luxury brands
-
వరల్డ్ ఫేమస్ లగ్జరీ బ్రాండ్‌ను తీసుకొచ్చిన రిలయన్స్
రిలయన్స్ రిటైల్‌కు చెందిన సౌందర్య ఉత్పత్తుల వేదిక ‘తీరా’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అగస్టినస్ బాడర్ కలెక్షన్ ప్రత్యేకంగా తీరా ఆన్‌లైన్‌తోపాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరులోని ఎంపిక చేసిన తీరా స్టోర్లలో అందుబాటులో ఉందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.దేశంలో తీరా స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఈ అగస్టినస్ బాడర్ బ్రాండ్‌ను ప్రపంచ ప్రఖ్యాత స్టెమ్ సెల్, బయోమెడికల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అగస్టినస్ బాడర్ స్థాపించారు. ఈ బ్రాండ్ ఉత్పత్తులతోపాటు వ్యక్తిగత స్కిన్‌కేర్ అవసరాలకు ఏ ఉత్పత్తులను ఎంచుకోవాలన్నదానిపై కస్టమర్లకు ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.యూరోమానిటర్ ఎస్టిమేట్స్ ప్రకారం.. భారతదేశ బ్యూటీ మార్కెట్ 2025 నాటికి 20 బిలియన్ డాలర్లకు పెరగనుంది. అందులోనూ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ 15% వృద్ధి చెందనుంది. దేశంలో స్కిన్‌కేర్ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2022లో 6.53 బిలియన్ డాలర్లు. ఇది 2027 నాటికి 8.84 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ డేటా చెబుతోంది.బ్యూటీ మార్కెట్ వృద్ధి నేపథ్యంలో నైకా, టాటా క్లిక్ ప్యాలెట్, మింత్రా వంటి సంస్థలతో రిలయన్స్ రిటైల్ కంపెనీ తీరా పోటీ పడుతోంది. ఆన్‌లైన్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ డజను ఆఫ్‌లైన్ స్టోర్లను కూడా తీరా ప్రారంభించింది. -
ఉన్నట్టుండి సీఈవోను తొలగించిన లగ్జరీ బ్రాండ్
ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బుర్బెర్రీ ఉన్నట్టుండి తమ సీఈవోను మార్చేసింది. బోర్డ్ పరస్పర అంగీకారంతో సీఈవో జొనాథన్ అకెరాయిడ్ తక్షణం పదవి నుంచి వైదొలగుతున్నారని, కంపెనీని వీడుతున్నారని కంపెనీ తాజాగా ప్రకటించింది.అకెరాయిడ్ స్థానంలో మైఖేల్ కోర్స్ మాజీ బాస్ జాషువా షుల్మాన్ను దాని కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బుర్బెర్రీ నియమించింది. అమ్మకాలు క్షీణించడంతో నష్టాలు తప్పవన్న సంకేతాలతో డివిడెండ్‌ను రద్దు చేసిన కంపెనీ.. సీఈవో జొనాథన్ అకెరాయిడ్పైనా వేటు వేసింది.లగ్జరీ సెక్టార్లో మందగమనం ప్రత్యర్థి బ్రాండ్ల కంటే బుర్బెర్రీని తీవ్రంగా దెబ్బతీసింది. 168 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్రిటిష్ కంపెనీలో ఏకంగా సీఈవో మార్పునకు దారితీసింది. జూన్ 29 వరకు 13 వారాలలో బుర్బెర్రీ అమ్మకాలు 21% క్షీణించాయి. ప్రస్తుత ట్రెండ్స్ వార్షిక లాభాల అంచనాలను దెబ్బతీసిన నేపథ్యంలో వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం డివిడెండ్‌ను కంపెనీ రద్దు చేసింది.షుల్మాన్ 2021-2022 వరకు యూఎస్ బ్రాండ్ మైఖేల్ కోర్స్‌కు సీఈవోగా పనిచేశారు. అంతకుముందు కోచ్ కంపెనీకి బ్రాండ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బుర్బెర్రీలో షేర్లు గత 12 నెలల్లో వాటి విలువలో 57% నష్టపోయాయి. -
సమంత లగ్జరీ బ్రాండ్ వాచ్.. ధర ఎంతంటే..!
టాలీవుడ్ నటి సమంత చక్కటి ఫ్యాషన్ దుస్తుల పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి డ్రెస్ అత్యంత లగ్జరియస్ బ్రాండ్‌కు చెందినవే. ఈసారి మంచి కలర్‌ఫుల్ లుక్ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన తెల్లటి లక్కర్ జాకెట్, స్కర్ట్ ధరించి.. క్యూట్ లూక్‌తో చూపురులన కట్టిపడేస్తుంది. దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ, ప్యాడెడ్ ఫోల్డర్లు, ఫుల్ స్లీవ్ల్లు బోర్డురూంలో సమావేశానికి వెళ్లే సీఈవోల మాదిరిగా ఉంది. అందుకు తగ్గట్టు ఆమె ధరించి డైమండ్ స్టడెడ్ సెర్పెంటి స్పిగా వాచ్ ఆమె అందన్ని రెట్టింపు చేశాయి. ఆ వాచ్ డయల్ చ్టుటూ సిల్వర్ ఒపలైన్ , డైమండ్లతో పొదడబడి ఉంది. చేతికి స్పైరల్ బ్రాస్లెట్ మాదిరిగా ప్రకాశవంతంగా ఉంది. ఆ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది కాంస్య మేకప్ సమంతాకి కొత్త లుక్‌ని ఇచ్చింది. బహుశా ఈ వాచ్ అంటే ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దీన్ని మరో రెండు సందర్భల్లో కూడా ధరించింది. ఒకసారి బోల్డ్ బ్లాక్ దుస్తులను ధరించినప్పుడూ వాచ్ మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అలాగే ఓ ఫ్రైమ్ వీడియో ఈవెంట్‌కు కూడా ఈ సర్పెంటీ వాచ్‌ని ధరించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే ఈ వజ్రాలతో కూడిన వాచ్‌కి కేవలం సమంతా మాత్రమే ఫ్యాన్ కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి కూడా తెగ ఇష్టం. అందుకే కియారా కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతికి వెండి సర్పెంటీ స్పిగా వాచ్‌ను ధరించింది. మంచి జీవనశైలితో జీవితాన్ని ఆశ్వాదించేవారికి ఈ బల్గారియా వాచ్‌లు స్టైయిల్ష్ లుక్‌ని ఇస్తాయట. ఇంతకీ డైమండ్లతో పొదగబడిన ఈ వాచ్ ధర వింటే షాకవ్వుతారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్ ధర ఏకంగా రూ. 70 లక్షలట. లగ్జరీ బ్రాండ్‌కి తగ్గ రేంజ్ ధర కాబోలు..! View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
పేపర్ కవర్ ధర పదివేలా? ఏముందిరా అందులో..?
సాధారణంగా మనం వాడే పేపర్ కవర్ (ఎన్వలప్) ఎంత ఉంటుంది. పది, ఐదు, మహా అయితే రెండు వందలు ఉంటుంది. కానీ ఫ్రెంచ్ లగ్జరీ డిజైన్ హౌస్ హెర్మేస్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం ఒకే పేపర్ ఎన్వలప్‌ను వేల రూపాయలకు విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి ఇంటర్నరెట్లో హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. హెర్మేస్ వెబ్సైట్ ప్రకారం, “సిగ్నేచర్ ఆరెంజ్ హెర్మేస్ పేపర్ ఎన్వలప్” ఆరెంజ్పేపర్ బాక్స్‌లో పట్టుదారాలతో చుట్టి ఉంటుంది. A4 , A5 అనే రెండు సైజుల్లో ఇది అందుబాటులో ఉంది. దీంట్లో ట్రావెల్ డాక్యుమెంట్స్, టిక్కెట్లు , ఇతర పత్రాలను దాచుకోవచ్చు. అంతేకాదు “ప్రత్యేక ఆహ్వానం లేదా ప్రేమ ప్రకటన” కోసం కూడా అపురూపంగా పదిలపర్చు కోవచ్చు. ఫ్రాన్స్లోప్రత్యేకంగా రూపొందించిన ఈపేపరు కవరు ధరసుమారు రూ. 10,411 (125 డాలర్లు)కి విక్రయిస్తోంది. అంతేకాదు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. హెర్మేస్ హై-ఎండ్ స్టేషనరీ కలెక్షన్లో దీన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొందరు ఇది కాస్ట్లీ గురూ అంటోంటే, మరికొందరు మాత్రం స్టేటస్ బాస్ అంటారట. కాగా హీర్మేస్ ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ ధరలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది Balenciaga ట్రాష్ బ్యాగ్ ఒక్కొక్కటి రూ. 1.4 లక్షలకు విక్రయించడం వైరల్‌గా మారింది. అలాగే 7.5 అంగుళాల సమర్కాండే మోడల్‌తో సహా వివిధ విలువైన పేపర్‌వెయిట్ ధర 2,950 డాలర్లు, అలాగే మౌస్ ప్యాడ్ 405 డాలర్లంటే ఆశ్చర్యమే మరి. 1837 నుండి విలాసవంతమైన ఉత్పత్తులకు, ముఖ్యంగా సాండిల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర లెదర్ వస్తువులకు ప్రసిద్ధి చెందింది ఈ బ్రాండ్. -
అందుకే కొనను: అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పిన బిలియనీర్
అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పారు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath). భారతదేశ యంగెస్ట్ బిలియనీర్ అయిన ఆయన.. తన పాడ్‌కాస్ట్ 'WTF ఈజ్ విత్ నిఖిల్ కామత్' తాజా ఎపిసోడ్లో మాట్లాడుతూ తాను అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ కొనడం ఆపేనట్లు చెప్పారు. హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాన్ని నిఖిల్ కామత్ తప్పుపట్టారు. అది ఒకరకంగా కస్టమర్లను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు కస్టమర్లకు ఉత్పత్తిని నేరుగా విక్రయించకుండా "సంబంధాన్ని పెంచుకునేలా" చేస్తాయన్నారు. అంతిమంగా కస్టమర్లకు ఉత్పత్తులు చేరేలోపు వారిని రకరకాల ఛట్రాల్లో ఇరికిస్తాయన్నారు. ఇదంతా తమ ఉత్పత్తులకు విలువను పెంచుకునే ఎత్తుగడలో భాగమేనన్నారు. “గత 3-4 సంవత్సరాలుగా నేను హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనడం పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే వారు కస్టమర్లతో ఆడుకుంటున్నారు. కస్టమర్లను ఊరించి ఫలితం పొందడమే వారి మార్కెటింగ్ వ్యూహం” అని కామత్ తన పోడ్కాస్ట్లో అన్నారు. తప్పుడు వ్యూహం! ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అహంకారంతో కూడిన వ్యూహంగా నిఖిల్ కామత్ భావిస్తున్నారు. “వారు ఈ బ్యాగ్‌లు, వస్తువులను మిలియన్ల కొద్దీ తయారు చేయగలరు. కానీ అహంకారంతో కూడిన వ్యూహంతోనే ఇలా పరిమితంగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కస్టమర్లు దీన్ని గమనించాలి” అన్నారు. హెర్మేస్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు వాటి ప్రత్యేకత, పరిమిత లభ్యతకు ప్రసిద్ధి చెందాయి. కస్టమర్లు హెర్మేస్ హ్యాండ్‌బ్యాగ్‌ను కొనుగోలు చేయాలంటే ముందుగా అనేక చిన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. -
ఆ సెంటిమెంట్ తెలుసో లేదో! కానీ యువత ఇప్పుడు లవ్ యూ బంగారం అంటూ!
అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజులలో బంగారం కొంటే మంచిది అనే సెంటిమెంట్ గురించి వీరికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ‘హాల్‌మార్క్ సింబల్ ఏం తెలియజేస్తుంది?’ అనేదాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవచ్చు. అయితే ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు యూత్ ‘లవ్ యూ బంగారం’ అనడం మాత్రమే కాదు గోల్డ్ గురించి బోలెడు విషయాలు తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తోంది...! ఆరోజుల్లో ఒకరోజు...తన బర్త్‌డేకు ఫ్రెండ్‌ని ‘గోల్డ్ రింగ్’ని గిఫ్ట్‌గా అడిగింది ఆమె. ‘నువ్వే 50 కేజీల బంగారం. నీకు బంగారం ఎందుకు బంగారం!’ అని ఆ ఫ్రెండ్ అన్నాడట. అయితే ఈ మిలీనియల్స్ జమానాలో అలాంటి డైలాగులతో తప్పించుకోవడం అసాధ్యం. అప్పుడూ, ఇప్పుడూ బంగారం అంటే బంగారమే! ఒకప్పుడంటే... బంగారం కొనుగోలు అనేది వివాహాది శుభకార్యాలలో పెద్దల వ్యవహారం. అయితే గత కొంత కాలంగా యూత్‌లో చిన్న మొత్తంలో అయినా బంగారం కొనుగోలు చేయడాన్ని ఇష్టపడే ధోరణి పెరుగుతోంది. 18–క్యారెట్ల వేర్/ఫ్యాషన్ జ్యువెలరీ ఆన్లైన్ షాపింగ్‌లో మిలీనియల్స్ చురుగ్గా ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజిసి) రిపోర్ట్ తెలియజేస్తుంది. మిలీనియల్స్ నుంచి కూడా డిమాండ్ ఏర్పడడంతో ఇండియన్ జ్యువెలరీ ఆన్లైన్ మార్కెట్ వేగం పెరిగింది. పెద్ద సంస్థలు యూత్‌ని దృష్టిలో పెట్టుకొని తేలికపాటి బరువుతో, స్టైలిష్‌గా ఉండే సబ్–బ్రాండ్స్‌ను లాంచ్ చేశాయి. అమ్మాయిలలో ఎక్కుమంది గోల్డ్ ఇయర్ రింగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. బరువును పెద్దగా పట్టించుకోవడం లేదు. యూత్‌ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్కెటింగ్, ఎడ్వర్టైజింగ్ స్ట్రాటజీలు మొదలయ్యాయి. ‘కష్టకాలంలో అక్కరకొస్తుంది’ అనే భావనతో కాస్తో,కూస్తో బంగారం కొనుగోలు చేయడం అనేది పెద్దల సంప్రదాయం. కానీ ఈతరంలో ఎక్కువమందికి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లాగే గోల్డ్ అనేది లగ్జరీ ఫ్యాషన్. ‘గోల్డ్ అంటే మా దృష్టిలో లగ్జరీ ఫ్యాషన్ మాత్రమే’ అనే స్టేట్మెంట్కు యువతరంలో కొద్దిమంది మినహాయింపు. దీనికి ఒక ఉదాహరణ చెన్నైకి చెందిన సచిత. ‘గతంలో స్టాక్‌మార్కెట్‌పై ఆసక్తి ఉండేది. ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. చాలా విషయాలు తెలిసి ఉండాలి అనేది తెలుసుకున్నాక గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి పెరిగింది’ అంటోంది సచిత. తమ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను దృష్టిలో పెట్టుకొని గోల్డ్‌ను సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా చూస్తున్న సచితలాంటి వాళ్లు యువతరంలో ఎంతోమంది ఉన్నారు. చదవండి: Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్! యూత్‌కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానంలో ఉన్నది ఏమిటంటే! -
వరల్డ్ టాప్–100 లగ్జరీ బ్రాండ్లు.. చోటు దక్కించుకున్న ఇండియన్ బ్రాండ్స్ ఇవే
న్యూఢిల్లీ: ప్రపంచంలో విలాసవంతమైన టాప్–100 బ్రాండ్లలో భారత్ నుంచి ఐదింటికి చోటు లభించింది. టైటాన్ మూడు స్థానాలు పైకి ఎగిసి 22వ ర్యాంకులోకి వచ్చింది. అంతేకాదు అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి 20 లగ్జరీ ఉత్పత్తుల కంపెనీల్లోనూ చోటు సంపాదించుకుంది. జెమ్స్ అండ్ జ్యుయల్లరీ టాప్–100 విలాసవంత ఉత్పత్తుల్లో భారత్ నుంచి కల్యాణ్ జ్యుయలర్స్, జోయలుక్కాస్, పీసీ జ్యుయలర్స్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ ఉన్నాయి. ఇవన్నీ జ్యుయలరీ కంపెనీలే కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి ధోరణి గతేడాది మాదిరే ఉందని, జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం తాజా ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించినట్టు.. ఈ నివేదికను రూపొందించిన డెలాయిట్ తెలిపింది. తొలిసారి త్రిభువన్దాస్.. టాప్ –100 లగ్జరీ ఉత్పత్తుల జాబితాలోకి త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి తొలిసారిగా చోటు సంపాదించుకుంది. టాప్–10 బ్రాండ్లు యూరోప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతం (ఈఎంఈఏ) నుంచే ఉన్నాయి. టాప్–100లో 80కు పైగా కంపెనీల విక్రయాలు 2019–20లో (2020వ సంవత్సరం) తక్కువగా ఉన్నాయని.. కరోనా ప్రబావం వీటిపై పడినట్టు డెలాయిట్ తెలిపింది. అయినప్పటికీ సగానికి పైగా కంపెనీలు లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. చదవండి: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్! నెక్ట్స్ ఏం జరగబోతుంది? -
లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...!
Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తులపై పెట్టుబడిపెడితే లాభాలను గడించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా లగ్జరీ ఉత్పత్తులపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే వైన్ ఎక్కువ రాబడులను వచ్చాయని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ తన ద్వితీయా త్రైమాసికం 2021 రిపోర్ట్‌లో వెల్లడించింది. తాజా డేటా ప్రకారం....వైన్ ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలు ఏడాది కాలంలో 13 శాతం మేర గణనీయంగా లాభాలను పొందినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అరుదైన విస్కీ, లగ్జరీ హ్యండ్బ్యాగుల తయారీ సంస్థల కంటే వైన్ కంపెనీలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయని తేలింది. చదవండి: Bill Gates: అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్...! ఇటీవలి కాలంలో నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ లో టాప్ గెయినర్స్‌గా అరుదైన స్కాచ్ బాటిల్స్, హెర్మెస్ హ్యాండ్ బ్యాగుల కంపెనీలు ఏడాది కాలంలో ప్రతికూల వృద్ధిని నమోదుచేసి సూచిక అగ్రస్థానంలో నిలిచాయి. 10 ఏళ్లలో 13శాతం, 119శాతం మేర ధరలు పెరగడంతో జూన్ 2021 చివరి వరకు 12 నెలల్లో వైన్ కంపెనీలు ఇండెక్స్ ముందు వరుసలో ఉన్నాయని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఎడిటర్ ఆండ్రూ షిర్లీ అన్నారు. ప్రముఖ వైన్ దిగ్గజం బోర్డియక్స్ కంపెనీ భారీ లాభాలను గడించింది. 12 నెలల వ్యవధిలో వైన్ ఉత్తమ రాబడులను చూసినప్పటికీ, 10 సంవత్సరాల వ్యవధిలో ఇతర పెట్టుబడుల కంటే ఇది చాలా ఎక్కువ. అరుదైన విస్కీ కంపెనీలు 10 సంవత్సరాలలో 483 శాతం రాబడిని నమోదు చేశాయి. లగ్జరీ ఉత్పత్తుల్లో క్లాసిక్ కార్లు, లగ్జరీ వాచీలు వరుసగా 4 , 5 శాతం ధరల పెరుగుదలతో 12 నెలల వ్యవధిలో భారీగా రాబడులను పొందాయి. చదవండి: ప్యాన్‌కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ -
ప్రపంచానికి కొత్త కుబేరుడు.. రెండో స్థానంలో జెఫ్ బిజోస్
ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలోకి కొత్త కుబేరుడు వచ్చి చేరుడు. ఇప్పటి వరకు ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడుగా కొనసాగుతున్న అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ రెండవ స్థానానికి పడిపోయారు. లగ్జరీ గూడ్స్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ మొత్తం నికర ఆస్తుల విలువ 186.4 బిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో 13 లక్షల 57వేల 737 కోట్ల పైనే. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. ఆ సంస్థ స్టాక్స్ 765 మిలియన్ డాలర్ల మేర పెరగడంతో ఆర్నాల్ట్ కుటుంబం ఆస్తులు జెఫ్ బిజోస్‌ను మించి పోయాయి. లూయిస్ విటన్ మోట్ హోనెస్సీ అనే కంపెనీ పేరు మీద అనేక బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ ద్వారా లగ్జరీ గూడ్స్ విక్రయిస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఆయా బ్రాండ్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ పెరగడంతో ఆర్నాల్ట్ ఆస్తులు వృధ్ధి చెందాయి. ప్రస్తుతం జెఫ్ బిజోస్ ఆస్తుల విలువ 186 బిలియన్ డాలర్లు. మరోవైపు ప్రపంచం కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 147.3 బిలియన్ డాలర్లు. ఎల్ఎమ్ హెచ్ వి కంపెనీ 2021 మొదటి త్రైమాసికంలో 14 బిలియన్ యూరోల రెవిన్యూ నమోదు చేసింది. 2020 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. చదవండి: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు -
బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు
శాన్ఫ్రాన్సిస్కో: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తయారీ తొలి హెడ్‌ఫోన్స్‌ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్దింది. రష్యన్ కంపెనీ కేవియర్. ఎయిర్‌పోడ్స్ మాక్స్‌ను స్వచ్చమైన బంగారంతో రూపొందించింది. నిజానికి ఎయిర్‌పోడ్స్ మాక్స్ ఇయర్ కప్స్‌ను యాపిల్ కంపెనీ అల్యూమినియంతో తయారు చేస్తోంది. అయితే బాగా ప్రాచుర్యం పొందిన గ్యాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా మలిచే రష్యన్ కంపెనీ కేవియర్ వీటిని ప్యూర్ గోల్డ్‌తో రూపొందించింది. అంతేకాకుండా మెష్ హెడ్‌బ్యాండ్‌ను అరుదైన క్రోకొడైల్ లెదర్‌తో అలంకరించింది. వెరసి యాపిల్ హెడ్‌ఫోన్స్ ఖరీదు 1.08 లక్షల డాలర్లుగా ప్రకటించింది. అంటే సుమారు రూ. 80 లక్షలన్నమాట! వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా(కస్టమ్ మేడ్) వీటిని పరిమితంగానే తయారు చేయనున్నట్లు కేవియర్ పేర్కొంది. కొత్త ఏడాది(2021)లో ఈ హెడ్‌ఫోన్స్ మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: (యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్) తొలి హెడ్‌ఫోన్స్ ఈ నెల మొదట్లో ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ పేరుతో యాపిల్ తొలిసారి హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని రూ. 59,900 ధరలో ప్రవేశపెట్టింది. స్పష్టమైన శబ్దం, అడాప్టివ్ ఈక్వలైజర్, అనవసర శబ్దాలను తగ్గించే సాంకేతికలతో వీటిని రూపొందించింది. కాగా.. వీటికి మరింత ప్రీమియంను జత చేస్తూ రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్.. తాజాగా గోల్డ్ ప్లేటెడ్ కప్స్‌తో రూపొందించింది. వీటిని రెండు కలర్స్‌లో అందిస్తున్నట్లు తెలియజేసింది. నలుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ హెడ్‌ఫోన్స్‌ను ప్యూర్ గోల్డ్‌తోపాటు.. హెడ్‌బ్యాండ్‌ను క్రోకొడైల్ లెదర్‌తో రూపొందించినట్లు వెల్లడించింది. రెండు రంగుల్లోనూ బంగారంతో చేసిన కప్స్, లెదర్ హెడ్‌బ్యాండ్‌లతో ఇవి లభించనున్నట్లు వివరించింది.