Paytm Mall
-
పేటీఎంకు భారీ షాక్
Patym Mall Lost Unicorn Status: డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేటీఎం ఈ-కామర్స్ విభాగం ‘పేటీఎం మాల్’ యూనికార్న్ హోదాను కోల్పోయింది. తాజాగా హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించిన యూనికార్న్ జాబితాలో ‘పేటీఎం మాల్’ స్థానం కనిపించలేదు. స్టార్టప్ వాల్యూయేషన్ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ స్టార్టప్‌లను ‘యూనికార్న్’ కంపెనీలుగా ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎం మాల్ వాల్యూ 1 బిలియన్ కంటే కిందకి పడిపోయినట్లు సమాచారం. ఈ పతనంపై పేటీఎం స్పందించాల్సి ఉంది. ఇక పేటీఎం మాల్తో పాటు మరో ఏడు భారీ స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొగొట్టుకున్నాయి. వీటిలో చాలావరకు చైనాకు చెందినవే ఉండడం విశేషం. ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. వేల్యుయేషన్స్ 1 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు యూనికార్న్ హోదా కోల్పోయాయి. స్టాక్ ఎక్సేంజ్ లిస్ట్ కావడం లేదంటే ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో మొత్తం 162 సంస్థలను యూనికార్న్ లిస్టు నుంచి తప్పించారు. ఈ-కామర్స్ రంగం పోటీలో భాగంగా పేటీఎం మాల్‌ను 2016లో పేటీఎం లాంఛ్ చేసింది. రెండేళ్లు తిరగకుండానే బిలియన్ డాలర్ల వాల్యూతో యూనికార్న్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది పేటీఎం మాల్. ఈబే ఫండింగ్ తర్వాత 2019లో పేటీఎం మాల్ విలువ 2.86 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో సైతం పోటీపడింది పేటీఎం మాల్. కిందటి ఏడాది 3 బిలియన్ డాలర్ల వాల్యూతో నిలిచిన పేటీఎం మాల్.. ఈ ఏడాది ఏకంగా యూనికార్న్ హోదా కోల్పోవడం విశేషం. ఇంకోవైపు ఐపీవోకి వెళ్లిన పేటీఎం.. చేదు ఫలితాల్నే చవిచూస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్.. నెక్స్ట్ చైనానే! -
పేటీఎం మాల్ సరికొత్త వ్యూహం..
బెంగుళూరు: కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వృద్ధికి కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా భారత ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ పీటీఎం మాల్ త్వరలో గ్రోసరీ మార్కెట్(సూపర్ మార్కెట్)రంగంలో ప్రవేశించనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రామాణికమైన స్థానిక వ్యాపారులతో (కిరాణా దుకాణాల) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పేటీఎం మాల్లో గ్రోసరీ మార్కెట్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్ తదితర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆన్లైన్ టూ ఆప్లైన్ అన్ని రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ మాల్ సేవలందించనుంది. కాగా వస్తువుల పంపిణీకి లాజిస్టిక్స్ వ్యాపారులను(గిడ్డంగులు, ప్యాకేజింగ్) సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే ఫార్మా రంగానికి చెందిన మందుల పంపిణీలో సంక్లిష్టత కారణంగా ఈ రంగంలో ప్రవేశించడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం పేటీఎమ్ మాల్ స్థానిక కిరాణా, మధ్యస్థాయి దుకాణాదారుల సమన్వయంతో వినియోగదారులను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. సంస్థ వృద్ధి చెందేందుకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. పేటీఎం సంస్థ లాక్డౌన్ కారణంగా కేంద్ర కార్యాలయాన్ని బెంగుళూరుకు మార్చింది. త్వరలో ప్రారంభించబోయే పేటీఎం మాల్గ్రోసరీ మార్కెట్)ను పరుగులు పెట్టించేందుకు 10,000 కిరాణా స్టోర్స్, చిన్న మధ్య స్థాయి దుకాణాదారులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, గ్రోసరీ మార్కెట్లో వృద్ధి చెందేందుకు గ్రోఫర్స్, మిల్క్ బాస్కెట్ తదితర ఆన్లైన్ సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం సంస్థ పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావం వల్ల గ్రోసరీ మార్కెట్ వైపు ఈకామర్స్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇదే బాటలో దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ గ్రోసరీ మార్కెట్ వైపు దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. (చదవండి: వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్) -
పేటీఎమ్ మాల్లో ఈబే చేతికి 5.5% వాటా
న్యూఢిల్లీ: భారత ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్, పేటీఎమ్ మాల్లో 5.5 శాతం వాటాను అమెరికా ఈ–టైలర్ ఈబే కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో భాగంగా పేటీఎమ్ మాల్లో ఒక స్టోర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఈబే ప్రెసిడెంట్, సీఈఓ డెవిన్ వెన్ చెప్పారు. భారత ఈ కామర్స్ రంగంలో ఈబేకు ఇది మూడో పెట్టుబడి. గతంలో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈబే పెట్టుబడులు పెట్టింది. -
ఐఫోన్లపై పేటీఎం మాల్ భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై : ఖరీదైన ఐఫోన్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో మంచి అవకాశం. డిజిటల్ దిగ్గజం పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. తన వెబ్సైట్లో ఐఫోన్లపై ఆకట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఈ నుంచి ఎక్స్ఎస్ మ్యాక్స్ దాకా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఆర్ తదితర ఫోన్లపై గరిష్టంగా రూ.15వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులకు అందిస్తోంది. దీంతోపాటు కొన్ని మోడల్స్‌పై ప్రోమోకోడ్ ఆఫర్ కూడా ఉంది. ఐ ఫోన్స్ ఎక్స్ మాక్స్ : 256 జీబీ స్టోరేజి వేరియంట్‌ను రూ. 1,14,156 లకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐ ఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ మోడల్‌ను రూ. 53,687లకే అందుబాటులో ఉంది. ఐఫోన్ ఎక్స్ : 64జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియింట్ ధరలు వరుసగా రూ. 89,999 రూ. 75,489గా ఉన్నాయి. దీంతోపాటు ఎకోడాట్ స్మార్ట్ స్పీకర్ కూడా ఉచితం.. ఐఫోన్ 8 : 64జీబీ స్టోరేజ్ వేరియింట్ రూ. 59,990. 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 70,799 ఐఫోన్ 8 ప్లస్ : ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ వేరియింట్ ధర రూ. 68వేలు. ఐఫోన్ 7 : 32 జీబీ వేరియంట్ ధర రూ. 39,530. 128జీబీ స్టోరేజి మోడల్ ధర రూ. 52,999. ఐఫోన్ 7 ప్లస్ : 32జీబీ 128జీబీ , 256 జీబీ స్టోరేజ్ ధరలు వరుసగా రూ. 49,899, రూ. 61,999, రూ. 64,990లు. -
గూగుల్ పిక్సెల్3 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్
గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం మాల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. తాజా ఆఫర్ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ఫోన్లలో ఒకటైన గూగుల్ పిక్సెల్ 3 64 జీబీ (జస్ట్ బ్లాక్) వెర్షన్‌పై 6శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా 6వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతో సుమారు 10వేల రూపాయల తగ్గింపుతో . ప్రస్తుతం రూ. 60,482 లకే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 71వేలు. అలాగే 'క్లియర్లీ వైట్' గూగుల్ పిక్సెల్ 3 స్మార్ట్‌ఫోన్ కూడా తగ్గింపు అనంతరం 60,487 రూపాయలకే లభ్యం కానుంది. మిగిలిన వివరాలు పేటీఎం మాల్ అధికారిక వెబ్సైట్లో లభ్యం. గూగుల్ పిక్సల్ 3 లీకైన ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 12.2ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 2915 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. -
పేటీఎమ్ నష్టాలు.. బుల్లెట్ ట్రైన్ బడ్జెట్ అంత !
ముంబై: భారత్‌లో ఈ కామర్స్ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైయిన్ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన రూ.1,800 కోట్ల బడ్జెట్‌కు సమానమని వివరించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ♦ పేటీఎమ్ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ మాల్తో ప్రత్యేక ఈ కామర్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. ♦ ఇప్పటివరకూ ఈ రంగంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలకు భారీ నష్టాలు వచ్చేవి. ♦ తాజాగా ఈ జాబితాలో పేటీఎమ్ కూడా చేరింది. ♦ గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ మాల్‌కు రూ.744 కోట్ల ఆదాయం రాగా, రూ.1,806 కోట్ల నష్టాలు వచ్చాయి. ♦ పేటీఎమ్ మాల్‌కు 2016–18 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.1,971 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇది, ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ సమీకరించిన మొత్తం నిధుల్లో (రూ..4,508 కోట్లు) 44 శాతానికి సమానం. ♦ భారత ఈ కామర్స్ రంగంలో నష్టాలు భారీగా వస్తున్నా, వాల్‌మార్ట్, అమెజాన్ కంపెనీలు తమ భారత సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాయి. పేటీఎమ్‌కు దన్నుగా ఉన్న ఆలీబాబా కూడా ఇదే రీతిగా ఆలోచిస్తోంది. ♦ భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ రిటైల్ సంస్థల్లో పేటీఎమ్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ఉన్నాయి. ♦ సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్, అలీబాబాడాట్‌కామ్‌ల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో పేటీఎమ్ మాల్ రూ.2,900 కోట్లు సమీకరించింది. -
పేటీఎం ఆఫర్లు: ఐఫోన్లపై క్యాష్‌బ్యాక్
బ్లాక్ ఫ్రైడే సందర్భంగా పేటిఎం మాల్ ఐఫోన్లపై డిస్కౌంట్ని ప్రకటించింది. దాదాపు 20 డివైస్‌లపై క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందనున్నారు. మోడల్‌ను బట్టి రూ.4000 నుంచి 8000ల వరకూ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదనంగా ఎస్ బ్యాంక్ నుంచి కొనుగోలు చేస్తే మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లు ప్రధానంగా... ఐఫోన్ 7ప్లస్ 128 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7 32జీబీ రూ. 6750 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7 128 జీబీ రూ. 6500 క్యాష్‌బ్యాక్ ఐఫోన్ 7ప్లస్ 32 జీబీ రూ. 8000 క్యాష్‌బ్యాక్ దీంతోపాటు మరి కొన్ని స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అలాగే ఎస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్ బ్యాక్‌ను లభ్యం. మరింత సమాచారం కోసం పేటీఎం మాల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
ఐ ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్
ఐ ఫోన్ కావాలని కలలు కంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ మిస్ అయ్యారా? అయితే దసరా పండుగ సందర్భంగా పేటీఎం మాల్ పలు ఉత్పత్తులపై భారీగా క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఒకవైపు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివ్ సేల్ ఆదివారంతో ముగిసిపోవడంతో పే టీఎం మాల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటి నుంచి (అక్టోబర్ 16) ఈ నెల 18 వరకు పేటీఎం మాల్ మరోసారి ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. తాజా ఐ ఫోన్లపై మహా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్ 256జీబీ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా 20వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ మార్కెట్ ధర రూ. 1,05,720తో పోలిస్తే. రూ .3830 డిస్కౌంట్ ఆఫర్‌తో 1,01,890 రూపాయల వద్ద పేటీఎం మాల్ విక్రయించింది. దీనికి ప్రస్తుత క్యాష్‌బ్యాక్ అదనం. 64 జీబీ ఐఫోన్ ఎక్స్‌పై రూ. 3502 తగ్గింపు లభిస్తుంది. అంటే మార్కెట్ ధర రూ. 95,390 నుంచి తగ్గి 91,888 రూపాయలకు లభ్యం. అలాగే రూ. 22వేల దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందేందుకు MOBFESTIVE18K ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలి. అంతేకాదు ఐ ఫోన్ ఎక్స్ఎస్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఉంది. IPH5000 ప్రోమో కోడ్ ద్వారా 64జీబీ ఐఫోన్ కొనుగోలుపై 5వేల దాకా క్యాష్ బ్యాక్ ఉంది. 256 జీబీ స్మార్ట్‌ఫోన్ లో 12వేల క్యాష్ బ్యాక్ ఆఫర్. దీనికి ప్రోమో కోడ్ MOBFESTIVE12K. వీటితోపాటు 64జీబీ ఐఫోన్ 8 ప్లస్‌పై 13వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్. ప్రోమో కోడ్ MOBFESTIVE13K.. 256జీబీ ఐఫోన్ 8 కొనుగోలుపై 13500 క్యాష్ బాక్ ఉంది. ప్రోమో కోడ్MOBFESTIVE13500. 32జీబీ , 128జీబీ ఐఫోన్ 7 వరుసగా 4500, 8500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ .ప్రోమో కోడ్ MALLFESTIVE8500.32జీబీ ఐఫోన్ 6ఎస్ లో రూ. 3500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. చివరగా, 32జీబీ ఐఫోన్ 6 వేరియంట్ 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ప్రోమోకోడ్ ద్వారానే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ప్రోమోకోడ్ ద్వారా ఆఫర్ చేస్తున్న నగదును ఫోన్లను డెలివరీ చేసిన 24గంటల్లోపు కస్టమర్ల ఖాతాలో క్రెడిట్ చేస్తామని కంపెనీ తెలిపింది. దీంతోపాటు దుస్తులపై గరిష్టంగా 70శాతంరాయితీని ప్రకటించింది. కంప్యూటర్ ఉత్పత్తులపై 25శాతం క్యాష్ బ్యాక్‌ను, గేమింగ్ కన్సోల్స్‌పై రూ.6వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్. అలాగే గృహోపకరణాలపై 60శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, మొబైల్ యాక్ససరీస్‌పై కూడా ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది. -
ఈ–కిరాణాలో హోరాహోరీ
ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ఈ–గ్రోసరీ సెగ్మెంట్ (ఆన్లైన్ ద్వారా కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, స్నాక్స్ ఆర్డర్ చేస్తే, వాటిని సదరు సంస్థ ఉద్యోగులు వినియోగదారుల ఇంటి వద్దనే డెలివరీ చేస్తారు) ఇప్పుడు హాట్ కేక్. భవిష్యత్తులో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలున్న ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో పట్టు, –మార్కెట్ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింతగా గుమ్మరించడం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం కోసం పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ సంస్థ ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ తన ఈ కామర్స్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయబోతోంది. అంతేకాకుండా ఇటీవలనే మోర్ సూపర్ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్ కంపెనీ కూడా ఈ–గ్రోసరీ సెగ్మెంట్ కోసం భారీగా పెట్టుబడులు గుమ్మరించబోతోంది. బిగ్‌బాస్కెట్ కోసం పేటీఎమ్ మాల్... బిగ్‌బాస్కెట్ మొదటగా బెంగళూరులో తన కార్యకలాపాలు ఆరంభించింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్‌ను డెలివరీ చేస్తోంది. 20,000పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. లో అత్యధిక మార్కెట్ వాటా బిగ్ బాస్కెట్‌దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్‌బాస్కెట్‌కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా. ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినప్పటికీ, ఈ కంపెనీ ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్ ప్లాట్ఫార్మ్ పేటీఎమ్ మాల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించిన చర్చలు గత ఏడాదే ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని సమాచారం. వాల్‌మార్ట్ సంస్థ, భారత్‌లో ఈ కామర్స్ సంస్థతో టై–అప్ కుదుర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోందని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చినప్పటినుంచే బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు పేటీఎమ్ చర్చలు జరపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే బిగ్‌బాస్కెట్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎమ్‌కు దన్నుగా నిలుస్తున్న అలీబాబా.. బిగ్‌బాస్కెట్‌లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా పేర్కొంది. విలువ దగ్గరే పీటముడి ? బిగ్‌బాస్కెట్–పేటీఎమ్ మాల్ డీల్ విషయమై... బిగ్‌బాస్కెట్ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైననే పీటముడి పడినట్లు బిగ్‌బాస్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశం తేలకనే చర్చలు ముందుకు సాగట్లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకుగాను పేటీఎమ్ మాల్లో తమకొక డైరెక్టర్ పదవి కావాలని కూడా బిగ్‌బాస్కెట్ కోరుతోందని సమాచారం. డీల్ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్‌బాస్కెట్‌కు ప్రీమియమ్ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి. బిగ్‌బాస్కెట్ అయితే బావుంటుంది..! ఈ కామర్స్ స్పేస్‌లో అమెజాన్–ఫ్లిప్‌కార్ట్‌ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్ మాల్ ఈ కామర్స్ స్పేస్‌లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్‌బాస్కెట్‌లో వాటా కొనుగోలు కోసం పేటీఎమ్ మాల్ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని నిపుణులంటున్నారు. బిగ్‌బాస్కెట్‌తో టై అప్ వల్ల పేటీఎమ్ మాల్‌కు రిపీటెడ్ కస్టమర్లు లభిస్తారని, ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్‌బాస్కెట్‌తో జత కడితే అది పేటీఎమ్ మాల్‌కు, బిగ్‌బాస్కెట్.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు. ఈ–గ్రోసరీదే హవా... ఆన్లైన్ మార్కెట్ సంస్థలకు భవిష్యత్తులో గ్రోసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని రెండేళ్ల క్రితమే అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అంచనా వేశారు. అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఐదేళ్లలో ఆన్లైన్ వ్యాపారంలో సగం వాటా గ్రోసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ గ్రోసరీ మార్కెట్ జోరు అంతకంతకూ పెరగనున్నదని గుర్తించిన అన్ని ఈ–కామర్స్ సంస్థలు గ్రోసరీస్పేస్లో మరింత మార్కెట్ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాల్‌మార్ట్ నుంచి సూపర్‌మార్ట్... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ తదితర సంస్థలు ఈ గ్రోసరీ సెగ్మెంట్లో మరింత వాటా కొల్లగొట్టడంపై దృష్టి పెట్టాయి. ఇటీవలనే ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్...ఈ గ్రోసరీ సెగ్మెంట్ కోసమే 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్లైన్ గ్రోసరీ విభాగాన్ని సూపర్‌మార్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్‌బై ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్‌కార్ట్ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సప్లై చెయిన్‌ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే 8,000 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో నాలుగో అతి పెద్ద రిటైల్ చెయిన్ మోర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్ ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు. ♦ రూ.1,460 కోట్లు–బిగ్‌బాస్కెట్‌లో ఆలీబాబా ఇన్వెస్ట్ చేసిన మొత్తం ♦ రూ.2,920 కోట్లు –ఈ–గ్రోసరీ కోసం వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ ఇన్వెస్ట్ చేయనున్న మొత్తం ♦ రూ.4,200 కోట్లు–మోర్ కోసం అమెజాన్, సమర క్యాపిటల్‌లు వెచ్చించిన మొత్తం ♦ 8,000– రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య. ఈ స్టోర్స్‌ను ఈ–గ్రోసరీ కోసం వినియోగించాలనుకుంటున్న రిలయన్స్ -
పేటీఎం మాల్ సేల్ : ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం మాల్ మళ్లీ డిస్కౌంట్ ధరలకు తెరతీసింది. ఇటీవలి అన్లైన్ సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న సంస్థ దాజాగా 'ఫ్లాష్ సేల్ వీక్' ను తిరిగి ప్రారంభించింది. ఇందులో ల్యాప్‌టాప్‌లపై క్యాష్ బ్యాక్‌లు ఇతర ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటుఈ సేల్ నిర్వహించనున ఈ సేల్‌లో దేశంలో టాప్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది. సెప్టెంబర్ 24 -30 వరకు పేటీఎం మాల్ ప్రతి రోజూ సాయంత్రం 4-8 గంటలదాకా ఫ్లాష్ సేల్ వీక్ కొనసాగనుంది. ముఖ్యంగా హెచ్‌పీ, డెల్, యాసెర్, ఆసుస్, లెనోవో బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను ఈ సేల్‌లో విక్రయిస్తోంది. రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇంటెల్ కోర్ ఐ5, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, 15.6 అంగుళాల డిస్ప్లే , టర్బో బూస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ల్యాప్‌టాప్‌ను రూ. 39,490కే ఆఫర్ చేస్తోంది. దీ ని వాస్తవ ధర రూ. 45,889. అదే విధంగా, లెనోవా ఇడిప్యాడ్ 320 (ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 4జీబీర్యామ్, 1 టిబి హార్డ్ డిస్క్ డ్రైవ్) కొనుగోలుపై 27శాతం డిస్కౌంట్, 3,500 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ. 21,490లభిస్తుంది. దీని ధరను వాస్తవ ధర రూ. 34,490. వీటితోపాటు డెల్, యాసెర్, ఆసుస్ లాంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌లాప్‌లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
