అమెజాన్లో డిస్కౌంట్ల పండుగ
అమెజాన్లో డిస్కౌంట్ల పండుగ
Published Thu, May 4 2017 2:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM
భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్ కార్ట్ తో పోటాపోటీగా తలపడుతున్న గ్లోబల్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ పండుగకు తెరలేపబోతుంది. వచ్చే వారం మే 11 నుంచి 'గ్రేట్ ఇండియన్ సేల్' ను ప్రారంభించబోతుంది. గత అక్టోబర్ లో నిర్వహించిన దివాళీ సేల్ లో ఫ్లిప్ కార్ట్ ను అందుకోలేకపోవడంతో ఈ సారి భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఎలాగైనా భారత కస్టమర్లను ఆకట్టుకోవాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ అన్నింటిపైనా గ్రేట్ డీల్స్ ను ఆఫర్ చేస్తామని, త్వరితగతిన డెలివరీ, సులభతరమైన రిటర్న్స్ లను ఈ సేల్ భాగంగా అందిస్తామని అమెజాన్ చెప్పింది.
అయితే అమెజాన్ కంటే కాస్త ముందుగానే ఫ్లిప్ కార్ట్ ''సమ్మర్ షాపింగ్ డేస్ సేల్'' ను ఈ నెల 2 నుంచి ప్రారంభించింది. నేటితో ఈ సేల్ ముగుస్తోంది. అయితే ఈ సారి అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల బేస్ ను ఎక్కువగా కలిగి ఉంది. అంతేకాక గత కొన్ని నెలలుగా కంపెనీ భారత వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. లార్జ్ అప్లియెన్స్ , ఫర్నీచర్ల కోసం ఏడు కొత్త ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు అమెజాన్ గత నెలలోనే ప్రకటించింది. మంగళవారం మరో ఏడు ఫుల్ ఫిల్మెంట్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది. కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇటు సిటీ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కంపెనీ ఆ బ్యాంకు కస్టమర్లకు వెబ్ సైట్ కొనుగోలుపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ను అందించనునంది. అంతేకాక యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాకును అందించనున్నట్టు తెలిపింది.
Advertisement
Advertisement