Justdial
-
ఫలితాలు, గణాంకాలు కీలకం
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం పలు కీలక అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ గత వారమే ప్రారంభమైంది. ఇకపై ఊపందుకోనుంది. వారాంతాన ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పీఎస్‌యూ ఇరెడా, జస్ట్‌డయల్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలను వెల్లడించాయి. ఈ బాటలో మరిన్ని దిగ్గజాలు క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. క్యూ2 జాబితాలో ఈ వారం ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్, బ్యాంకింగ్ బ్లూచిప్ హెచ్డీఎఫ్సీ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ల ట్రెండ్‌ను ఫలితాలు నిర్దేశించే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. 17న ఐటీ సేవల దిగ్గజం విప్రో క్యూ2 ఫలితాలుసహా బోనస్ షేర్లను ప్రకటించనుంది. అంతేకాకుండా 12న డీమార్ట్ క్యూ2 పనితీరును వెల్లడించడంతో సోమవారం(14న) ఈ ప్రభావం రెండు షేర్లపై కనిపించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. 3 ఐపీవోలు ఈ వారం మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ప్రధానమైనది హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇష్యూ. అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనున్న రూ. 27,870 కోట్ల ఇష్యూ మంగళవారం ప్రారంభమై గురువారం ముగియనుంది. ఈ బాటలో మరో రెండు చిన్న కంపెనీలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐపీవోకు రానున్నాయి. లక్ష్య పవర్‌టెక్, ఫ్రెషార ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్ 16–17 మధ్య ఇష్యూలు చేపట్టనున్నాయి. అయితే గత వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఎస్ఎంఈ ఐపీవో తదుపరి ట్రాఫిక్సోల్ను లిస్ట్కాకుండా నిలిపి వేయడం గమనార్హం. నిధుల వినియోగంపై అభియోగాలతో మరింత లోతైన దర్యాప్తునకు సైతం ఆదేశించింది. ద్రవ్యోల్బణం గత వారం పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడగా.. ఇకపై రిటైల్ ధరలు(సీపీఐ), టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. సెప్టెంబర్ నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం నేడు(సోమవారం) విడుదల చేయనుంది. వీటికితోడు పశి్చమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులు సెంటిమెంటును దెబ్బతీయగలవని స్టాక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇండియా, చైనా, యూకే ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేయనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా వెల్లడించారు. ఈసీబీ పాలసీ రేట్ల నిర్ణయాలు, చైనా జీడీపీ, యూఎస్ రిటైల్ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నట్లు వివరించారు. వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని తెలియజేశారు.చమురు రయ్ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల కారణంగా గత వారం ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 84ను దాటి ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నీ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలవని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. చైనా సహాయక ప్యాకేజీలు, అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. మరోపక్క 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం సైతం విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు కొద్ది రోజులుగా అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల మరిన్ని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల(అక్టోబర్)లో ఇప్పటివరకూ(1–11 మధ్య) నికరంగా రూ. 58,711 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే గత నెల(సెపె్టంబర్)లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత 9 నెలల్లో ఇవి అత్యధిక పెట్టుబడులుకాగా.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, చైనా సహాయక ప్యాకేజీల తదుపరి దేశీ స్టాక్స్‌లో నిరంతర అమ్మకాలు చేపడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేలండర్ ఏడాది ఏప్రిల్, మే నెలల తదుపరి జూన్ నుంచి ఎఫ్‌పీఐలు దేశీయంగా పెట్టుబడులకే కట్టుబడినట్లు మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. అయితే పశ్చిమాసియా యుద్ధ భయాలతో ముడిచమురు ధరలు పెరగడం, చైనా మార్కెట్లు బలపడుతుండటం వంటి అంశాలు ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమవుతున్నట్లు విశ్లేíÙంచారు. వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినిత్ బి. సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.గత వారమిలా గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 307 పాయింట్లు క్షీణించి 81,381 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు నీరసించి 24,964 వద్ద స్థిరపడింది.–సాక్షి, బిజినెస్ డెస్క్ -
జస్ట్ డయల్ లాభం డబుల్.. ఓనర్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: స్థానిక సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 154 కోట్లను తాకింది.రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహణలోని కంపెనీ గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 72 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 261 కోట్ల నుంచి రూ. 285 కోట్లకు జంప్‌చేసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. అటు బిజినెస్‌లు, ఇటు కన్జూమర్లకు అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్లు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ. 226 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు పెరిగాయి. -
ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్
వేసవి కాలం ఆరంభంలో ఉండగానే చల్లదనం కోసం హైదరాబాదీలు సెర్చింగ్ మొదలెట్టారు. ఎయిర్ కండీషన్ కోసం తెగ వాకాబు చేస్తున్నారు. జస్ట్ డయల్ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఏసీ విషయంలో హైదరాబాద్ నగరం ముంబై, ఢిల్లీలతో పోటీ పడుతోంది. సెర్చింగ్ సైట్ గూగుల్‌లో జస్ట్ డయల్ది ప్రత్యేక స్థానం. ఏదైనా సర్వీస్‌కి సంబంధించిన సమాచారం ఇక్కడ ఠక్కున లభిస్తుంది. అందుకే నెటిజన్లు జస్ట్ డయల్‌ని రెగ్యులర్‌గా క్లిక్ చేస్తుంటారు. వేసవి ఆరంభం నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా రివీల్ చేసిన డేటాలో ఏసీలు కోసం సెర్చింగ్ బాగా పెరిగిందట. ముఖ్యంగా దేశంలో ఉన్న టాప్ సెవన్ సిటీసైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పూనేల నుంచే ఎక్కువ సెర్చింగ్ ఉందట. ఏసీల కోసం వాకాబు చేస్తున్న ట్రాఫిక్‌లో 61 శాతం ఈ నగరాల నుంచే వస్తోంది. ఇక ఏసీల కోసం విపరీతంగా సెర్చ్ చేస్తున్న నగరాల్లో ముంబై మొదటి వరుసలో ఉండగా ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలను హైదరాబాద్ ఏసీ డిమాండ్‌లో వెనక్కి నెట్టింది. ఇక విండో ఏసీలతో పోల్చితే నూటికి తొంభై మంది స్లిట్ ఏసీలను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారని జస్ట్ డయల్ తెలిపింది. గతంతో పోల్చితే టైర్ 2 సిటీల నుంచి కూడా ఏసీ సెర్చింగ్ ట్రాఫిక్ పెరిగింది. అయితే ఇక్కడ కొత్త ఏసీలు కొనుగోలుకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అదే స్థాయిలో పాత ఏసీల రిపేర్ల కోసం కూడా విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. టైర్ టూ నగరాల్లో ఏసీ రిపేర్ల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్న నగరాల జాబితాలో విశాఖపట్నం, చండీగడ్, జైపూర్, లక్నో, వడోదరలు వరుసగా టాప్ 5లో ఉన్నాయి. చదవండి: సరిలేరు మీకెవ్వరూ!! ధనవంతులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్! -
భారీగా పెరిగిన ముఖేష్ అంబానీ సంపద
ముంబై: భారతీయ కుభేరుడు.. అసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సంపద భారీగా పెరిగింది. ముఖేష్ అంబానీ సంపద కేవలం ఒక్క రోజులోనే(సెప్టెంబర్ 3) 3.71 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంపద ఇంతభారీగా పెరగడానికి కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర పెరగడమేనని తెలుస్తోంది. కంపెనీ షేర్ల విలువ ఇటీవల పెరిగిన నేపథ్యంలో 100 బిలియన్ డాలర్లకు పైగా నికర విలువతో బిలియనీర్ల ప్రత్యేక క్లబ్ లోకి ప్రవేశించడానికి దగ్గరగా ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అంబానీ తన నికర ఆస్తుల విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీ 12వ స్థానంలో ఉన్నారు. ఆర్ఐఎల్ షేర్లు సోమవారం(సెప్టెంబర్ 6) బీఎస్ఈలో 1.70 శాతం పెరిగి రూ.2,429.00 వద్ద ఉన్నాయి. గత వారం, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ లో రూ.393 కోట్ల వాటాను రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది.(చదవండి: అడుగేస్తేనే కరెంట్ పుడుతుంది మరి!) లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇక జియో ఇన్ఫోకామ్ అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ అందిస్తూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం జియో భారతదేశంలో అతిపెద్ద వైర్ లెస్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. 2021, జూన్ చివరి నాటికి 43.66 కోట్ల మంది చందాదారులను కలిగి ఉంది. -
బై బ్యాక్ ఆఫర్‌తో జస్ట్ డయల్ జోరు
న్యూఢిల్లీ: లోకల్ సెర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ బై బ్యాక్ ఆఫర్‌తో మంగళవారం నాటి బుల్మార్కెట్లో భారీ లాభాలను ఆర్జించింది. రూ. 84 కు సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జస్ట్ డయల్ కౌంటర్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు 3శాతం జంప్ చేసింది. వాటాదారుల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో చెల్లించిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను బోర్డు ఆమోదించిందని రెగ్యులేటరీ ఫైలింగ్ లో బోర్డు డైరెక్టర్లు చెప్పారు. దీని ద్వారా రూ. 84 కోట్ల రూపాయలదాకా వెచ్చించనున్నట్టు ప్రకటించింది. షేరు ధర రూ. 700 ధర మించకుండా సంస్థ గరిష్టంగా 11.98 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. అలాగే అభిషేక్ బన్సాల్ ని ఛీఫ్ ఫైనాన్షయిల్ ఆఫీసర్‌గా జస్ట్ డయల్ బోర్డ్ నియమించింది.