పేటీఎం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ : ఆఫర్ల వెల్లువ
బెంగళూరు : పేటీఎం మాల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి(సెప్టెంబర్ 20) మూడు రోజుల పాటు ఫెస్టివల్ సీజన్ సేల్‌ను నిర్వహించబోతుంది పేటీఎం మాల్. ఈ సేల్‌లో తన సైట్లో ఆఫర్ చేసే స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు సుజుకి జిక్సర్ బైక్‌ను గెలుపొందే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. ఈ సేల్‌లో ఆఫర్లో ఉన్న స్మార్ట్ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్, శాంసంగ్ గెలాక్సీ జే8, మోటో జీ6, రెడ్మి నోట్ 5 ప్రొ, హానర్ 9 లైట్, హానర్ ప్లేలు. పలు స్మార్ట్ఫోన్లపై పేటీఎం 50 శాతం డిస్కౌంట్‌తో మురిపిస్తుంది. గెలాక్సీ నోట్ 9 128జీబీ వేరియంట్‌ను రూ.67,900కే కొనుగోలు చేయొచ్చు. నోట్9 అనే కోడ్‌ను వాడి ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదేవిధంగా హానర్ 9 లైట్‌ను 23 శాతం డిస్కౌంట్, 2000 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ.13,945కే విక్రయిస్తుంది పేటీఎం మాల్. మోటో జీ6పై 12 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్లో రూ.15,814కే అందుబాటులోకి వస్తుంది. ఎంఓబీ1500 ప్రోటో కోడ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్ నిర్వహించే రోజుల్లో ఆఫర్లు మారే అవకాశం కనిపిస్తుంది. కేవలం స్మార్ట్ఫోన్లపైనే కాకుండా.. కెమెరాలు, హెడ్ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా 70 శాతం తగ్గింపు లభిస్తుంది. డెల్ ఇన్సిరాన్ 3000 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 12 శాతం తగ్గింపు అందిస్తుంది పేటీఎం మాల్. దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పేటీఎం ఫెస్టివ్ సీజన్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతోంది. -
గెలాక్సీ నోట్ 9పై కళ్లు చెదిరే డిస్కౌంట్
అదిరిపోయే ఫీచర్లతో, ఆకర్షణీయమైన రూపురేఖలతో శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9ను గత వారమే మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ బిగ్-స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ గెలాక్సీను కొనుగోలు చేయాలని భావించే వారికి, ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లపైనే పేటీఎం మాల్ కోంబో డీల్‌ను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9పై ఫ్లాట్ 6000 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్ పేటీఎం వాలెట్లలో క్యాష్‌బ్యాక్ రూపంలో కస్టమర్లు పొందనున్నారు. డివైజ్ కస్టమర్ వద్దకు చేరాక 12 రోజుల అనంతరం ఈ క్యాష్‌బ్యాక్‌ను క్రెడిట్ చేయనున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది. దాంతో పాటు పేటీఎం మాల్లో గెలాక్సీ నోట్ 9 బుక్ చేసుకున్న వారికి శాంసంగ్ గేర్ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్‌పై రూ.18,000 డిస్కౌంట్ లభించనుంది. కోంబో ఆఫర్లో భాగంగా శాంసంగ్ గేర్ స్పోర్ట్‌ను కేవలం రూ.4,999కే అందిస్తుంది. అదేవిధంగా తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది? దాని ధరెంత ఉంటుంది? అనే విషయాలపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు... 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే క్వాడ్ హెచ్‌డీప్లస్ రెజుల్యూషన్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ఆక్టా-కోర్ ఎక్సీనోస్ 9810 ప్రాసెసర్ 6 జీబీ/8 జీబీ ర్యామ్ 128 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరో 512 జీబీ స్టోరేజ్ పెంపు అంటే మొత్తంగా 1 టీబీ స్టోరేజ్ అందుబాటు 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ డాల్బీ అట్మోస్ ఎస్ పెన్, బారో మీటర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ -
పేటీఎం మాల్ ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్’ సేల్
ఈ-కామర్స్ కంపెనీలన్నీ వరుసబెట్టి స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నేటి నుంచి తన ‘ఫ్రీడం సేల్’ను ప్రారంభించగా.. ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ ఫ్రీడం సేల్'ను రేపటి నుంచి నిర్వహించబోతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌కు పోటీగా.. పేటీఎం మాల్ కూడా ‘ఫ్రీడం క్యాష్‌బ్యాక్’ సేల్‌ను ప్రకటించింది. పేటీఎం మాల్ సేల్ నిన్నటి(ఆగస్టు 8) నుంచే ఈ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఎవరైతే కొత్తగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరియైన సమయమని తెలుస్తోంది. పేటీఎం మాల్ ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 20 వేల రూపాయల వరకు ధర తగ్గించింది. ఇంటెల్ కోర్ ఐ3, 4జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్, ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కలిగిన లెనోవో ఐడియాప్యాడ్ 320 ధర పేటీఎం మాల్లో రూ.22,490కు తగ్గింది. అదేవిధంగా ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ స్పేస్ కలిగిన డెల్ వోస్ట్రో 3578 ల్యాప్‌టాప్‌పై ఫ్లాట్ 6000 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఎంఎస్ఐ జీఎల్63 8ఆర్ఈ-455ఐఎన్ గేమింగ్ ల్యాప్‌టాప్‌పై రూ.20వేల క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం మాల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. 13 శాతం తగ్గింపు, 11000 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంక్యూడీ42హెచ్ఎన్/ ల్యాప్‌టాప్‌పై కస్టమర్లకు అందుతుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రొ కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌పై 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అంతేకాక, ఆపిల్, హెచ్‌పీ, ఏసర్ వంటి పలు ప్రముఖ బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఆఫర్లు మాత్రమే కాక, మిడ్నైట్ సూపర్ డీల్స్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పేటీఎం మాల్ ఆఫర్ చేస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి కూడా ఫ్లాష్ సేల్స్, అద్భుతమైన డీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్లు జరుపుతారో, వారికి అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్టు పేటీఎం మాల్ తెలిపింది. -
పేటీఎం భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్, వారికి శుభవార్త!
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం మాల్, గ్రాడ్యుయేట్లకు శుభవార్త చెప్పింది. అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పేటీఎం మాల్ పేర్కొంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో దాదాపు 5000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇది క్యాంపస్ ఐకాన్ ప్రొగ్రామ్‌లో సెకండ్ ఎడిషన్. ఈ ఎడిషన్‌లో భాగంగా విద్యార్థులకు టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వారి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను చేపట్టనుంది. వీటిలో టాప్ పర్‌ఫార్మెర్స్ జాబితాను అక్టోబర్ 10న పేటీఎం మాల్ ప్రకటించనుంది. వీరికి లక్ష రూపాయల వరకు నగదు బహుమతితో పాటు, పేటీఎం మాల్లో ఫుల్-టైమ్ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్రొగ్రామ్‌ను తొలుత 2017లో లాంచ్ చేశారు. ఆ సమయంలో 2,200 మంది విద్యార్థులను నియమించుకుంది.‘మా క్యాంపస్ ఐకాన్ ప్రొగ్రామ్ ప్రారంభ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వందల కొద్ది గ్రాడ్యుయేట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ఏడాది కూడా మరింత మంది విద్యార్థులను చేరుకోవాలనుకుంటున్నాం. దేశంలోనే ఇది అతిపెద్ద క్యాంపస్ ఐకాన్’ అని పేటీఎం మాల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్‌సిన్హా తెలిపారు. ఈ ప్రొగ్రామ్‌తో తర్వాతి తరం యువ ప్రొఫిషినల్స్‌కు మంచి అనుభవం కల్గిస్తుందని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు, ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదో అపూర్వ అవకాశమని అన్నారు. కస్టమర్ల రోజువారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే ఆఫ్‌లైన్ మర్చెంట్ల వ్యాపారా వృద్ధిని పెంచేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
స్మార్ట్ఫోన్లపై పేటీఎం బంపర్ ఆఫర్
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారు.. కానీ మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం మాల్, ఒప్పో, మోటరోలా, హనర్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్లపై ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఒప్పో ఎఫ్ 5 యూత్ ఈ ఏడాది విడుదలైన ‘ఒప్పో ఎఫ్ 5 యూత్’ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఇదే కాక కంపెనీ అదనంగా మరో 5,499 రూపాయల డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంటే మొత్తంగా కలుపుకుని చివరకు ‘ఒప్పో ఎఫ్ యూత్’ 14,500 రూపాయలకే వస్తుంది. క్యాష్‌బ్యాక్ పొందాలనుకుంటే పేమెంట్ చేసేటప్పుడు వినియోగదారుడు ‘ఎమ్‌ఓబీ15’ అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది. క్యాష్‌బ్యాక్ ఎమౌంట్ 24 గంటల్లో పేటీఎం వాలెట్‌కు యాడ్ అవుతుందని తెలిపారు. ఒప్పో ఎఫ్7 డైమండ్ బ్లాక్ ఎడిషన్ ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత విలువ 27, 990 రూపాయలు. కంపెనీ 4 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత ఈ ఫోన్ ఖరీదు 23,990 రూపాయలకు తగ్గింది. ఇదే కాక ప్రోమో కోడ్ ‘ఎమ్‌ఓబీ15’ను అప్లై చేస్తే అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేటీఎం తెలిపింది. మోటో జీ6 ఈ మధ్యే లాంచ్ అయిన మోటో జీ6 స్మార్ట్‌ఫోన్ ఖరీదు 19,999 రూపాయలు. కానీ ఇప్పటికే కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్‌తో ఇది 16,998 రూపాయలకు లభిస్తుంది. ఇదే కాక పేటీఎం అదనంగా మరో 15 శాతం డిస్కౌంట్ ఇస్తుండటంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరో 2,210 రూపాయలు తగ్గుతుంది. పేటీఎం డిస్కౌంట్ అప్లై అవ్వాలంటే పేమెంట్ చేసే సమయంలో ప్రోమో కోడ్ ‘ఎమ్‌ఓబీ15’ను నమోదు చేయలని కంపెనీ చెప్పింది. మోటో జీ 6 ప్లే మోటో జీ 6 తో పాటు జీ 6 ప్లేపై కూడా పేటీఎం 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ ప్రకటించిన 1,744 రూపాయల డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ 12,255 రూపాయలకు వస్తుంది. ఇదే కాక పేటీఎం ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్‌తో అదనంగా మరో 1,593 రూపాయలు తగ్గుతుంది. 15 శాతం క్యాష్‌బ్యాక్ అప్లై అవ్వాలంటే పేమెంట్ చేసే సమయంలో ప్రోమో కోడ్ ‘ఎమ్‌ఓబీ15’ను ఎంటర్ చేయాలి. హనర్ 9 లైట్ హనర్ కంపెనీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ హనర్ 9 లైట్. ఈ ఏడాది లాంచ్ అయిన హనర్ 9 లైట్ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ప్రకటించిన 2,000 రూపాయల డిస్కౌంట్‌తో పాటు అదనంగా పేటీఎం ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్‌ను కలుపుకుని ఈ ఫోన్ ఫైనల్ ప్రైస్ 14,998 రూపాయలకు లభిస్తుంది. హనర్ 7 ఎక్స్ గతేడాది డిసెంబర్లో విడుదలైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హనర్ 7 ఎక్స్ పై పేటీఎం మాల్ ప్రకటించిన 15 శాతం క్యాష్‌బ్యాక్ వల్ల 2,516 రూపాయలు తగ్గి చివరకూ 16, 770 రూపాయలకు అందుబాటులో ఉందని పేటీఎం ప్రకటించింది. -
స్మార్ట్ఫోన్లపై పేటీఎం బంపర్ ఆఫర్లు
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అయితే ఇదే సరియైన సమయమట. డిజిటల్ దిగ్గజం పేటీఎం తన మాల్లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. నోకియా... నోకియా స్మార్ట్ఫోన్లపై పేటీఎం మాల్ తన ప్లాట్‌ఫామ్‌పై 21 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 18 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. మోటోరోలా.. మోటోరోలా హ్యాండ్సెట్లపై కూడా 35 శాతం వరకు డిస్కౌంట్లను పేటీఎం మాల్ అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇది ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ మొత్తం డివైజ్‌ను బట్టి ఉంది. ఒప్పో... 5 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌తో ఒప్పో స్మార్ట్ఫోన్లు, పేటీఎం మాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా 25 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాక 1,199 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ అనంతరం ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్ 10,791 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. వివో... ఒప్పో మాదిరిగా వివో హ్యాండ్సెట్లు కూడా ఫ్లాట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కలిగి ఉన్నాయి. అన్ని చైనీస్ హ్యాండ్సెట్లతో పోల్చుకుంటే, వివో వీ5ఎస్ స్మార్ట్ఫోనే గరిష్టంగా 31 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 655 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా ఈ ఫోన్‌పై లభిస్తోంది. దీంతో మొత్తంగా రూ.12,444కు వివో వీ5ఎస్‌ను పేటీఎం మాల్ విక్రయిస్తోంది. ఆపిల్, గూగుల్, శాంసంగ్, హానర్, లెనోవో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్లపై 9 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్, శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్, గూగుల్ పిక్సెల్ డివైజ్‌లపై కనీసం 6 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. -
పేటీఎం మాల్‌కు రూ.2,900 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ వెంచర్, పేటీఎం మాల్ భారీగా పెట్టుబడులను సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్, ఆలీబాబాడాట్‌కామ్ సింగపూర్ ఈ కామర్స్ సంస్థల నుంచి రూ.2,900 కోట్ల మేర పెట్టుబడులను పేటీఎం మాల్ సమీకరించింది. ఈ భారీ నిధులతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లతో పోటీపడటానికి తగిన ఆర్థిక బలిమి పేటీఎంకు చేకూరుతుందని నిపుణులంటున్నారు. ఈ పెట్టుబడుల కారణంగా పేటీఎం మాల్ విలువ 200 కోట్ల డాలర్లని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబాల తాజా పెట్టుబడులతో తమ కంపెనీ వ్యాపార విధానం, వృద్ధి జోరు, నిర్వహణ తీరు పటిష్టంగా ఉన్నాయని మరోసారి వెల్లడైనట్లు పేటీఎం మాల్ సీఓఓ అమిత్ సిన్హా చెప్పారు. టెక్నాలజీ, లాజిస్టిక్స్, పీటీఎం మాల్ బ్రాండ్‌ను మరింత శక్తివంతం చేయడానికి.. ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. -
పేటీఎం మాల్ రిపబ్లిక్ డే ఆఫర్స్
పేటీఎం మాల్ కూడా రిపబ్లిక్ డే సేల్‌ను నేటి(బుధవారం) నుంచి ప్రారంభించింది. ఈ కొత్త సేల్‌లో భాగంగా పేటీఎం స్మార్ట్ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎలక్ట్రిక్ అప్లియెన్స్‌పై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. అంతేకాక డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, జనవరి 28 వరకు కొనసాగనుంది. ఆపిల్, వివో, షావోమి, ఒప్పో, లెనోవో, మోటోరోలా, శాంసంగ్ వంటి పలు ప్రముఖ బ్రాండులన్నింటిపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్ డివైజ్‌ల పరంగా చూస్తే.. పేటీఎం మాల్ ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను 83,899 రూపాయలకు లిస్ట్ చేసింది. దీని అసలు ధర రూ.89వేలు. అదేవిధంగా ఐఫోన్ ఎక్స్(256జీబీ)ను 98వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దీని అసలు ధర లక్షకు పైన రూ.1,02,000గా ఉంది. అంతమొత్తంలో వెచ్చించలేని వారి కోసం ఐఫోన్ 8(64జీబీ)ను రూ.52,706కు లిస్టు చేసింది. ఈ ఫోన్ అసలు ధర 64వేల రూపాయలు. అదేవిధంగా 73వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8 ప్లస్(64జీబీ)ను కూడా రూ.63,470కు అందిస్తోంది. క్యాష్‌బ్యాక్ మొత్తాలను పొందడానికి యూజర్లు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రోమో కోడ్లను వాడాల్సి ఉంటుంది. వివో వీ5ఎస్, వివో వై55ఎస్, వివో వై69 వంటి 4జీ స్మార్ట్ఫోన్లపై పేటీఎం మాల్ 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మోటో ఈ4 ప్లస్, లెనోవో కే6 నోట్, లెనోవో కే6 వపర్ హ్యాండ్సెట్లపై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఇక శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అంత ప్రముఖ హ్యాండ్సెట్లు లేనప్పటికీ, ఫ్లాట్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ జే3 ప్రో ధర రూ.8800 నుంచి రూ.7990కు తగ్గించింది. అదేవిధంగా గెలాక్సీ జే2 ధరను రూ.6990కు లిస్ట్ చేసింది. షావోమి స్మార్ట్ఫోన్లపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను మాత్రమే ప్రవేశపెట్టింది. పాపులర్ టాబ్లెట్లను కూడా పేటీఎం మాల్ ఈ సేల్‌లో లిస్ట్ చేసింది. -
హైదరాబాద్‌లో పేటీఎం మాల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ పేటీఎం.. హైదరాబాద్‌లో పేటీఎం మాల్ ప్రచారం కోసం రూ.50 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం నగరంలో వెయ్యి బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్, సెంట్రో, చందనా బ్రదర్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈనెల 5–17 వరకు షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. అప్లయెన్స్, స్మార్ట్ఫోన్లు, అపెరల్స్ వంటి ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్స్, 100 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈనెల 12న నిజాం గ్రౌండ్స్‌లో హైదరాబాద్ కార్నివాల్‌ను నిర్వహించన్నట్లు తెలిపింది. ఇందులో 30కి పైగా టాప్ బ్రాండ్స్ పాల్గొంటాయని పేర్కొంది. -
దిగ్గజాల రూటే వేరు!
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ మార్కెట్లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వాటాను పెంచుకునేందుకు 2018 సంవత్సరంలో భిన్న విధానాలను ఆచరణలో పెట్టనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు ఈ కామర్స్ మార్కెట్లో పై చేయి సాధించేందుకు గాను తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. అగ్ర స్థానం కోసం మార్కెటింగ్ వ్యూహాల పరంగా ఒకదాన్ని ఇంకొకటి అనుకరించేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ, కొత్త ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భిన్నంగా అడుగులు వేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. చైనా అలీబాబా వెన్నుదన్నుతో పేటీఎం మాల్ సైతం మూడో పక్షంగా అవతరించనుందని భావిస్తున్నారు. చిన్న పట్టణాలపై ఫ్లిప్‌కార్ట్ గురి ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్ చిన్న పట్టణాల్లో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించనుంది. తన సొంత బ్రాండ్ ఉత్పత్తులతో వినియోగదారులను చేరువ కావాలన్న వ్యూహంతో ఉంది. అమెజాన్ ప్రీమియం కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించనుంది. మొత్తం మీద ఇరు కంపెనీలు ప్రస్తుత తమ స్థానాలను పటిష్టంగా కాపాడుకుంటూనే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే విధానాలను అమలు చేయబోతున్నాయి. ‘‘మొదటి సారి ఈ కామర్స్ మార్కెట్ లీడర్లయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండు భిన్న మార్గాలను అనుసరించడాన్ని చూడబోతున్నాం’’అని హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) అనలిస్ట్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. కేవలం సరుకుల అమ్మకాల విలువ (జీఎంవీ)పైనే ఈ మార్కెట్ ఎంతో కాలం కొనసాగకపోవచ్చని, ఆన్లైన్ కొనుగోలుదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు, కొత్త విభాగాలలో వృద్ధి ఉండొచ్చని ‘ఇండియా ఇంటర్నెట్: ఆన్ ద వే టు ఇండియా ఈ కామర్స్ 2.0’ పేరుతో విడుదల చేసిన నివేదికలో రాజీవ్ శర్మ వివరించారు. స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు లభించేలా, కస్టమర్లు ఆశించేవన్నీ అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. మెట్రోలకు వెలుపల విస్తరించి ఉన్న పట్టణాల్లోని కస్టమర్లకు చేరువ కావాలన్నది ఫ్లిప్‌కార్ట్ యోచన. ప్రైవేటు లేబుల్స్ ఉత్పత్తుల ద్వారా వారిని చేరువ కావాలనుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్ మొత్తం విక్రయాల్లో దాని సొంత లేబుల్స్ ఉన్న ఉత్పత్తుల విలువ 15 నుంచి 20 శాతం వరకు ఉంది. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత అమ్మకాల్లో 45 శాతం చిన్న పట్టణాల నుంచే వస్తోంది. అమెజాన్ కూడా చిన్న పట్టణాల మార్కెట్‌ను సొంతం చేసుకునే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం అమెజాన్ విక్రయాల్లో 65 శాతం వాటా మెట్రో నగరాల నుంచే ఉంది. ఇందులోనూ ‘అమెజాన్ ప్రైమ్’ పాత్ర కీలకం. అమెజాన్ ఇండియా ఫ్యాషన్, కిరాణా ఉత్పత్తులపైనా ప్రత్యేకమైన దృష్టి సారించనుంది. -
పేటీఎం మాల్ 2017 గ్రాండ్ ఫైనల్ సేల్
12.12 సేల్ అనంతరం ఒక్క రోజులోనే పేటీఎం 2017 గ్రాండ్ ఫైనల్ సేల్‌ను ప్రారంభించింది. పేటీఎం మాల్లో నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, డిసెంబర్ 15 వరకు నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఆపిల్, లెనోవో, మోటోరోలా, శాంసంగ్, షావోమి లాంటి అన్ని దిగ్గజ బ్రాండులపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదేవిధంగా రూ.64వేలుగా ఉన్న ఐఫోన్ 8(64జీబీ) వేరియంట్‌ను రూ.58,582కే లిస్టు చేసింది. ''MOB7500'' ప్రోమో కోడ్‌ను వాడుతూ ఐఫోన్ 8పై రూ.7500 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఐఫోన్ 7(32జీబీ వేరియంట్) రూ.44,599కే అందుబాటులోకి వచ్చింది. రూ.6,250 క్యాష్‌బ్యాక్‌తో ఐఫోన్ 7 ధరను మరింత రూ.38,349కి తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌పై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.48,900గా ఉన్న గెలాక్సీ ఎస్7ను రూ.32,750కే అందుబాటులోకి తెచ్చింది. వివో వీ7 ప్లస్‌ను డిస్కౌంట్ ధరలో రూ.21,990కే విక్రయిస్తోంది. ఇలా లెనోవో కే8(32జీబీ మోడల్) కూడా పేటీఎం మాల్ సేల్‌లో రూ.10,356తో లిస్టు అయింది. ''MOB12'' ప్రోమో కోడ్‌తో రూ.1,243 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఓప్పో ఏ71 స్మార్ట్‌ఫోన్ కూడా డిస్కౌంట్ ధరలో 11,800కే అందుబాటులోకి వచ్చింది. ఇలా మోటో జీ5ఎస్, స్వైప్ కనెక్ట్ పవర్ 4జీ, స్వైప్ ఎలైట్ ప్రో 32జీబీ, స్వైప్ ఎలైట్ 2ప్లస్, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 6, ఇంటెక్స్ ఆక్వా ఎస్3 4జీ స్మార్ట్ఫోన్లపై పలు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను పేటీఎం మాల్ అందిస్తోంది. -
పేటీఎం మాల్‌కు భారీ నష్టాలు
ముంబై : పేటీఏం అనుబంధ సంస్థ పేటీఎం మాల్ భారీ నష్టాలను నమోదుచేసింది. ఇటీవలే ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థకు ఏడు నెలల కాలంలోనే రూ.13 కోట్ల నష్టాలు వాటిల్లయ్యాయి. 2016 ఆగస్టు నుంచి 2017 మార్చి వరకు రిపోర్టును రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ.20 కోట్లుంటే, రిజర్వులు, సర్ప్లస్లు రూ.1,284 కోట్లు ఉన్నట్టు ఫైలింగ్‌లో తెలిపింది. పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేటీఎం మాల్‌ను ఏర్పాటుచేసింది. 2016 ఆగస్టు 16లో ఏర్పాటైన దీన్ని పేటీఎం పేమెంట్స్ యాప్ నిర్వహిస్తోంది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు దీనిలో 12 శాతం వాటా ఉంది. ఇతర వాటాదారులు చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా, సైఫ్ పార్టనర్లు. పేటీఎం మాల్‌కు ఇవి తొలి ఏళ్లని, దీన్ని విజయవంతమైన టెక్ బిజినెస్‌గా అభివృద్ధి చేయడానికి తాము దీర్ఘకాల దృష్టికోణాన్ని కలిగి ఉన్నట్టు పేటీఎం మాల్ అధికార ప్రతినిధి చెప్పారు. తమ బ్రాండ్‌కు పర్యాయపదంగా ఉన్న విశ్వసనీయ రిటైల్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడానికి తాము సహాయ పడతామని తెలిపారు. తమ ఆన్లైన్ టూ ఆఫ్‌లైన్ మోడల్ ద్వారా ఒకే రకమైన అనుభూతిని అందిస్తామన్నారు. తమ వ్యాపారాల్లో సహకారం కోసం 2000 మందిని నియమించుకునే ప్రణాళికను కంపెనీ ఇటీవలే ప్రకటించింది. -
పేటీఎం మాల్ సూపర్ క్యాష్‌బ్యాక్ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త సేల్స్‌తో కస్టమర్లను మనసులను చూరగొంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌తోపాటు పేటీఎం మాల్ కూడా సూపర్ క్యాష్‌బ్యాక్ సేల్‌తో వినియోగదారుల మందుకు వచ్చింది. ఈ క్యాష్‌బ్యాక్ సేల్ కింద వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్, ఉచిత షిప్పింగ్‌తో పాటు మరిన్ని డీల్స్ అందిస్తున్నట్టు పేటీఎం మాల్ చెప్పింది. అన్ని గ్రోసరీ వస్తువులపైనా ఈ క్యాష్‌బ్యాక్ సేల్‌ను పేటీఎం మాల్ లాంచ్ చేసింది. సేల్‌లో భాగంగా కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.2500ను అందిస్తోంది. అంతేకాక కనీసం 10 నిత్యావసర వస్తువులు లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఉచిత షిప్పింగ్‌ను ఇది ఆఫర్ చేస్తోంది. పేటీఎం మాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేల్, నేటి సాయంత్రంతో ముగియనుంది. బ్యూటీ, మేకప్, గ్రూమింగ్ అండ్ సేవింగ్, డైపర్స్, బేబీకేర్, లాండ్రి అండ్ డిటర్జెంట్లు, హోమ్ కేర్, ఫుడ్వంటి పలు కేటగిరీ యాక్ససరీస్, ఉత్పత్తులు ఈ సూపర్ క్యాష్‌బ్యాక్ సేల్‌లో ప్రధానంగా ఉన్నాయి. ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మ్యాగీ, పతంజలి, మాగి, పతంజలి,హార్లిక్స్, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్, మామి పోకో, లక్మే, లోరియల్ వంటి వాటిని ఒకే గూటికి కిందకు తెచ్చింది. -
భారీ క్యాష్ బ్యాక్, లక్కీ విన్నర్స్కి ఐ ఫోన్ ఫ్రీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ప్లాట్‌ఫాం పేటీఎం మాల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ’మేరా క్యాష్‌బ్యాక్ సేల్’ పేరుతో లాంచ్ చేసింది. అన్ని ఆపిల్ ఉత్పత్తులతో పాటు టాప్ సెల్లింగ్ మోడల్స్ పై రూ. 6వేల నుంచి రూ.15దాకా కచ్చితమైన నగదు వాపస్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ అవకాశం సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మోడల్ జీబీ వేరియంట్ క్యాష్ బ్యాక్ ఐ ఫోన్ 6 32 జీబీ వేరియంట్ రూ.6వేల క్యాష్ బ్యాక్ ఐ ఫోన్ 7 32 జీబీ వేరియంట్ రూ 8,000 క్యాష్ బ్యాక్ ఐఫోన్ 7 128 జీబీ వేరియంట్ రూ. 10,000 క్యాష్ బ్యాక్ ఐఫోన్ 7 256 జీబీ వేరియంట్ రూ.10,000 క్యాష్ బ్యాక్ ఐఫోన్ 7 ప్లస్ 256 జీబీ వేరియంట్ భారీ ఆఫర్ రూ. 15,000 అంతేకాదు.. ఈ నాలుగు రోజుల సేల్ లో మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. 25మంది లక్కీ స్మార్ట్‌ఫోన్ కొలుగోలుదారులకు 100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా. అంటే 25మంది ఉచితంగా ఐ ఫోన్‌ను దక్కించుకోవచ్చన్నమాట. పేటీఎం లిఫాఫాతో కలిసి పేటీఎం మాల్ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్ (నాలుగు రోజుల సేల్)లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్ గెల్చుకోవచ్చని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. కాగా ఫిబ్రవరి 2016 లో ప్రారంభించబడిన, పేటీఎం మాల్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ద్విచక్ర వాహన విక్రయాల ద్వారా 100 కోట్ల రూపాయల అమ్మకాలు దాటింది. టూవీలర్ బుకింగ్ ప్లాట్‌ఫాంలో సుజుకి, హోండా, హీరో, యమహా తదితర బ్రాండ్లను అందిస్తుడగా, 2016 లో 50,000 యూనిట్లను విక్రయించింది. -
పేటీఎం మాల్ తొలి మెగా సేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు పోటీగా పేటీఎం మాల్ కూడా మెగా సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. 'మెరా క్యాష్ బ్యాక్' పేరుతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించే తేదీల్లోనే పేటీఎం మాల్ కూడా ఈ మెగా సేల్ ఈవెంట్‌కు తెరలేపబోతుంది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్ నిర్వహించనుంది. ఈవెంట్లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కంపెనీ అందించనున్నట్టు ప్రకటించింది. కొత్తగా 50 లక్షల మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఫ్యాషన్ ప్రొడక్ట్‌లు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు పేటీఎం మాల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. స్మార్ట్ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, పెద్ద పెద్ద అప్లియెన్స్ టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. 25 మంది ఫోన్ కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది. అదేవిధంగా నాలుగు రోజుల సేల్‌లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌ను కూడా ప్రకటించింది. పేటీఎం మాల్ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్ ఇదేనని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. తమ భాగస్వామ్య బ్రాండులు, మెర్చంట్లతో కలిసి క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు చెప్పారు. ఆపిల్, జేబీఎల్, ఉడ్‌ల్యాండ్, టైమెక్స్‌లు ఈ సేల్‌లో టాప్ బ్రాండులుగా ఉన్నాయి. తమ విక్రయాలను పెంచుకోవడానికి రిటైలర్లతో కూడా పేటీఎం మాల్ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ కంపెనీ ఇటీవలే అలీబాబా, ఎస్ఏఐఎఫ్ పార్టనర్ల నుంచి ఫండ్స్ సేకరించింది.