భారీ క్యాష్‌ బ్యాక్‌, లక్కీ విన్నర్స్‌కి ఐ ఫోన్‌ ఫ్రీ.. | Paytm Mall will give you up to Rs 15,000 cashback on purchase of iPhone: Here's how | Sakshi
Sakshi News home page

భారీ క్యాష్‌ బ్యాక్‌, లక్కీ విన్నర్స్‌కి ఐ ఫోన్‌ ఫ్రీ..

Published Mon, Sep 18 2017 5:59 PM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

భారీ క్యాష్‌ బ్యాక్‌, లక్కీ విన్నర్స్‌కి ఐ ఫోన్‌ ఫ్రీ..

భారీ క్యాష్‌ బ్యాక్‌, లక్కీ విన్నర్స్‌కి ఐ ఫోన్‌ ఫ్రీ..

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్లాట్‌ఫాం పేటీఎం మాల్‌  తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్లను ప్రకటించింది.  ముఖ్యంగా   ఐఫోన్లపై  క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది.  రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని  ఈ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌  అందిస్తోంది.  ’మేరా క్యాష్‌బ్యాక్‌ సేల్‌’ పేరుతో లాంచ్‌ చేసింది. అన్ని ఆపిల్ ఉత్పత్తులతో పాటు  టాప్‌ సెల్లింగ్‌  మోడల్స్‌ పై  రూ. 6వేల నుంచి రూ.15దాకా  కచ్చితమైన నగదు వాపస్‌ ఆఫర్‌ను  ప్రకటించింది.  ఈ అవకాశం సెప్టెంబర్‌ 20 నుంచి 23  తేదీవరకు మాత్రమే  అందుబాటులో ఉంటుంది. 

మోడల్ జీబీ వేరియంట్‌ క్యాష్‌ బ్యాక్‌
ఐ ఫోన్‌ 6 32 జీబీ వేరియంట్‌ రూ.6వేల క్యాష్‌ బ్యాక్‌
ఐ ఫోన్‌  7 32 జీబీ వేరియంట్‌ రూ 8,000 క్యాష్‌ బ్యాక్‌
ఐఫోన్  7 128 జీబీ  వేరియంట్‌ రూ. 10,000 క్యాష్‌ బ్యాక్‌
ఐఫోన్  7 256 జీబీ  వేరియంట్‌ రూ.10,000 క్యాష్‌ బ్యాక్‌
ఐఫోన్ 7 ప్లస్ 256  జీబీ వేరియంట్‌ భారీ ఆఫర్‌ రూ. 15,000

అంతేకాదు.. ఈ నాలుగు రోజుల సేల్‌ లో మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఉంది. 25మంది లక్కీ స్మార్ట్‌ఫోన్‌ కొలుగోలుదారులకు 100శాతం  క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ కూడా.  అంటే 25మంది ఉచితంగా ఐ ఫోన్‌ను దక్కించుకోవచ్చన్నమాట.

పేటీఎం  లిఫాఫాతో కలిసి  పేటీఎం మాల్‌ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్‌ (నాలుగు రోజుల సేల్‌)లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌ గెల్చుకోవచ్చని  చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ సిన్హా తెలిపారు.

కాగా ఫిబ్రవరి 2016 లో ప్రారంభించబడిన, పేటీఎం మాల్‌  ఈ ఏడాది ఏప్రిల్ నెలలో  ద్విచక్ర వాహన విక్రయాల  ద్వారా 100 కోట్ల రూపాయల అమ్మకాలు దాటింది.  టూవీలర్‌ బుకింగ్ ప్లాట్‌ఫాంలో సుజుకి, హోండా, హీరో,  యమహా తదితర  బ్రాండ్లను అందిస్తుడగా,  2016 లో 50,000 యూనిట్లను విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement