ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బుర్బెర్రీ ఉన్నట్టుండి తమ సీఈవోను మార్చేసింది. బోర్డ్ పరస్పర అంగీకారంతో సీఈవో జొనాథన్ అకెరాయిడ్ తక్షణం పదవి నుంచి వైదొలగుతున్నారని, కంపెనీని వీడుతున్నారని కంపెనీ తాజాగా ప్రకటించింది.
అకెరాయిడ్ స్థానంలో మైఖేల్ కోర్స్ మాజీ బాస్ జాషువా షుల్‌మాన్‌ను దాని కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బుర్బెర్రీ నియమించింది. అమ్మకాలు క్షీణించడంతో నష్టాలు తప్పవన్న సంకేతాలతో డివిడెండ్‌ను రద్దు చేసిన కంపెనీ.. సీఈవో జొనాథన్ అకెరాయిడ్‌పైనా వేటు వేసింది.
లగ్జరీ సెక్టార్‌లో మందగమనం ప్రత్యర్థి బ్రాండ్‌ల కంటే బుర్బెర్రీని తీవ్రంగా దెబ్బతీసింది. 168 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్రిటిష్ కంపెనీలో ఏకంగా సీఈవో మార్పునకు దారితీసింది. జూన్ 29 వరకు 13 వారాలలో బుర్బెర్రీ అమ్మకాలు 21% క్షీణించాయి. ప్రస్తుత ట్రెండ్స్ వార్షిక లాభాల అంచనాలను దెబ్బతీసిన నేపథ్యంలో వృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం డివిడెండ్‌ను కంపెనీ రద్దు చేసింది.
షుల్‌మాన్ 2021-2022 వరకు యూఎస్ బ్రాండ్ మైఖేల్ కోర్స్‌కు సీఈవోగా పనిచేశారు. అంతకుముందు కోచ్ కంపెనీకి బ్రాండ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బుర్బెర్రీలో షేర్లు గత 12 నెలల్లో వాటి విలువలో 57% నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment