Great Indian Sale
-
వన్‌ప్లస్ 10 ప్రొ పై భారీ తగ్గింపు, ఎక్కడ?
సాక్షి,ముంబై: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్ 10ప్రో భారీ డిస్కౌంట్ ధరకకు లభిస్తోంది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ద్వారా వన్‌ప్లస్ 10ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలను కుంటున్న కస్టమర్లు అదనంగా రూ. 5,000 తగ్గింపును కూడా పొందవచ్చు. చదవండి: మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్: ఒక్కరోజులోనే.. వన్ప్లస్కుసంబంధించి ఏడాది లాంచ్ చేసిన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో. ఇది ప్రస్తుతం రూ.66,999 నుంచి రూ.61,999కి లిస్ట్ అయింది. ఎస్బీఐ ఆఫర్ద్వారా రూ.56,999 సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 22,000 వరకు ఉంటుంది. అలాగే షరతుల మేరకు కనీసం 4,000 తగ్గింపు లభిస్తుంది. అంటే సుమారు 52 వేలకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ తొమ్మిది రోజుల్లో ముగుస్తుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్, ది వైర్లెస్ ఛార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్, 8మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాంటివి ప్రధాన ఫీచర్లు. (TVS Jupiter Classic Edition: టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే) వన్‌ప్లస్ 10 ప్రో ఫీచర్లు 6.70 అంగుళాల (1440x3216) డిస్ప్లే ఆండ్రాయిడ్ 12 32ఎంపీ సెల్ఫీ కెమెరా 8జీబీ,12 జీబీ ర్యామ్ 128, 256, 512, జీబీ మొమరీవేరియంట్స్ 5000mAhబ్యాటరీ కెపాసిటీ -
తగ్గేదేలే అంటున్న అమెజాన్: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022
సాక్షి,ముంబై: ఫెస్టివ్ సీజన్వచ్చిందంటే చాలు ఆన్లైన్ రీటైలర్ల ఆఫర్లు, డిస్కౌంట్ సేల్కు తెరలేస్తుంది. ఆన్లైన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను ప్రకటించగా, ఈ కోవలో అమెజాన్ చేరింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022 సందర్భంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోప కరణాలు, ఇతర ఉత్పత్తులతో సహా వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయ డీల్స్ పొందవచ్చు. మొబైల్స్, ఉపకరణాలపై 40 శాతం దాకా తగ్గింపుతోపాటు ఇతర ఆఫర్లను అందించనుంది. అమెజాన్ వెబ్సైట్ ప్రకారం, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-2022లో స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపునివ్వనుంది. అలాగే గృహోపకరణాలపై 75 శాతం వరకు, రోజువారీ నిత్యావసరాలపై 65శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. అయితే ఈ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ధృవీకరించనప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తో పాటు సెప్టెంబర్ 23నుండి స్టార్ట్ అవుతుందని రు భావిస్తున్నారు. వినియోగదారులకు డిస్కౌంట్‌ను ఇచ్చేందుకు ఎస్బీఐ ఒప్పందం కుదుర్చుకున్నట్టు అమెజాన్ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించే కొనుగోలుదారులు 10శాతం తక్షణ తగ్గింపును అందించనుంది. -
అమెజాన్ సేల్ : వాటిపై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మరోసారి తగ్గింపుధరలు, ఆఫర్ల పండుగ మొదలైంది. గణతంత్ర దినోత్సవం (రిప్లబిక్ డే) అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్-2020 పేరుతో స్పెషల్ విక్రయాలను చేపట్టింది. జనవరి 22 వరకు కొనసాగే సేల్ ఈ రోజు (శనివారం) అర్థరాత్రి నుంచే ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తేనుంది. ప్రధానంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లతోపాటు, పలురకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 40శాతం దాకా, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలపై 60 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ల్యాప్‌టాప్‌లపై రూ.35వేల దాకా, కెమెరాలపై రూ. 10,000 వరకూ ప్రత్యేక తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా అదనం. వన్‌ప్లస్ 7టీ, వన్‌ఫ్లస్ 7టీ ప్రొ, రెడ్మినోట్ 8 ప్రొ, ఒప్పో ఎఫ్ 11 వివో యూ 20లపై ఈ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఒప్పో ఎఫ్ 11 భారీగా పదివేల దాకా డిస్కౌంట్ ధరలో లభించనుంది. ప్రస్తుత సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 13,990 కే కొనుగోలు చేయవచ్చు. -
అమెజాన్ దివాలీ సేల్ : టాప్ బ్రాండ్స్, టాప్ డీల్స్
సాక్షి, బెంగళూరు: అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్‌ను శనివారం ప్రకటించింది. అక్టోబర్ 21 అర్థరాత్రి నుంచి 25వ తేదీవరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిచనుంది. ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే ప్రైమ్ సభ్యుల కోసం అక్టోబర్ 20 ఉదయం 12 గంటల నుంచే ప్రత్యేకమైన సేల్, స్పెషల్ అఫర్లను కూడా అమెజాన్ ప్రకటించింది. ఆపిల్, షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 60శాతం దాకా డిస్కౌంట్ లభ్యం. వన్‌ప్లస్ 7టీ, శాంసంగ్ ఎం 30ఎస్, వివో యు10 తో సహా అమెజాన్ స్పెషల్స్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్సర్వ్ కార్డులు, అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత రివార్డ్ పాయింట్లుతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అంతేకాదు ఎల్జీ (43) 4 కె స్మార్ట్ టీవీ వర్ల్‌పూల్ కన్వర్టిబుల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లతోపాటు, కొత్తగా ప్రారంభించిన సాన్యో కైజెన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంటి లేటెస్ట్ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్ వెల్లడించింది. -
అమెజాన్ సేల్: టాప్ డీల్స్
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలు అమోజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది డిస్కౌంట్‌సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. జనవరి 20-23వరకు జరగనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, హానర్ స్మార్ట్‌ఫోన్స్‌పై ఆఫర్లను ప్రకటించాయి. ఆదివారం నుంచి షురూ కానున్న ఈ ఆఫర్ల పండుగలో అమెజాన్ రివీల్ చేసిన టాప్ డీల్స్ ఒకసారి చూద్దాం. జనవరి 19న లాంచ్ కానున్న ఎల్‌జీవీ40 థింక్యూపై రూ.5వేలదాకా ఎక్స్జేంజ్ ఆఫర్. షావోమిరెడ్ మి 6 ప్రొ, ఎంఐ ఏ2, స్మార్ట్ఫోన్లపై రూ.2వేల ఎక్స్జేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఒప్పో ఆర్17, వివో వి9ప్రొపై కూడా ఈ ఆఫర్ అందించనుంది. రియల్‌మి యూ1 స్మార్ట్‌ఫోన్‌పై రూ.2వేల ఆఫర్ తరువాత రూ.10,999లకే లభ్యం కానుందని అమెజాన్ ప్రకటించింది. ఇంకా హార్డ్డ్రైవ్లపై 60శాతం దాకా, అమెజాన్ స్పీకర్స్‌పై 50 శాతం దాకా తగ్గింపు. -
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్
సాక్షి, ముంబై: ఆన్లైన్ కొనుగోలు దారులకు పండగే పండగ. 2019 ఏడాదిలో తొలి డిస్కౌంట్ల సేల్ షురూ అవుతోంది. దిగ్గజ ఆన్లైన్ రీటైలర్స్ రిపబ్లిక్ డే సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించనున్నాయి. ఈ వరుసలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ క్యూ కట్టాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ సేల్‌ను ప్రకటించగా..అమెజాన్ జనవరి 20 నుంచి 23 వరకు గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో స్పెషల్ విక్రయాలకు తెరతీయనుంది. ముఖ్యంగా ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక డీల్స్ అందుబాటులో ఉంచింది. ప్రైమ్ సభ్యుల కోసం జనవరి 19 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ మొదలవుతుంది. పలు క్యాటగిరీల్లో 17 కోట్ల ఉత్పత్తులపై ఆఫర్లున్నాయి. వన్‌ప్లస్ 6టీ, శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్స్, హానర్, రియల్మీ, షావోమీలాంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళళ్లపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అంతేనా దాదాపు లక్ష రూపాయల దాకా క్రెడిట్ సదుపాయం కూడా కల్పిస్తుంది. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్, నిత్యావసర వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఇక అమెజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇ-రీడర్స్‌పై రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. -
రిపబ్లిక్ డే మెగా సేల్స్ : అసలు విజేతెవరు?
ముంబై : అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రెండూ తమ తొలి బిగ్ ఆన్లైన్ సేల్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్' ను నిర్వహించగా... ఫ్లిప్‌కార్ట్ 'రిపబ్లిక్ డే సేల్' నిర్వహించింది. ఈ రెండు దిగ్గజాలు నిర్వహించిన సేల్‌లో విజేతలు తామెంటే తామని ప్రకటనలు ఇచ్చేసుకుంటున్నాయి. తమ ప్రత్యర్థి కంటే రెండింతల విక్రయ ఆర్డర్లను నమోదుచేసినట్టు అమెజాన్ ప్రకటించగా.. 60 శాతం నుంచి 65 శాతం వరకు మార్కెట్ షేరుతో తాము ముందంజలో ఉన్నామని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఇంతకీ విజేత ఎవరంటే? చెప్పడం కష్టంగానే మారింది. కాగ, అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్‌ను జనవరి 21 నుంచి బుధవారం రాత్రి వరకు నిర్వహించింది. ఫ్లిప్‌కార్ట్ జనవరి 21 నుంచి జనవరి 23 వరకు ఆఫర్లు కురిపించింది. 200 నగరాల్లో 32వేల ఆన్లైన్ వినియోగదారులు నమోదైనట్టు కాంటర్ ఐఎంఆర్బీ సర్వేలో తేలింది. అంతేకాక తాము తమ ప్రత్యర్థి కంటే రెండింతల ఎక్కువ ఆర్డర్లతో అత్యధిక షేరును దక్కించుకున్నామని అమెజాన్ పేర్కొంది. కొత్త కస్టమర్లను ఎక్కువగా పొందామని, 85 శాతం కొత్త కస్టమర్లు తమకు టైర్ 2, 3 పట్టణాల నుంచి వచ్చినట్టు అమెజాన్ ఇండియా కేటగిరి మేనేజ్మెంట్ వైస్-ప్రెసిడెంట్ మనీష్ తివారీ చెప్పారు. స్థూల సరుకుల విలువలో స్మార్ట్ఫోన్లు అతిపెద్ద కేటగిరీగా ఉన్నాయని, సాధారణ రోజుల కంటే ఆరింతలు జంప్ చేసిందని తివారీ తెలిపారు. పెద్ద పెద్ద ఉపకరణాలు విక్రయాలు కూడా భారీగా పెరిగాయన్నారు. అయితే అమెజాన్ ప్రకటనకు ఫ్లిప్‌కార్ట్ సీనియర్ డైరెక్టర్ స్మృతి రవిచంద్రన్ కౌంటర్ ఇచ్చారు. దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ ప్లేయర్‌గా ఫ్లిప్‌కార్ట్ తన స్థానాన్ని కొనసాగిస్తుందని, మూడు రోజుల రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ-టైల్ మార్కెట్లో 60 నుంచి 65 శాతం షేర్‌ను తాము పొందినట్టు పేర్కొన్నారు. అమెజాన్‌తో, ఫ్లిప్‌కార్ట్‌కు గట్టిపోటీ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇరు కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను, డెలివరీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నాయి. -
ఆ కంపెనీలో 6500 ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో 6500కు పైగా తాత్కాలిక ఉద్యోగాలను ఆఫర్ చేసింది. ఈ నెల 20-24 వరకూ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ను నిర్వహిస్తుండటంతో ఈ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. సీజనల్ నియామకాల్లో భాగంగా సీజనల్ పొజషన్స్ కోసం 6500 మందిని విధుల్లోకి తీసుకుంటున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా చెప్పారు. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, డెలివరీ స్టేషన్లు, సార్టేషన్ సెంటర్లలో ఈ నియామకాలు ఉంటాయని అన్నారు. సేల్ పీరియడ్‌లో కస్టమర్ల నుంచి అధిక డిమాండ్‌ను అధిగమించేందుకు 1000 మంది అసోసియేట్స్‌ను నియమిస్తామని చెప్పారు.గ్రేట్ ఇండియన్ సేల్‌ను విజయవంతంగా నిర్వహించి, వినియోగగారులకు మెరుగైన డెలివరీ సేవలు అందించేందుకు అసోసియేట్ల నియామకం ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూర్ వంటి పలు మెట్రో నగరాల్లో ఈ నియామకాలు చోటు చేసుకుంటాయని సక్సేనా తెలిపారు. -
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ సేల్' వచ్చేస్తోంది
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగ తెరతీయబోతుంది. అమెజాన్ తన వెబ్సైట్, యాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రేట్ ఇండియన్ సేల్ తేదీలను కంపెనీ ప్రకటించేసింది. స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 9వ తారీఖు అర్థరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 12వ తారీఖు అర్థరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నట్టు అమెజాన్ పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా ఎన్నడూ చూడని బ్లాక్ బాస్టర్ డీల్స్ ఆఫర్ చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అయితే ఎక్స్‌క్లూజివ్‌గా ప్రైమ్-ఓన్లీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేకంగా 30 నిమిషాల ముందే టాప్ డీల్స్‌ను ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ప్రారంభించనుంది. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ''అమెజాన్ పే బ్యాలెన్స్ ఓన్లీ డీల్స్''ను కూడా అమెజాన్ ఆఫర్ చేయనుంది. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ పే బ్యాలెన్స్‌లో అదనంగా 15 శాతం క్యాష్ బ్యాక్ అంటే 300 రూపాయల వరకు తగ్గింపును అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. అంతేకాక అమెజాన్.ఇన్‌లో అప్పీరల్, స్టోరేజ్, హోమ్ వాటిపై ఇన్స్టాంట్ 10-15 శాతం క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ పే బ్యాలెన్స్ ఓన్లీ డీల్స్‌లో అందించనున్నారు. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఆపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, యూఎస్బీ, ప్యూమా, అదిదాస్, రాంగ్లర్, టైటాన్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అమెరికన్ టూరిస్టర్, బీపీఎల్, మైక్రోమ్యాక్స్, టీసీఎల్, లెనోవో, హెచ్‌పీ, ఐఎఫ్బీ, మెకాఫీ వంటి బ్రాండులపై బ్లాక్ బాస్టర్ డీల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా యాప్‌లో కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్, వెబ్సైట్లో కొనుగోలుచేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్‌ను అమెజాన్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. యాప్‌లో కొనుగోలు చేసే కస్టమర్లకు ఖరీదైన పెయిడ్ ట్రిప్స్ వంటి వాటిలో అద్భుతమైన ట్రావెల్ ఆఫర్లను అందించబోతుంది. అన్ని ఈమెయిల్ గిఫ్ట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్, బుక్‌మైషో, క్లియర్‌ట్రిప్, పాంటాలూన్స్, జోయలుక్కాస్ నుంచి గిఫ్ట్కార్డులపై 20 శాతం తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేయనుంది. -
అమెజాన్ డిస్కౌంట్ల పండుగ అర్థరాత్రి నుంచే...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించబోయే నాలుగు రోజుల డిస్కౌంట్ల, క్యాష్ బ్యాక్ పండుగ నేటి అర్థరాత్రి 12 గంటల నుంచే ప్రారంభం కాబోతుంది. గురువారం నుంచి ఆదివారం వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ను నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర్నుంచి, హోమ్ అప్లియెన్స్, బుక్స్, ఫ్యాషన్ వేర్ వరకు తన ప్లాట్ ఫామ్ పై దొరికే అన్ని వస్తువులపై డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ లను అమెజాన్ ప్రకటించింది. మొబైల్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 50 శాతం వరకు, ఫ్యాషన్ ప్రొడక్ట్ లపై 40 శాతం నుంచి 80 శాతం వరకు, హోమ్, కిచెన్ అప్లియెన్స్ పై 70 శాతం వరకు తగ్గింపును అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. త్వరితగతిన డెలివరీ, సులభరతమైన రిటర్న్స్ లను ఈ సేల్ సందర్భంగా అమెజాన్ అందించనుంది. శాంసంగ్, మోటోరోలా, లెనోవో, పుమా, అదిదాస్, ఎల్జీ, బజాజ్ వంటి టాప్ బ్రాండ్లపై బొనాంజ ఆఫర్ల ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. ఆపిల్ కూడా ఈ సేల్ లో భాగంగా తన ఐఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 6 (స్పేస్ గ్రే, 32జీబీ) ఫోన్ ను రూ.26,999కు, ఆపిల్ ఐఫోన్ 5ఎస్ (స్పేస్ గ్రే, 16జీబీ) ను 17,783 రూపాయలకు, ఆపిల్ ఐఫోన్7 (బ్లాక్, 32జీబీ)ను 47,790 రూపాయలకు, ఐఫోన్ 6ఎస్ (స్పేస్ గ్రే, 32జీబీ)ను 37,141 రూపాయలకు, ఐఫోన్ ఎస్ఈ (రోజ్ గోల్డ్, 64జీబీ)ను 27,624 రూపాయలకు అందుబాటులో ఉంచుతోంది. అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో కూల్ ప్యాడ్ కూడా పాలుపంచుకుంటోంది. కూల్ ప్యాడ్ తన నోట్ 5, నోట్ 5 లైట్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. గతేడాది లాంచ్ అయిన కూల్ ప్యాడ్ నోట్5 ధర రూ.10,999 కాగ, ఈ ఫోన్ ను రూ.9,999కే అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ ను కూడా 6,999కే అందుబాటులో ఉంచుతోంది. -
అమెజాన్‌లో డిస్కౌంట్ల పండుగ
భారత ఈ-కామర్స్ మార్కెట్లో ఫ్లిప్ కార్ట్ తో పోటాపోటీగా తలపడుతున్న గ్లోబల్ దిగ్గజం అమెజాన్ నాలుగు రోజుల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ పండుగకు తెరలేపబోతుంది. వచ్చే వారం మే 11 నుంచి 'గ్రేట్ ఇండియన్ సేల్' ను ప్రారంభించబోతుంది. గత అక్టోబర్ లో నిర్వహించిన దివాళీ సేల్ లో ఫ్లిప్ కార్ట్ ను అందుకోలేకపోవడంతో ఈ సారి భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఎలాగైనా భారత కస్టమర్లను ఆకట్టుకోవాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ అన్నింటిపైనా గ్రేట్ డీల్స్ ను ఆఫర్ చేస్తామని, త్వరితగతిన డెలివరీ, సులభతరమైన రిటర్న్స్ లను ఈ సేల్ భాగంగా అందిస్తామని అమెజాన్ చెప్పింది. అయితే అమెజాన్ కంటే కాస్త ముందుగానే ఫ్లిప్ కార్ట్ ''సమ్మర్ షాపింగ్ డేస్ సేల్'' ను ఈ నెల 2 నుంచి ప్రారంభించింది. నేటితో ఈ సేల్ ముగుస్తోంది. అయితే ఈ సారి అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల బేస్ ను ఎక్కువగా కలిగి ఉంది. అంతేకాక గత కొన్ని నెలలుగా కంపెనీ భారత వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. లార్జ్ అప్లియెన్స్ , ఫర్నీచర్ల కోసం ఏడు కొత్త ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు అమెజాన్ గత నెలలోనే ప్రకటించింది. మంగళవారం మరో ఏడు ఫుల్ ఫిల్మెంట్లను ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించింది. కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇటు సిటీ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కంపెనీ ఆ బ్యాంకు కస్టమర్లకు వెబ్ సైట్ కొనుగోలుపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ ను అందించనునంది. అంతేకాక యాప్ ద్వారా 15 శాతం క్యాష్ బ్యాకును అందించనున్నట్టు తెలిపింది. -
అమెజాన్‌లో మళ్లీ డిస్కౌంట్ల పండుగ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతేటా ప్రకటించే డిస్కౌంట్ల ఉత్సవం మళ్లీ ప్రారంభం కాబోతుంది. 2017 జనవరి 20 అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించనున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. 2017 ఏడాదిలో మొదట ప్రారంభం కాబోతున్న మెగా డిస్కౌంట్ సేల్ ఇదే కావడం విశేషం. భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహిస్తోంది. పాపులర్ బ్రాండ్స్‌పై గ్రేట్ డీల్స్ ఉంటాయని అమెజాన్ ఇండియా తెలిపింది. సుమారు 100కు పైగా కేటగిరీల్లో 95 మిలియన్లకు పైగా ఉత్పత్తులను షాపింగ్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించనున్నట్టు అమెజాన్ పేర్కొంది.. వెనువెంటనే డెలివరీ సిస్టమ్‌ను కూడా అందించనున్నట్టు వెల్లడించింది. వినియోగదారులకు వెనువెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయడం కోసం ఈ సంస్థ ముందస్తు ప్రణాళికలు కూడా వేసుకుంటోంది. తాత్కాలికంగా 7500 పైగా ఉద్యోగాలను సృష్టించనున్నట్టు అమెజాన్ ఇండియా తెలిపింది. ముఖ్యంగా లాజిస్టిక్స్‌లో ఈ ఉద్యోగాలు ఎక్కువగా ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. తాము కల్పించే వేల కొద్దీ ఈ సీజనల్ అవకాశాలు, వారి దీర్ఘకాలిక కెరీర్ అభివృద్ధికి ఎంతో దోహదం చేయనున్నాయని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్-ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం రిక్రూట్ మెంట్ ప్రక్రియ నడుస్తుందని, అప్‌కమింగ్ సేల్కు వారికి ట్రైనింగ్ ఇస్తామని ఆయన చెప్పారు. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, టోయ్స్, యాక్ససరీస్ వంటి వాటిపై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించనుంది.