ఐ ఫోన్లు: జియో బంపర్‌ ఆఫర్‌ | Jio announces 70% buyback offer for iPhone 8 & 8 Plus, Rs 10,000 cashback | Sakshi
Sakshi News home page

ఐ ఫోన్లు: జియో బంపర్‌ ఆఫర్‌

Published Thu, Sep 21 2017 4:38 PM | Last Updated on Fri, Sep 22 2017 11:00 AM

Jio announces 70% buyback offer for iPhone 8 & 8 Plus, Rs 10,000 cashback

సాక్షి, ముంబై: రిలయన్స్‌  డిజిటల్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది.  కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం  ఆపిల్ ఐఫోన్ 8 ,  ఐ ఫోన​ 8 ప్లస్ వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి  అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు  వెల్లడించింది.   రిలయన్స్ డిజిటల్,  అమెజాన్‌, మై జియో.కాం జియో స్టోర్లలో ఈ సదుపాయం ఉన్నట్టు తెలిపింది

అంతేకాదు సెప్టెంబర్‌ 22 -29వ తేదీల మధ్య  రిలయన్స్‌ డిజిటల్‌  ద్వారా   స్మార్ట్‌ ఫోన్‌లను ప్రీ బుకింగ్‌  చేస్తే రూ.10వేల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది.  సెప్టెంబర్‌ 29 లాంచింగ్‌ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.   అయితే ఈ ఆఫర్‌  సిటీ బ్యాంక్‌  క్రెడిట్‌ ద్వారా  కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే  లభ్యం. అంతేకాదు ఐ ఫోన్లకు  ప్రత్యేక తారిఫ్‌లను కూడా   జియో  ప్రకటించింది.  ఐ ఫోన్‌ 8 లో పోస్ట్‌ పెయిడ్‌ ఖాతాదారులకు  28 రోజుల వాలిడిటీతో రూ. 799 ప్లాన్‌లో  అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ సదుపాయంతోపాటు  90 జీబీ  డేటా ఉచితం. అలాగే కాంప్లిమెంటరీ  ప్రీమియం సభ్యత్వం కూడా.
ఐ పోన్‌ 8, ఐఫోన్‌ 8ప్లస్‌ లను సెప్టెంబర్‌ 22 నుంచి  రిలయన్స్ డిజిటల్,  అమెజాన్‌, మై జియో.కాం జియో స్టోర్లలో ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు. అలాగే 29 నుంచి  అన్ని స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి. దీంతోపాటు ఐ ఫోన్‌ X కూడా ప్రీ ఆర్డర్‌ కూడా అక్టోబర్‌ 27 నుంచి, కొనుగోలుకు నవంబర్‌ 3నుంచి అందుబాటులో ఉంటుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement