రిలయన్స్ రిటైల్‌కు చెందిన సౌందర్య ఉత్పత్తుల వేదిక ‘తీరా’ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్‌ను భారత్‌లో ప్రారంభించింది. అగస్టినస్ బాడర్ కలెక్షన్ ప్రత్యేకంగా తీరా ఆన్‌లైన్‌తోపాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరులోని ఎంపిక చేసిన తీరా స్టోర్లలో అందుబాటులో ఉందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
దేశంలో తీరా స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ఈ అగస్టినస్ బాడర్ బ్రాండ్‌ను ప్రపంచ ప్రఖ్యాత స్టెమ్ సెల్, బయోమెడికల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ అగస్టినస్ బాడర్ స్థాపించారు. ఈ బ్రాండ్ ఉత్పత్తులతోపాటు వ్యక్తిగత స్కిన్‌కేర్ అవసరాలకు ఏ ఉత్పత్తులను ఎంచుకోవాలన్నదానిపై కస్టమర్లకు ఎక్స్‌పర్ట్ గైడెన్స్ కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
యూరోమానిటర్ ఎస్టిమేట్స్ ప్రకారం.. భారతదేశ బ్యూటీ మార్కెట్ 2025 నాటికి 20 బిలియన్ డాలర్లకు పెరగనుంది. అందులోనూ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ 15% వృద్ధి చెందనుంది. దేశంలో స్కిన్‌కేర్ ఉత్పత్తుల మార్కెట్ విలువ 2022లో 6.53 బిలియన్ డాలర్లు. ఇది 2027 నాటికి 8.84 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని రీసెర్చ్ అండ్ మార్కెట్స్ డేటా చెబుతోంది.
బ్యూటీ మార్కెట్ వృద్ధి నేపథ్యంలో నైకా, టాటా క్లిక్ ప్యాలెట్, మింత్రా వంటి సంస్థలతో రిలయన్స్ రిటైల్ కంపెనీ తీరా పోటీ పడుతోంది. ఆన్‌లైన్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ డజను ఆఫ్‌లైన్ స్టోర్లను కూడా తీరా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment