buyback offer
-
Kia: కారు నచ్చకుంటే 30 రోజుల్లో వాపస్ చేయొచ్చు!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ ప్రీమియం మల్టీపర్పస్ వెహికల్ (ఎంపీవీ) కార్నివాల్‌పై కొత్త స్కీమ్ ప్రకటించింది. కొనుగోలుదారులు కారు పనితీరుపై సంతృప్తి చెందని పక్షంలో కొన్న 30 రోజుల్లో వాపసు చేయొచ్చని తెలిపింది. కార్నివాల్ ఎంపీవీలోని అన్ని వేరియంట్స్‌కి ‘శాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ స్కీమ్’ వర్తిస్తుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కీమ్ కింద వాపసు చేయాలంటే కొన్న తేదీ నుంచి ప్రయాణించిన దూరం 1,500 కి.మీ.లకు మించకూడదు. అలాగే ఎలాంటి డ్యామేజీలు, పెండింగ్ క్లెయిమ్‌లు మొదలైనవి ఉండకూడదు. హైపోథికేషన్ ఉండకూడదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉంటుంది. వాపసు చేస్తే ఎక్స్–షోరూం ధరలో దాదాపు 95% మొత్తంతో పాటు రిజిస్ట్రేషన్, ఫైనాన్స్ మొదలైన వాటికి అయిన ఇతర ఖర్చులకు కవరేజీ ఉంటుంది. ప్రస్తుత గడ్డుకాలంలో తమ కస్టమర్లకు మరింత భరోసా కల్పించేందుకు ఈ స్కీము దోహదపడగలదని కియా ఇండియా ఈడీ టే–జిన్ పార్క్ తెలిపారు. చదవండి: New York Mercantile Exchange: మళ్లీ పసిడి జిగేల్! -
భారీ ఆఫర్: దూసుకుపోయిన ఇన్ఫోసిస్
సాక్షి, ముంబై: 1800 పాయింట్లుకు పైగా కుప్పకూలిన దలాల్ స్ట్రీట్‌లో ఈ సోమవారం బ్లాక్ మండేగా నిలిచింది. స్టాక్మార్కెట్లో 2021లో ఇదే అదిపెద్ద పతనం. అయితే దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది. తమ బోర్డు సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని ఆదివారం ఎక్స్ఛేంజీలకు సమాచారం కంపెనీ వెల్లడించడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ఫోసిస్ షేరు ఏకంగా 2.72 శాతం ఎగిసి రూ.1480 తాకింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ బీఎస్ఇలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 6.12 లక్షల కోట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా నష్టపోతోంది. (మార్కెట్ల క్రాష్: రూ. 7 లక్షల కోట్లు మటాష్) ఏప్రిల్ 14, 2021న బోర్డు సమావేశం ముగిసిన తరువాతఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్ ప్రకటించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. ప్రధానంగా క్యూ4 ఫలితాలు, బోర్డ్ మీటింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనుందని అంచనా. దీనికితోడు ఫైనల్ డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించనుందని సీఎల్ఎస్ఏ అంచనాలు వెలువరించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందనితెలిపింది. ఈ బైబ్యాక్‌ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లయితే,రెండేళ్ళలో ఇన్ఫోసిస్ రెండో బై బ్యాక్ ఆఫర్ అవుతుంది. మార్చి 2019న 747 ధర వద్ద 11.05 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లను 8,260 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (బంపర్ ఆఫర్ : ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీ తగ్గింపు) చదవండి : ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త! -
కార్పొరేట్ ఇండియా... డివిడెండ్ బొనాంజా!
ఇటీవల నగదు నిల్వలు అధికంగా గల(క్యాష్ రిచ్) కంపెనీలు వాటాదారులకు డివిడెండ్లు, బైబ్యాక్‌ల రూపంలో లాభాలను పంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు విస్తరణ ప్రాజెక్టుల వ్యయాలు తగ్గడం, వ్యాపార నిర్వహణ ద్వారా మెరుగుపడుతున్న క్యాష్‌ఫ్లో తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వార్షిక లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండుగా అందించనున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రకటించడాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా దేశీ బ్లూచిప్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు, బీమా, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను మినహాయిస్తే.. పలు లిస్టెడ్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2020 మార్చికల్లా టాప్ లిస్టెడ్ కంపెనీల వద్ద రూ. 11 లక్షల కోట్లకుపైగా నగదు, తత్సమాన నిల్వలున్నాయి. ఇవి ఆయా కంపెనీల మొత్తం నెట్‌వర్త్‌లో 30 శాతానికి సమానమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండ్లకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల కాలంలో చెల్లించిన డివిడెండ్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో వాటాదారులకు భారీ నగదు అందనున్నట్లు నిపుణులు తెలియజేశారు. బజాజ్ ఆటో కొత్త డివిడెండ్ పాలసీ నేపథ్యం లో ఇకపై మరిన్ని కార్పొరేట్స్ ఈ బాటలో నడిచే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు గత వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డివిడెండ్ పంపిణీ పాలసీని సమీక్షించింది. దీనిలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా డివిడెండ్ పాలసీలోకి వచ్చే టాప్–500 కంపెనీల జాబితాను టాప్–1,000కు సవరించింది. ఇది డివిడెండ్ చెల్లింపు విధానాలలో మార్పులకు కారణంకానున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బజాజ్ దూకుడు... గత మూడేళ్లలో బజాజ్ ఆటో వాటాదారులకు లాభాల్లో 47 శాతం వాటాను డివిడెండ్లుగా పంచింది. ఈ బాటలో గతేడాది డివిడెండ్ చెల్లింపులకు రూ. 3,472 కోట్లను వెచ్చించింది. తద్వారా అధిక చెల్లింపుల జాబితాలో 10వ ర్యాంకులో నిలిచింది. రూ. 16,000 కోట్లవరకూ మిగులు ఉన్నదని, దీనికితోడు వార్షికంగా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. దీంతో అధిక డివిడెండ్ పాలసీకి తెరతీసినట్లు వెల్లడించింది. కాగా.. దేశీ కార్పొరేట్ల వద్ద గతేడాదికల్లా నగదు నిల్వలు 13.8%కి చేరాయి. ఇందుకు ఐటీ కంపెనీల ఆర్జనల మెరుగుదలతోపాటు.. రిలయన్స్, ఎయిర్టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల నిధుల సమీకరణ కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిమాండ్ ఎఫెక్ట్ ఇటీవల డిమాండ్ మందగించడంతో ఆటో, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ తదితర రంగాలలో భారీ విస్తరణ ప్రణాళికలు తగ్గినట్లు ఈక్వినామిక్స్ అండ్ రీసెర్చ్ అడ్వయిజరీ పేర్కొంది. దీంతో మరిన్ని కంపెనీలు డివిడెండ్ చెల్లింపులను పెంచడం, షేర్ల బైబ్యాక్‌లు వంటివి చేపట్టవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అధిక డివిడెండ్లను చెల్లిస్తున్న కొన్ని కంపెనీలు తమ లాభాల్లో మరింతగా ఇన్వెస్టర్లకు అందించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ నేపథ్యంలోనూ గతేడాది(2019–20) ఫైనాన్షియల్‌యేతర రంగ కంపెనీలు 12.8% అధికంగా రూ.1.7 లక్షల కోట్లను వాటాదారులకు అందించినట్లు తెలిపారు. వెరసి 2019–20లో మొత్తం కంపెనీలు తమ నికర లాభాల్లో 78% వాటాను డివిడెండ్లకు కేటాయించాయి. అంతక్రితం ఏడాది ఇది 55% శాతమే. బైబ్యాక్‌లతో... 2019 జనవరి నుంచి చూస్తే పలు కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లను చేపట్టాయి. తద్వారా దాదాపు రూ. 64,000 కోట్లను వెచ్చించాయి. ఈ జాబితాలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాతోపాటు.. పీఎస్‌యూలు ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ప్రైవేట్ రంగ కంపెనీ అదానీ పోర్ట్స్ తదితరాలున్నాయి. పటిష్ట నిర్వహణ లాభాలు, నీరసించిన ట్రెజరీ ఈల్డ్స్, విస్తరణ ప్రణాళికల్లో మందగమనం వంటి అంశాలు పలు కంపెనీలను బైబ్యాక్, డివిడెండ్లవైపు ప్రోత్సాహిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ వర్గాలు తెలియజేశాయి. -
ఎల్ అండ్ టీ మెగా బై బ్యాక్: చరిత్రలో తొలిసారి
సాక్షి, ముంబై: దేశీయ ఇంజనీరింగ్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు (బై బ్యాక్)కు చరిత్రలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుని వాటాదారులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. 9వేలకోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు కంపెనీ పట్ల చూపిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నామని ఎల్ అండ్ టి ఛైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. ఒక్కో ఈక్విటీ షేరువిలువు 1500రూపాయల వద్ద సుమారు 6వేల షేర్లు కొనుగోలు చేయనున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఎల్ అండ్‌టీ బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్ అండ్ టీ షేరు ధర మంగళవారం నాటి ముగింపు రూ.1,322 తోలిస్తే 13శాతం ఎక్కువ.దీంతో ఫ్లాట్‌మార్కెట్‌లో ఈ కౌంటర్ 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
ఖరీదైన ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : ఆపిల్ తన ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్ అందరికీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన ఆరు నెలల అనంతరం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఇది కల్పిస్తోంది. వీటితో పాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి కొత్త ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ కనీసం 20 వేల రూపాయల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.20వేల కంటే ఎక్కువగా బైబ్యాక్ పొందే కస్టమర్లకు అదనంగా మరో 7వేల రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్లు మామూలు స్థాయిలోనే వాడుతూ ఉండాలి. ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. అన్ని యాక్ససరీస్‌ను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న ఆఫర్లు ఆపిల్ ప్రీమియం రీసెల్లర్స్, ఇతర ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కాగ, గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 8, 8 ప్లస్లతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను ఆపిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ ఎక్స్ ప్రారంభ ధర 83,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 11తో రన్ అవుతుంది. కంపెనీ సొంత ఏ11 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఓలెడ్ డిస్ప్లేతో లాంచ్ అయిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. 5.8 అంగుళాల డిస్ప్లే, 2436 x 1125 పిక్సెల్ రెజుల్యూషన్, ఫేస్ఐడీ ఫీచర్, 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్, వీడియో కాలింగ్, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను ఇది కలిగి ఉంది. -
ఐ ఫోన్లు: జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన 8 ప్లస్ వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు వెల్లడించింది. రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ఈ సదుపాయం ఉన్నట్టు తెలిపింది అంతేకాదు సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం. అంతేకాదు ఐ ఫోన్లకు ప్రత్యేక తారిఫ్‌లను కూడా జియో ప్రకటించింది. ఐ ఫోన్ 8 లో పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు 28 రోజుల వాలిడిటీతో రూ. 799 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయంతోపాటు 90 జీబీ డేటా ఉచితం. అలాగే కాంప్లిమెంటరీ ప్రీమియం సభ్యత్వం కూడా. ఐ పోన్ 8, ఐఫోన్ 8ప్లస్ లను సెప్టెంబర్ 22 నుంచి రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే 29 నుంచి అన్ని స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి. దీంతోపాటు ఐ ఫోన్ X కూడా ప్రీ ఆర్డర్ కూడా అక్టోబర్ 27 నుంచి, కొనుగోలుకు నవంబర్ 3నుంచి అందుబాటులో ఉంటుంది. -
బైబ్యాక్‌లో వ్యవస్థాపకులూ పాల్గొనొచ్చు
బెంగళూరు: ఐటీ దిగ్గజం ప్రతిపాదించిన రూ. 13,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్లో వ్యవస్థాపకులు కూడా తమ షేర్లను విక్రయించాలనుకోవడంలో తప్పేమీ లేదని సంస్థ మాజీ సీఎఫ్‌వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లకు ఇదేమీ తప్పుడు సంకేతాలు పంపబోదని పేర్కొన్నారు. ‘సాధారణ పరిస్థితుల్లో వ్యవస్థాపకులు తమ షేర్లను విక్రయిస్తుంటేనే సందేహపడాల్సి రావొచ్చు. దేశీ పరిభాషలో బైబ్యాక్ అనేది పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే డివిడెండ్‌కు మరో రూపం లాంటిదిగా భావించవచ్చు. నిజానికి సీఈవో సిక్కా రాజీనామా చేయడానికి కాస్త ముందుగా కంపెనీ బోర్డు బైబ్యాక్ ప్రకటించడమే నాలాంటి బయటి వ్యక్తులకు అసాధారణమైనదిగా అనిపిస్తోంది‘ అని ఆయన తెలిపారు. వ్యవస్థాపకులు బైబ్యాక్‌లో షేర్లు విక్రయిస్తే. కంపెనీ భవిష్యత్‌పై సందేహాలుండటం వల్లే ప్రమోటర్లు బైబ్యాక్‌లో పాల్గొన్నారన్న సంకేతాలేమైనా ఇచ్చినట్లవుతుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ బాలా ఈ విషయాలు చెప్పారు. సీఈవో గురించి వారెప్పుడూ మాట్లాడలేదు.. కంపెనీ తమ సారథ్యంలోనే నడుస్తున్నప్పటికీ వ్యవస్థాపకులు ఎప్పుడూ కూడా తమ వాటాలను అడ్డం పెట్టుకుని నియంత్రణాధికారాలు దక్కించుకునేందుకు చూడలేదని బాలా చెప్పారు. తమ పనితీరు ఆధారంగానే కంపెనీపై అజమాయిషీ చేశారని, పనితీరు బాగుండి షేర్హోల్డర్లకు ప్రయోజనాలు చేకూర్చినంతకాలం వాటాదారుల మద్దతు తమకు ఉంటుందని వారు విశ్వసించారని తెలిపారు. ఇక, సీఈవో గురించి గానీ కంపెనీ పనితీరు లేదా వ్యూహాల గురించి గానీ వారెప్పుడూ మాట్లాడలేదని, సంస్థ వ్యవహారాల్లోనూ తలదూర్చలేదని బాలా చెప్పారు. -
ఇది కూడా ఇన్ఫీని ఆదుకోలేకపోతుంది
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను బైబ్యాక్ ఆఫర్ కూడా ఆదుకోలేకపోతుంది. సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో మొదలైన ఇన్ఫీ షేర్ల పతనం, సోమవారం ట్రేడింగ్‌లోనూ కొనసాగుతోంది. పలు బ్రోకరేజ్ సంస్థలు ఇన్ఫోసిస్ షేరు విలువను డౌన్ గ్రేడ్ చేయడంతో, ప్రారంభ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు 4.39 శాతం పడిపోతూ.. రెండేళ్ల కనిష్ట స్థాయిల వద్ద నమోదవుతున్నాయి. శుక్రవారం విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించడంతో, ఆ రోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్ఫీ భారీగా పతనమైంది. ఇంట్రాడేలో దాదాపు 13 శాతం మేర షేరు విలువ దిగజారింది. దీంతో ఇన్ఫీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.30వేల కోట్ల మేర ఆవిరైపోయింది. కాగ, సిక్కా రాజీనామా అనంతరం ఒక్కరోజు వ్యవధిలోనే అంటే శనివారం ఇన్ఫోసిస్ రూ.13వేల కోట్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఇది మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 4.92 శాతం. బైబ్యాక్ ఆఫర్‌తో కంపెనీ షేర్లు కోలుకుంటాయని విశ్లేషకులు భావించారు. కానీ ఇన్ఫీ షేర్లు కోలుకోకపోగా, రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. కంపెనీ నుంచి విశాల్ సిక్కా వైదొలగడం, స్వల్పకాలకంగా, మధ్యకాలికంగా ఇన్పీ పనితీరుపై ప్రభావం చూపుతుందని, 2017-18 ఆర్థిక సంవత్సర గైడెన్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయంటూ బ్రోకరేజ్ సంస్థలు చెప్పాయి. రూ.929 వద్ద ప్రారంభమైన షేరు విలువ రూ.929 వద్ద గరిష్ట స్థాయిలను, రూ.882.55 వద్ద కనిష్ట స్థాయిలను నమోదుచేసింది. మరోవైపు మిగతా ఐటీ దిగ్గజాలు టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రోలు లాభాలు పండిస్తున్నాయి. సిక్కా దెబ్బకు పతనమైన మార్కెట్లు కూడా నేటి ట్రేడింగ్‌లో పునరుద్ధరించుకున్నాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు మేర పైకి ఎగిసింది. -
ఇన్ఫోసిస్ షేర్లకు బైబ్యాకు జోరు
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇంట్రాడేలో ఇన్ఫోసిస్ షేర్లు 4.63 శాతం మేర పైకి ఎగిసి, రూ.1,020.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేశాయి. ఆగస్టు 19(శనివారం) షేరు బై బ్యాకు ప్రతిపాదనపై కంపెనీ బోర్డు సమావేశం కాబోతుందని ఇన్ఫీ తెలిపిన నేపథ్యంలో షేర్ల జోరు ఊపందుకుంది. '' ఇన్ఫోసిస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కంపెనీ ఈక్విటీ షేర్లు బైబ్యాకు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు 2017 ఆగస్టు 19న సమావేశం ఏర్పాటుచేస్తున్నాం'' అని ఇన్ఫోసిస్ బొంబై స్టాక్ ఎక్స్చేంజీకి ప్రకటన విడుదల చేసింది. ఆటోమేషన్, కొన్ని దేశాల్లో వీసా నిబంధనల కఠినతరంతో ఐటీ కంపెనీల కోర్ బిజినెస్‌ల వృద్ది నెమ్మదించింది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. 2017 జూన్ 30 నాటికి ఇన్ఫోసిస్ వద్ద లిక్విడ్ అసెట్స్(నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు) రూ.39వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఐటీ కంపెనీల వద్ద నగదు నిల్వలు మంచిగా ఉండటంతో, వాటిని షేర్ హోల్డర్స్‌కు పంచాలని బాగా ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీల్లో అతిపెద్ద దిగ్గజం టీసీఎస్ కూడా షేర్ బైబ్యాక్స్‌ను ప్రకటించింది. రూ.16,000 కోట్ల షేరు బైబ్యాకును ఈ ఏడాది మేలో పూర్తిచేసింది. విప్రో కూడా గత నెలలో రూ.11,000 కోట్ల బైబ్యాకును చేపట్టనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం 4.50 శాతం పైగా పెరిగి రూ.1,020 వద్ద ట్రేడవుతున్నాయి. -
బై బ్యాక్ ఆఫర్‌తో జస్ట్ డయల్ జోరు
న్యూఢిల్లీ: లోకల్ సెర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ బై బ్యాక్ ఆఫర్‌తో మంగళవారం నాటి బుల్మార్కెట్లో భారీ లాభాలను ఆర్జించింది. రూ. 84 కు సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జస్ట్ డయల్ కౌంటర్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు 3శాతం జంప్ చేసింది. వాటాదారుల నుంచి బహిరంగ మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో చెల్లించిన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను బోర్డు ఆమోదించిందని రెగ్యులేటరీ ఫైలింగ్ లో బోర్డు డైరెక్టర్లు చెప్పారు. దీని ద్వారా రూ. 84 కోట్ల రూపాయలదాకా వెచ్చించనున్నట్టు ప్రకటించింది. షేరు ధర రూ. 700 ధర మించకుండా సంస్థ గరిష్టంగా 11.98 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. అలాగే అభిషేక్ బన్సాల్ ని ఛీఫ్ ఫైనాన్షయిల్ ఆఫీసర్‌గా జస్ట్ డయల్ బోర్డ్ నియమించింది. -
వన్ ప్లస్ ఫోన్లకు బైబ్యాక్ ఆఫర్
చైనీస్ స్మార్ట్ పోన్ కంపెనీ వన్ ప్లస్, తన పాత ఫోన్ల ఎక్సేంజ్ కు బైబ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. రీగ్లోబ్ తో కలిసి వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం వన్ ప్లస్ ఫోన్లు అంటే వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ టూ, వన్ ప్లస్ ఎక్స్ లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పాత ఫోన్ ఎక్సేంజ్ పై వినియోగదారులు రూ.16 వేల వరకూ తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. ఈ బైబ్యాక్ స్కీమ్ కేవలం అమెజాన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ ఫోన్ల కంపెనీ చెప్పింది. 64జీబీ ఉన్న వన్ ప్లస్ టూ అమెజాన్ లో రూ.22,999కు లభ్యమవుతుండగా.. వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ ఎక్స్ లు రూ.19,999లకు, రూ. 14,999లకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మొదట వినియోగదారులు కొనుకోవాలనుకున్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఎంచుకుని, ఆర్డర్ ప్లేస్ చేసి, ఆర్డర్ ఐడీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అమెజాన్ లో ఫర్ చేస్డ్ మొబైల్ పేజీకి వెళ్లి, మొబైల్ పేబ్యాక్ స్కీమ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నియమ నిబంధనలను ఒప్పుకున్న తర్వాత రీగ్లోబ్ పేజీకి వినియోగదారుల వివరాలను మళ్లించబడతారు. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న స్మార్ట్ పోన్ వివరాలను ఆ రీగ్లోబల్ పేజీలో నమోదు చేయాల్సి ఉంటుంది. దానితో పాటు కొనుకుంటున్న వన్ ప్లస్ పోన్ ఆర్డర్ ఐడీని కూడా తెలపాలి. ఈ వివరాలన్నీ నమోదుచేసిన తర్వాత కొత్త ఫోన్ ధర, బైబ్యాక్ ఆఫర్, ఏ స్టోర్ లో వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందో ఆ పేజీలో కనిపిస్తాయి. ఆ పేజీలోనే వినియోగదారులు కాంటాక్టు వివరాలు ఇస్తే, రీగ్లోబల్ పేజీ నుంచి వినియోగదారులకు కాల్ వస్తుంది. కొత్తగా కొన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్, క్యాష్ బ్యాక్ ను రీగ్లోబల్ పేజీ వారు నిర్దేశించిన సమయానికి వినియోగదారులకు చేరవేస్తారు.