న్యూఢిల్లీ: ప్రపంచంలో విలాసవంతమైన టాప్–100 బ్రాండ్లలో భారత్ నుంచి ఐదింటికి చోటు లభించింది. టైటాన్ మూడు స్థానాలు పైకి ఎగిసి 22వ ర్యాంకులోకి వచ్చింది. అంతేకాదు అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి 20 లగ్జరీ ఉత్పత్తుల కంపెనీల్లోనూ చోటు సంపాదించుకుంది.
జెమ్స్ అండ్ జ్యుయల్లరీ
టాప్–100 విలాసవంత ఉత్పత్తుల్లో భారత్ నుంచి కల్యాణ్ జ్యుయలర్స్, జోయలుక్కాస్, పీసీ జ్యుయలర్స్, త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరీ ఉన్నాయి. ఇవన్నీ జ్యుయలరీ కంపెనీలే కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి ధోరణి గతేడాది మాదిరే ఉందని, జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం తాజా ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించినట్టు.. ఈ నివేదికను రూపొందించిన డెలాయిట్ తెలిపింది.
తొలిసారి త్రిభువన్‌దాస్..
టాప్ –100 లగ్జరీ ఉత్పత్తుల జాబితాలోకి త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జవేరి తొలిసారిగా చోటు సంపాదించుకుంది. టాప్–10 బ్రాండ్లు యూరోప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతం (ఈఎంఈఏ) నుంచే ఉన్నాయి. టాప్–100లో 80కు పైగా కంపెనీల విక్రయాలు 2019–20లో (2020వ సంవత్సరం) తక్కువగా ఉన్నాయని.. కరోనా ప్రబావం వీటిపై పడినట్టు డెలాయిట్ తెలిపింది. అయినప్పటికీ సగానికి పైగా కంపెనీలు లాభాలను నమోదు చేశాయని పేర్కొంది.
చదవండి: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్! నెక్ట్స్ ఏం జరగబోతుంది?
Comments
Please login to add a commentAdd a comment