Cashback
-
ఈ–స్కూటర్ కస్టమర్లకు చార్జర్ డబ్బు వాపస్
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలతో పాటు చార్జర్లను విడిగా కొనుగోలు చేసిన కస్టమర్లకు సదరు చార్జర్ల డబ్బును వాపసు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ తెలిపాయి. ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. స్వార్ధ శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ విద్యుత్ వాహనాల పరిశ్రమ గత కొన్నాళ్లుగా అసాధారణంగా వృద్ధి చెందినట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్లో ఓలా పేర్కొంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన కస్టమర్లందరికీ చార్జర్ల డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఇది సుమారు రూ. 130 కోట్లు ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఈవీ స్కూటర్లతో కలిపే చార్జర్లను విక్రయించే అంశంపై భారీ పరిశ్రమల శాఖతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఎథర్ ఎనర్జీ తెలిపింది. చట్టబద్ధంగా ఇలా చేయాల్సిన అవసరం లేనప్పటికీ వాహనాలతో పాటే చార్జరును కూడా ఇచ్చేలా తమ నిబంధనలు మార్చుకున్నట్లు వివరించింది. అలాగే 2023 ఏప్రిల్ 12కు ముందు కొనుగోలు చేసిన వాహనాల విషయంలో చార్జర్లకు వసూలు చేసిన మొత్తాన్ని రిఫండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో టీవీఎస్ మోటార్ కంపెనీ తాము రూ. 20 కోట్లు పైచిలుకు వాపసు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్‌ఫోన్ మీ సొంతం!
దీపావళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’ తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్ జాయ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివో ఎక్స్80 సిరీస్, వివో వీ25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై ఇప్పటి వరకు లేనంత డిస్కౌంట్‌ను ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్80 సిరీస్‌పై రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు ఈఎంఐపై ఈ ప్రయోజనాలు అందిస్తోంది. ముందు రూ.101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్‌లో నచ్చిన ఫోన్‌ను తీసుకెళ్లొచ్చని వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత ఈఎంఐ ( EMI) కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని పై వివో పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ ఆఫర్‌పై పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని వివో రిటైలర్ సంప్రదించడం ఉత్తమం. రూ.15వేలకు పైన ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, ఆరు నెలల అదనపు వారంటీ ఇస్తున్నట్టు తెలిపింది. వై సిరీస్ ఫోన్లను ఈఎంఐపై తీసుకుంటే రూ.2,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
గూగుల్‌పే మాదిరిగా...వాట్సాప్‌లో మనీ క్యాష్‌బ్యాక్..!
Whatsapp Offers 255 Rupees Cashback: ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో వాట్సాప్ పేమెంట్స్‌ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్ పేమెంట్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండనుంది. గూగుల్‌పే (తేజ్) తరహాలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ పేమెంట్స్‌కు యూజర్ల బేస్ పెంచుకునే క్రమంలో వాట్సాప్ ఈ ఐడియాతో ముందుకువచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పేరు మార్చాడో లేదో...! ఏకంగా యాపిల్‌కే గురిపెట్టాడు..! రూ. 255 వరకు కచ్చితమైన క్యాష్‌బ్యాక్..! వాట్సాప్ పేమెంట్స్ వాడుతున్న యూజర్లు వారి స్నేహితుడికి లేదా ఇతరులకు రూ. 1 చెల్లిస్తే రూ. 51 రూపాయలను క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్ అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ మొదటి ఐదు లావాదేవీలకు మాత్రమే చెల్లుబాటు కానుంది. ప్రతి ఐదు లావాదేవీలకు యూజర్లుకు కచ్చితమైన రూ. 51 క్యాష్‌బ్యాక్ వస్తోంది. వాట్సాప్ పేమెంట్స్ ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా యూజర్లు మొత్తంగా రూ.255 వరకు క్యాష్‌బ్యాక్‌ను వాట్సాప్ నుంచి పొందవచ్చు. వాట్సాప్ పేమెంట్ సర్వీస్‌తో రిజిస్టర్ చేసుకున్న యూజర్ల బ్యాంక్ ఖాతాలో క్యాష్‌బ్యాక్ నేరుగా జమ అవుతుంది. వాట్సాప్ పేమెంట్స్‌ను ఇలా సెట్ చేయండి..! వాట్సాప్ పేమెంట్స్ చేయాలనుకునే వారు మొదట వాట్సాప్ అప్ డేట్ వెర్షన్ కలిగి ఉండాలి. వాట్సాప్ చాట్ ఆప్షన్లో కన్పించే ‘₹’ సింబల్‌పై ప్రెస్ చేయాలి. ఒక వేళ మీరు ముందుగానే రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు పేమెంట్ చేసే అప్షన్ కన్పిస్తోంది. ఒకవేళ చేయకపోతే ఇతర యూపీఐ యాప్స్ మాదిరిగానే మీ బ్యాంక్ అకౌంట్‌ను వాట్సాప్‌తో లింక్ చేయాలి. మీరు బ్యాంక్‌లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఆ నెంబర్‌తోనే వాట్సాప్ ఉండాలి. యూపీఐ వెరిఫికేషన్ కోసం బ్యాంక్ నుంచి ఆటో డిటెక్ట్ ఎస్ఎంఎస్ వస్తుంది వాట్సాప్ పే, యూపీఐ సెటప్ పూర్తయిన తర్వాత వాట్సాప్ చాట్ విండో నుంచే మీరు పేమెంట్స్ చేయవచ్చు. చదవండి: మహీంద్రా ఎక్స్‌యూవీ700 జావెలిన్ ఎడిషన్‌పై ఓ లుక్కేయండి..! -
అమెజాన్‌లో రైలు టికెట్లు : క్యాష్ బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అమెజాన్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకోసం అమెజాన్ బుకింగ్ ఫీచర్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, ఈ బుకింగ్ ఫీచర్ అమెజాన్ మొబైల్ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ త్వరలో ఐఓఎస్ ప్లాట్ఫామ్లో కూడా లభ్యం కానుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తమ మొదటి టికెట్ బుకింగ్‌లో 10 శాతం క్యాష్‌బ్యాక్ (రూ .100 వరకు) పొందుతారని అమెజాన్ తెలిపింది. ప్రైమ్ సభ్యులు తమ మొదటి బుకింగ్ కోసం 12 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 120 వరకు) పొందవచ్చు. పరిమిత కాలానికి సర్వీస్, పేమెంట్ గేట్‌వే లావాదేవీ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అయితే అమెజాన్ పే వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది విమానం, బస్సు టికెట్ల బుకింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన తాము తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని అమెజాన్ పే డైరెక్టర్ వికాస్ బన్సాల్ వెల్లడించారు. అమెజాన్ పే ట్యాబ్‌కు వెళ్లి, ఆపై రైళ్లు / కేటగిరీని ఎంచుకుని టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇతర ట్రావెల్ బుకింగ్ పోర్టల్ మాదిరిగానే, కస్టమర్లు తమకు కావలసిన గమ్యస్థానాలు, ప్రయాణ తేదీలను ఎంచుకోవచ్చు. అమెజాన్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతిని ఎంచుకోవచ్చు. అలాగే టికెట్ బుక్ అయిన తరువాత పీఎన్ఆర్ నెంబరు, సీటు తదితర వివరాలను కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలి అమెజాన్ యాప్ లోకి వెళ్లి ఆఫర్స్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఐఆర్సీటీసీ ఆప్షన్ ను ఎంచుకుని బుక్ నౌ క్లిక్ చేయాలి. అనంతరం ప్రయాణం, రైలు, ప్యాసింజర్ వివరాలను నమోదు చేసి టికెట్ బుక్ చేసుకొని అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేయాలి. వెంటనే క్యాష్ బ్యాక్ మీ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది. టికెట్ క్యాన్సిలేషన్ పై తక్షణమే నగదు వాపసు సదుపాయం అందించడం విశేషం. -
నిరుద్యోగ భృతి, క్యాష్‌బ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే యువ స్వాభిమాన్ యోజన కింద నిరుద్యోగులకు నెలకు రూ. 5,000–7,500 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంది. కరెంటు, నీటిని ఆదా చేసే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ పథకాలు అమలు చేస్తామంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. బడ్జెట్లో 25 శాతం నిధులను కాలుష్యంపై పోరాటానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కేటాయిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తామని తెలిపింది. 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.15 కే భోజనం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘ఐసీ హోగీ హమారీ ఢిల్లీ’ పేరిట కాంగ్రెస్ నాయకులు తమ మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
బిగ్ సీలో సంక్రాంతి ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. శామ్సంగ్ గెలాక్సీ జే6, జే6 ప్లస్, ఏ7 మొబైల్స్‌పై అన్ని బ్యాంక్‌ల కార్డ్‌ల ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్, అన్ని వివో మోడల్స్‌పై సర్ప్రైజ్ గిఫ్ట్‌లను అందిస్తోంది. దీంతో పాటు ఒప్పో ఎఫ్9 ప్రొ కొంటే రైస్ కుక్కర్ ఉచితం, రూ.1,590 కార్బన్న్కే3 బూమ్ మ్యాక్స్ సెల్‌ఫోన్‌పై రూ.2,500 విలువ గల ఫ్యాన్ ఉచితంగా అందుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉచిత డాటా భారీ ఆఫర్లతో సంచలనంగా మారిన రిలయన్స్ జియో ఈ ఏడాది కూడా కొత్త సంవత్సరం ఆఫర్‌తో యూజర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. జియో తాజాగా ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ద్వారా రూ. 399 రీచార్జ్‌పై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇది జియో ప్రస్తుత, కొత్త యూజర్లు అందరికీ వర్తిస్తుందని జియో ప్రకటించింది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ కూపన్లు రూపంలో లభిస్తుందని తెలిపింది. జియో న్యూ ఇయర్ ఆఫర్ కోసం ఆన్లైన్ రీటైలర్ అజియో.కాంతో జత కట్టింది. రూ.399 రీచార్జ్‌పై 100శాతం అంటే రూ.399 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. దీనికి సంబంధిచిన కూపన్ మై జియో కూపన్లో యాడ్ అవుతుంది. దీని ద్వారా అజియోలో షాపింగ్‌కు వాడవచ్చు. అయితే ఈ క్యాష్ బ్యాక్‌ను పొందాలంటే కనీసం వెయ్యి రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ జనవరి 31,2019తో ముగుస్తుంది. ఇలా వచ్చిన కూపన్లను మార్చి 15, 2019 లోపు రిడీమ్ చేసుకోవాలి. -
స్మార్ట్ఫోన్లపై పేటీఎం బంపర్ ఆఫర్
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారు.. కానీ మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం మాల్, ఒప్పో, మోటరోలా, హనర్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లపై ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఒప్పో ఎఫ్ 5 యూత్ ఈ ఏడాది విడుదలైన ‘ఒప్పో ఎఫ్ 5 యూత్’ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఇదే కాక కంపెనీ అదనంగా మరో 5,499 రూపాయల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే మొత్తంగా కలుపుకుని చివరకు ‘ఒప్పో ఎఫ్ యూత్’ 14,500 రూపాయలకే వస్తుంది. క్యాష్‌బ్యాక్ పొందాలనుకుంటే పేమెంట్ చేసేటప్పుడు వినియోగదారుడు ‘ఎమ్‌ఓబీ15’ అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది. క్యాష్‌బ్యాక్ ఎమౌంట్ 24 గంటల్లో పేటీఎం వాలెట్‌కు యాడ్ అవుతుందని తెలిపారు. ఒప్పో ఎఫ్7 డైమండ్ బ్లాక్ ఎడిషన్ ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత విలువ 27, 990 రూపాయలు. కంపెనీ 4 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత ఈ ఫోన్ ఖరీదు 23,990 రూపాయలకు తగ్గింది. ఇదే కాక ప్రోమో కోడ్ ‘ఎమ్‌ఓబీ15’ను అప్లై చేస్తే అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేటీఎం తెలిపింది. మోటో జీ6 ఈ మధ్యే లాంచ్ అయిన మోటో జీ6 స్మార్ట్‌ఫోన్ ఖరీదు 19,999 రూపాయలు. కానీ ఇప్పటికే కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్‌తో ఇది 16,998 రూపాయలకు లభిస్తుంది. ఇదే కాక పేటీఎం అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్ ఇస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరో 2,210 రూపాయలు తగ్గుతుంది. పేటీఎం డిస్కౌంట్ అప్లై అవ్వాలంటే పేమెంట్ చేసే సమయంలో ప్రోమో కోడ్ ‘ఎమ్‌ఓబీ15’ను నమోదు చేయలని కంపెనీ చెప్పింది. మోటో జీ 6 ప్లే మోటో జీ 6 తో పాటు జీ 6 ప్లేపై కూడా పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ ప్రకటించిన 1,744 రూపాయల డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ 12,255 రూపాయలకు వస్తుంది. ఇదే కాక పేటీఎం ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్‌తో అదనంగా మరో 1,593 రూపాయలు తగ్గుతుంది. 15 శాతం క్యాష్‌బ్యాక్ అప్లై అవ్వాలంటే పేమెంట్ చేసే సమయంలో ప్రోమో కోడ్ ‘ఎమ్‌ఓబీ15’ను ఎంటర్ చేయాలి. హనర్ 9 లైట్ హనర్ కంపెనీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ హనర్ 9 లైట్. ఈ ఏడాది లాంచ్ అయిన హనర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ప్రకటించిన 2,000 రూపాయల డిస్కౌంట్‌తో పాటు అదనంగా పేటీఎం ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్‌ను కలుపుకుని ఈ ఫోన్ ఫైనల్ ప్రైస్ 14,998 రూపాయలకు లభిస్తుంది. హనర్ 7 ఎక్స్ గతేడాది డిసెంబర్లో విడుదలైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హనర్ 7 ఎక్స్ పై పేటీఎం మాల్ ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్ వల్ల 2,516 రూపాయలు తగ్గి చివరకూ 16, 770 రూపాయలకు అందుబాటులో ఉందని పేటీఎం ప్రకటించింది. -
రూ.70 వేల ఫోన్, రూ.11వేలకే!
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మరో సేల్‌ను ప్రారంభించింది. సూపర్ వాల్యు వీక్ పేరుతో నేటి నుంచి ఈ సేల్కు తెరలేపింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా కొత్త స్మార్ట్ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, బైబ్యాక్ గ్యారెంటీలు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 2, ఐఫోన్ 6, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, మోటో ఎక్స్4 వంటి పాపులర్ మొబైల్ ఫోన్లను ఈ సేల్‌లో అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యు వీక్ సేల్... సూపర్ వాల్యు వీక్ సేల్ కింద, ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. బైబ్యాక్ గ్యారెంటీతో పిక్సెల్ 2 128 జీబీ మోడల్ కేవలం 10,999 రూపాయలకే అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 70వేల రూపాయలు. అయితే ఈ ఆఫర్ పొందాలంటే, వినియోగదారులు తొలుత రూ.199తో బైబ్యాక్ గ్యారెంటీ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై 9,001 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో పిక్సెల్ 2 ఫోన్ ధర 60,999 రూపాయలకు దిగొచ్చింది. అదేవిధంగా హెచ్డీఎఫ్ డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు అదనంగా మరో 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ క్యాష్‌బ్యాక్‌తో పిక్సెల్ 2 ధర రూ.52,999కు తగ్గింది. వీటితో పాటు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో రూ.42 వేల ఎక్స్చేంజ్ వాల్యును కొనుగోలు దారులను పొందుతారు. ఇలా పిక్సెల్ 2 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,999కు పడిపోయింది. పిక్సెల్ 2, 128 జీబీ వేరియంట్‌పైనే కాక, ఫ్లిప్‌కార్ట్ తన పిక్సెల్ 2 ఎక్స్ఎల్ 64 జీబీ మోడల్‌పై కూడా రూ.37 వేల బైబ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.44 వేల బైబ్యాక్‌ను అందిస్తోంది. ఇదే రకమైన ఆఫర్‌ను మోటో ఎక్స్4కు కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా మోటో ఎక్స్4 స్మార్ట్‌ఫోన్ రూ.6999కు లభ్యమవుతోంది. ఈ హ్యాండ్సెట్ అసలు ధర 22,999 రూపాలయు. బైబ్యాక్ గ్యారెంటీతో పాటు , ఫ్లిప్‌కార్ట్ పలు స్మార్ట్ఫోన్లపై ‘ఈజీ నో కాస్ట్ ఈఎంఐ’ ను కూడా ఆఫర్‌ను చేస్తోంది. -
రైల్వే వినూత్న ఆఫర్ : వాటిపై క్యాష్‌బ్యాక్
వడోదర : దేశీయ రైల్వే మరో వినూత్న ఆఫర్ ప్రకటించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి రైల్వే రివార్డ్స్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయడానికి ఉపయోగపడితే ప్రయాణికులకు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనికోసం వడోదర రైల్వే స్టేషన్లో బాటిల్ క్రషర్లను ఇన్స్టాల్ చేసింది. ఈ స్కీమ్ కింద క్రషింగ్ మిషన్‌లో ప్లాస్టిక్ బాటిల్ వేస్తే, ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ప్రయాణికుల పేటీఎం అకౌంట్లో క్రెడిట్ చేయనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందడానికి, బాటిల్‌ను వేసిన తర్వాత ప్రయాణికులు మొబైల్ నెంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొబైల్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న పేటీఎం అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్తాయి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా దేశీయ రైల్వే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దీంతో కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చని దేశీయ రైల్వే యోచిస్తోంది. వడోదరతో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఇలాంటి మిషన్లనే ఏర్పరించింది. -
అల్కాటెల్ 3వీ స్మార్ట్‌ఫోన్, బడ్జెట్ ధర, ఫీచర్లు అదుర్స్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతోంది. ఇప్పటికే షావోమి, వివో, లెనోవా లాంటి కంపెనీలు ఆకట్టుకునే స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి. తాజాగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా అల్కాటెల్ అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. 'అల్కాటెల్ 3వి' పేరుతో తాజా డివైస్‌ను మంగళవారం విడుదల చేసింది. ముఖ్యంగా రూ.9,999 ధరలో ఈ నెల 31వ తేదీ నుంచి వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపర్చింది. అంతేకాదు ఫోన్‌ను కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్, ఇతర ఆఫర్లను అందిస్తోంది. జియో కస్టమర్లకు ఈ ఫోన్‌పై రూ.2200, రూ.3700 ల క్యాష్‌బ్యాక్ సదుపాయాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు వెయ్యి రూపాయలు, రూ.500 విలువ చేసే మింత్రా, క్లియర్ ట్రిప్ గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ సదుపాయం కూడా లభ్యం. ప్రీమియం బ్రాండ్‌లో కసమర్లు ఆశించే ఫేస్ అన్‌లాక్ సహా అన్ని ఫీచర్లతో తాజా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశామని భారత్‌లో అల్కాటెల్ పరికరాలను విక్రయిస్తున్న చైనాకు చెందిన టిసిఎల్ కమ్యూనికేషన్ రీజనల్ డైరెక్టర్ ప్రవీణ్ వలేచా తెలిపారు. అల్కాటెల్ 3వి ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160x1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 1.45 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వినియోగదారులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మెగా ప్లాన్‌ను రూపొందిస్తోంది. వ్యాపారస్తులకు క్యాష్‌బ్యాక్‌లు, వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో ప్రోత్సహాకాలు అందించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనల మేరకు డిజిటల్ రూపంలో లావాదేవీలు నిర్వహించిన వినియోగదారులకు ఎంఆర్పీపై డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిసింది. ఈ డిస్కౌంట్ 100 రూపాయల వరకు ఉండనుంది. మరోవైపు వ్యాపారస్తులకు క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ మోడ్‌లో నిర్వహించే టర్నోవర్ ఆధారితంగా అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో మే 4న నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రధానమంత్రి ఆఫీసు నిర్వహించిన సమావేశంలో చర్చించారు. క్యాష్‌బ్యాక్ మాత్రమే కాక, డిజిటల్ మోడ్ ద్వారా నిర్వహించే టర్నోవర్లపై పన్ను క్రెడిట్ పొందటానికి వ్యాపారాలు అనుమతించే ప్రతిపాదనపై కూడా చర్చించారు. ప్రత్యక్ష పన్నుల వైపు డిజిటల్ లావాదేవీలకు ఏమైనా ప్రోత్సహకాలు ఇవ్వాలో లేదో కూడా పీఎంఓ మీటింగ్ చర్చించినట్టు తెలిసింది. -
ఖరీదైన ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ : ఆపిల్ తన ఐఫోన్ 10వ వార్షికోత్సవంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్ అందరికీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసిన ఆరు నెలల అనంతరం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఇది కల్పిస్తోంది. వీటితో పాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి కొత్త ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ కనీసం 20 వేల రూపాయల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.20వేల కంటే ఎక్కువగా బైబ్యాక్ పొందే కస్టమర్లకు అదనంగా మరో 7వేల రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్8, శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్లు మామూలు స్థాయిలోనే వాడుతూ ఉండాలి. ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. అన్ని యాక్ససరీస్‌ను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న ఆఫర్లు ఆపిల్ ప్రీమియం రీసెల్లర్స్, ఇతర ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కాగ, గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 8, 8 ప్లస్లతో పాటు ఐఫోన్ ఎక్స్‌ను ఆపిల్ లాంచ్ చేసిన సంగతి తెలిసింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ ఎక్స్ ప్రారంభ ధర 83,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 11తో రన్ అవుతుంది. కంపెనీ సొంత ఏ11 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఓలెడ్ డిస్ప్లేతో లాంచ్ అయిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. 5.8 అంగుళాల డిస్ప్లే, 2436 x 1125 పిక్సెల్ రెజుల్యూషన్, ఫేస్ఐడీ ఫీచర్, 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్, వీడియో కాలింగ్, 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను ఇది కలిగి ఉంది. -
ఆ ఫోన్లపై ఎయిర్టెల్ రూ.2 వేల క్యాష్‌బాక్
న్యూఢిల్లీ : ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ ప్లాన్ ప్రచారంలో భాగంగా మోటరోలా, లెనోవా 4జీ స్మార్ట్ఫోన్లపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్ రూ.2 వేల క్యాష్‌బాక్ ఆఫర్‌ను ప్రకటించింది. మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ మొబైళ్లకు మాత్రమే ఈ క్యాష్‌బాక్ వర్తిస్తుంది. క్యాష్‌బాక్ ఆఫర్లో భాగంగా మోటో సీ మొబైల్ రూ.3,999 , మోటో ఈ4 మొబైల్ రూ.6,499, లెనోవో కే8 నోట్ రూ.10,999 లకే లభిస్తుంది. స్మార్ట్ఫోన్లు అత్యంత దిగువస్థాయి కస్టమర్లకు కూడా లభ్యమయ్యేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేశ్ తెలిపారు. -
రిలయన్స్ జియో 'ఫుట్‌బాల్ ఆఫర్'
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొలిసారి జియో నెట్వర్క్ యాక్టివేట్ చేసుకునే కొత్త స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 2,200 రూపాయల వరకు ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. షావోమి, శాంసంగ్, మోటోరోలా, ఆసుస్, హువావే, ప్యానాసోనిక్, ఎల్జీ, నోకియా, మైక్రోమ్యాక్స్ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు జియో ఈ ఫుట్‌బాల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ఫోన్ యాక్టివేషన్ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ ఓచర్ ఒక్కో దాని విలువ 50 రూపాయలు. ఈ ఓచర్లను తర్వాత రీఛార్జ్‌లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్ ఆఫర్ వర్తిస్తుంది. మైజియో యాప్ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్‌పైరి అయిపోతాయి. ఈ ఓచర్లను వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు. ఒక్కసారి మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్యాష్‌బ్యాక్ ఓచర్లను మైజియో యాప్‌లో ''మై ఓచర్స్' సెక్షన్ కింద చూసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా కేవలం అర్హత పొందిన డివైజ్‌లలో దేశీయ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ డివైజ్‌లకు ఇప్పటికే జియో తన ఫుట్‌బాల్ ఆఫర్‌ను లాంచ్ చేసింది. అదనంగా కోమియో ఎస్1 లైట్, సీ1 లైట్ యూజర్లకు ఈ ఆఫర్‌కు అర్హులే. షావోమి రెడ్మి వై1, శాంసంగ్ ఆన్8, హానర్ 9ఐ, బ్లాక్‌బెర్రీ కీవన్, మైక్రోమ్యాక్స్ భారత్1 వంటి డివైజ్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. -
ఐ ఫోన్లు: జియో బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆపిల్ ఐఫోన్ 8 , ఐ ఫోన 8 ప్లస్ వినియోగదారులకి ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఇస్తే.. వీటి అసలు కొనుగోలు ధరలో 70 శాతం తిరిగి ఇవ్వనున్నట్టు వెల్లడించింది. రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ఈ సదుపాయం ఉన్నట్టు తెలిపింది అంతేకాదు సెప్టెంబర్ 22 -29వ తేదీల మధ్య రిలయన్స్ డిజిటల్ ద్వారా స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేస్తే రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 29 లాంచింగ్ సందర్భంగా ఈ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ సిటీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభ్యం. అంతేకాదు ఐ ఫోన్లకు ప్రత్యేక తారిఫ్‌లను కూడా జియో ప్రకటించింది. ఐ ఫోన్ 8 లో పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు 28 రోజుల వాలిడిటీతో రూ. 799 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయంతోపాటు 90 జీబీ డేటా ఉచితం. అలాగే కాంప్లిమెంటరీ ప్రీమియం సభ్యత్వం కూడా. ఐ పోన్ 8, ఐఫోన్ 8ప్లస్ లను సెప్టెంబర్ 22 నుంచి రిలయన్స్ డిజిటల్, అమెజాన్, మై జియో.కాం జియో స్టోర్లలో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే 29 నుంచి అన్ని స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి. దీంతోపాటు ఐ ఫోన్ X కూడా ప్రీ ఆర్డర్ కూడా అక్టోబర్ 27 నుంచి, కొనుగోలుకు నవంబర్ 3నుంచి అందుబాటులో ఉంటుంది. -
భారీ క్యాష్ బ్యాక్, లక్కీ విన్నర్స్కి ఐ ఫోన్ ఫ్రీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్లాట్‌ఫాం పేటీఎం మాల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ’మేరా క్యాష్‌బ్యాక్ సేల్’ పేరుతో లాంచ్ చేసింది. అన్ని ఆపిల్ ఉత్పత్తులతో పాటు టాప్ సెల్లింగ్ మోడల్స్ పై రూ. 6వేల నుంచి రూ.15దాకా కచ్చితమైన నగదు వాపస్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ అవకాశం సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మోడల్ జీబీ వేరియంట్ క్యాష్ బ్యాక్ ఐ ఫోన్ 6 32 జీబీ వేరియంట్ రూ.6వేల క్యాష్ బ్యాక్ ఐ ఫోన్ 7 32 జీబీ వేరియంట్ రూ 8,000 క్యాష్ బ్యాక్ ఐఫోన్ 7 128 జీబీ వేరియంట్ రూ. 10,000 క్యాష్ బ్యాక్ ఐఫోన్ 7 256 జీబీ వేరియంట్ రూ.10,000 క్యాష్ బ్యాక్ ఐఫోన్ 7 ప్లస్ 256 జీబీ వేరియంట్ భారీ ఆఫర్ రూ. 15,000 అంతేకాదు.. ఈ నాలుగు రోజుల సేల్ లో మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. 25మంది లక్కీ స్మార్ట్‌ఫోన్ కొలుగోలుదారులకు 100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా. అంటే 25మంది ఉచితంగా ఐ ఫోన్‌ను దక్కించుకోవచ్చన్నమాట. పేటీఎం లిఫాఫాతో కలిసి పేటీఎం మాల్ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్ (నాలుగు రోజుల సేల్)లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్ గెల్చుకోవచ్చని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. కాగా ఫిబ్రవరి 2016 లో ప్రారంభించబడిన, పేటీఎం మాల్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ద్విచక్ర వాహన విక్రయాల ద్వారా 100 కోట్ల రూపాయల అమ్మకాలు దాటింది. టూవీలర్ బుకింగ్ ప్లాట్‌ఫాంలో సుజుకి, హోండా, హీరో, యమహా తదితర బ్రాండ్లను అందిస్తుడగా, 2016 లో 50,000 యూనిట్లను విక్రయించింది. -
అమెజాన్ ఆపిల్ ఫెస్ట్: డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా రెండు రోజుల ఆపిల్ ఫెస్టివల్‌కు తెరతీసింది. ఈ ఫెస్టివల్లో ఐఫోన్లు, వాచ్‌లు, ఐప్యాడ్లు, ఐమ్యాక్‌లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. నేడు, రేపు ఈ ఫెస్టివల్ జరుగనుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుహోల్డర్స్పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఐఫోన్ 7, ఐఫోన్6, ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డివైజ్ ధర రూ.56,200 కాగ, ఈ ఫోన్ 11,201 రూపాయల డిస్కౌంట్‌తో 44,999 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత డివైజ్‌తో ఎక్స్చేంజ్లో ఐఫోన్ 7ను కొనుగోలు చేయాలనుకుంటే 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక 32జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 6 ధర 29,500 రూపాయలు కాగ, ఈ డివైజ్ కూడా 3,501 రూపాయల డిస్కౌంట్లో 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 6పై కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 14,920 రూపాయల వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఆపిల్‌కు చెందిన మరో ఫేమస్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎస్ఈ కూడా డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎస్ఈ అసలు ధర 26వేల రూపాయలు కాగ, 7,001 రూపాయల డిస్కౌంట్లో 25,999 రూపాయలకే ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌పై కూడా 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లపై 3000 రూపాయల తగ్గింపు, ఐప్యాడ్లపై ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐలు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. -
పేటీఎంలో క్యాష్‌బ్యాక్‌గా డిజిటల్ బంగారం ఆఫర్
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ పసిడి రూపంలోనూ పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే యూజర్లు ప్రస్తుతం తమ వాలెట్లలో ఉన్న క్యాష్‌బ్యాక్‌ను సైతం పేటీఎం గోల్డ్ కింద మార్చుకునేందుకు ప్రత్యేక ప్రమోషనల్ కోడ్‌ను కూడా ఇవ్వనున్నట్లు వివరించింది. ఈ విధంగా జమయిన డిజిటల్ బంగారాన్ని డెలివరీ తీసుకోవచ్చని, లేదా పసిడి రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీకైనా విక్రయించుకోవచ్చని పేటీఎం తెలిపింది. అత్యంత తక్కువగా రూ.1కే డిజిటల్ బంగారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలు కల్పించేందుకు ఎంఎంటీసీ–పీఏఎంపీతో పేటీఎం జట్టు కట్టిన సంగతి తెలిసిందే. -
జియోఫై పై క్యాష్ బ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ : టెలికం రంగంలో సంచలన ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. రిలయన్స్ జియోఫైపై 100 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. వైఫై రూటర్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారికి ఈ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పరిమితకాలానికి ఉద్దేశించిన ఈ ప్రమోషన్ స్కీంలో భాగంగా రెండు పథకాలను లాంచ్ చేసింది. జియో.కాం ద్వారా పోర్టబుల్ 4జీ వైఫై రౌటర్ లేదా హాట్ స్పాట్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద, రూ. 2,010 విలువైన జియో ఉచిత డేటాను, ఎక్స్ఛేంజ్ లేకుండా రూ. 1,005 విలువైన 4జీ డేటాను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వినియోగిస్తున్న డాటా కార్డు లేదా డోంగల్ లేదా హాట్‌స్పాట్ రౌటర్(ఎయిర్టెల్. బీఎస్ఎన్ఎల్ తదితర)ను జియో ఫై 4జీ రౌటర్‌తో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. జియో ఫై రౌటర్ విలువు రూ.1999 లుగా ఉంది. దీనికి ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లలో ఈ ఆఫర్ అందుబాటులోఉండనుంది. రౌటర్ కొనుగోలు చేసిన వారికి రూ.1005 విలువైన 5 వోచర్లను ఉచితంగా అందించనుంది. ఎక్స్ఛేంజ్ లేకుండా రూ.201 విలువైన 5 టాప్ అప్ కూపన్ల ద్వారా 4 జీ డేటా ఉచితం. ఇతర నాన్ జియో రౌటర్లతో ఎక్సేంజ్ చేసుకుంటే ఎక్స్ఛేంజ్ తో రూ.201 విలువైన 10టాప్ అప్ వోచర్లు ఉచితం. ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వరుస 5 రీచార్జ్లకుగాను కస్టమర్లకు అదనంగా 5జీబీ 4 జీ డేటా ఉచితంగా అందిస్తుంది. మార్చి 31, 2018వరకు ఈ ఆఫర్లు అందుబాటులోఉంటాయి.