
న్యూఢిల్లీ: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 154 కోట్లను తాకింది.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహణలోని కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 72 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 261 కోట్ల నుంచి రూ. 285 కోట్లకు జంప్‌చేసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. అటు బిజినెస్‌లు, ఇటు కన్జూమర్లకు అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్లు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 226 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment