Q2 profit
-
జస్ట్ డయల్ లాభం డబుల్.. ఓనర్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 154 కోట్లను తాకింది.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహణలోని కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 72 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 261 కోట్ల నుంచి రూ. 285 కోట్లకు జంప్‌చేసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. అటు బిజినెస్‌లు, ఇటు కన్జూమర్లకు అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్లు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 226 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు పెరిగాయి. -
ఎస్‌యూవీల జోరు.. లాభాల్లో మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44% జంప్‌చేసి రూ. 2,773 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ.1,929 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు ఎగసింది. ఆటోమోటివ్ విభాగం టర్నోవర్ రూ.8,245 కోట్ల నుంచి రూ.15,231 కోట్లకు దూసుకెళ్లగా.. వ్యవసాయ పరికరాల బిజినెస్ రూ. 6,723 కోట్ల నుంచి రూ.7,506 కోట్లకు బలపడింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.2,974 కోట్లకు చేరింది. ఎస్‌యూవీల జోరు: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎం అండ్ ఎం స్టాండెలోన్ నికర లాభం 46% జంప్‌చేసి రూ. 2,090 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 57% వృద్ధితో రూ. 20,839 కోట్లకు చేరింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 75% దూసుకెళ్లి 1,74,098 యూనిట్లను తాకగా, ట్రాక్టర్ల అమ్మకాలు 5% బలపడి 92,590కు చేరాయి. ఎక్స్‌యూవీ 700, స్కార్పియో–ఎన్ వాహనాలకు భారీ డిమాండ్ వలకల వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ ఈడీ రాజేష్ జెజూరికర్ చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఎస్యూవీ తయారీ సామ ర్థ్యాన్ని నెలకు 39,000 యూనిట్లకు, తదుపరి వచ్చే ఏడాది చివరికల్లా 49,000 యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 2.6 లక్షల యూనిట్లకు బుకింగ్స్ ఉన్నట్లు తెలియజేశారు. 2027కల్లా ఎస్‌యూవీల అమ్మకాలలో 20–30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఆక్రమించవచ్చని అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 0.8% నీరసించి రూ. 1,287 వద్ద ముగిసింది. -
డోమినోస్‌కు లాభాల పంట, క్యూ2లో రూ. 131 కోట్ల ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ పటిష్ట ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 131 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 120 కోట్లు ఆర్జించింది. డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ కంపెనీ ఆదాయం 17 శాతం ఎగసి రూ. 1,301 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 20 శాతం పెరిగి రూ. 1,154 కోట్లకు చేరాయి. ఈ కాలంలో 76 డోమినోస్ స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. -
అమర రాజా సేల్స్ అదిరాయ్: లాభం రూ. 201 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) 39 శాతం పెరిగింది. రూ. 201 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 144 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,700 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 2,097 కోట్ల నుంచి రూ. 2,449 కోట్లకు పెరిగాయి. రూ.1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 2.90 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. గురువారం బీఎస్ఈలో సంస్థ షేరు ఒక్క శాతం పెరిగి సుమారు రూ. 520 వద్ద ముగిసింది. -
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫలితాల జోరు, 6 శాతం జంప్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 223 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 187 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 1,995 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 1,647 కోట్ల నుంచి రూ. 1,740 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.65 శాతం నుంచి 5.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.85 శాతం నుంచి 2.51 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ. 179 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో గురువారం 3.4 శాతం ఎగిసింది. శుక్రవారం కూడా ఈ జోరు కంటిన్యూ చేస్తూ ఏకంగా 6 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
రిలయన్స్ ‘రికార్డు’ల హోరు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. షేర్ పరంగా చూస్తే, నికర లాభం రూ.16.1 నుంచి రూ.18.6కు పెరిగింది. ఒక్క క్వార్టర్లో ఈ స్థాయి లాభం సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అత్యదిక త్రైమాసిక లాభం సాధించిన ప్రైవేట్ కంపెనీగా తన రికార్డ్‌ను తానే రిలయన్స్ ఇండస్ట్రీస్ బద్దలు కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ కంపెనీ రూ.10,362 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. స్టాండ్అలోన్ పరంగా చూసినా, ఈ క్యూ2లో రికార్డ్ నికర లాభం, రూ.9,702 కోట్లను ఈ కంపెనీ సాధించింది. రిటైల్, జియోల జోరు..... సాంప్రదాయ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ విభాగాల లాభాలు బలహీనంగా ఉన్నా, రిఫైనింగ్ మార్జిన్లు టర్న్ అరౌండ్ కావడం, రిటైల్, టెలికం... ఈ రెండు కన్సూమర్ వ్యాపారాలు జోరుగా పెరగడం వల్ల ఈ రికార్డ్ స్థాయి లాభాలను సాధించామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వివరించారు. ఇక ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారం నిర్వహణ లాభం 12 శాతం పెరిగి రూ.2,322 కోట్లకు చేరిందని, టెలికం విభాగం, జియో రూ.990 కోట్ల నికర లాభం సాధించిందని తెలి పారు. ఈ రెండు విభాగాలు రికార్డ్ స్థాయి స్థూల లాభాలు సాధించాయని పేర్కొన్నారు. మొత్తం కంపెనీ నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా మూడో వంతుకు చేరిందని చెప్పారు. రిటైల్ పరుగు... రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 67% పెరిగి రూ.2,322 కోట్లకు, ఆదాయం 27% పెరిగి రూ.41,202 కోట్లకు చేరాయి. స్టోర్ ఉత్పాదకత, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణే దీనికి కారణం. క్యూ2లో కొత్తగా 337 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించింది. దీంతో 6,700 నగరాల్లో మొత్తం రిటైల్ స్టోర్స్ సంఖ్య 10,901కు చేరింది. మరిన్ని విశేషాలు... ►9.9 మిలియన్ టన్నుల రికార్డ్ ఉత్పత్తిని సాధించినప్పటికీ, పెట్రో కెమికల్స్ వ్యాపారం స్థూల లాభం 6 శాతం తగ్గి రూ.7,692 కోట్లకు చేరింది. ఈ విభాగం స్థూల లాభం తగ్గడం ఇది వరుసగా ఆరో క్వార్టర్. ►స్థూల రిఫైనింగ్ మార్జిన్(ఒక్క బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే మార్జిన్) గత క్యూ2లో 9.5 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ2లో 9.4 డాలర్లకు తగ్గింది. క్యూ1 జీఆర్ఎమ్(8.1 డాలర్లు)తో పోలి్చతే పెరిగింది. ►ఈ ఏడాది జూన్ చివరికి రూ.2,88,243 కోట్లుగా ఉన్న రుణభారం సెప్టెంబర్ నాటికి రూ.2,91,982 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్లకు పెరిగాయి. జియో...జిగేల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 45 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.681 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.990 కోట్లకు ఎగసింది. నిర్వహణ ఆదాయం రూ.9,240 కోట్ల నుంచి 34 శాతం వృద్ధితో రూ.12,354 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో 35 కోట్ల వినియోగదారుల మైలురాయిని దాటిందని రిలయన్స్ ఎమ్డీ ముకేశ్ అంబానీ తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ.2 తగ్గి రూ.120కు చేరింది. కాగా ఈ క్యూ2లో కొత్తగా 2.4 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్ జియోకు జతయ్యారు. రిలయన్స్ మార్కెట్ విలువ రికార్డ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ శుక్రవారం మరో రికార్డ్ ఘనత సాధించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో రూ.9,05,214 కోట్లను తాకింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన తొలి భారత కంపెనీ ఇదే. ఆరి్థక ఫలితాలపై సానుకూల అంచనాల నేపథ్యంలో (మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి) ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,428ను తాకింది. చివరకు 1.3% లాభంతో రూ.1,428 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను తాకిన ఈ షేర్ మార్కెట్ క్యాప్ రూ. రూ.8,97,179 కోట్లకు చేరింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన ఘనతను ఈ కంపెనీ గత ఏడాది ఆగస్టులోనే సాధించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 14 నెలల్లోనే లక్ష కోట్లకు పైగా ఎగియడం విశేషం. మరో రెండేళ్లలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 20,000 కోట్ల డాలర్ల(రూ.14 లక్షల కోట్లకు)కు పెరగగలదని ఇటీవలే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. వినియోగదారుల వ్యాపారాల జోరు కారణంగా రికార్డ్ స్థాయి లాభం సాధించాం. రిటైల్ వ్యాపారం వృద్ది కొనసాగుతుండటం సంతోషదాయకం. వినియోగదారులకు ఉత్తమ విలువ అందించడమే లక్ష్యంగా రిలయన్స్ రిటైల్ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ విభాగం రికార్డ్ స్థాయి ఆదాయాన్ని, నిర్వహణ లాభాన్ని సాధించింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ సరీ్వసుల కంపెనీగా రిలయన్స్ జియో నిలిచింది. ప్రతి నెలా కొత్తగా కోటిమంది వినియోగదారులవుతున్నారు. వినియోగదారులు, ఆదాయం పరంగా రిలయన్స్ జియో కంపెనీ భారత్‌లోనే అతి పెద్ద కంపెనీగానే కాకుండా, డిజిటల్ గేట్‌వే ఆఫ్ ఇండియాగా కూడా నిలిచింది. ఇళ్లకు, వ్యాపార సంస్థలకు బ్రాడ్‌బాండ్ సేవలందించడానికి జియో ఫైబర్ పేరుతో మరో విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టాం. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,848 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,848 కోట్ల నికర లాభం(స్టాండ్అలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో ఆర్జించిన నికర లాభం(రూ.1,525 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. గృహ సంరక్షణ, సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగాల ఉత్పత్తుల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్ మెహతా చెప్పారు. గత క్యూ2లో రూ.9,138 కోట్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు ఈ క్యూ2లో రూ.9,708 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఆరి్థక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.11 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. డిమాండ్ సమస్యలు కొనసాగుతాయ్.... ఈ క్యూ2లో నిర్వహణ లాభం 21 శాతం వృద్ధితో రూ.2,443 కోట్లకు పెరిగిందని మెహతా పేర్కొన్నారు. గత క్యూ2లో 23.7 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్ ఈ క్యూ2లో 24.8 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆరి్థక మందగమన కాలంలోనూ మంచి వృద్ధి సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. మార్జిన్లు నిలకడగా మెరుగుపడుతున్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో డిమాండ్ పరంగా సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గృహ సంరక్షణ విభాగం ఆదాయం గత క్యూ2లో రూ.3,080 కోట్లు ఉండగా, ఈ క్యూ2లో రూ.3,371 కోట్లకు పెరిగిందని మెహతా చెప్పారు. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ విభాగం ఆదాయం రూ.4,316 కోట్ల నుంచి రూ.4,543 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఆహార, రిఫ్రెష్మెంట్ విభాగం ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,847 కోట్లకు చేరిందన్నారు. విల్లెమ్ ఉజేన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ–సప్లై చెయిన్)గా నియమించామని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆయన కంపెనీ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతారని పేర్కొన్నారు. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. సానుకూల అంచనాల కారణంగా బీఎస్ఈలో హిందుస్తాన్ యూని లివర్ షేర్ 0.5 శాతం లాభంతో రూ.2,015 వద్ద ముగిసింది. -
అంచనాలు మించిన భారతీ ఎయిర్టెల్
విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలనే దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై-సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభాలు 4.9 శాతం పడిపోయి రూ.1,461 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభాలు రూ.1,536 కోట్లగా ఉన్నాయి. స్పెక్ట్రమ్ సంబంధిత ఖర్చులు, నైజీరియన్ కరెన్సీ డివాల్యుయేషన్ వంటి కారణాలతో భారతీ ఎయిర్టెల్ లాభాలు పడిపోయినట్టు కంపెనీ ప్రకటించింది. కానీ విశ్లేషకుల అంచనావేసిన దానికంటే బాగానే ఆపరేషన్ ఫర్ఫార్మెన్స్ను కంపెనీ చూపించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విశ్లేషకుల ముందస్తు అంచనా ప్రకారం భారతీ ఎయిర్టెల్ రూ.25,495 కోట్ల రెవెన్యూలపై రూ.1050 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,053 కోట్లగా ఉన్న నికర వడ్డీ వ్యయాలు రూ.1,603 కోట్లకు ఎగిశాయి. ఈ వ్యయాలు పెరగడానికి ప్రధాన కారణం కూడా స్పెక్ట్రమ్ సంబంధిత వడ్డీ వ్యయాలేనని కంపెనీ వెల్లడించింది. ఉచిత సేవలతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో ఎఫెక్టు భారతీ ఎయిర్‌టెల్‌పై పడింది. ఈ క్వార్టర్లో ఎయిర్ టెల్ మొబైల్ వ్యాపారాలు నెమ్మదించాయి. మొత్తంగా అయితే యేటికేటికి 10.1 శాతం రెవెన్యూ వృద్ధి నమోదుచేస్తూ కంపెనీ ఊపందుకున్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. నాన్-మొబైల్ బిజినెస్‌ల్లో వృద్ధి నమోదు వల్లే కంపెనీ రెవెన్యూలను పెంచుకోగలిగిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ తెలిపారు. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి రెవెన్యూలు 10.1 శాతం ఎగిసి రూ.19,219 కోట్లగా నమోదయ్యాయి. యేటికేటికీ డిజిటల్ టీవీ వ్యాపారాల్లో 20.9 శాతం వృద్ధి, ఎయిర్టెల్ బిజినెస్‌లో రూ.19.2 శాతం, మొబైల్ వ్యాపారాల్లో 7.9 శాతం వృద్ధి కంపెనీ భారత వ్యాపారాల్లో నమోదుచేసినట్టు భారతీ ఎయిర్టెల్ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆదాయం 3.4 శాతం పెరిగి రూ.24,671.5 కోట్లగా కంపెనీ నమోదుచేసింది. అయితే నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్తో కన్సాలిడేటెడ్ రెవెన్యూ వృద్ధి 3.3 శాతం మందగించింది.