హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) 39 శాతం పెరిగింది. రూ. 201 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 144 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 2,264 కోట్ల నుంచి రూ. 2,700 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 2,097 కోట్ల నుంచి రూ. 2,449 కోట్లకు పెరిగాయి.
రూ.1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 2.90 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. గురువారం బీఎస్‌ఈలో సంస్థ షేరు ఒక్క శాతం పెరిగి సుమారు రూ. 520 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment