2020వ సంవత్సరం) తక్కువగా ఉన్నాయని.. కరోనా ప్రబావం వీటిపై పడినట్టు డెలాయిట్ తెలిపింది. అయినప్పటికీ సగానికి పైగా కంపెనీలు లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. చదవండి: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్! నెక్ట్స్ ఏం జరగబోతుంది? -
టైటాన్ డబుల్ ధమాకా..!
Titan Q2 Results: టైటాన్ కంపెనీ ఈ ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నికర లాభాల్లో డబుల్ ధమాకా కొట్టేసింది. క్యూ2లో 270శాతం వృద్ధితో సుమారు రూ. 641 కోట్ల ఏకీకృత నికర లాభాలను సొంతం చేసుకుంది. గత ఏడాది క్యూ2లో టైటాన్ సుమారు రూ.173 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో టైటాన్ జ్వువెలరీ కంపెనీ విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో టైటాన్ జ్వువెలరీ విభాగంలో క్యూ2లో రూ. 4,127 కోట్ల నుంచి 75 శాతం పెరిగి రూ.7,243 కోట్లకు చేరుకుంది. ఆదాయం సుమారు 78 శాతం మేర పెరిగింది. టైటాన్ జ్వువెలరీ విభాగంలో గత ఏడాదిలో క్యూ2లో రూ. 3446 కోట్లను నివేదించగా, ఈ ఏడాదిగాను 77శాతం వృద్ధితో రూ. 6,106 కోట్ల ఆదాయాన్ని గడించింది. టైటాన్ గడియారాలు, వెయిరబుల్స్ మార్కెట్లో క్యూ2లో 72 శాతం వృద్ధితో 687 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు కళ్లజోడు వ్యాపారంలో కూడా భారీ గ్రోత్నే సాధించింది. ఈ ఏడాది క్యూ2లో 70 శాతం వృద్ధితో రూ. 160 కోట్లను ఆదాయాన్ని గడించింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సికె వెంకటరామన్ మాట్లాడుతూ...ఈ త్రైమాసికంలో టైటాన్ బలమైన వృద్ధి నమోదుచేసింది. డిమాండ్ ఉండడటంతో అన్ని విభాగాల్లో బలంగా పుంజుకుందని పేర్కొన్నారు. చదవండి: సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..! -
Sate Bank Day: డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. టైటన్ వాచెస్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ తగ్గింపు ధరలు ఈ నెల 7 వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి. తన యోనో యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ కొనుగోళ్లు చేయాలని కస్టమర్లకు పిలుపునిచ్చింది. కాగా ఎస్బీఐ నేడు ఫౌండేషన్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒకవీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అలాగే తమకు అండగా నిలిచిన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. (State Bank Day: హ్యపీ, ఇన్క్రెడిబుల్ జర్నీ) Get Flat 20% OFF* on all TITAN PAY watches through YONO. Make fast, contactless and secure transactions via Titan Pay. Download now: https://t.co/FpPOSnsD5V #StateBankDay #TitanPay #Titan #ContactlessPayment #TitanWatch #Watch #YONOSBI pic.twitter.com/gTDf05Ndqr — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 -
టైటాన్ నికర లాభం 38% డౌన్
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టైటాన్‌కు అధిక వ్యయాల సెగ తగిలింది. ఈ ఆర్థిక సంవ త్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కంపెనీ స్టాండెలోన్ నికర లాభం 38 శాతం క్షీణించి రూ.199 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.320 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 1.72 శాతం తగ్గుదలతో రూ.4,466 కోట్ల నుంచి రూ.4,389 కోట్లకు చేరింది. క్యూ2లో కంపెనీ మొత్తం వ్యయాల్లో భాగంగా రూ.480 కోట్లను నష్టంగా గుర్తించింది. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.4,151 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.4,037 కోట్లుగా ఉన్నాయి. భారత్‌లో కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020–21 తొలి త్రైమాసికంలో నెలకొన్న తీవ్ర సమస్యల తర్వాత రెండో త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 89 శాతం మేర పుంజుకున్నాయని కంపెనీ పేర్కొంది. ‘క్యూ2లో కంపెనీ చవిచూసిన రికవరీ పట్ల సంతృప్తి చెందుతున్నాం. పండుగ సీజన్లో వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నెలకొనడం కంపెనీ మొత్తం విభాగాలన్నింటికీ శుభసూచకం. కీలక వ్యాపారాల్లో కంపెనీ మార్కెట్ వాటా పెంపు కొనసాగుతోంది. వ్యయాలు, పెట్టుబడులపై మరింత దృష్టిసారించడం, లాభాలు అదేవిధంగా నగదు ప్రవాహాలు మెరుగయ్యేందుకు దోహదం చేసింది’ అని కంపెనీ ఎండీ సి.కె. వెంకటరామన్ తెలిపారు. ► ఆభరణాల విభాగం ఆదాయం క్యూ2లో రూ.3,446 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.3,528 కోట్లతో పోలిస్తే 2 శాతం తగ్గింది. వాచీలు, వేరబుల్స్ వ్యాపార ఆదాయం 44 శాతం దిగజారి రూ.719 కోట్ల నుంచి రూ.400 కోట్లకు క్షీణించింది. ► కళ్లద్దాల వ్యాపారం ఆదాయం సైతం 39 శాతం క్షీణతతో రూ.154 కోట్ల నుంచి రూ.94 కోట్లకు పడిపోయింది. ఫలితాల నేపథ్యంలో టైటాన్ షేరు బుధవారం బీఎస్ఈలో 1.2 శాతం నష్టంతో రూ.1,218 వద్ద ముగిసింది. -
టైటన్- శ్రీ సిమెంట్... ఫలితాల దెబ్బ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో టాటా గ్రూప్ కంపెనీ టైటన్ కంపెనీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే కాలంలో పనితీరు నిరాశపరచడంతో శ్రీ సిమెంట్ లిమిటెడ్ కౌంటర్ సైతం బలహీనపడింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ రెండు కౌంటర్లూ నష్టాల బాటలో సాగుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో డైవర్సిఫైడ్ దిగ్గజం టైటన్ రూ. 297 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 364 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 61 శాతం క్షీణించి రూ. 1979 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు రూ. 361 కోట్ల నష్టం నమోదైంది. గత క్యూ1లో ఈ పద్దుకింద రూ. 520 కోట్ల లాభం సాధించింది. ఈ నేపథ్యంలో టైటన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4 శాతం పతనమై రూ. 1063 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1049 దిగువకు చేరింది. శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ప్రయివేట్ రంగ దిగ్గజం శ్రీ సిమెంట్ 14 శాతం తక్కువగా రూ. 330 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 25 శాతం క్షీణించి రూ. 2480 కోట్లకు పరిమితమైంది. పన్నుకు ముందు లాభం 12 శాతం వెనకడుగుతో రూ. 443 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో శ్రీ సిమెంట్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం నష్టపోయింది. ప్రస్తుతం రూ. 21,530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,322 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
ఈ 3 షేర్ల దూకుడుకు కారణమేంటట?
ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో పరుగు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 34,543కు చేరగా.. నిఫ్టీ 64 పాయింట్లు పుంజుకుని 10,206 వద్ద ట్రేడవుతోంది. కాగా.. విభిన్న వార్తల కారణంగా టైటన్ కంపెనీ, యస్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టైటన్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో ప్రస్తుతం టైటన్ కంపెనీ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 3.5 శాతం పెరిగి రూ. 1025 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,050 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. జ్యువెలరీ, ఐవేర్, వాచీలు తదితర లైఫ్‌స్టైల్ ప్రొడక్టుల ఈ కంపెనీ అమ్మకాలు ఇటీవల లాక్‌డవున్ నేపథ్యంలో నీరసించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పసిడి ధరలు పుంజుకోవడంతో మార్క్‌టు మార్కెట్ క్యాష్‌ఫ్లో పెరిగినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్టోర్లను తిరిగి తెరుస్తున్న కారణంగా అమ్మకాలు గాడిన పడగలవన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. యస్ బ్యాంక్ యస్ బ్యాంకుకు చెందిన రూ. 18,000 కోట్ల బాండ్లకు BBB రేటింగ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు క్రిసిల్ తాజాగా పేర్కొంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ దన్ను కారణంగా యస్ బ్యాంక్ జారీ టైర్-2, ఇన్ఫ్రా బాండ్లకు స్టేబుల్ రేటింగ్‌ను ఇస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు తొలుత 10 శాతం జంప్‌చేసి రూ. 32ను తాకింది. ఇది 10 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం లాభంతో రూ. 30.4 వద్ద ట్రేడవుతోంది. వొడాఫోన్ ఐడియా వరుసగా 10వ సెషన్లోనూ మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా కౌంటర్ జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 12.6ను తాకింది. ప్రస్తుతం 11.5 శాతం ఎగసి రూ. 11.7 వద్ద ట్రేడవుతోంది. గత 10 రోజుల్లోనూ ఈ కౌంటర్ 129 శాతం ర్యాలీ చేయడం విశేషం! గత 26న ఈ షేరు రూ. 5.5 వద్ద ట్రేడైన సంగతి తెలిసిందే. కాగా.. టెక్ దిగ్గజం గూగుల్ వొడాఫొన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి గతేడాది జులైలో చేపట్టిన రైట్స్ ఇష్యూ ధర రూ. 12.5ను తాజాగా అధిగమించినట్లు తెలియజేశారు. ఈ అంశాన్ని కంపెనీ తోసిపుచ్చినప్పటికీ.. ఇటీవల దేశీయంగా మొబైల్ టారిఫ్‌ల పెంపు.. వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం వంటి అంశాలు మొబైల్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు చెబుతున్నారు. -
టైటన్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే
సాక్షి, ముంబై: కంజ్యూమర్ గూడ్స్ రంగ సంస్థ టైటన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ, వేరబుల్స్ కంపెనీ హగ్ ఇన్నోవేషన్స్‌ను కొనుగోలు చేసింది. హగ్ ఫౌండర్ రాజ్ నేరావటితోపాటు 23 మంది ఉద్యోగులు జనవరి 1న తమ సంస్థలో చేరారని టైటాన్ వాచెస్, వేరబుల్స్ విభాగం సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. దీనిని టైటన్ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్‌గా మార్చినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. స్మార్ట్‌వాచ్‌ల సెగ్మెంట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేప్రణాళికలో భాగంగా హగ్‌ను సొంతం చేసుకుంది. అయితే డీల్ విలువ వివరాలను రవికాంత్ వెల్లడించలేదు. అలాగే ‘కనెక్టెడ్ ఎక్స్ ’ పేరుతో టైటన్ ఫుల్ టచ్ స్మార్ట్‌వాచ్‌ను ప్రవేశపెట్టింది. టైటన్ పోర్ట్‌ఫోలియోలో ఇది టైటాన్ యొక్క 13 వ ఉత్పత్తి. మార్చి నుంచి ఈ స్మార్ట్ వాచ్ అన్ని ప్రముఖ టైటాన్ స్టోర్లలో లభిస్తుంది. 1.2 అంగుళాల ఫుల్ కలర్ టచ్‌స్క్రీన్ , స్మార్ట్ వాచ్ అనలాగ్ హ్యాండ్స్, యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్ అలర్ట్స్ లాంటి 13 టెక్ ఫీచర్లతో లోడ్ చేయబడిన మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ వాచ్ ధర రూ.14,995గా కంపెనీ నిర్ణయించింది. కాగా అమెరికాలో ఐటీ ఉద్యోగం చేసుకునే నేరావటి 2012లో నిర్భయ ఘటన తరువాత భారతదేశానికి తిరిగి వచ్చి మహిళల భద్రతా సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో హైదరాబాద్ లోని గచిబౌలిలో స్టార్టప్ సంస్థ హగ్ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించారు. ఫాక్స్‌కాన్, ఫిట్నెస్ బ్యాండ్ల సహకారంతో భద్రతా లక్షణాలతో పలు స్మార్ట్ వాచ్‌లను హగ్ రూపొందించిది. 30వేల మంది కస్టమర్లను హగ్ సొంతం. -
10 శాతం పెరిగిన టైటాన్ లాభం
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 10 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.328 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.364 కోట్లకు పెరిగిందని టైటాన్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.4,407 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.5,095 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,020 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.4,687 కోట్లకు చేరాయని కంపెనీ వివరించింది. ఆభరణాల ఆదాయం రూ.4,164 కోట్లు.... వాచ్‌ల విభాగం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.716 కోట్లకు, జ్యూయలరీ విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.4,164 కోట్లకు, కళ్లజోళ్ల విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.1,32 కోట్లకు పెరిగాయని టైటాన్ తెలిపింది. నిర్వహణ లాభం 14 శాతం వృద్ధితో రూ.565 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇన నిర్వహణ లాభ మార్జిన్లో పెద్దగా పురోగతి లేకుండా 11.4 శాతంగానే ఉంది. ఇతర ఆదాయం రూ.56 కోట్లుగా ఉండగా, వడ్డీ వ్యయాలు రూ.68 కోట్లని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటం, వినియోగం మందగమనంగా ఉండటంతో కొన్ని విభాగాలపై ప్రభావం పడిందిన కంపెనీ ఎమ్డీ భాస్కర్ భట్ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు, ప్రత్యేక ఆభరణాల కలెక్షన్ల కారణంగా ఆభరణాల విభాగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 0.2 శాతం లాభంతో రూ.1,038 వద్ద ముగిసింది. -
టైటాన్ లాభం రూ.348 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.304 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.348 కోట్లకు పెరిగిందని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,126 కోట్ల నుంచి రూ.4,945 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ భాస్కర్ భట్ తెలిపారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారాయన. నికర అమ్మకాలు రూ.3,917 కోట్ల నుంచి 19 శాతం ఎగసి రూ.4,672 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం రూ.475 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు పెరిగింది. 9.8 శాతం మార్జిన్ సాధించామని భట్ పేర్కొన్నారు. రూ.19,961 కోట్లకు మొత్తం ఆదాయం... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,102 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,389 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,245 కోట్ల నుంచి రూ.19,961 కోట్లకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్నట్లే వృద్ధి జోరు గత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగిందని భాస్కర్ భట్ వివరించారు. కీలకమైన వ్యాపార విభాగాల్లో ఆదాయం, లాభం అంశాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామన్నారు. అత్తరు బ్రాండ్ స్కిన్, భారత దుస్తులకు సంబంధించిన బ్రాండ్ తనైరాలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 0.2 శాతం లాభంతో రూ.1,088 వద్ద ముగిసింది. ఫలితాలు మార్కెట్ ముగిశాక వెలువడ్డాయి. -
ఇక ‘టాటా’ చీరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌నకు చెందిన ఆభరణాలు, వాచీల ఉత్పత్తుల విక్రయ సంస్థ టైటాన్ బ్రాండెడ్ చీరల విభాగంలోకి అడుగుపెట్టింది. చీరలు, మహిళల సాంప్రదాయ దుస్తులకు సంబంధించి తనైరా పేరిట హైదరాబాద్‌లో షోరూం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో టైటా న్ ఎండీ భాస్కర్ భట్, సినీ నటి అదితి రావు హైదరీ పాల్గొన్నారు. తనైరా బ్రాండ్ కింద ఇది అయిదో స్టోర్ అని, హైదరాబాద్‌లో మొట్టమొదటిదని భాస్కర్ భట్ తెలిపారు. ‘ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీల్లో కలిపి నాలుగు షోరూమ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మొత్తం 14 స్టోర్స్ ఏర్పాటు చేయనున్నాం. దీంతో 2020 మార్చి నాటికి తనైరా స్టోర్స్ సంఖ్య 18కి చేరుతుంది’ అని ఆయన వెల్లడించారు. బెనారస్, కంచి మొదలుకుని పోచంపల్లి, ఉప్పాడ వరకు దాదాపు 3,000 రకాల చీరలు ఈ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయని భట్ చెప్పారు. వీటి కోసం ప్రత్యేకంగా 300 మంది దాకా చేనేతకారులతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఒక్కో స్టోర్‌పై సుమారు రూ. 4–5 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందన్నారు. ధరల శ్రేణి రూ. 1,000 నుంచి ప్రారంభమవుతుందని భట్ చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేక సందర్భాల కోసం ఉద్దేశించిన దుస్తుల మార్కెట్ పరిమాణం సుమారు రూ. 20,000 కోట్లు ఉంటుందని భట్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా స్టోర్స్ ఏర్పాటు పరిశీలించనున్నట్లు టైటాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ చావ్లా తెలిపారు. మరోవైపు, ఆభరణాల బ్రాండ్ తనిష్క్ స్టోర్స్‌ను ఈ ఏడాది మధ్యప్రాచ్య దేశాల్లో ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. టైటాన్ 20 శాతం వృద్ధి అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైటాన్ ఆదాయ వృద్ధి సుమారు 20 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు భట్ చెప్పారు. క్రిత ఆర్థిక సంవత్సరం వృద్ధి 22 శాతంగా ఉండగా, 2018 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లోను సుమారు అదే స్థాయిలో నమోదైందని ఆయన పేర్కొన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నేడు (మంగళవారం) వెల్లడి కానున్నాయి. 2017–18లో సంస్థ ఆదాయం రూ. 15,472 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఇది రూ. 14,769 కోట్లుగా నమోదైంది. ఆదాయ వృద్ధికి ఆభరణాల వ్యాపార విభాగం గణనీయంగా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టైటాన్ ఆదాయాల్లో దాదాపు 83 శాతం వాటా ఈ విభాగానిదేనని భట్ వివరించారు. -
ఆభరణాల్లో రెట్టింపు వాటా
బెంగళూరు: వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆభరణాల మార్కెట్లో వాటాను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని టైటాన్ సంస్థ నిర్దేశించుకుంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉంది. తాజా లక్ష్యాన్ని చేరుకునేందుకు వెడ్డింగ్ విభాగం, అధిక విలువ వజ్రాభరణాలు, గోల్డెన్ హార్వెస్ట్ కొనుగోలు స్కీమ్, కస్టమర్లకు ఎక్సే్చంజ్ ప్రోగ్రాం తోడ్పడగలవని కొత్త ఎండీగా నియమితులైన సీకే వెంకటరామన్ తెలిపారు. ప్రధానంగా వెడ్డింగ్ జ్యుయలరీపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగమైన టైటాన్.. ’తనిష్క్’ బ్రాండ్ కింద ఆభరణాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పనితీరు గణనీయంగా మెరుగుపడుతోందని, మధ్య–టాప్ స్థాయి విభాగాల్లో కూడా మిగతా జ్యుయలర్స్ నుంచి తమ స్టోర్స్‌కు మళ్లే కొత్త కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వెంకటరామన్ చెప్పారు. మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా 2018–19లో ఇప్పటిదాకా కొత్తగా 40 స్టోర్స్‌ను ప్రారంభించినట్లు వెంకటరామన్ వివరించారు. ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో స్టోర్స్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే దూకుడు కొనసాగగలదని వెంకటరామన్ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణింపు.. దాదాపు రూ.14,000 కోట్ల మేర కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బతీసిన నేపథ్యంలో గతేడాది జ్యుయలరీ పరిశ్రమ పెను సవాళ్లను ఎదుర్కొనాల్సి వచ్చింది. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ మెరుగ్గా రాణించిన సంస్థల్లో టైటాన్ కూడా ఒకటిగా నిల్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టైటాన్ ఆదాయం 35 శాతం, నికర లాభం 46 శాతం పెరిగింది. ఆభరణాల వ్యాపార విభాగం ఆదాయం 36.95 శాతం పెరిగింది. టైటాన్ మొత్తం ఆదాయంలో దాదాపు 80 శాతం వాటా ఆభరణాల వ్యాపార విభాగానిదే ఉంటుంది. పెరుగుతున్న స్టోర్స్ నెట్వర్క్, బ్రాండ్ పేరు, అధిక విలువ ఆభరణాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాల ఊతంతో 2018–21 మధ్యలో తనిష్క్ అమ్మకాలు సుమారు 22 శాతం, స్థూల లాభం 26.5% పెరగొచ్చని బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్లో వెడ్డింగ్ ఆభరణాల అమ్మకాలు మరింత భారీగా ఉండగలవని భావిస్తున్నట్లు టైటాన్ ప్రస్తుత ఎండీ భాస్కర్ భట్ ఇటీవలే పేర్కొన్నారు. ప్రస్తుతం వెడ్డింగ్ జ్యుయలరీ విభాగంలో తనిష్క్‌కు 2–3% మార్కెట్ వాటా ఉంటోందని, వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
నష్టాల మార్కెట్లో టైటన్ మెరుపులు
సాక్షి, ముంబై: నష్టాల మార్కెట్లో టైటన్ కంపెనీ మెరుపులు మెరిపించింది. 250 పాయింట్లకు పైగా సోమవారం నాటి మార్కెట్లో టైటన్ 6 శాతం పుంజుకుని టాప్ గెయినర్‌గా నిలిచింది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను అందుకోవడంతో వాచీలు, జ్యువెలరీ దిగ్గజం టైటన్ కంపెనీ కౌంటర్ జోరందుకుంది. టైటన్ క్యూ2 ఫలితాలు ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో టాటా గ్రూప్ సంస్థ టైటన్ కంపెనీ నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 314 కోట్లను ప్రకటించింది. నికర అమ్మకాలు మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 4406 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 5 శాతం పుంజుకుని రూ. 466 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 12.7 శాతం నుంచి 10.6 శాతానికి బలహీనపడ్డాయి. టైటన్ వాచెస్ మార్కెట్ బాగా ఉన్నట్టు చెప్పారు. వాచ్‌ల అమ్మకాల విషయంలో అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. -
టైటాన్ నికర లాభం రూ.301 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.301 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ2లో రూ.278 కోట్ల నికర లాభం వచ్చిందని, ఈ క్యూ2లో 8% వృద్ధి సాధించామని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,603 కోట్ల నుంచి రూ.4,595 కోట్లకు పెరిగిందని టైటాన్ సీఎమ్‌డీ భాస్కర్ భట్ చెప్పారు. జ్యూయలరీ విభాగం ఆదాయం 29 శాతం పెరగి రూ.3,582 కోట్లకు, వాచ్‌ల విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ.676 కోట్లకు, కళ్లజోళ్ల విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.120 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యూయలరీ విభాగం అమ్మకాలు పుంజుకున్నాయని భాస్కర్ భట్ వివరించారు. వాచ్‌ల అమ్మకాల విషయంలో అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో రూ.145 కోట్లు... ట్రెజరీ కార్యకలాపాల్లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ సంస్థలో రూ.145 కోట్లు ఇన్వెస్ట్ చేశామని భాస్కర్ భట్ తెలిపారు.. వీటి కోసం రూ.29 కోట్ల కేటాయింపులు జరిపామని వివరించారు. -
స్టాక్స్ వ్యూ
టైటాన్ కంపెనీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.793 టార్గెట్ ధర: రూ.1,070 ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక విక్రయ అంచనాలను విడుదల చేసింది. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యుయలరీ విభాగం అమ్మకాలు ఈ క్యూ2లో పుంజుకున్నాయి. పెళ్లి ముహూర్తాలు తక్కువగా ఉండటం, పుత్తడి ధరలు అధికంగా ఉండటం, పరిశ్రమకు రుణ లభ్యత కటకటగా ఉండటం, వినియోగదారుల డిమాండ్ బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతలు జ్యుయలరీ పరిశ్రమలో నెలకొన్నాయి. అయితే జ్యుయలరీ పరిశ్రమలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, కొత్త కలెక్షన్ ఆఫర్ల కారణంగా ఈ కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. గుల్నాజ్ బ్రాండ్ కింద విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను, మియా బ్రాండ్ కింద వెండి ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఇక బ్రాండ్ ప్రచారం జోరుగా ఉండటం, కొత్త ఉత్పత్తుల ఆఫర్ల కారణంగా వాచ్‌ల సెగ్మెంట్ కూడా మంచి విక్రయాలను సాధించింది. మార్కెటింగ్ విస్తృతంగా ఉండటం, డిస్కౌంట్ల ధరల కారణంగా కళ్ల జోళ్ల విభాగం కూడా జోరుగానే వృద్ధి సాధించింది. ఈ క్యూ2లో ఈ కంపెనీ కొత్తగా ఆరు తనిష్క్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య 16కు పెరిగింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న ‘స్కిన్న్’ బ్రాండ్.. డిపార్ట్మెంటల్ స్టోర్లలో అత్యధికంగా అమ్ముడయ్యే సెంట్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ కొత్తగా ఆఫర్ చేసిన అమల్పి బ్లూ మంచి అమ్మకాలు సాధిస్తోంది. సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) జోరుగా ఉండనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం 20 శాతం పెరగగలదని, అలాగే మార్జిన్లు కూడా మంచి వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. గెయిల్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.332 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: గెయిల్ కంపెనీకి సంబంధించిన నాలుగు గ్యాస్ పైప్లైన్ల తుది టారిఫ్‌లను పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్(పీఎన్జీఆర్బీ) ఖరారు చేసింది. ఈ నాలుగు గ్యాప్ పైప్లైన్లలో ముఖ్యమైనదైన దహేజ్–ఉరాన్–పన్వేల్/దభోల్ పైప్‌లైన్ టారిఫ్ 54 శాతం పెరిగింది. ఇతర మూడు గ్యాప్ పైప్లైన్లు చిన్నవే అయినప్పటికీ, వీటి టారిఫ్‌లు 161–691 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ టారిఫ్‌ల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీ షేర్‌వారీ ఆర్జన (ఈపీఎస్) 1 శాతం, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ 4 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. హజీరా–విజయ్‌పూర్–జగదీశ్‌పూర్(హెచ్వీజే), దహేజ్–విజయ్‌పూర్ పైప్‌లైన్(డీవీపీఎల్)లకు సంబంధించి ఒకే టారిఫ్ ప్లాన్ ఉండాలన్న గెయిల్ ప్రతిపాదనను పీఎన్జీఆర్బీ ఆమోదిస్తే, గెయిల్ పనితీరుపై దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ సానుకూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ అమ్మకాలు నిలకడగా ఉండటం, పైప్లైన్ల విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) జోరు పెరుగుతుండటం, ఎల్పీజీ, పెట్రో కెమికల్స్ ధరలు పెరుగుతుండటం.. ఇవన్నీ సానుకూలాంశాలు. 2016–17లో రూ.48,902 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా రూ.73,782 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే నికర లాభం రూ.3,503 కోట్ల నుంచి రూ.5,945 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. -
టైటాన్ లాభం 31 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 31 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.267 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.349 కోట్లకు పెరిగిందని టైటాన్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.4,054 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.4,355 కోట్లకు ఎగసిందని టైటాన్ కంపెనీ ఎమ్డీ భాస్కర్ భట్ తెలిపారు. గత ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చినందున ఈ రెండు ఆదాయ గణాంకాలను పోల్చడానికి లేదని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.389 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.495 కోట్లకు, నిర్వహణ మార్జిన్ 9.7 శాతం నుంచి 11.5 శాతానికి పెరిగాయని వివరించారు. తమ కీలక వ్యాపారాలన్నీ లాభాల పరంగా మంచి వృద్ధిని సాధించాయని, అంతేకాకుండా మార్కెట్ వాటా కూడా పెరిగిందని భాస్కర్ భట్ తెలిపారు. జ్యూయలరీ వ్యాపారం మాత్రం ఒక్క అంకె వృద్ధినే సాధించిందని పేర్కొన్నారు. ఈ విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.3,572 కోట్లకు, వాచ్‌ల వ్యాపార ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.594 కోట్లకు పెరిగాయని, కళ్లజోళ్ల వ్యాపార విభాగం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.132 కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టైటాన్ కంపెనీ షేర్ 0.2 శాతం లాభంతో రూ.918 వద్ద ముగిసింది. గురువారం రూ.920 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం ఇంట్రాడేలో రూ.902, రూ.942 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. ఏడాది కాలంలో ఈ షేర్ విలువ 67 శాతం ఎగసింది. -
టెటాన్ లాభం 71% అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం 2017–18 క్యూ4లో 71 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.178 కోట్లు. ఇపుడది రూ.304 కోట్లకు పెరిగినట్లు టైటాన్ ఎమ్డీ భాస్కర్ భట్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.3,693 కోట్ల నుంచి రూ.4,126 కోట్లకు పెరిగిందని వివరించారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3.75 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.102 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.13,453 కోట్ల నుంచి రూ.16,245 కోట్లకు వృద్ధి చెందింది. కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన టాటా సన్స్ నామినీ, నోయల్ టాటాను డైరెక్టర్ల బోర్డ్‌కు వైస్ చైర్మన్‌గా నియమించామని భట్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టైటాన్ షేర్ 1.3% నష్టపోయి రూ.973 వద్ద ముగిసింది. -
టైటన్ లాభాలు 67శాతం జంప్
సాక్షి,ముంబై: టైటాన్ కంపెనీ లిమిటెడ్ లాభాల్లో మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ప్రకటించిన ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా బంగారం వ్యాపారంలో అత్యధిక లాభాలను సాధించి విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ త్రైమాసికంలో నికరలాభం 67.44 శాతం ఎగిసి రూ .277.93 కోట్లను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ .165.98 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. టైటాన్ మొత్తం ఆదాయం 3,517.7 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .2,714.98 కోట్లు ఆర్జించింది. జ్యుయల్లరీ సెగ్మెంట్ లాభాలు మొత్తం ఆదాయంలో 79 శాతం పుంజుకుంది. 37 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 2,748.20 కోట్లను సాధించింది. క్వార్టర్ ప్రారంభంలో కొత్త పిఎంఎల్ఏ నిబంధనల ద్వారా జ్యూయలరీ వ్యాపారాన్ని ప్రభావితం చేసినా పండుగ సీజన్ వ్యాపారానికి ఊపందుకుందని టైటన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ చెప్పారు. ద్వితీయ త్రైమాసికంలో టైటాన్ వాచ్ ల ద్వారా ఆదాయం 8.96 శాతం పెరిగి రూ .571.75 కోట్లకు చేరుకుంది. ఆభరణాల వ్యాపార ఆదాయం 36.90 శాతం పెరిగి రూ .2,748.2 కోట్లకు చేరింది. ఐ వేర్ విభాగంలో వచ్చిన ఆదాయం 3.51 శాతం పెరిగి రూ .98.54 కోట్లకు చేరింది. కాగా శుక్రవారం నాటి మార్కెట్లో టైటాన్ ఇండస్ట్రీస్ షేర్లు 0.56 శాతం పెరిగి రూ .659.40 వద్ద స్థిరపడింది. -
జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్
బంగారంపై జీఎస్టీ పన్ను రేటుపై గతకొంతకాలంగా సాగుతున్న సస్పెన్షన్ కు తెరదించడంతో జువెల్లరీ షేర్లు జిల్ జిగేల్ మంటున్నాయి.. గోల్డ్ , బంగార ఆభరణాలపై 3 శాతం పన్ను వేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో జువెల్లరీ రిటైలర్ షేర్లు సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. జీఎస్టీ బూస్ట్ తో టైటాన్ కంపెనీ, పీసీ జువెల్లరీ, గీతాంజలి జెమ్స్, తారా జువెల్స్ షేర్లు 6 శాతం నుంచి 15 శాతం మధ్యలో ట్రేడవుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన పన్ను రేట్లు తమకు ఆహ్వానించదగినగానే ఉన్నాయని జెమ్స్ అండ్ జువెల్లరీ ఇండస్ట్రీ చెబుతోంది. ప్రస్తుతం జువెల్లరీ ఇండస్ట్రీ 2 నుంచి 2.5 శాతం పన్ను చెల్లిస్తోంది. జీఎస్టీ పన్ను 3 శాతం. ఈ పన్ను రేటుతో జువెల్లరీ, బంగారం ఇండస్ట్రిపై ఎలాంటి ప్రభాముండదని డబ్ల్యూహెచ్పీ డైరెక్టర్ ఆదిత్య పేథె చెప్పారు. ఈ పన్ను రేట్లు అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని సక్రమమైన మార్గంలో ట్రేడ్ నిర్వహించడానికి ప్రోత్సహిస్తాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. బంగారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రోత్సహకరంగా ఉందని, లక్షల మంది పొట్టకూటిగా ఉన్న ఇండస్ట్రిని సుస్థిరంగా ఉంచేలా ఇది దోహదం చేస్తుందని వరల్డ్ గోల్డ్ కైన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరామ్ పీఆర్ చెప్పారు. జువెల్లరీ తయారీదారుల ఇతర షేర్లు పీసీ జువెల్లరీ 8 శాతం జంప్ చేసింది. గీతాంజలి జెమ్స్, టాటా జువెల్స్ షేర్లు కూడా 8 శాతం పైగి ఎగిశాయి. ప్రారంభంలో నిఫ్టీ ఫ్లాట్ గా ఉన్నప్పటికీ, ఈ షేర్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి. -
ప్రీమియం చీరల వ్యాపారంలోకి టైటాన్
తనైరా బ్రాండ్ ఆవిష్కరణ బెంగళూరు: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ తాజాగా ప్రీమియం చీరలు, ఉమెన్ ఎత్నిక్ వేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘తనైరా’ బ్రాండ్ కింద వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు టైటాన్ పేర్కొంది. తొలి తనైరా స్టోర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. ఇందులో చేతితో నేసిన చీరలను, ఎత్నిక్ వేర్ దస్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. స్టోర్‌లోని ప్రొడక్టుల ధర రూ.2.5 లక్షల వరకు ఉంది. ‘హడావిడిగా వ్యాపారాన్ని విస్తరించాలని, పెద్ద సంఖ్యలో స్టోర్లను ఏర్పాటు చేయాలని మేం అనుకోవట్లేదు. 12–15 నెలల తర్వాత భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను వెల్లడిస్తాం’ అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ బిజినెస్ ఇంక్యూబేషన్) అజయ్ హెచ్ చావ్లా తెలిపారు. తాము దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 వరకు చేనేత సంఘాలు, నేత వారు, మధ్యవర్తులు, డిజైనర్లు వంటి వారితో భాగస్వామ్యమై ఉన్నామని పేర్కొన్నారు. వాచ్‌లు, యాక్ససిరీస్‌లు, జువెలరీ, ఐవేర్ వంటి కేటగిరిల్లో టైటాన్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
విశాఖ జగదాంబ జంక్షన్లో అగ్నిప్రమాదం
-
విశాఖలో అగ్నిప్రమాదం
విశాఖపట్నం: విశాఖపట్నంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక జగదాంబ జంక్షన్ లోని టైటాన్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ఉద్యోగులు షోరూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
అంచనాలను బీట్ చేసిన టైటన్
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ బుధవారం భారీగా దూసుకుపోతోంది. కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ఎనలిస్టుల అంచనాలను బీట్ చేయడంతో ఒక దశలో 10 శాతానిపైగా ఎగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ఆకట్టుకోవడంతో ఈ కౌంటర్లో మదుపర్లు కొనుగోళ్ల జోరందుకుంది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం 13 శాతం పెరిగి రూ. 255.75 కోట్లను అధిగమించింది. మొత్తం అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 3926 కోట్లను తాకాయి. టైటాన్ ఈబీఐటీడీఏ లేదా ఆపరేటింగ్ లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 309 కోట్ల పోలిస్తే 21 శాతం ఎగసింది. ఈ ఏడాది రూ. 373 కోట్లగా నమోదుచేసింది. ఇబిటా మార్జిన్లు 9 శాతం నుంచి 9.5 శాతానికి బలపడ్డాయి. అమ్మకాలలో జ్యువెలరీ విభాగం నుంచి 15 శాతం అధికంగా రూ. 3255 కోట్లు లభించగా.. వాచీల బిజినెస్ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకింది. జ్యువెలరీ ఇబిటా 15 శాతం ఎగసి రూ. 334 కోట్లయ్యింది. వాచీల ఇబిటా మరింత అధికంగా 63 శాతం జంప్‌చేసి రూ. 53 కోట్లను తాకింది. మంచి ఫెస్టివల్ సీజన్, పెళ్లిళ్ల సీజన్ ,టైటాన్ రిటైల్ అమ్మకాల వృద్ధికి దోహదపడిందని, లాభాలకు తోడ్పడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిమానిటైజేషన్ తరువాత చాలా బంగారం షాపులు మూతపడడంతో తమకు డిమాండ్ ఏర్పడిందని టైటాన్ కంపెనీ సీఎఫ్‌వో ఎస్ సుబ్రమణ్యం చెప్పారు. దీపావళివ కి గోల్డ్ కాయిన్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు. -
టైటాన్ అతిపెద్ద వాచ్ స్టోర్ హైదరాబాద్‌లో..
• 2017లో 200 కొత్త మోడళ్లు • కంపెనీ సీఈవో రవికాంత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాచీల తయారీ దిగ్గజం టైటాన్ కంపెనీ అతి పెద్ద ఔట్లెట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ఇక్కడి జూబ్లీహిల్స్‌లో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పునరుద్ధరించిన ఈకేంద్రంలో వరల్డ్ ఆఫ్ టైటాన్, హీలియోస్ స్టోర్లను నెలకొల్పారు. టైటాన్‌కు చెందిన ఫాస్ట్‌ట్రాక్, సొనాటా, జూప్, స్కిన్‌తోపాటు రేమండ్ వీల్, మొవాడో, గెస్, ఎంపోరియో అర్మాణీ, ఫాసిల్ వంటి 25 ప్రముఖ విదేశీ బ్రాండ్లుసైతం కొలువుదీరాయి. ఈ ఔట్లెట్లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా వాచీలపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు టైటాన్ కంపెనీ వాచెస్, యాక్సెసరీస్ సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. స్టోర్‌ను ప్రారంభించినఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడళ్ల ధర రూ.1.8 లక్షల దాకా ఉందని వివరించారు. వచ్చే ఏడాదీ 200 మోడళ్లు.. ఇటీవల ప్రవేశపెట్టిన సొనాటా యాక్ట్ సేఫ్టీ వాచ్‌కు మహిళల నుంచి మంచి స్పందన ఉందని రవికాంత్ వెల్లడించారు. మొత్తంగా టైటాన్ ప్రస్తుత సంవత్సరంలో 200 మోడళ్లను ప్రవేశపెట్టింది. 2017లోనూ అదే స్థాయిలోమోడళ్లను పరిచయం చేస్తామని వెల్లడించారు. ఏటా 1.4 కోట్ల యూనిట్ల వాచీలను విక్రయిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వీటిలో అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 10 శాతం దాకా ఉందన్నారు. స్మార్ట్ వాచీలవిభాగంలో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు తెలిపారు. రూ.10 వేలలోపు ధరలో స్మార్ట్ వాచీలు ఆరు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌లో 6–7 శాతం అమ్మకాలుతగ్గాయన్నారు. 50 శాతమున్న కార్డు చెల్లింపులు 75%కి చేరాయని తెలిపారు. -
10వేల లోపు ధరతో స్మార్ట్ వాచీ
-
స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంపై టైటాన్ దృష్టి
త్వరలో మార్కెట్లోకి ఫాస్ట్రాక్, సొనాట బ్రాండ్లలోనూ స్మార్ట్‌వాచ్‌లు! ముంబై: వాచ్‌లు, జువెలరీ తయారీ కంపెనీ ‘టైటాన్’ తాజాగా తన స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే కంపెనీ తన పలు బ్రాండ్లలో స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులోనే సొనాట, ఫాస్ట్రాక్ వంటివి ఉన్నారుు. గత కొన్ని త్రైమాసికాల్లో వాచ్‌ల బిజినెస్‌లో వృద్ధి మందగించడం వల్ల కంపెనీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. టైటాన్ కంపెనీ ఈ ఏడాది జనవరిలో జెక్టస్ ప్రొడక్ట్‌తో స్మార్ట్‌వాచ్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘మంచి లుక్, స్మార్ట్ ఫీచర్లతో జెక్టస్ వాచ్‌లను రూపొందించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. దీని తర్వాత జెక్టస్ ప్రొ స్మార్ట్‌వాచ్‌లను తెచ్చాం. వీటిని ప్రజలు ఆదరించారు’ అని టైటాన్ వాచెస్ సీఈవో రవి కాంత్ తెలిపారు. తాము త్వరలో పలు వాచ్ బ్రాండ్లలో స్మార్ట్‌వాచ్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వీటి ధర రూ.10,000లోపు ఉండేలా చూస్తామన్నారు. కాగా టైటాన్ కంపెనీ తాజాగా అమెరికాకు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ కెన్నెత్ కోలెతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మరింత ఆసక్తిగా టైటాన్‌పై జీవాన్వేషణ
వాషింగ్టన్: విశ్వంలో ఇప్పటివరకూ కనుగొన్న గ్రహాలు, ఉపగ్రహాల్లో అత్యంత ఎక్కువగా భూమిని పోలిన లక్షణాలున్నదిగా శనిగ్రహానికి చెందిన ఉపగ్రహం టైటాన్ ను భావిస్తారు. ద్రవరూప మీథేన్ ప్రవహించిన ఆనవాళ్లు ఉపరితలంలో కలిగి ఉండటం టైటాన్ ప్రత్యేకత. భూమిని పోలిన టైటాన్‌పై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇప్పుడు దానికి మరింత బలం చేకూర్చేలా భూమిపై మాదిరిగానే టైటాన్‌పై అసాధారణంగా మేఘాలు కనిపించాయి. అక్కడి వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ మేఘాలు ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. శనిగ్రహం, దాని ఉపగ్రహాలపై పరిశోధనల కోసం నాసా పంపిన కాసినీ ఆర్బిటర్ ద్వారా టైటాన్‌పై మేఘాలు ఏర్పడటాన్ని గుర్తించారు. టైటాన్ స్ట్రాటో స్పియర్‌లో ఈ మేఘాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే దశాబ్దం క్రితం నాసా ప్రయోగించిన వయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ సైతం టైటాన్‌పై మేఘాలను గుర్తించింది. తాజాగా కనిపించిన మేఘాలు టైటాన్‌పై జీవాన్వేషణలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
టైటాన్ఎక్స్ ఇక టాటా ఆటోకాంప్ వశం!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన వాహన విడిభాగాల కంపెనీ ‘టాటా ఆటోకాంప్ సిస్టమ్స్’ తాజాగా ఇంజిన్ కూలింగ్ సప్లయర్ ‘టైటాన్ఎక్స్’ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. టైటాన్ఎక్స్ కంపెనీ కమర్షియల్ వెహికల్స్‌కు ఇంజిన్ అండ్ పవర్ట్రైన్ కూలింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. దీనికి అమెరికా, యూరప్, చైనా వంటి పలు దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. దీని విక్రయాల విలువ 200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. తమ భవిష్యత్ వృద్ధికి టైటాన్ఎక్స్ కొనుగోలు దోహదపడుతుందని టాటా ఆటోకాంప్ భావిస్తోంది. -
టైటాన్ కొత్త స్మార్ట్‌వాచ్ ‘జక్ట్స్ ప్రో’
హైదరాబాద్: ప్రముఖ వాచీల తయారీ కంపెనీ ‘టైటాన్’ తాజాగా ‘జక్ట్స్ ప్రో’ టచ్‌స్క్రీన్ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.22,995. ఈ వాచ్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 20 ప్రి-లోడెడ్ డిజైన్లతో కూడిన కస్టమైజ్డ్ వాచ్ డయల్, 4 జీబీ మెమరీ, ఎస్ఎంఎస్/ఈ-మెయిల్/వాట్సాప్/కాల్ అలర్ట్స్ నోటిఫికేషన్స్, అలారమ్, ఫిట్నెస్ ట్రాకింగ్, ఫోన్ ఫైండర్, ఫోన్ కెమెరా/మ్యూజిక్ కంట్రోల్, క్లౌడ్ సపోర్ట్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వివరించింది. వినియోగదారులు ఈ వాచ్‌లను టైటాన్ షాపులు సహా ఇతర మల్టీబ్రాండెడ్ ఔట్‌లెట్స్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో పొందొచ్చని తెలిపింది. -
టైటాన్ లాభం రూ.127 కోట్లు
జూన్ త్రైమాసికంలో 16 శాతం డౌన్ న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.127 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.151 కోట్లతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైందని టైటాన్ కంపెనీ తెలిపింది. గత క్యూ1లో రూ.2,587 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 8 శాతం వృద్ధితో రూ.2,783 కోట్లకు పెరిగాయని టైటాన్ ఎండీ భాస్కర్ భట్ చెప్పారు. ఆభరణాల విభాగం ఆదాయం రూ.2,073 కోట్ల నుంచి రూ.2,138 కోట్లకు, వాచ్‌ల విభాగం ఆదాయం రూ.485 కోట్ల నుంచి రూ.492 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. -
క్షీణించిన టైటాన్ లాభాలు
ముంబై: టాటా గ్రూపునకు చెందిన టైటాన్ కో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదల చేసింది. జ్యువెలరీ, వాచీల దిగ్గజం టైటన్ కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 16.34 శాతం గా క్షీణించి రూ. 127 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2015-16) క్యూ1లో రూ.151.45 కోట్ల నికర లాభం ఆర్జించింది. పసిడి ధరలు పెరగడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ వంటి కారణాలతో రూ. 97 కోట్లమేర అనూహ్య నష్టాలు వాటిల్లడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంవత్సరం కొన్ని ప్రతికూల అంశాలు దెబ్బతీసినప్పటికీ, బాటం లైన్ పెర్స్పెక్టివ్ లో మొదటి త్రైమాసికం బావుందని టైటాన్ కో మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ చెప్పారు. అయితే ఆదాయం మాత్రం పుంజుకుంది. నికర అమ్మకాల్లో 7.56 శాతం వృద్ధిని సాధించి రూ. 2,782.5 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 2,586.76 కోట్లుగా ఉంది. జ్యువె ల్లరీ విభాగం ఆదాయం రూ. 2,138.32 కోట్లు కాగా, వాచెస్ విభాగంలో రూ. 491.72 కోట్లు ఆర్జించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 32 శాతం ఎగసి రూ. 292 కోట్లుగా నమోదైంది. కాగా జీఎస్టీ బిల్లుపై అంచనాలనేపథ్యంలో బుధవారం ఈ షేర్ పతనమైంది. ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈలో టైటన్ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 411 దగ్గర ముగిసింది. -
శని ఉపగ్రహంపై జీవం?
లాస్ఏంజెలెస్: భూమిపై జీవం ఏర్పడటానికి కారణం ద్రవరూపంలోని నీరే. కానీ శనిగ్రహపు అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పై నీటి ఛాయలున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్కడి వాతావరణంలో హైడ్రోజన్ సైనేడ్ ఉన్నట్లు వీరు కనుగొన్నారు. ఈ రసాయన రూపాన్ని పాలీమైన్ అంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రూపొందించిన కాసినీ, హ్యూజెన్స్ మిషన్లు పంపిన సమాచారం ఆధారంగా వీరు ఈ విషయాన్ని నిర్ధారించారు. టైటాన్పైనున్న చల్లటి వాతావారణం కారణంగా పాలీమైన్ సూర్యుని శక్తిని సంగ్రహించి జీవ పరిణామానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మన భూమిపై పూర్వం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని వారు చెబుతున్నారు. కానీ టైటాన్ వాతావరణం మనకు పూర్తి విభిన్నమైనదని వారంటున్నారు. టైటాన్‌పై కూడా సరస్సులు, నదులు, సముద్రాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే దీనిపై ఇంకా లోతుగా పరిశోధన చేసి మరిన్ని విషయాలు కనుగొంటామని వారంటున్నారు. -
‘టైటాన్’పై మంచు మేఘాలు
లండన్ : శని గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పై భారీస్థాయిలో మంచు మేఘాలు ఉన్నట్లు ‘నాసా’ ప్రకటించింది. టైటాన్ స్ట్రాటో ఆవరణం దిగువ మధ్యభాగంలో ఇవి ఉన్నట్లు కేసినీ వ్యోమనౌక గుర్తించింది. టైటాన్ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఇవి ఉన్నట్లు నాసా తెలిపింది. భూమిపై ఉన్న పొగమంచు మాదిరిగా ఈ మేఘాలు అత్యల్ప సాంద్రతను కలిగి ఉన్నాయి. కాని పైభాగం మాత్రం చదునుగా ఉంది. ఇవి భూమిపై వర్షాన్నిచ్చే మేఘాల మాదిరిగా ఏర్పడవు. వెచ్చని అర్థగోళంలోని వాతావరణం నుంచి వేడి వాయువులు దక్షిణార్థగోళంలోని చల్లని ప్రాంతానికి ప్రసరిస్తాయి. -
పెళ్లా? తొందరేంటి!
పదిహేనేళ్ల క్రితం అమెరికాలో ఈ ధోరణి మీద ఏకంగా సినిమాయే వచ్చింది, జూలియా రాబర్ట్స్ నటించిన రనవే బ్రైడ్. పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లిరోజు పారిపోతుంది. పెళ్లంటే అంత కన్ఫ్యూజన్ హీరోయిన్‌కి. ఇప్పుడు మనమ్మాయిలు కూడా, ‘పెళ్లిలో ఏముంది.. స్వేచ్ఛను పోగొట్టుకోవడమూ, టెన్షనూ తప్ప’ అని పెళ్లిని ఆమడదూరంలో ఉంచుతున్నారు. షి హాజ్ మూవ్డ్ ఫార్ అహెడ్. ఒకప్పుడు అమ్మాయి సెటిల్ అవడం అంటే ఒక అయ్య చేతిలో పడడం. ఇవాళ అమ్మాయి సెటిల్ అవడం అంటే కెరీర్లో మగవాడికి దీటుగా లేదా బెటర్‌గా నిలవడం. అలాంటప్పుడు పెళ్లికి వాటిజ్ ద హర్రీ అనుకుంటున్న అమ్మాయిలకు ఇది క్లారిటీయా... కన్ఫ్యూజనా తెలుసుకుందామని... ‘వెన్ ఈజ్ ది రైట్ టైమ్ టు గెట్ మ్యారీడ్?’ అంటూ కొత్త ప్రశ్నను లేవదీసింది ‘టైటాన్ రాగా’ వాచ్ యాడ్ ! ‘ఫ్రెండ్స్‌కి పెళ్లి అయిపోయిందని, చుట్టపక్కాలు అడుగుతున్నారని, వాలంటైన్స్‌డే రోజు ఒంటరిగా గడపాల్సి వస్తుందని, చెల్లెలు పెళ్లికి లైన్లో ఉందని, మాతృత్వపు ఘడియలు మించిపోతున్నాయని... పెళ్లి చేసుకోకు... యు ఫైండ్ ఎ మ్యాన్ హూ డిజర్వ్స్ యువర్ టైమ్... అప్పుడే పెళ్లి చేసుకో’ అంటూ కత్రినాకైఫ్‌తో చెప్పించింది. టైటాన్ లాంటి కంపెనీ, కత్రినా కైఫ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకొని ఈ యాడ్‌ని తయారుచేసిందంటే అంత ఆషామాషీ వ్యవహారం అయ్యుండదు. ఎందుకంటే పెద్ద కంపెనీలు యాడ్ చేసేముందు మార్కెట్ రీసెర్చ్‌ను నిర్వహిస్తాయి. అంటే పెళ్లికి కరెక్ట్ టైమ్ ఏదీ అని చెప్పించే ముందు టైటాన్ కూడా అలాంటి రీసెర్చ్‌ను చేసే ఉంటుంది. అంటే టైటాన్ రాగా యాడ్‌లో కత్రినా చెప్పిన అభిప్రాయం టైటాన్ కంపెనీ చేసిన మార్కెట్ రీసెర్చ్‌కి అద్దం. ‘పెళ్లి బంధంలో ఉన్న అమ్మానాన్నలు హ్యాపీగా ఉన్నారా? తనకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వాళ్లకున్నాయా? పెళ్లి వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నప్పుడు మూడుముళ్ల కోసం తొందరపడ్డమెందుకు? మనసును అర్థం చేసుకున్న వాడు దొరికే దాకా ఆగుదాం’.. అనుకుంటున్న అమ్మాయిల భావమే ఆ యాడ్ అయి ఉండొచ్చు! ఈ నేపథ్యంలో అమ్మాయి పెళ్లికి ఏది సరైన సమయం అంటూ సాక్షి ఫ్యామిలీ కొందరిని అడిగింది.. వాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలివి... - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి తొందరపాటు తగదు ఏ విషయంలో తొందరపడినా సరిదిద్దుకోవచ్చేమోగానీ పెళ్లి విషయంలో తొందరపడితే మాత్రం సరిదిద్దుకోలేం. భర్త చెడు అలవాట్లు ఉన్నవాడు కావొచ్చు. ‘గే’గా రుజువు కావొచ్చు. కట్నం కోసం వేధించేవాడు కావొచ్చు. కాబట్టి మనసుకు నచ్చగానే పెళ్లి చేసేసుకోకూడదు. ఆ వ్యక్తి తగినవాడేనా అని బాగా ఆలోచించాలి. ఆ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చిన టైమే పెళ్లికి రైట్ టైమ్. - జయసుధ, నటి రూలేం లేదు పెళ్లనేది వయసుతో కాదు మనసుతో ముడి పడినదని నా ఫీలింగ్. ఫలానా వయసులోనే పెళ్లాడాలని రూలేం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు తారసపడితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ 18ఏళ్ల వయసులోనే మంచి జీవిత భాగస్వామి దొరికితే చేసుకోవచ్చు. 70 ఏళ్ల తర్వాత దొరికినా చేసుకోవచ్చు. నా మటుకు నాకు రైట్ పర్సన్ దొరికినప్పుడే పెళ్లికి రైట్ టైమ్. - దీక్షా సేథ్, నటి ఏళ్లు వచ్చాయని పెళ్లి చేసేసుకోవాలా? పెళ్లనేది అంత సులభంగా తీసుకొనే నిర్ణయం కాదు. పదేళ్లుగా సినీ రంగంలో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ఇక్కడ నుంచి మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతా. ఈ పరిస్థితుల్లో ప్రేమ, పెళ్లి అంటూ ఇప్పటికిప్పుడు దీన్ని వదులుకోదల్చుకోలేదు. - కంగనా రనౌత్, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘క్వీన్’ చిత్రాల హీరోయిన్ అప్పుడు పిల్లల్ని కనొద్దు అబ్బాయి కన్నా అమ్మాయి త్వరగా పరిణతి చెందుతుంది. కాబట్టి డిగ్రీ లేదా పీజీ అవగానే అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయ్యాలి. లేట్ అయితే అనారోగ్యంగా ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ ఉద్యోగం చేస్తూ పదేళ్లు ఎంజాయ్ చేశాకే పెళ్లి అనుకుంటే మాత్రం పిల్లల్ని కనకూడదు. సరికదా, అసలు పెళ్లి జోలికి వెళ్లకపోవడమే మంచిది. - స్వాతి సోమనాథ్, నృత్యకళాకారిణి నిర్ణయించుకునే శక్తి ఉండాలి తన జీవితానికి సంబంధించి తనే నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి అమ్మాయికి ఉన్నప్పుడే పెళ్లీడు వచ్చినట్టు. ఈ స్వయం నిర్ణయాధికారం ఎప్పుడు ఉంటుంది? ఆమె ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయినప్పుడే కదా! - సి. వనజ, సీనియర్ జర్నలిస్ట్ పద్దెనిమిదే కరెక్ట్ నాకు 32 ఏళ్లు. వాళ్ల కన్నా నా శాలరీ తక్కువని, నేను పనిచేసే కంపెనీ చిన్నదని.. ఇలాంటి సిల్లీ రీజన్స్‌తో అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేశారు. ఈ ఎక్స్‌పీరియెన్స్ నాకో సత్యాన్ని తెలిపింది. అమ్మాయిలను ప్రొఫెషనల్ డిగ్రీస్ చదివించకూడదు. ఇదివరకటిలాగే పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేయ్యాలి. ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ గర్ల్స్. - ఎన్. అరవింద్, సాఫ్ట్వేర్ ఉద్యోగి మనసుకు నచ్చినప్పుడే... పెళ్లికి ఫలానా ఏజ్ అనేది ప్రాతిపదిక కాదు. అలాగే తల్లి కావడానికి బయోలాజికల్ క్లాక్నూనేను విశ్వసించను. ఈ రెండిటి ప్రాతిపదికగా పెళ్లి చేసుకొని తర్వాత నేనెందుకు ఈ పనిచేశానని బాధపడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి వ్యక్తిని కలిసినప్పుడు.. ఈ వ్యక్తితో జీవితం పంచుకుంటే బాగుండు అని అనిపించినప్పుడే పెళ్లి వయసు వచ్చినట్టు. - ఉమా సుధీర్, ఎన్డీటీవీ కరెస్పాండెంట్ మెచ్యూరిటీ వచ్చాకే... మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధమున్న అంశం కాదు.. రెండు కుటుంబాలతోనూ ముడిపడ్డ తంతు. కాబట్టి ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఆడపిల్లకి ఆ ఆడపిల్ల.. ఏ జంటకు ఆ జంట యూనిక్. దీన్నర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్ అంటాన్నేను. - మాధవీలత గంజి, ఫ్యామిలీ కౌన్సెలర్, సోషల్ యాక్టివిస్ట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్.. ఈ రెండూ అమ్మాయికి తప్పనిసరి. వీటితో పాటు ఫిజికల్‌గా, మెంటల్‌గా మెచ్యురిటీ రావాలి. లైఫ్‌లో సెటిల్ అయ్యాను.. జీవితాన్ని పంచుకోవడానికి ఓ తోడు కావాలని అమ్మాయికి అనిపించినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్. ఆ తోడును సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా అమ్మాయికే ఉండాలి. - బిందు నాయుడు, టీవీ సీరియల్ రచయిత్రి సపోర్ట్ చేస్తా... నేనైతే టైటాన్ రాగా యాడ్‌లోని కత్రినా ఒపీనియన్‌ని సపోర్ట్ చేస్తా. నేను రెండేళ్లుగా గూగుల్‌లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే లైఫ్ అంటే తెలుస్తోంది. ఆస్వాదిస్తున్నాను. ఇంకో టూ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నా. నా పెళ్లికి అదే రైట్ టైమ్. అయితే పెళ్లి కొడుకును వెదికే బాధ్యత పేరెంట్స్‌దే. వాళ్లు చూసిన సంబంధాల్లో నాకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటా! - సుధా సురక్షిత రాణి, సాఫ్ట్వేర్ -
టైటాన్ వాచ్ షోరూంలో భారీ చోరీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ రోడ్డులో టైటాన్ వాచ్ షోరూంలో సోమవారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ. 15లక్షల విలువైన వాచీలు, లక్ష రూపాయల నగదు అపహరణ జరిగినట్టు పోలీసులు తెలిపారు. టైటాన్ వాచ్ షోరూం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
రోజూ రూ.8 కోట్లు జేబులోకి...
ముంబై: బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రోజూ రూ.8.40 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికిపైగా ఆయన అలా సంపాదిస్తూనే ఉన్నారు. షేర్ మార్కెట్లో బుల్ రన్‌తో ఆయన ఆదాయం కూడా పెరిగిపోతూ ఉంది. ఆయన కుటుంబ సభ్యుల పోర్ట్‌ఫోలియో విలువ ఏడువేల కోట్ల రూపాయలు మించిపోయిందని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసింది. 2008లో ముగిసిన బుల్ రన్లో ఝున్‌ఝున్‌వాలా బిలియనీర్ (బిలియన్ = 100 కోట్లు) అయ్యారు. తర్వాత మార్కెట్ల పతనం ప్రభావం అందరితోపాటే ఝున్ఝున్వాలాపైనా పడింది. 2009 మార్చి నాటికి ఝున్‌ఝున్‌వాలా వద్ద ఉన్న మొత్తం షేర్ల విలువ రూ.1,130 కోట్లకు క్షీణించింది. 2007 డిసెంబర్ నాటి విలువ రూ.3,461 కోట్లతో పోలిస్తే ఇది మూడోవంతే. అయితేనేం, ప్రస్తుత బుల్ రన్‌తో ఆయన ఆస్తులు దినదిన ప్రవర్థమానం అవుతున్నాయి. గతేడాదిలో పరిశీలిస్తే... ఆయన నెట్‌వర్త్ వారానికి రూ.59 కోట్లు, నెలకు రూ.256 కోట్ల చొప్పున పెరిగింది. జూన్ చివరి నాటికి ఝున్‌ఝున్‌వాలా, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం నెట్‌వర్త్ రూ.7,261 కోట్లు. ఏడాది క్రితం ఇది కేవలం రూ.4,192 కోట్లు మాత్రమే. దేశీయ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన 5,463 కంపెనీల్లో దాదాపు 96% కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్తే అధికం. (ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఒక శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న కంపెనీల్లోని హోల్డింగ్స్ ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించాం.) ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, ర్యాలీస్ ఇండియా, అరబిందో ఫార్మా, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఫెడరల్ బ్యాంక్ వంటి కంపెనీల ఈక్విటీల ధర గత నెలలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఈ కంపెనీలన్నిటిలోనూ ఒక్కోదాంట్లో రూ.100 కోట్లకు మించిన విలువైన షేర్లు ఈ కుటుంబం వద్ద ఉన్నాయి. ఝున్‌ఝున్‌వాలా కుటుంబ నెట్‌వర్త్ కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ప్రముఖ కంపెనీల్లో ఇండియన్ హోటల్స్ (మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,041 కోట్లు), ముత్తూట్ ఫైనాన్స్ (రూ.7,028 కోట్లు), యూనిటెక్ (రూ.6,837 కోట్లు), సుజ్లాన్ ఎనర్జీ (రూ.6,254 కోట్లు), డిష్ టీవీ ఇండియా (రూ.6,171 కోట్లు) ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, ఫెడరల్ బ్యాంక్, ఈడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రకాశ్ ఇండస్ట్రీస్, పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఓరియంట్ సిమెంట్, మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ వంటి కంపెనీలు ఆయన పోర్ట్‌ఫోలియోలో చేరాయి. జూన్ క్వార్టర్‌లోనే ఆయన ఎంసీఎక్స్‌లో 1.45 వాటాను ఓపెన్ మార్కెట్లో కొన్నారు. తర్వాత ఒక్కో ఈక్విటీ రూ.664 ధరకు ఎంసీఎక్స్‌లో 1.96 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ఈ స్టాకు రూ.824 వద్ద క్లోజైంది. టైటాన్, ల్యుపిన్, క్రిసిల్, కరూర్ వైశ్యాబ్యాంక్, ఎ టూ జడ్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీల్లో హోల్డింగ్‌ను ఝున్‌ఝున్‌వాలా ఇటీవల తగ్గించుకున్నారు. కంపెనీల షేర్లే కాదు, ముంబైలో రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఆయన కొన్నారని సమాచారం. అంతేనా, కోట్ల విలువైన అనేక రేసు గుర్రాలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. -
టాటా గోల్డ్‌ప్లస్ ‘ఇప్పుడు ప్లస్, ఎప్పుడూ ప్లస్’
హైదరాబాద్: టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్ కంపెనీ జ్యూయలరీ బ్రాండ్ గోల్డ్‌ప్లస్ ‘ఇప్పుడు ప్లస్ ఎప్పుడూ ప్లస్’ పేరుతో వినూత్నమైన వాగ్దానాన్ని వినియోగదారులకు అందిస్తోంది. అత్యుత్తమ ధరలో స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను ఈ బ్రాండు ద్వారా ఆఫర్ చేస్తున్నామని టైటాన్ కంపెనీ సీఈవో(ఆభరణాల విభాగం) సి.కె. వెంకటరామన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ప్లస్, ఎప్పుడూ ప్లస్‌లో భాగంగా మంచి డిజైన్లను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని, అత్యుత్తమ మార్పిడి విలువను పొందవచ్చని, ఆభరణాలకు 100 శాతం తిరిగి కొనుగోలు ధర ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని వివరిస్తూ కొత్తగా మూడు టీవీ ప్రచార చిత్రాలను రూపొందించామని, వీటికి ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు సాహిత్యాన్ని అందించారని వివరించారు. -
పబ్లిక్ ఫిగర్ల ప్రభావం తక్కువే!
సర్వే అధునాతన టెక్నాలజీతో అందివచ్చిన సదుపాయాలను ఆస్వాదిస్తున్న తొలితరం నాడిని పట్టడానికి ప్రయత్నించింది ‘టైటాన్’ సంస్థ. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ సహా వివిధ రకాల వస్తువుల, సేవల విషయంలో 21 యేళ్ల నుంచి 35 యేళ్ల మధ్య వయసున్న వాళ్ల అభిప్రాయాలను, వారు ప్రభావితం అవుతున్న అంశాల గురించి తెలుసుకోవడానికి ఆ సంస్థ ప్రయత్నించింది. ఈ మేరకు ‘ది మిల్లెన్నియల్ పారడాక్స్ వేవ్’ పేరిట ఒక సర్వేను విడుదల చేసింది టైటాన్ కంపెనీ. ఆ సర్వే వివరాలు... వాడే స్మార్ట్‌ఫోన్స్ విషయంలోనైనా, ఇతర గ్యాడ్జెట్ల విషయంలో తమ అభిమాన హీరోల, ఇతర పబ్లిక్ ఫిగర్ల చేత తాము ప్రభావితం కావడం లేదని 69 శాతం మంది చెబుతున్నారు! అయితే యువతులపై మాత్రం బ్రాండ్ అంబాసిడర్లుగా వచ్చే సినీ తారల ప్రభావం ఎక్కువగా ఉంది. అన్ని వయసుల వారినీ పరిగణనలోకి తీసుకొంటే 80 శాతం మంది తమ వ్యక్తిగత విషయాలను సోషల్ నెట్వర్కింగ్ ద్వారా షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే యువతులు మాత్రం ఆ సంగతుల్ని సోషల్ నెట్‌వర్క్‌లో పంచుకుంటున్నారు. దాదాపు 67 శాతం మంది తమ వ్యక్తిగత విషయాలను సోషల్ సైట్ల ద్వారా షేర్ చేసుకొంటున్నట్లు సర్వేలో తేలింది. అయితే, గమ్మత్తేమిటంటే, నెట్వర్కింగ్ సైట్లలో ఖాతా ఉన్నప్పటికీ 41 శాతం మంది మహిళలు తమ వృత్తిగత సమాచారాన్ని మాత్రం పంచుకోవడం లేదు. -
‘పది’ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెంది.. పదో తరగతి ఫలితాల్లో పదికి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఘనంగా సత్కరించారు. ‘ఉత్తమ ప్రతిభకు అభినందనలు’ నామకరణంతో శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. 10 పాయింట్లు సాధించిన 32 మందికి ప్రశంసాపత్రం, రూ.2,500 నగదు, టైటాన్ రిస్ట్ వాచ్‌లను బహూకరించారు. అలాగే శత శాతం ఫలితాలు సాధించిన 89 పాఠశాలలకు విజయం పాఠశాలల కింద విజయం పతాకం, షీల్డ్‌లను అందజేశారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను పర్యవేక్షిస్తున్న 13 మంది ఎంఈవోలకు ప్రశంసాపత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను విజయపథంలో ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది జిల్లా 91.68 శాతం ఫలితాలు సాధించడానికి అందరి సమిష్టి కృషే కారణమన్నారు. నూరు శాతం ఫలితాలు సాధించడానికి ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఎంతో శ్రమకు ఓర్చి ఉంటారన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, దేశానికి నిర్మాతలను తయారు చేసి అందిస్తున్నారన్నారు. రేపటి సమాజానికి పునాదులు వేస్తున్నారన్నారు. జిల్లాలో విద్యా వ్యవస్థకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ జిల్లాలో ఏర్పాటు చేశామని, తద్వారా పిల్లల పర్యవేక్షణ జరిగిందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో జిల్లా మంచి ఫలితాలు సాధించాలని ఆకాక్షించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో బాలికలదే పైచేయిగా ఉందన్నారు. సివిల్ సర్వీస్‌లు, బ్యాంకు పరీక్షలు వంటి వాటిలో బాలికలు కనీసం 40 శాతం మంది ఉంటున్నారన్నారు. గత ఏడాది సంస్కారం కార్యక్రమం ద్వారా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. జేసీ జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మంచి స్థానాలను అందుకొనడంలో తగిన తర్ఫీదును అందజేయాలన్నారు. డీఈవో ఎస్.అరుణకుమారి మాట్లాడుతూ ఈ ఏడాది 91.68 శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలో 9వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.అచ్యుతానంద గుప్తా మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఈ ఏడాది 94.78 శాతం ఫలితాలు సాధించామన్నారు. సమావేశంలో ఏజేసీ ఎం.డి.హషీమ్షరీఫ్, జీడ్పీ సీఈవో వి.నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.లాలాలజపతిరాయ్, ఆర్వీం అధికారి ఆర్.గణపతిరావు, విజయం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రశంసలందుకున్న పాఠశాలలు... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదమల్లి, అవలంగి, బులుమూరు, మాతల, పూసాం, కొమ్మువలస, రావిచంద్రి, ఎం.సింగుపురం, రొంపివలస, జి.సిగడాం, రాజాం, లింగాలవలస, కాగితాపల్లి, మండాకురిటి, వాల్తేరు, బొడ్డూరు, సిరిపురం, యు.కె.గుమ్మడ, కోణంగిపాడు, నీలానగరం, నర్సిపురం, వీరఘట్టం, కె.కవిటి, సతివాడ, కరవంజ, యలమంచిలి, లింగాలవలస, అచ్యుతాపురం, టి.లింగాలపాడు, బాదాం, వెదుళ్లవలస, అంపలాం, తోలాపి, తాడివలస, తెప్పలవలస, గొర్లెపేట, కిల్లిపాలెం, నవనంపాడు, కె.కొజ్జీరియా, తురగలకోట, పెదబాణాపురం, రౌతుపురం, మర్రిపాడు, కొల్లిపాడు, లింగావలస, తలగాం, మెట్టూరు, వజ్రపుకొత్తూరు, గరుడభద్ర కేజీబీవీలు... భామిని, బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్.పేట, రాజాం, సారవకోట, తురాయిపువలస, వంగర, ఆమదాలవలస, జలుమూరు, కోటబొమ్మాళి, మురపాక, లావేరు, పొందూరు, రణస్థలం, మెళియాపుట్టి, ఇచ్చాపురం, బోరువంక, నందిగాం, బోరుభద్ర, సోంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలు... లబ్బ, ఓండ్రుజోల, శంభాం, పూతికవలస, చినబగ్గ, మల్లి-2, హడ్డుబంగి, దోనుబాయి, గంగంపేట, పట్టులోగాం, బందపల్లి, పెద్దమడి, పెద్ద లక్ష్మీపురం, జయపురం, భీమ్‌పురం, సీతంపేట-2 అవార్డులు పొందిన విద్యార్థులు వీరే... దారపు అప్పలరెడ్డి (జి.సిగడాం), కోన అసిరిరెడ్డి(జి.సిగడాం), తెప్పల ఉష(వజ్రపుకొత్తూరు), వెలుగు జోగమ్మ(టెక్కలి), జి.వి.వి.ఎస్.ఆర్.ఎల్.ప్రసాద్(రాగోలు), కలిశెట్టి వనిత(సారవకోట), పాగోటి రేణుక(సారవకోట), కరిమెల్లి సుకన్య(సారవకోట), చవికి సాయికృష్ణ(జి.సిగడాం), కోల దివ్య(హిరమండలం), వి.డింపుల్(ఇచ్చాపురం), పి.శంకర్(ఇచ్చాపురం), ప్రగడ ఉదయభాస్కర్(జలుమూరు), అంధవరపు శ్యామసుందర్(జలుమూరు), తొగరాపు నాగభూషణరావు(జలుమూరు), చల్లా సత్యనారాయణ(జలుమూరు), గార రామలక్ష్మి(సంతకవిటి), బలగ నరేంద్ర(పాతపట్నం), గొల్లపల్లి రేణుక(పలాస), మజ్జి సౌజన్య(పాలకొండ), గొట్టా చరణ్‌కుమార్(నరసన్నపేట), అన్నెపు కవిత(నందిగాం), ఎం.శేషగిరి(నందిగాం), ఆర్.కృష్ణవేణి (మెళియాపుట్టి), శిర్లా బేబీ ప్రసాద్(మందస), లోపింటి భీమశంకర్(మందస), శిల్పాపాండ్యన్(మందస), ఎస్.మహేష్(కొత్తూరు), బొండాడ ఊర్వశి(కంచిలి), కప్ప సంతోషి(కంచిలి), తుంగాన అశ్విని(కవిటి), సి.హెచ్.స్వాతి(కవిటి). -
టైటాన్ వాచెస్ మహిళా ఉద్యోగుల రికార్డుల పంట
సిప్కాట్ (తమిళనాడు), న్యూస్‌లైన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని హోసూరులో ఉన్న టైటాన్ వాచెస్ కంపెనీ మహిళా ఉద్యోగులు గిన్నిస్ రికార్డుల పంట పండించారు. 12 విభాగాల్లో కొత్త రికార్డులను సృష్టించారు. ప్రపంచంలో ఎక్కువ మంది మహిళలు ఒకేచోట చేరి బెలూన్లలో గాలి నింపడం, 382 మంది మహిళలు ఒకే చోట చేరి మదర్ థెరిస్సా రూపుతో ఉన్న మాస్కులను ధరించడం, అందరూ ఒకే సారి ఈల వేయడం, పేపర్ టీ కప్పులు నుదుటిపై పెట్టుకోవడం, ఒకే వ్యక్తికి ఏకకాలంలో ఎంతో మంది ఉత్తరాలు రాయడం వంటి అంశాల్లో రికార్డులను నమోదు చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నిర్వాహకులు శాంటిగర్యాంగ్, ఫ్రాన్సిస్ విలియమ్ వీటిని పర్యవేక్షించారు. -
టైటాన్.. ‘కారీగర్’ కేంద్రాలు
దేశంలోనే తొలిసారిగా ఇన్‌హౌస్ ఆభరణాల తయారీ మెరుగైన సౌకర్యాలతో స్వర్ణకారులకు రెట్టింపు ఆదాయం త్వరలోనే ఆభరణాల తయారీపై శిక్షణా కేంద్రం హోసూరు నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి దేశీయ బంగారు ఆభరణాల తయారీ రంగంలో టాటా గ్రూపునకు చెందిన టైటాన్ సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలోనే తొలిసారిగా స్వర్ణకారుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాలుగు ఆభరణాల తయారీ కేంద్రాలను (కారీగర్ సెంటర్స్) ఏర్పాటు చేసింది. సుమారు రూ.22 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను సంస్థ డెరైక్టర్ డాక్టర్ సి.జి.కె.నాయర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆభరణాల వినియోగంలో ఇండియా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో చాలా వెనుకబడి ఉందని, ఈ కేంద్రాల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాలు తయారై ఎగుమతులు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ఆదాయాన్ని పెంచే ఇటువంటి కేంద్రాలు ఇతర జ్యుయెలరీ సంస్థలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టైటాన్ మేనేజింగ్ డెరైక్టర్ భట్ మాట్లాడుతూ గత పదేళ్లలో తనిష్క్ వినియోగదారుల్లో సంతోషాన్ని చూశాం కానీ, దానికి కారణమైన స్వర్ణకారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. స్వర్ణకారుల ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్న తమ పదేళ్ల కల ఇప్పటికి నిజమయ్యిందన్నారు. సుమారు పదేళ్ల క్రితం కారీగర్ పార్క్‌తో ప్రారంభించి ఇప్పుడు కారీగర్ కేంద్రాల స్థాయికి వచ్చామన్నారు. త్వరలోనే కోల్‌కతాలో మరో రెండు కారీగర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మరింత నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని భట్ తెలియజేశారు. రెట్టింపైన ఆదాయాలు: తమ కారీగర్ సెంటర్స్‌తో స్వర్ణకారులు ఎక్కువ ఆభరణాలను తయారు చేయడం ద్వారా అధికాదాయాన్ని పొందుతున్నట్లు టైటాన్ సీఈవో(జ్యుయెలరీ విభాగం) సి.కె.వెంకటరామన్ తెలిపారు. సాధారణంగా ఒక స్వర్ణకారుడు నెల రోజుల్లో 500- 600 గ్రాముల ఆభరణాలను తయారు చేస్తాడని, కానీ ఈ అధునాతన సౌకర్యాల వల్ల నెలకు 1,500 గ్రాముల వరకు తయారు చేయగలుగుతున్నారని తెలిపారు. త్వరలోనే దీన్ని 3 కిలోలకు (3వేల గ్రాములు) తీసుకెళ్ళాలన్నది టైటాన్ లక్ష్యమని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈ నాలుగు కారీగర్ సెంటర్స్‌లో 300 మంది స్వర్ణకారులు పనిచేస్తున్నారు.