Cashbacks
-
స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.6,000 క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న భారతి ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా రూ.12,000 వరకు ధర గల స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.6,000 క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. శామ్సంగ్, షావొమీ, వివో, ఒప్పో, రియల్మీ, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, లెనోవో, మోటరోలా బ్రాండ్ల ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 150కిపైగా మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. రూ.249 ఆపైన ధర గల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను 36 నెలలపాటు రిచార్జ్ చేయాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత రూ.2,000, మిగిలిన రూ.4,000లను 36 నెలలు పూర్తి అయ్యాక చెల్లిస్తారు. అలాగే స్క్రీన్ పాడైతే ఒకసారి ఉచితంగా మారుస్తారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ వైపు వినియోగదార్లను అప్‌గ్రేడ్ చేసేందుకే ఈ చొరవ తీసుకున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
పోస్ట్ పే వినూత్న ఆఫర్: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే, 'పోస్ట్ పే' పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. 'బై నౌ పే లేటర్' (బిఎన్పిఎల్) కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు భారత్ పే ప్రకటించింది. "పోస్ట్ పే" యాప్ ను కస్టమర్లు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు వడ్డీ లేని క్రెడిట్ లిమిట్ పొందవచ్చు అని తెలపింది. 'పోస్ట్ పే' భారీ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ కొనుగోళ్లకు వర్తిస్తుంది అని తెలిపింది. తన రుణ భాగస్వాముల కోసం మొదటి 12 నెలల్లో పోస్ట్ పే ద్వారా 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ పే పేర్కొంది. సులభంగా చెప్పాలంటే మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఈ యాప్ ద్వారా నగదు చెల్లించి. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఆ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకపోతే రుసుము వసూలు చేస్తారు. మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా రాను రాను రుణ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం పడదు అని కంపెనీ తెలిపింది. అలాగే, మీరు గనుక భారీ మొత్తం దీని ద్వారా చెల్లిస్తే దానిని ఈఎమ్ఐల ద్వారా సులభంగా తిరిగి చెల్లించవచ్చని ఫిన్ టెక్ కంపెనీ తెలిపింది. కస్టమర్ చేయాల్సిందల్లా పోస్ట్ పే యాప్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్బుల్ ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి) అలాగే, వినియోగదారులు స్టోర్స్ వద్ద పోస్ట్ పే కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. క్యాష్ బ్యాక్, రివార్డులు కూడా లభిస్తాయి. పోస్ట్ పే యాప్ లేదా కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వార్షిక ఫీజు లేదా లావాదేవీ ఛార్జీలు లేవని కంపెనీ తెలిపింది. అంతేగాక, దుబాయ్ లో జరగబోయే ఐసీసీ టి20 ప్రపంచ కప్ కోసం ప్రపంచ స్పాన్సర్లలో పోస్ట్ పే ఒకరు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 వరకు జరగబోయే మ్యాచ్ కోసం వినియోగదారులు 3,500 ఉచిత పాసులు గెలుచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ప్రతి ఒక్కరికీ రుణం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏమిటీ బీఎన్‌పీఎల్ కొన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించే విధానమే ఈ బీఎన్‌పీఎల్. ఈ వ్యవధిలో సున్నా శాతం లేదా స్వల్ప వడ్డీని ఈ బీఎన్‌పీఎల్ సంస్థలు వసూలు చేస్తాయి. చిన్న మొత్తంలో రుణం కావాలని అనుకున్నప్పుడు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎన్నో ఫిన్‌టెక్ అంకురాలు ఇప్పుడు ఈ బీఎన్‌పీఎల్ సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు బ్యాంకులూ ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇ-కామర్స్ వెబ్సైట్లూ.. కొన్ని సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. -
పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం
paytm cash back offer : పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. దీంతో సబ్సిడీ లేని సిలిండర్లను కొనుగులు చేయడం సామాన్యులకు కష్టంగా మారింది. అయితే పెరుగుతున్న సిలిండర్ల ధరల్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది. ♦ పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. ♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించవచ్చు -
జీఎస్టీ గుడ్‌న్యూస్ : డిజిటల్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు జరిగాయి. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను రూపే, భీమ్ యాప్ చెల్లింపులపై ప్రోత్సాహకాలు లభించనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పైలట్ ప్రాజ్జెక్టుగా ముందుగా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయనున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలు ప్రయోగాత్మంగా, స్వచ్ఛందంగా ప్రారంభించనున్నాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సాధించిన ఆదాయం, నష్టం లాంటి అంశాలను అంచనా వేయనున్నామని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహాకాలపై బీహార్ డిప్యూటీముఖ్యమంత్రి సుశీల్ మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ బృందం ప్రతిపాదనలకౌన్సిల్ ఆమోదించినట్టు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే 20శాతం దాకా క్యాష్‌బ్యాక్ వినియోగదారులకు చెల్లించనున్నామని వెల్లడించారు. మొత్తం జీస్‌ఎటీపై గరిష్టంగా వంద రూపాయలు వరకు పొందవచ్చని గోయల్ చెప్పారు. కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబర్ 28-29తేదీల్లో గోవాలో జరుగనుంది. -
స్మార్ట్ఫోన్లపై పేటీఎం బంపర్ ఆఫర్లు
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అయితే ఇదే సరియైన సమయమట. డిజిటల్ దిగ్గజం పేటీఎం తన మాల్లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. నోకియా... నోకియా స్మార్ట్ఫోన్లపై పేటీఎం మాల్ తన ప్లాట్‌ఫామ్‌పై 21 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 18 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. మోటోరోలా.. మోటోరోలా హ్యాండ్సెట్లపై కూడా 35 శాతం వరకు డిస్కౌంట్లను పేటీఎం మాల్ అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్‌ను కూడా ఇది ఆఫర్ చేస్తోంది. క్యాష్‌బ్యాక్ మొత్తం డివైజ్‌ను బట్టి ఉంది. ఒప్పో... 5 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌తో ఒప్పో స్మార్ట్ఫోన్లు, పేటీఎం మాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్‌పై గరిష్టంగా 25 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాక 1,199 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ అనంతరం ఒప్పో ఏ57 స్మార్ట్‌ఫోన్ 10,791 రూపాయలకు అందుబాటులోకి వచ్చింది. వివో... ఒప్పో మాదిరిగా వివో హ్యాండ్సెట్లు కూడా ఫ్లాట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కలిగి ఉన్నాయి. అన్ని చైనీస్ హ్యాండ్సెట్లతో పోల్చుకుంటే, వివో వీ5ఎస్ స్మార్ట్ఫోనే గరిష్టంగా 31 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 655 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా ఈ ఫోన్‌పై లభిస్తోంది. దీంతో మొత్తంగా రూ.12,444కు వివో వీ5ఎస్‌ను పేటీఎం మాల్ విక్రయిస్తోంది. ఆపిల్, గూగుల్, శాంసంగ్, హానర్, లెనోవో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై కూడా పేటీఎం మాల్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్లపై 9 వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్, శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌పై 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్, గూగుల్ పిక్సెల్ డివైజ్‌లపై కనీసం 6 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. -
వివో సరికొత్త సేల్, స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి వివో సరికొత్త సేల్కు తెరలేపింది. వివో నాకౌట్ కార్నివల్ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. మే 16(నేటి) నుంచి మే 18 వరకు ఎక్స్‌క్లూజివ్‌గా వివో అధికారిక ఆన్లైన్ స్టోర్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేయనుంది. ఈ మూడు రోజులు వివో వీ5 ప్లస్, వీ5ఎస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ రూ.14,990కు, రూ.12,990కు విక్రయిస్తోంది. వివో ఆఫర్ చేసే ఈ స్పెషల్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు కస్టమర్లకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించనున్నాయని వివో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కెన్నీ జెంగ్ తెలిపారు. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు కస్టమర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నట్టు వివో పేర్కొంది. రూ.1000 వరకు లక్కీ డ్రా కూపన్లను వివో ఈ కార్నివల్లో ఆఫర్ చేస్తోంది. రూ.500 విలువైన బుక్‌మైషో కపుల్ మూవీ ఓచర్లు అందిస్తోంది. అన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పైనా 12 నెలల పాటు ‘నో కాస్ట్ ఈఎంఐ’ ఆఫర్‌ను వివో అందుబాటులోకి తెచ్చింది. -
పేటీఎం మాల్ రిపబ్లిక్ డే ఆఫర్స్
పేటీఎం మాల్ కూడా రిపబ్లిక్ డే సేల్‌ను నేటి(బుధవారం) నుంచి ప్రారంభించింది. ఈ కొత్త సేల్‌లో భాగంగా పేటీఎం స్మార్ట్ఫోన్లపై 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలపై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను, ఎలక్ట్రిక్ అప్లియెన్స్‌పై 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. అంతేకాక డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, జనవరి 28 వరకు కొనసాగనుంది. ఆపిల్, వివో, షావోమి, ఒప్పో, లెనోవో, మోటోరోలా, శాంసంగ్ వంటి పలు ప్రముఖ బ్రాండులన్నింటిపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్ డివైజ్‌ల పరంగా చూస్తే.. పేటీఎం మాల్ ఐఫోన్ ఎక్స్(64జీబీ)ను 83,899 రూపాయలకు లిస్ట్ చేసింది. దీని అసలు ధర రూ.89వేలు. అదేవిధంగా ఐఫోన్ ఎక్స్(256జీబీ)ను 98వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. దీని అసలు ధర లక్షకు పైన రూ.1,02,000గా ఉంది. అంతమొత్తంలో వెచ్చించలేని వారి కోసం ఐఫోన్ 8(64జీబీ)ను రూ.52,706కు లిస్టు చేసింది. ఈ ఫోన్ అసలు ధర 64వేల రూపాయలు. అదేవిధంగా 73వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8 ప్లస్(64జీబీ)ను కూడా రూ.63,470కు అందిస్తోంది. క్యాష్‌బ్యాక్ మొత్తాలను పొందడానికి యూజర్లు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు ప్రోమో కోడ్లను వాడాల్సి ఉంటుంది. వివో వీ5ఎస్, వివో వై55ఎస్, వివో వై69 వంటి 4జీ స్మార్ట్ఫోన్లపై పేటీఎం మాల్ 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. మోటో ఈ4 ప్లస్, లెనోవో కే6 నోట్, లెనోవో కే6 వపర్ హ్యాండ్సెట్లపై రూ.8000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఇక శాంసంగ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అంత ప్రముఖ హ్యాండ్సెట్లు లేనప్పటికీ, ఫ్లాట్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ జే3 ప్రో ధర రూ.8800 నుంచి రూ.7990కు తగ్గించింది. అదేవిధంగా గెలాక్సీ జే2 ధరను రూ.6990కు లిస్ట్ చేసింది. షావోమి స్మార్ట్ఫోన్లపై కూడా ఫ్లాట్ డిస్కౌంట్లను మాత్రమే ప్రవేశపెట్టింది. పాపులర్ టాబ్లెట్లను కూడా పేటీఎం మాల్ ఈ సేల్‌లో లిస్ట్ చేసింది. -
ఆ 8 ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్
స్మార్ట్ఫోన్లపై ఈ-కామర్స్ కంపెనీలు భలే భలే ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. కేవలం ఈ-కామర్స్ వెబ్సైట్లు మాత్రమే కాక, టెలికాం ఆపరేటర్లు సైతం మొబైల్ ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్సైట్లు, మొబైల్ కంపెనీలు అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. ఐఫోన్ ఎక్స్ : పేటీఎంలో రూ.4000 క్యాష్‌బ్యాక్ ఆపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్సే. ఈ ఫోన్ 256జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు. రూ.1,01,498గా లిస్టు అయిన ఈ ఫోన్‌ను క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.97,498కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 88,698 రూపాయల 64జీబీ వేరియంట్‌ను కూడా రూ.4000 క్యాష్‌బ్యాక్‌తో రూ.84,698కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు ప్రోమోకోడ్ ఏ4కే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. శాంసంగ్ నోట్8 : అమెజాన్‌లో రూ.8000 క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే ను వాడుతూ నోట్ 8ను కొనుగోలు చేసిన వారికి రూ.8000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ను కస్టమర్‌కి పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్ పేలో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు. జనవరి 10 వరకే ఇది వాలిడ్‌లో ఉంటుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ : పేటీఎంపై రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ 2016లో లాంచ్ అయిన ఈ రెండు ఐఫోన్లపైనా రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ లభ్యమవుతోంది. రూ.57,690గా ఉన్న ఐఫోన్ 7, 256జీబీ వేరియంట్ రూ. 51,690కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏ6కే కోడ్‌ను అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 32జీబీ వేరియంట్ ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,500 వరకు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ అనంతరం ఐఫోన్ 7 ప్లస్ రూ.51,604కు దిగొచ్చింది. మోటో జీ5ఎస్ ప్లస్ : పేటీఎంలో రూ.1,625 క్యాష్‌బ్యాక్ రిటైల్ ధరపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ కింద ఒక్కో యూజర్ మూడు ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి ఉంది. ఇది కూడా కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ఫోన్ షిప్ అయిన 24 గంటల వ్యవధిలో యూజర్ అకౌంట్లోకి ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని జమచేస్తారు. శాంసంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ - వొడాఫోన్ ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్ ఇటీవల శాంసంగ్‌తో జతకట్టిన వొడాఫోన్, గెలాక్సీ జే7 మ్యాక్స్ కొత్త, పాత యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఎం-పైసా వాలెట్ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లిందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. వివో వీ7 ప్లస్ : పేటీఎంలో రూ.1,100 క్యాష్‌బ్యాక్ రూ.21,990 ధర కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌పై రూ.1100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,890కి దిగొచ్చింది. 10.ఆర్ డీ స్మార్ట్‌ఫోన్ : జియో ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్ 10.ఆర్ డీ స్మార్ట్‌ఫోన్ నిన్నటి నుంచే విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై జియో ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్‌లో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అయితే యూజర్లు కనీసం రూ.199తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఫ్లిప్‌కార్ట్ న్యూ పించ్ సేల్: స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి సేల్స్ ను ప్రకటించింది. ‘న్యూ పించ్ డేస్’ పేరుతో ఈ కొత్త సేల్‌ను లాంచ్ చేసింది . నేటి శుక్రవారం డిసెంబర్ 15) 17వ తేదీ వరకు ఈ విక్రయాలను నిర్వహించనుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఊరిస్తోంది. ముఖ్యంగా ఈ న్యూ పించ్ డేస్ సేల్‌లో రెడ్మీ నోట్ 4, ఐ ఫోన్ 8 , గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్ఎల్, షియోమీ ఎంఐ ఎ1, మోటో ఎక్స్4, శాంసంగ్ ఫోన్లు, ఐఫోన్లు, మొబైల్ యాక్ససరీలపై ఆకర్షణీయమైన రాయితీలు, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా సైట్ ఎందులో ఐటమ్స్‌ను కొన్నాఈ ఆఫర్లు లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990 (రూ.16,010 తగ్గింపు) ధరకు, గెలాక్సీ ఆన్‌నెక్ట్స్ పై రూ.11, 900కు లభిస్తోంది. గెలాక్సీ జే 3 ప్రొ, గెలాక్సీ ఆన్ 5పై డిస్కౌంట్ ఆఫర్. అలాగే గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.5,001 తగ్గింపుతో రూ.58,999 ధరకు లభిస్తుండగా, హెచ్‌టీసీ యూ11 రూ.44,999 (రూ.8,991 తగ్గింపు) ధరకు, పిక్సెల్ 2 రూ.39,999 (రూ.11,001 తగ్గింపు) ధరకు, యాపిల్ ఐఫోన్ 7 32జీబీ రూ.42,999 (రూ.6,001 తగ్గింపు) ధరకు, మోటో ఎక్స్4 (4జీబీ, 64జీబీ) రూ.20,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు లభ్యం కానున్నాయి. షావోమీ ఎంఐ ఎ1 రూ.12,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు, షావోమీ రెడ్మీ నోట్ 4 (4జీబీ, 64జీబీ) రూ.10,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు , ఎంఐ మ్యాక్స్ 2 64జీబీ రూ.14,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు, లభిస్తున్నాయి. ఇవే కాకుండా మరెన్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభ్యం. వీటితోపాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, యాక్ససరీలపై కూడా ఈ సేల్‌లో ఆఫర్లను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
సాక్షి ముంబై: వన్ ప్లస్ మూడు రోజుల అమ్మకాలకు తెర తీసింది. ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెట్టి వెయ్యిరోజులు పూర్తయిన ఉత్సవాల్లో భాగంగా 1000 డే సేల్‌ను ప్రారంభించింది. ఈ రోజునుంచి (సెప్టెంబర్ 5-7వ తేదీ) గురువారం వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ 3టీ, వన్ ప్లస్ 5 స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. వన్‌ప్లస్ 3టీ వన్‌ప్లస్ 3టీ భారీ తగింపును ఆఫర్ చేస్తోంది. రూ. రూ. 4వేల తగ్గింపుతో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ వెర్షన్‌ను రూ. 25,999, లకే అందిస్తోంది. అంతేకాదు యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు మరో ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై మరో రూ. 2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్. 12 నెలల జీరో చార్జ్ ఇఎంఐ ఆఫర్ కూడా. వన్‌ప్లస్ 5 ఆఫర్లు వన్‌ప్లస్ 5 కొనుగోలుపై 100 మంది లక్కీ కస్టమర్లకు దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా గిఫ్ట్ ఓచర్. క్లియర్ టిప్ నుంచి లభిస్తున్న దీని దీని విలువ రూ.25వేల దాకా. (పూర్తి నిబంధనలు షరతులు అధికారిక వెబ్సైట్లో) దీంతోపాటు వోడాఫోన్ ప్లే మూడు నెలల ఉచిత చందాతో పాటు వోడాఫోన్ వినియోగదారులకు 75జీబీ ఉచిత డేటా. కిండ్లే నుంచి 500 ప్రమోషన్ క్రెడిట్, లో రూ. 250 ప్రైమ్ వీడియో అమెజాన్ పే బ్యాలెన్స్ , ఉచిత 12 నెలల డ్యామేజ్ ఇన్సూరెన్స్ లభ్యం. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్ గమనిక: ఈ ఆఫర్లు అమెజాన్ లో మాత్రమే లభ్యం. మరిన్ని వివరాలకు కంపెనీ ఆన్లైన్ స్టోర్లను, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. -
అమెజాన్‌లో డిస్కౌంట్ల పండుగ
భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్ కార్ట్ తో పోటాపోటీగా తలపడుతున్న గ్లోబల్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ పండుగకు తెరలేపబోతుంది. వచ్చే వారం మే 11 నుంచి 'గ్రేట్ ఇండియన్ సేల్' ను ప్రారంభించబోతుంది. గత అక్టోబర్ లో నిర్వహించిన దివాళీ సేల్ లో ఫ్లిప్ కార్ట్ ను అందుకోలేకపోవడంతో ఈ సారి భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఎలాగైనా భారత కస్టమర్లను ఆకట్టుకోవాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ అన్నింటిపైనా గ్రేట్ డీల్స్ ను ఆఫర్ చేస్తామని, త్వరితగతిన డెలివరీ, సులభతరమైన రిటర్న్స్ లను ఈ సేల్ భాగంగా అందిస్తామని అమెజాన్ చెప్పింది. అయితే అమెజాన్ కంటే కాస్త ముందుగానే ఫ్లిప్ కార్ట్ ''సమ్మర్ షాపింగ్ డేస్ సేల్'' ను ఈ నెల 2 నుంచి ప్రారంభించింది. నేటితో ఈ సేల్ ముగుస్తోంది. అయితే ఈ సారి అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల బేస్ ను ఎక్కువగా కలిగి ఉంది. అంతేకాక గత కొన్ని నెలలుగా కంపెనీ భారత వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. లార్జ్ అప్లియెన్స్ , ఫర్నీచర్ల కోసం ఏడు కొత్త ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు అమెజాన్ గత నెలలోనే ప్రకటించింది. మంగళవారం మరో ఏడు ఫుల్ ఫిల్మెంట్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది. కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇటు సిటీ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కంపెనీ ఆ బ్యాంకు కస్టమర్లకు వెబ్ సైట్ కొనుగోలుపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ను అందించనునంది. అంతేకాక యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాకును అందించనున్నట్టు తెలిపింది. -
ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీ ఆఫర్లు
డిజిటల్ లావాదేవీల్లో ఫుల్ పాపులర్ అయిన పేటీఎం, ఐఫోన్, మ్యాక్ బుక్ మోడల్స్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ ఆపిల్ సేల్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16 వరకు పేటీఎం నిర్వహించే ఈ సేల్ లో మ్యాక్ బుక్ కొనుగోలుచేసిన వారికి రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వీటిలో ఎంపికచేసిన వాటికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం 15 అంగుళాలు కలిగిన ఆపిల్ మ్యాక్ బుక్ రూ.1,50,000కు అందుబాటులో ఉంది. దీనిపై వినియోగదారులు రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ పొందనున్నారు. అంతేకాక మరికొన్ని ఆపిల్ ఉత్పత్తులపై కూడా పేటీఎం ఆఫర్లను అందిస్తోంది. 256జీబీ కలిగిన ఐఫోన్ 7 కొనుగోలు చేసిన వారికి రూ.12వేల క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఐఫోన్ పేటీఎంలో రూ.92వేలుగా నమోదైంది. క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఉత్పత్తి అందించిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదంట. అదేవిధంగా రూ.65వేల ధర కలిగిన 128జీబీ ఐఫోన్ 7 కొనుగోలుచేసిన వారికి, రూ.7500 క్యాష్ బ్యాక్, రూ.46వేలు ధర ఉన్న 32జీబీ ఐఫోన్ 6ఎస్ కొంటే, రూ.6000 క్యాష్ బ్యాక్, రూ.65వేల ధర కలిగిన ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొంటే, రూ.9000 క్యాష్ బ్యాక్, ఆపిల్ వాచ్ కొనుగోలు చేసిన వారికి రూ.4500 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు పేటీఎం పేర్కొంది.