పేటీఎం మాల్ కూడా రిపబ్లిక్ డే సేల్‌ను నేటి(బుధవారం) నుంచి ప్రారంభించింది. ఈ కొత్త సేల్‌లో భాగంగా పేటీఎం స్మార్ట్‌ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎలక్ట్రిక్ అప్లియెన్స్‌పై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. అంతేకాక డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, జనవరి 28 వరకు కొనసాగనుంది. ఆపిల్, వివో, షావోమి, ఒప్పో, లెనోవో, మోటోరోలా, శాంసంగ్ వంటి పలు ప్రముఖ బ్రాండులన్నింటిపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది.
మొబైల్ డివైజ్‌ల పరంగా చూస్తే.. పేటీఎం మాల్ ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను 83,899 రూపాయలకు లిస్ట్ చేసింది. దీని అసలు ధర రూ.89వేలు. అదేవిధంగా ఐఫోన్ ఎక్స్(256జీబీ)ను 98వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దీని అసలు ధర లక్షకు పైన రూ.1,02,000గా ఉంది. అంతమొత్తంలో వెచ్చించలేని వారి కోసం ఐఫోన్ 8(64జీబీ)ను రూ.52,706కు లిస్టు చేసింది. ఈ ఫోన్ అసలు ధర 64వేల రూపాయలు. అదేవిధంగా 73వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8 ప్లస్(64జీబీ)ను కూడా రూ.63,470కు అందిస్తోంది. క్యాష్‌బ్యాక్ మొత్తాలను పొందడానికి యూజర్లు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రోమో కోడ్‌లను వాడాల్సి ఉంటుంది.
వివో వీ5ఎస్, వివో వై55ఎస్, వివో వై69 వంటి 4జీ స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం మాల్ 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మోటో ఈ4 ప్లస్, లెనోవో కే6 నోట్, లెనోవో కే6 వపర్ హ్యాండ్‌సెట్లపై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఇక శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అంత ప్రముఖ హ్యాండ్‌సెట్లు లేనప్పటికీ, ఫ్లాట్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ జే3 ప్రో ధర రూ.8800 నుంచి రూ.7990కు తగ్గించింది. అదేవిధంగా గెలాక్సీ జే2 ధరను రూ.6990కు లిస్ట్ చేసింది. షావోమి స్మార్ట్‌ఫోన్లపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను మాత్రమే ప్రవేశపెట్టింది. పాపులర్ టాబ్లెట్లను కూడా పేటీఎం మాల్ ఈ సేల్‌లో లిస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment