న్యూఢిల్లీ : డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం మెగా ప్లాన్‌ను రూపొందిస్తోంది. వ్యాపారస్తులకు క్యాష్‌బ్యాక్‌లు, వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో ప్రోత్సహాకాలు అందించడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనల మేరకు డిజిటల్ రూపంలో లావాదేవీలు నిర్వహించిన వినియోగదారులకు ఎంఆర్‌పీపై డిస్కౌంట్ అందించనున్నట్టు తెలిసింది. ఈ డిస్కౌంట్ 100 రూపాయల వరకు ఉండనుంది. మరోవైపు వ్యాపారస్తులకు క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ మోడ్‌లో నిర్వహించే టర్నోవర్ ఆధారితంగా అందించనున్నట్టు పేర్కొంది.
ఈ ప్రతిపాదనను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో మే 4న నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రధానమంత్రి ఆఫీసు నిర్వహించిన సమావేశంలో చర్చించారు. క్యాష్‌బ్యాక్ మాత్రమే కాక, డిజిటల్ మోడ్ ద్వారా నిర్వహించే టర్నోవర్లపై పన్ను క్రెడిట్ పొందటానికి వ్యాపారాలు అనుమతించే ప్రతిపాదనపై కూడా చర్చించారు. ప్రత్యక్ష పన్నుల వైపు డిజిటల్ లావాదేవీలకు ఏమైనా ప్రోత్సహకాలు ఇవ్వాలో లేదో కూడా పీఎంఓ మీటింగ్ చర్చించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment