బై బ్యాక్‌ ఆఫర్‌తో జస్ట్‌ డయల్‌ జోరు | Justdial announces Rs 84 cr share buyback offer | Sakshi
Sakshi News home page

బై బ్యాక్‌ ఆఫర్‌తో జస్ట్‌ డయల్‌ జోరు

Published Tue, Jul 25 2017 11:53 AM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

లోకల్‌ సెర్చ్‌ ఇంజీన్‌ జస్ట్‌ డయల్‌ బై బ్యాక్‌ ఆఫర్‌తో మంగళవారం నాటి బుల్‌మార్కెట్‌లో భారీలాభాలను ఆర్జించింది.

న్యూఢిల్లీ: లోకల్‌ సెర్చ్‌ ఇంజీన్‌  జస్ట్‌ డయల్‌  బై బ్యాక్‌ ఆఫర్‌తో మంగళవారం నాటి బుల్‌మార్కెట్‌లో భారీ లాభాలను ఆర్జించింది.    రూ. 84 కు సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జస్ట్‌ డయల్‌ కౌంటర్‌కు ఉత్సాహాన్నిచ్చింది.   ఇన్వెస్టర్ల   కొనుగోళ్లతో దాదాపు 3శాతం జంప్‌ చేసింది.


వాటాదారుల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో చెల్లించిన ఈక్విటీ షేర్లను కొనుగోలు  చేసే  ప్రతిపాదనను  బోర్డు ఆమోదించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ లో బోర్డు డైరెక్టర్లు చెప్పారు. దీని ద్వారా రూ. 84 కోట్ల రూపాయలదాకా వెచ్చించనున్నట్టు  ప్రకటించింది.  షేరు ధర రూ. 700 ధర మించకుండా  సంస్థ గరిష్టంగా 11.98 లక్షల షేర్లను కొనుగోలు  చేయనుంది.  అలాగే  అభిషేక్ బన్సాల్ ని ఛీఫ్‌ ఫైనాన్షయిల్‌ ఆఫీసర్‌గా జస్ట్‌ డయల్‌ బోర్డ్‌ నియమించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement